breaking news
Public singer
-
ఏపీ బడ్జెట్ పై సింగర్ దేవి శ్రీ అదిరిపోయే సాంగ్..
-
సాయిచంద్ కుటుంబానికి రూ.కోటిన్నర ఆర్థికసాయం
బడంగ్పేట్/అమరచింత: ప్రజా గాయకుడు, దివంగత నేత సాయిచంద్ కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడలో నివాసం ఉంటున్న సాయిచంద్ సతీమణి రజినీకి సోమవారం ప్రభుత్వం తరఫున రూ.కోటి చెక్కును ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి అందజేశారు. అనంతరం రజినీతో పాటు చిన్నారులను ఓదార్చారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, జెడ్పీ చైర్‌పర్మన్ తీగల అనిత తదితరులు పాల్గొన్నారు. రజనికి చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి సబితారెడ్డి, దాసోజు సాయిచంద్ తండ్రి, చెల్లెలికి చెక్కుల అందజేత అణగారిన వర్గాల బాధలను, ఆంధ్ర పాలకుల నైజాన్ని ఎండగట్టిన మహాగాయకుడు సాయిచంద్ అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సాయిచంద్ తండ్రి వెంకట్రాములు, చెల్లెలు ఉజ్వలకు చెరో రూ.25 లక్షల చొప్పున చెక్కులను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
విస్మృత ప్రజాగాయకుడు నంద కృష్ణమూర్తి
కొంతమంది పుట్టుకతోనే గొప్ప వారవుతారు. మరి కొంతమంది ఎంతో కృషి చేసి గొప్పవారవుతా రు. వేరే కొంతమంది అదృష్టం వరించి గొప్పవారవు తారని ఆంగ్ల నాటకకర్త షేక్స్పియర్ పేర్కొన్నారు. ఇందులో రెండవ కోవకు చెందిన వారు నంద కృష్ణ మూర్తి. స్వాతంత్య్ర సమరయోధునిగా, ప్రజా గాయకునిగా వర్థిల్లిన ఆయనకు అనుకున్నంత పేరు ప్రఖ్యాతులు రాకపోవడం దురదృష్టకరం. శ్రీకాకుళం జిల్లాలో పదిమంది స్వాతంత్య్ర సమరయోధులకు నెలవైన కనిమెట్టలో నందశేష య్య, చిన్నమ్మ దంపతులకు 1921, మార్చి 13న కృష్ణమూర్తి జన్మించారు. చిన్నతనం నుంచే దేశభక్తి భావాలను పుణికిపుచ్చుకున్నారు. 8వ తరగతి వర కు మాత్రమే చదువుకున్నారు. తర్వాత ఆమదాల వలస సమీపంలో గట్టుముడిపేటలోని ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో హయ్యర్ గ్రేడ్ ఉపాధ్యాయు నిగా పనిచేశారు. గాంధీజీ పిలుపునందుకుని ఉద్యో గానికి స్వస్తి చెప్పి స్వాతంత్య్ర సమరంలో నేను సయితం అంటూ పాల్గొన్నారు. తన పాటల ఈటెల తో ఆంగ్లేయులను హడలెత్తించారు. స్వాతంత్య్రం నా జన్మహక్కు కాదన్నవాడి పీకనొక్కు లాంటి నినా దాలతో ఆంధ్ర, ప్రవాసాంధ్ర ప్రాంతాలను దద్దరిల్ల జేశారు. ఆచార్య ఎన్.జీ.రంగా, సర్దార్ గౌతు లచ్చన్నల ముఖ్య అనుచరుడిగా ఉంటూ వారు పాల్గొన్న అన్ని సభల్లో స్వాతంత్య్రోద్యమ గీతాలను ఆలపించా రు. నిద్రాణమై ఉన్న ప్రజానీకాన్ని తన ఆటపాటలతో మేల్కొలిపి స్వరాజ్య ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఆయన స్వరం.. స్వరం కాదు. అదో భాస్వరం. అదో బడబాగ్ని. వలస పాలనకు వ్యతిరేకంగా క్రిప్స్ రాయబారం పేరుతో కృష్ణమూర్తి దళం పల్లెల్లో, పట్నాల్లో ప్రదర్శించిన బుర్రకథ ప్రభంజనం సృష్టిం చింది. బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహానికి గురై అరెస్ట య్యారు. ఆయనతో పాటు నంద ఆదినారాయణ, కూన ఎర్రయ్య, కూన అప్పలసూరి, కూన బుచ్చ య్య, గురగుబెల్లి సత్యనారాయణ, అన్నెపు అప్ప య్య తదితరులను పాలీసులు అరెస్టు చేశారు. భారత మాతకు జైకొట్టరా, బానిస బతుకులకు చరమగీతం పాడరా వంటి విప్లవ గీతాలతో హోరె త్తించిన కృష్ణమూర్తి నాటి ప్రజానీకానికి దిక్సూచిగా నిలిచారు. శ్రీకాకుళం రోడ్-పొందూ రు రైల్వేస్టేషన్ల మధ్యగల దూసి ఆర్. ఎస్ వద్ద పట్టాలు తప్పించడం, కళింగ పట్నంలో తపాలా కార్యాలయం దోపి డీతో పాటు పలు ఉదంతాల్లో కృష్ణ మూర్తితో సహా పలువురిపై కేసులను పోలీసులు నమోదు చేసి కారాగారానికి పంపారు. 1940, జనవరి 20న మహాత్మాగాంధీ దూసి రైల్వే స్టేషన్లో సభను నిర్వహించినప్పుడు జన సమీకరణ చేసి జయప్రదం చేసిన ఘనత ఆయ నకే దక్కుతుంది. ఆచార్య ఎన్.జి.రంగా, గౌతులచ్చ న్న, కిల్లి అప్పల్నాయుడు, బెండి అప్పలసూరి వంటి ప్రముఖులకు స్వగ్రామమైన కనిమెట్టలో ఆశ్రయం కల్పించిన ఖ్యాతి కృష్ణమూర్తి బృందానికే దక్కుతుం ది. వీరందరికీ భోజన వసతులను కల్పించారు. పోలీసుల దృష్టికి రాకుండా అన్ని జాగ్రత్తలను తీసు కుని రహస్య జీవితాన్ని కొన్నాళ్లు అక్కడే గడిపారు. కారాగార జీవితం అనంతరం కృష్ణమూర్తి జాతీ య కాంగ్రెస్‌లో కీలక భూమికను పోషించారు. స్వాతంత్య్రం వచ్చినతర్వాత పూర్తిగా ఆయన రాజకీ యాలకే అంకితమయ్యారు. 1953లో జరిగిన విశాఖ జిల్లా బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఆధిక్యతతో విజయం సాధించి సత్తాచూపించారు. విశాఖపట్నం లో జల ఉష అనే నౌకను ప్రారంభించేందుకు వచ్చిన తొలి ప్రధాని నెహ్రూ పాల్గొన్న సభలో కృష్ణమూర్తి జాతీయ, దేశభక్తి గీతాలను పాడారు. తెలుగు భాష రాని నెహ్రూ ఆయన గానాన్ని విని అభినందించా రు. ప్రజల కోసం, సమాజం కోసం, దేశం కోసమే తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు కృష్ణ మూర్తి తన 34వ ఏట 1955, సెప్టెంబర్ 26న ఈ ప్రపంచం నుంచి నిష్ర్కమించారు. కృష్ణమూర్తి స్వగ్రామం కనిమెట్టలో అక్కడి ప్రగ తి యువజన సంఘం ప్రతి ఏటా నంద కృష్ణమూర్తి జయంతిని నిర్వహిస్తోంది. ఆనాటి సమరయోధుల సంస్మరణార్థం ప్రగతి యువజన సంఘం అధ్య క్షులు సూరు చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో 2000 సంవత్సరం జనవరి 26న ప్రాథమిక పాఠశాల ఆవ రణలో ఆయన స్తూపాన్ని ఏర్పాటు చేశారు. (నేడు నంద కృష్ణమూర్తి 95వ జయంతి) వి. కొండలరావు సీనియర్ జర్నలిస్టు, పొందూరు మొబైల్: 9490528730 -
ఆటోలో వచ్చి.. ఆశ్చర్యంలో ముంచెత్తి..!
‘ప్రజా గాయకుడు గద్దర్ వస్తున్నారు...’ ఇదీ సూరారం వాసులకు మంగళవారం తెలిసిన సమాచారం. దీంతో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆయన రాక కోసం ఎదురు చూశారు. అటువైపుగా వచ్చే కారులన్నిటినీ పరిశీలించసాగారు. కానీ గద్దర్ జాడ లేదు. ఇంతలో ఓ ఆటో అక్కడికి వచ్చి ఆగింది. అందులో నుంచి గన్‌మెన్ దిగారు. అందులో ఉన్నదెవరో ఎవరికీ తెలియదు. దీంతో అందరూ ఆసక్తిగా అటువైపు చూశారు. తీరా చూస్తే ఆటోలో ఉన్నది గద్దర్. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. ఫొటోలు: దశరథ్ రజువా