breaking news
Prajith
-
డేట్ ఫిక్స్ చేసిన అల్లరోడు..!
ఒకప్పుడు వరుస హిట్స్ తో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదిగిన అల్లరి నరేష్, కొంత కాలంగా తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నాడు. తన మార్క్ కామెడీ సినిమాలతో పాటు ప్రయోగాలు కూడా ఫెయిల్ అవ్వటంతో ఇక రూట్ మార్చక తప్పదని నిర్ణయించుకున్నాడు. అందుకే తరహా కామెడీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. క్లాస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మేడ మీద అబ్బాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ సినిమా ఒరు వడక్కన్ సెల్పీ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్ డైరెక్ట్ చేసిన ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిఖిలా విమల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైన ఫాంలోకి రావాలన్న ఆలోచనలో ఉన్నాడు అల్లరి నరేష్. -
మేం చెప్పం.. ప్రేక్షకులే చెబుతారు!
– ‘అల్లరి’ నరేశ్ ‘‘కొంతమంది మాది డిఫరెంట్ సినిమా. కొత్త కాన్సెప్ట్‌తో తీశామంటుంటారు. కానీ, మా సినిమా చూసిన తర్వాత ఎంత కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తీశామనేది ప్రేక్షకులే చెబుతారు’’ అన్నారు ‘అల్లరి’ నరేశ్. ఆయన హీరోగా నటిస్తున్న 53వ సినిమా ‘మేడ మీద అబ్బాయి’. జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆదివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్ ఇవ్వగా, ‘నూజివీడు సీడ్స్’ వైస్ ప్రెసిడెంట్ రామ కోటేశ్వరరావు కెమేరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత సి. కల్యాణ్, ప్రసన్నకుమార్‌లు యూనిట్‌కి స్క్రిప్ట్ అందించారు. ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ – ‘‘మలయాళ హిట్ సినిమా ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’కి తెలుగు రీమేక్ ఇది. ఒరిజినల్ వెర్షన్ తీసిన ప్రజిత్ తెలుగు సినిమాకూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’ల తర్వాత అంత పొటెన్షియల్ ఉన్న పాత్ర దక్కింది’’ అన్నారు. బొప్పన చంద్రశేఖర్ మాట్లాడుతూ – ‘‘నాకిష్టమైన సినిమాల్లో ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ ఒకటి. ఈ నెల 16న పొల్లాచ్చిలో షూటింగ్ ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం’’ అన్నారు. సంగీత దర్శకుడు డీజే వసంత్, ఛాయాగ్రాహకుడు ఉన్ని ఎస్.కుమార్, మాటల రచయిత చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎంఎస్ కుమార్, హీరోయిన్ నిఖిలా విమల్ పాల్గొన్నారు.