breaking news
Prisons Department DG
-
ఖైదీలను ఆస్పత్రులకు పంపించడంపై ఎస్వోపీ రూపొందించండి
సాక్షి, అమరావతి:హత్యలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులు వంటి హేయమైన నేరాలకు పాల్పడిన వారిలో ఎంతమంది శిక్ష అనుభవిస్తున్నారు, వారిలో ఎంతమంది అనారోగ్య కారణాలతో జైలు నుంచి విడుదలయ్యారనే వివరాలను తమ ముందుంచాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తీవ్ర అస్వస్థతకు గురై, అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు వారిని బయట ఆస్పత్రులకు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు పంపే విషయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) రూపొందించాలని కూడా జైళ్ల శాఖను ఆదేశించింది. అఫిడవిట్ రూపంలో ఆ ఎస్‌వోపీని తమ ముందుంచాలని కోరింది. ఇందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.మధ్యంతర బెయిల్ కోరిన కేసులో..ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల మండలానికి చెందిన శ్రీనివాస వర్మకి గుంటూరు పోక్సో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ 2022 డిసెంబర్ 19న తీర్పునిచ్చింది. దీంతో వర్మ రాజమండ్రి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. పోక్సో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వర్మ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. తీవ్ర గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వర్మ అత్యవసర చికిత్స నిమిత్తం 6 నెలల పాటు మధ్యంతర బెయిల్ కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌తో పాటు అనుబంధ పిటిషన్‌పై జస్టిస్ నరేందర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అత్యవసర వైద్య చికిత్స అవసరమైనప్పుడు మంచి ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతుండటంపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పిటిషనర్ వర్మకు అత్యవసర చికిత్స అవసరమైన నేపథ్యంలో అతన్ని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో జైళ్ల శాఖ డీఐజీని కోర్టుకు పిలిచి ఖైదీల అత్యవసర చికిత్స విషయంలో జైళ్ల నిబంధనలు ఏం చెబుతున్నాయో ఆరా తీసింది. చికిత్స అవసరమైన ఖైదీలను ఆరోగ్యశ్రీ పథకం కింద నెట్వర్క్ ఆస్పత్రులకు పంపుతున్నామని డీఐజీ వివరించారు. పిటిషనర్ వర్మను అలాగే నెట్వర్క్ ఆస్పత్రికి పంపి చికిత్స అందించామని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జైళ్ల నిబంధనలను పరిశీలించింది. ఖైదీలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటే వారిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు పంపి చికిత్స అందించవచ్చునని, అయితే మెడికల్ ఆఫీసర్ ఆ మేర సర్టిఫికెట్ ఇస్తే చాలని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొంది. అందువల్ల ఈ విషయంలో అన్ని జైళ్లకు వర్తించేలా ఓ ఎస్‌వోపీని రూపొందించాలని జైళ్ల శాఖను ఆదేశించింది. కోర్టుకొచ్చే పని లేకుండా జైలు అధికారులే చికిత్స నిమిత్తం సూపర్ స్పెషాలిటీ లేదా బయట ఆస్పత్రులకు పంపే దిశగా ఎస్వోపీ రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. -
జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌పై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జైళ్లశాఖ డీజీ వీకే సింగ్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. మరోవైపు జైళ్లశాఖ ఇంఛార్జ్ డీఐజీగా సందీప్ శాండిల్యకు బాధ్యతలు అప్పగిస్తూ ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈ–ములాఖత్‌తో సమయం ఆదా
⇒ ఖైదీల కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగకరం ⇒ ‘చంచల్‌గూడ’లో ఈ–ములాఖత్ ప్రారంభంలో హోం మంత్రి నాయిని హైదరాబాద్: జైళ్లలోని ఖైదీలను కలిసేందుకు వచ్చే వారి కుటుంబ సభ్యులకు ఈ–ములాఖత్ ఎంతగానో ఉపయోగపడుతోందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం ఆయన చంచల్‌గూడ జైల్లో నూతనంగా ప్రవేశపెట్టిన ఈ–ములాఖత్ సౌకర్యాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ–ములాఖత్ పనితీరును జైళ్ల శాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ.. గతంలో ములాఖత్ కోసం వచ్చే వారు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని, ఈ–ములాఖత్ ద్వారా ఆన్లైన్లో ఇంట్లోనే కూర్చుని ములాఖత్ నమోదు చేసుకోవచ్చని చెప్పారు. దేశంలో ఎక్కడి నుంచైనా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చన్నారు. జెళ్ల శాఖ నిర్వస్తున్న పెట్రోల్ బంక్‌ల ద్వారా ఏటా రూ. 3 కోట్ల ఆదాయం వస్తోంద న్నారు. జైళ్లలో అవినీతిని రుజువు చేస్తే రూ. 5 వేల నగదు బహుమానం ఇస్తామని డీజీ వినయ్‌కుమార్ ప్రకటించారు. కార్యక్రమంలో డీఐజీ నర్సింహ, సూపరింటెండెంట్లు బచ్చు సైదయ్య, బషీరాబేగం తదితరులు పాల్గొన్నారు. ఈ–ములాఖత్ నమోదు ఇలా.. ఖైదీలను ములాఖత్‌లో కలవాలం టే జైలు వద్ద ఉన్న ములాఖత్ నమోదు కేంద్రానికి వచ్చి ఆధార్ జిరాక్స్ అందజేస్తే ములాఖత్‌కు వచ్చే వారితో పాటు జైల్లో ఉన్న వ్యక్తి వివరాలు నమోదు చేసుకుని టోకెన్ నంబర్ ఇస్తారు. సూపరింటెండెంట్ లేదా డిప్యూటీ సూపరింటెండెంట్ ములాఖత్ ఫారమ్‌ను పరిశీలించి అనుమతి ఇస్తారు. దీనికి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. సమయం వృథా కాకుండా ఉండేందుకు జైళ్ల శాఖ ఈ–ములాఖత్ ను ప్రవేశపెట్టింది. eprisons. nic. inలో new visit registration ఆప్షన్లో ఆధార్ నంబర్‌తో పాటు ములాఖత్‌కు వచ్చే వారి, ఖైదీ వివరాలు నమోదు చేయాలి. తేదీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. రెండు మూడు గంటల వ్యవధిలో ములాఖత్ అనుమతించబడిందా లేక తిరస్కరించబడిందా తెలిసిపోతుంది. అనుమతించబడిన ములాఖత్ పాస్ ప్రింట్ తీసుకుని జైల్లోని ములాఖత్ కార్యాలయంలో అందజేస్తే సరిపోతుంది.