President Tayyip Erdogan
-
ఈ హంతకుడు అధ్యక్షుడికి కాపలా కాశాడు
టర్కీ: అంకారాలోని ఓ వేదికపై రష్యా రాయబారిని అతి కిరాతకంగా కాల్చి చంపిన టర్కీ పోలీసు అధికారి మెవ్లత్ మెర్ట్ అల్తింటాస్(22) గతంలో ఎనిమిదిసార్లు టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌కు అంగరక్షణ బాధ్యతలు కూడా నిర్వహించాడట.ఈ ఏడాది జూలై 15న టర్కీలో సైనిక తిరుగుబాటు జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎర్డోగన్ కు అతడు మొత్తం ఎనిమిది సందర్భాల్లో రక్షణ బాధ్యతలు నిర్వహించినట్లు ఓ రిపోర్టు బుధవారం తెలిపింది. సోమవారం సాయంత్రం ఆర్ట్ ఎగ్జిబిషన్ సెంటర్ లోని వేదికపై రష్యా రాయబారి ఆండ్రే కర్లోవ్ మాట్లాడుతుండగా అల్తింటాస్ నేరుగా వెళ్లి ఆయనపై తొమ్మిది రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. అయితే, ఈ అల్తింటాస్ కు టర్కీలో సైనిక తిరుగుబాటుకు కారణంగా అనుమానిస్తున్న అమెరికాలోని ముస్లిం మతపెద్ద ఫెతుల్లా గులెన్కు సంబంధాలు ఉన్నట్లు టర్కీ పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో గులెన్ విద్యాసంస్థలు నిర్వహించే కార్యక్రమాలకు కూడా అల్తింటాస్ వెళ్లినట్లు గుర్తించారు. అంతేకాకుండా టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లట్ కావ్సోగ్లు అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీతో మంగళవారం సాయంత్రం ఫోన్లో మాట్లాడుతూ ఇదే అనుమానం వ్యక్తం చేశారు. -
తోకముడిచిన సైన్యం!
అంకారా: ప్రజల సంఘటిత శక్తి ముందు సైనిక తిరుగుబాటు వ్యూహం బెడిసికొట్టింది. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ పిలుపు మేరకు ప్రజలు విధుల్లోకి రావడంతో అధికార కాంక్షతో తెగబడిన సైన్యం తోక ముడిచింది. టర్కీలో సైనిక తిరుగుబాటు విఫలమైంది. అధ్యక్షుడిగా తన పట్టును ఎర్డోగాన్ మరింత బిగించారు. తిరుగుబాటుకు దిగిన సైన్యంపై ఆయన ఉక్కుపాదాన్ని మోపుతున్నట్టు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సైన్యం జరిపిన తిరుగుబాటు వల్ల తలెత్తిన హింసలో 90 మంది వరకు చనిపోయారు. టర్కీ వాయవ్య తీరప్రాంతమైన మార్మారీస్‌కు అధ్యక్షుడు ఎర్డోగాన్ విహారయాత్రకు వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన సైన్యంలో ఓ చీలిక వర్గం శనివారం తెల్లవారుజామున సైనిక కుట్రకు తెగబడింది. టర్కీలో ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, రాజధాని అంకారాలను తమ అధీనంలోకి తీసుకొనేందుకు సైనిక తిరుగుబాటుదారులు ప్రయత్నించారు. ప్రభుత్వ చానెల్‌ను తమ అధీనంలోకి తీసుకొని దేశంలో సైనిక పాలన విధిస్తున్నట్టు ప్రకటన చేయాలని ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో హుటాహుటీన తిరిగివచ్చిన ఎర్డోగాన్ వెంటనే సైనిక తిరుగుబాటును అణచివేసేందుకు చర్యలు తీసుకున్నారు. సైనిక తిరుగుబాటు దేశద్రోహచర్య అని, దీనికి కారకులు తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి సైనిక తిరుగుబాటును తిప్పికొట్టాలని ఎర్డోగాన్ ఇస్తాంబుల్ విమానాశ్రయంలో తన మద్దతుదారులను ఉద్దేశించి పిలుపునిచ్చారు. ఎర్డోగాన్ పిలుపుతో ప్రజలు వీధుల్లోకి రావడం, ఇటు పోలీసులు, ప్రభుత్వ దళాలు సైనిక తిరుగుబాటుదారుల దాడిని దీటుగా తిప్పికొట్టడంతో సైనిక కుట్ర విఫలమైనట్టు భావిస్తున్నారు. పోలీసులు సైనిక తిరుగుబాటుదారులపై ఉక్కుపాదం మోపారు. టర్కీ వ్యాప్తంగా మొత్తం 754 మంది సైనికులను అదుపులోకి తీసుకొన్నారు. తిరుగుబాటు నేపథ్యంలో సైన్యానికి తాత్కాలిక నూతన అధ్యక్షుడిని నియమించినట్టు టర్కీ ప్రధాని బెనాలీ ప్రకటించారు. అంకారాలో కొంతమంది సైనిక తిరుగుబాటుదారులు ప్రతిఘటిస్తున్నారని, వారిని కూడా ఏరివేస్తామని అధ్యక్షుడు ఎర్డోగాన్ మీడియాకు తెలిపారు. టర్కీలో పరిస్థితి పూర్తిగా ప్రజా ప్రభుత్వం నియంత్రణలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. -
అధ్యక్ష భవనంపై బాంబుల వర్షం!
అంకారా: అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌కు వ్యతిరేకంగా సైన్యం తిరుగుబాటుకు దిగడంతో టర్కీలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. టర్కీలో ప్రధాన నగరాలైన ఇస్తాంబుల్, అంకారాలలో తిరుగుబాటు అనుకూల సైనికులు, ప్రభుత్వ అనుకూల సైనికుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో 17మంది పోలీసు అధికారులు సహా 42 మంది చనిపోయారు. మృతుల్లో పౌరులే అధికంగా ఉన్నారు. ఈ ఘర్షణల్లో తిరుగుబాటు సైనికులదే పైచేయిగా ఉన్నట్టు ప్రాథమిక కథనాలు చాటుతున్నాయి. టర్కీలో సైనిక తిరుగుబాటు లైవ్ అప్ డేట్స్ ఇవి.. టర్కీ పార్లమెంటు భవనం వద్ద రెంబు బాంబు పేళ్లులు, పలువురికి గాయాలు సైనిక తిరుగుబాటుదారుల విమానాన్ని కూల్చేసిన ప్రభుత్వ దళాలు సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావాలని ఎర్డోగాన్ పిలుపు.. సైనిక తిరుగుబాటును ధిక్కరిస్తున్న ఎర్డోగాన్ మద్దతుదారులు అంకారాలోని టర్కీ అధ్యక్ష భవనం సమీపంలో బాంబులను విసిరిన జెట్ విమానం టర్కీలో కర్ఫ్యూ, సైనిక పాలన విధించిన మిలిటరీ టర్కీ తీరప్రాంతమైన మార్మారీస్‌కు అధ్యక్షుడు ఎర్డోగాన్ విహాయాత్రకు వెళ్లడంతో ఇదే అదనుగా తిరుగుబాటుకు తెగబడ్డ సైన్యం విహారయాత్ర నుంచి తిరిగొచ్చిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో మద్దతుదారుల ఘనస్వాగతం సైనిక తిరుగుబాటు దేశద్రోహమేనని ప్రకటించిన ఎర్డోగాన్ -
సైన్యంలోని ద్రోహులను ఏరిపారేస్తున్నాం!
అంకరా: తన ప్రభుత్వం కూల్చేందుకు సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నించడంపై టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సైనిక తిరుగుబాటులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. టర్కీ సైన్యంలోని దేశద్రోహ శక్తులను సమూలంగా ఏరిపారేసే మిషన్ ప్రారంభమైందని ఎర్డోగాన్ తెలిపారు. శనివారం ఉదయం ఇస్తాంబుల్‌లోని అటాటర్క్ విమానాశ్రయం వద్ద మద్దతుదారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆయనను ఓ విమానం ఎయిర్పోర్ట్ వద్ద దిగబెట్టిందని జిన్హుహా వార్తాసంస్థ తెలిపింది. సైనిక తిరుగుబాటుపై టర్కీ ప్రధానమంత్రి బినాలీ యిల్దిరిమ్ కూడా స్పందించారు. ప్రస్తుతం రాజధాని అంకరాలో పరిస్థితి అదుపులోనే ఉందని, తిరుగుబాటుకు దిగిన 120మందిని అదుపులోకి తీసుకున్నామని ప్రధాని తెలిపారు. ప్రధాని ప్రకటన వెలువడిన 15 నిమిషాలకే టర్కీ పార్లమెంటు భవనం బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డట్టు స్థానిక మీడియా తెలిపింది. అంతేకాకుండా అంకరాలో విమానాల రాకపోకలను నిలిపేస్తూ ’నో ప్లై జోన్’ ప్రకటించారు. ఎర్గోగాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సైన్యం తిరుగుబాటుకు దిగడంతో ఇప్పటికే 42 మంది ప్రాణాలు కోల్పోయారు.