breaking news
Pollutants
-
పొలాల్లో ప్లాస్టిక్ భూతం! బయోపాస్టిక్‌లూ విషపూరితమే!
వ్యవసాయంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరుగుతోంది. మల్చింగ్ షీట్లు, మొలక ట్రేలు, డ్రిప్ లైన్లు, చెరువు లైనర్ షీట్లు, పాలీహౌస్‌ల నిర్మాణంతో పాటు ఆహార పదార్థాల నిల్వ, ప్యాకేజింగ్, రవాణా క్రమంలోనూ విరివిగా ప్లాస్టిక్ వాడుతున్నారు. పంట భూముల్లో మిగిలిపోయే పాలిథిన్ అవశేషాలు ఇప్పుడు హెక్టారుకు 300 కిలోలకన్నా ఎక్కువట. ప్లాస్టిక్ వస్తువుల్లో 16 వేల రకాల రసాయనాలు ఉంటాయి. వీటిలో 4,200 రసాయనాలు అత్యంత విషపూరితమైనవి. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఇవి తీవ్ర హాని చేస్తున్నాయని ప్లాస్ట్కెమ్ ప్రాజెక్టు శాస్త్రవేత్తల బృందం గతేడాది గుర్తించింది. కాబట్టి, ప్లాస్టిక్ వాడకంలోను, వాడిన వాటిని పారేయటంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు మానవ సమాజానికి తిరుగులేని ప్రయోజనాలను అందిస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ ‘అరికట్టలేని సంక్షోభం’గా మారిపోయింది. కృత్రిమ రసాయనాలతో సింథటిక్ ప్లాస్టిక్ వస్తువులను 1907లో మొట్టమొదట తయారు చేశారు. 1950 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 2 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వస్తువులు ఉత్పత్తి అయ్యేవి. ఇప్పుడు ఏటా 45 కోట్ల మెట్రిక్ టన్నులకు మించిపోయింది. ఇందులో, వాడేసిన ప్లాస్టిక్ వస్తువుల్లో కేవలం 9 శాతాన్ని మాత్రమే సేకరించి, తిరిగిఉపయోగించుకుంటున్నాం.91% శాతం ప్లాస్టిక్ వస్తువులు మట్టిలోనో, నీటిలో కలిసిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 1.9 కోట్ల నుంచి 2.3 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు నీటి ద్వారా సరస్సులు, నదులు, సముద్రాలను కలుషితం చేస్తున్నాయి. 1.3 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలో పేరుకుపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు కనపడని చోటేదీ ఇప్పుడు మిగల్లేదు. మన అడవులు, నేల, నీరు, గాలిని కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు కలుషితం చేస్తున్నాయి. కంటికి కనిపించనంత చిన్న ప్లాస్టిక్ ముక్కలు (మైక్రోప్లాస్టిక్‌లు) జంతువులు, మొక్కలు, పండ్లు, మానవ శరీరాల్లోకి కూడా ప్రవేశించాయి. ఒక లీటరు మంచినీటి సీసాలో దాదాపు 2,40,000 చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయని ఇటీవలి అధ్యయనంలో తేలింది.చదవండి: Vitamin D deficiency ఎన్నో ఆరోగ్య సమస్యలుప్లాస్టిక్ పదార్థాలు ప్రపంచంలోని ప్రతి మూలలోకి చొరబడ్డాయి. మనం తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలిని కూడా కలుషితం చేశాయి. వీటిని బాధ్యతతో వాడుకోవటం, వాడిన ప్లాస్టిక్‌ను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా పద్ధతి ప్రకారం సేకరించి తిరిగి ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనలో ప్రతి ఒక్కరూ సమష్టిగా చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వ్యవసాయంలో ప్లాస్టిక్‌తో ముప్పువ్యవసాయంలో ప్లాస్టిక్ వస్తువుల వాడకం గత కొన్ని దశాబ్దాలుగా అలవాటైంది. ఆధునిక కాలంలో వాణిజ్య పద్ధతుల్లో వ్యవసాయం తీవ్రతరం కావటంతో దీని వాడకం మరింత పెరుగుతోంది. నేల ఉష్ణోగ్రతను విజయవంతంగా నియంత్రించడం, కలుపు పెరుగుదలను చాలా వరకు అరికట్టడం, నేలలో తేమ నష్టాన్ని నిరోధించడం కోసం వ్యవసాయ భూముల్లో మల్చింగ్ షీట్(పాలిథిన్ ఫిల్మ్)ను విస్తృతంగా వాడటం మన దేశంలో మొదలుపెట్టింది కొద్ది సంవత్సరాల క్రితమే. అయితే, అభివృద్ధి చెందిన దేశాల్లో 1950లలోనే ప్రారంభమైంది. ఈ పద్ధతి పత్తి, మొక్కజొన్న తదితర పంటల సాగు ఖర్చును తగ్గించటంతో పాటు దిగుబడిని సగటున 30 శాతం పెంచుతోంది. ప్లాస్టిక్‌ను ఇప్పుడు మల్చింగ్ షీట్, మొలక ట్రేలు, డ్రిప్ లైన్లు, చెరువు లైనర్ షీట్లు, పాలీహౌస్‌లు, ఆహార నిల్వ, ప్యాకేజింగ్, రవాణాలో విరివిగా ఉపయోగిస్తున్నారు. పంట భూముల్లో మిగిలిపోయే పాలిథిన్ అవశేషాలు ఇప్పుడు హెక్టారుకు 300 కిలోలకన్నా ఎక్కువగానే ఉన్నాయని ఒక అధ్యయనం చెబుతోంది.ఇదీ చదవండి: నటి పరిణీతి ప్రెగ్నెన్సీ.. నో కోల్డ్‌వార్..పెద్దమ్మ ఫుల్ హ్యాపీఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) వ్యవసాయంలో ప్లాస్టిక్‌ల వినియోగాన్ని అంచనా వేసే ఒక కీలక నివేదికను విడుదల చేసింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా పంటలు, పశువుల ఆహారోత్పత్తుల సాగు నుంచి విక్రయం వలకు వివిధ దశల్లోని విలువ గొలుసులో 1.2 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడారు. ఆహార ప్యాకేజింగ్‌లో 3.73 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తులను ఉపయోగించారని ఎఫ్ఏవో లెక్క తేల్చింది. ప్లాస్టిక్ వాడకంపై నియంత్రణ అవసరమనే విషయమై 3 దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నాయి. పది రోజుల శిఖరాగ్రసభ జెనీవాలో ఈ నెల 15న ముగిసింది. భారత్ సహా 184 దేశాలకు చెందిన 3,700 మంది ప్రతినిధులు ఏకాభిప్రాయానికి రాలేక ఎటువంటి ఒడంబడికా చేసుకోలేదు. ముప్పయ్యేళ్లుగా ఇదే తంతు. మన దేశంలో పరిస్థితేంటి?వ్యవసాయంలోప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో సగం ఆసియా దేశాల్లోనే వినియోగిస్తు న్నారు. వాడేసిన ప్లాస్టిక్‌ను తగులబెట్టడం, పూడ్చిపెట్టటం లేదా చెత్తకుప్పల్లో పోయటం మనకు తెలిసిందే. అయితే, దీనికి సంబంధించిన ఏ లెక్కలూ దొరకవు. ఎందుకంటే, వ్యవసాయ ప్లాస్టిక్ కాలుష్యం గురించి ఆలోచించేవారే కరువు. మన దేశంలో 90 శాతం గ్రామాల్లో చెత్త యాజమాన్య వ్యవస్థలే లేవు. ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు ఎక్కడపడితే అక్కడ పారెయ్యటమే. 67 శాతం మంది మామూలు చెత్తతో పాటు ప్లాస్టిక్ చెత్తను కూడా కాల్చేస్తున్నారని ఒక అధ్యయనం చెబుతోంది. దేశంలోని 6.65 లక్షల గ్రామాలు, 2.68 లక్షల పంచాయతీల్లో ప్రతి ఏటా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తుంటాయి. వీటిలో క్లైమేట్ ఛేంజ్ యాక్షన్ ప్లాన్‌ను చేర్చాలి. అందులో వ్యవసాయ, వ్యవసాయేతర ప్లాస్టిక్ నిర్వహణను కూడా జోడించాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ప్లాస్టిక్‌కు బదులు పంట వ్యర్థాలతో, వత్తుగా పంటలతోనే సజీవ ఆచ్ఛాదన చేస్తూ ఉంటారు. ఆ పద్ధతులపై అవగాహన కలిగించి, ప్రోత్సహించే పథకాలను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలిథిన్ మల్చింగ్ షీట్లతో ఇదీ ముప్పు వ్యవసాయ భూముల్లో వేసిన ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ వ్యర్థాలు మిగిలిపోతాయి. వేసిన నెలల్లోనే చిరిగి పోతుంది. కాబట్టి దాని ముక్కలన్నిటినీ మట్టిలో నుంచి ఏరెయ్యటం సాధ్యపడదు.నేల ఆరోగ్యాన్ని, పర్యావరణ వ్యవస్థలను దెబ్బతీస్తుంది. వ్యవసాయ భూముల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు నేల సారాన్ని తగ్గిస్తుంది. పంట భూమి లోపలికి గాలి ప్రసరించటం కూడా అవసరం. ప్లాస్టిక్ షీట్ కింద మట్టిలో గాలి ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. నేల ఆరోగ్యంగా ఉండాలంటే అందులో సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉండాలి. మల్చింగ్ షీట్ వీటికి ప్రతికూలంగా పనిచేస్తుంది. వేర్లు, మొత్తంగా మొక్కల పెరుగుదలపై ప్లాస్టిక్ ప్రతికూలంగా పని చేస్తుంది. మట్టిలోని వానపాములు వంటి మేలు చేసే జీవరాశికి హాని కలుగుతుంది. వాటి పోషణ దెబ్బతింటుంది.వానపాములు బొరియలు చేసుకుంటూ మట్టిపైకి వచ్చి వదిలే విసర్జితాలే నేలను సారవంతం చేస్తాయి. ఆ ప్రక్రియ ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల దెబ్బతింటుంది. ప్లాస్టిక్ సూక్ష్మ ముక్కల (మైక్రోప్లాస్టిక్‌ల)ను మొక్కలు వేర్ల ద్వారా గ్రహించి, ఆకుల్లో, పువ్వుల్లో, కాయల్లో, గింజల్లోకి చేర్చుతాయి. ఆ భూమిలో పండే ఆహారోత్పత్తుల ద్వారా మైక్రోప్లాస్టిక్స్ ఆహారంలోకి, మానవ శరీరాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. వ్యవసాయంలో ప్లాస్టిక్ కాలుష్యంపై పాలకులు పట్టించుకోవటం లేదు. అధ్యయనాలూ జరగక పోవటం దురదృష్టకరం. ఈ నిర్లక్ష్యం వ్యవసాయాన్ని, యావత్ పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది.పంట పొలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను జాగ్రత్తగా సేకరించి, రీసైకిల్ చేసే వారికి పంపటం ద్వారా ఈ ముప్పును కొంత తగ్గించవచ్చు. అయితే, దీని గురించి రైతులకు చైతన్యం కలిగించే వారు కరువయ్యారు. అర్బన్ ప్రాంతాల్లోని ఇళ్లలో ప్రజలు వాడిన ప్లాస్టిక్ సేకరణ, రీసైక్లింగ్‌పై కార్యాచరణ ప్రణాళికల్లోనూ వ్యవసాయ ప్లాస్టిక్ వ్యర్థాల ఊసే లేదు. అగ్రి ప్లాస్టిక్ సమస్యపై అవగాహన ఇటీవలే ముందుకు వస్తుండటం దీనికి కారణం. ఈ నేపథ్యంలో వ్యవసాయ ప్లాస్టిక్ వస్తువుల సుస్థిర వినియోగం, నిర్వహణపై ఎఫ్ఏవో గత అక్టోబర్‌లో వాలంటరీ గైడ్‌లైన్స్‌ను ప్రకటించింది. మల్చింగ్ షీట్లతో ముప్పేమిటో తెలుసా?ఆధునిక పంట పొలాల్లో ప్లాస్టిక్ షీట్లు విస్తారంగా కనిపిస్తుంటాయి. ఇవి చాలా పల్చటి ప్లాస్టిక్‌తో తయారు చేసినవి. పొలంలో పరచిన ఒక సంవత్సరంలో చిరిగిపోతాయి. అవి ఎంత పలచనంటే.. ఒక కిలో మల్చింగ్ షీట్ కట్టను 700 చదరపు అడుగుల వ్యవసాయ భూమిపై పరచడానికి సరిపోతుంది. దాని వల్ల ఉపయోగాలున్నాయి. అయితే, అంత భూమిని అనేక విధాలుగా నాశనం చేస్తోందన్నది కూడా వాస్తవం.బయోపాస్టిక్‌లూ విషపూరితమే! పెట్రోలియం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా మొక్కల ఆధారంగా బయోప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తున్నారు. మొక్కజొన్న, బంగాళదుంపలు, చెరకు, సుగర్బీట్ అనే దుంపల ద్వారా బయోప్లాస్టిక్‌లను తయారు చేస్తారు. అయితే, ఇవి కూడా పూర్తిగా మేలైనవనుకోవటానికి లేదు. బయోప్లాస్టిక్ వస్తువుల తయారీలో వాడే ముడి పదార్థాలను ఈ మొక్కలనుంచి తీసుకుంటు న్నప్పటికీ.. బయోప్లాస్టిక్‌ను తయారు చేసే క్రమంలో గట్టితనం, రంగు తదితర గుణాల కోసం రసాయనిక ప్రక్రియల్లో వాడే వేలకొద్దీ సింథటిక్ రసాయనాలు చాలా విషపూరితమైనవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్వీడన్‌లోని గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయంలో ఎకోటాక్సికాలజీ–పర్యావరణ శాస్త్ర ప్రొఫెసర్ బెథానీ అల్మ్రోత్ ఇలా స్పందించారు: ‘చాలా మందికి ప్లాస్టిక్‌లోని విషతుల్య పదార్థాల గురించి తెలియదు. ప్లాస్టిక్‌లతో పనిచేసే వ్యక్తులకు కూడా బయోప్లాస్టిక్లలోని టాక్సిన్స్ గురించి సరైన సమాచారం లేదు. అందుకని, ప్లాస్టిక్లు పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ముప్పుగా మారకుండా ఉండాలంటే, మొదట వాటి వాడకం తగ్గించాలి. వాడేసిన ప్లాస్టిక్ వస్తువుల్ని పారేసే అలవాట్లను మనందరం పనిగట్టుకొని మార్చుకోవాలి’ అంటున్నారామె. కాబట్టి, ప్రజల్లో ప్లాస్టిక్ చైతన్యం పెరగాలి. బయోప్లాస్టిక్ తయారీని పాతికేళ్ల క్రితమే కనుగొన్నప్పటికీ ప్రస్తుతం వీటి ఉత్పత్తి మొత్తం ప్లాస్టిక్ వాడకంలో ఒక్క శాతానికే పరిమితమైంది.4,200 ప్లాస్టిక్ రసాయనాల్లో విషం! మనం దైనందిన జీవితంలో వాడే ప్లాస్టిక్ వస్తువులు పెట్రోకెమికల్స్తోనే తయారవుతున్నాయి. ఈ ప్లాస్టిక్ వస్తువుల్లో 16 వేల రకాల రసాయనాలు ఉంటాయి. ఇవన్నీ హాని చేసేవి కాదు. వీటిలో 4,200 రసాయనాలు మాత్రం అత్యంత విషపూరితమైనవి. ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఇవి తీవ్ర హాని చేస్తున్నాయని ప్లాస్ట్కెమ్ ప్రాజెక్టు శాస్త్రవేత్తల బృందం గతేడాది గుర్తించింది. మరో 10 వేల ప్లాస్టిక్ రసాయనాల విషతుల్యత ఎంత అనేదానిపై ఇప్పటికీ తగినంత సమాచారం లేదని బృందం తెలిపింది. ప్లాస్టిక్ వస్తువుల్లోని రసాయనాలు 70 శాతం అసాంక్రమిక వ్యాధుల(ఎన్సీడీలు) వ్యాప్తికి ఒకానొక ముఖ్యకారణమని అంచనా. -
బయోమెడికల్ వ్యర్థాలు..ప్రాణాంతక వ్యాధులు
మనం ఏదైనా ఆసుపత్రికి వెళితే వైద్యులు వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్ష చేయించుకుని రమ్మంటారు.. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు అవసరాన్ని బట్టి ఇంజక్షన్ వేస్తారు.. వీటి కోసం వినియోగించిన సిరంజిలను ఎక్కడ పడితే అక్కడ వేయడం ప్రాణాంతకం. వాటిని తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన బయో మెడికల్ వ్యర్థ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ఇవ్వాలి. కొందరు వైద్యులు కక్కుర్తి పడి ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వాహకులకు వ్యర్థాలు ఇవ్వడం లేదు. రోడ్లపై, చెత్త కుండీల్లో పడేస్తున్నారు. చెత్తను తీసుకెళ్లే మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి ఈ వ్యర్థాలను ఇస్తుండటంతో పెను ప్రమాదం పొంచి ఉందంటున్నారు పర్యావరణ వేత్తలు. జిల్లాలో 200కు పైగా చిన్న, పెద్ద ఆసుపత్రులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. ప్రొద్దుటూరు టౌన్ : మనుషులకు, జంతువులకు రోగనిర్ధారణ కోసం ఉపయోగించిన సింరజిలు, సెలైన్ బాటిళ్లు, రక్తపు బ్యాగ్‌లు, కట్టు గుడ్డలు, శరీరంలోని వివిధ రకాల అవయవాలు ఇవన్నీ బయో మెడికల్ వ్యర్థాలుగా పరిగణించారు. అనంతపురం జిల్లాలో ఉన్న శ్రవన్ ఎన్విరాన్మెంట్æటెక్నాలజీస్ అనే బయో మెడికల్ వ్యర్థ రహిత ట్రీట్మెంట్ ప్లాంట్‌కు ఈ వ్యర్థాలను ఇవ్వాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ణయించింది. అనంతపురం జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లాలోని ఆసుపత్రుల నుంచి వచ్చే బయో మెడికల్ వ్యర్థాలను ఈ సంస్థకు చెందిన వాహనాల్లో ప్రతి రోజు తీసుకెళుతున్నారు. వైఎస్సార్ జిల్లాలో 550కిపైగా ఆసుపత్రులు, రక్తపరీక్ష ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో 340 ఆసుపత్రులు, ల్యాబ్‌ల నుంచి వ్యర్థాలను ఈ ప్లాంట్ ప్రతినిధులకు ఇస్తున్నారు. మరో 200 ఆసుపత్రులు, ల్యాబ్‌లు వ్యర్థాలను వీరికి ఇవ్వకుండా రోడ్లపై, చెత్త కుండీల్లో, మున్సిపల్ చెత్త వాహనాల్లో వేస్తున్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, ల్యాబ్స్... జిల్లాలోని రాజంపేట మున్సిపాలిటీలో 14, రాయచోటిలో 10, లక్కిరెడ్డిపల్లెలో ప్రభుత్వాసుపత్రి, వేంపల్లి 3, పులివెందుల 16, జమ్మలమడుగు 15, మైదుకూరు 5, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రితో పాటు మరో 110 ప్రైవేటు ఆసుపత్రులు, కడప కార్పొరేషన్ 140, బద్వేలు 20, కోడూరు 10 ఆసుపత్రులు, ల్యా బ్లు బయోమెడికల్ వ్యర్థాలను ట్రీట్మెంట్ప్లాం ట్‌కు ఇస్తున్నాయి. ఇవి కాక మరో 200లకు పైగా ఆసుపత్రులు, ల్యాబ్‌లు బయో మెడికల్ వ్యర్థాలను ఇష్టానుసారంగా పడేస్తున్నారు. అలాగే జిల్లాలోని మరో 60 పీహెచ్‌సీల వ్యర్థాలను కూడా ట్రీట్ మెంట్ప్లాంట్కు ఇవ్వాలని సంస్థ నిర్వాహకులు డీఎంఅండ్ హెచ్ఓకు లేఖలు ఇచ్చారు. కొందరు ఆసుపత్రుల నిర్వాహకులు బయోమెడికల్ వ్యర్థాలను నేరుగా మురికి కాలువల్లో పడేస్తున్నారు. ఈ నీటిలోని దోమ ల వల్ల కానీ, ఈ నీరు భూమిలోకి ఇంకడం వల్ల కానీ పెను ప్రమాదం ఏర్పడుతుందన్న విషయం తెలిసి కూడా ఏ శాఖ దీన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది. కంపోస్టు యార్డులో వ్యాపిస్తున్న వైరస్... మున్సిపాలిటీ చెత్త వాహనాల్లో బయో మెడికల్ వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బంది కంపోస్టు యార్డు కు తీసుకెళుతున్నారు. బయోమెడికల్ వ్యర్థాలపై ఉన్న వైరస్, చెత్తలో కలిసి మరింత పెరుగుతోంది. పారిశుద్ధ్య సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆసుపత్రుల నిర్వాహకులు ఇచ్చే డబ్బు కోసం ఆశపడి బయో మెడికల్ వ్యర్థాలను వాహనాల్లో వేసుకునే సమయంలో సిరంజిలు చేతులకు, కాళ్లకు గుచ్చుకుంటున్నా పట్టించుకోవడం లేదు. వారికి తెలియకుండానే భయంకరమైన జబ్బుల బారినపడే ప్రమాదం ఉందని సీనియర్ వైద్యులు చెబుతున్నారు. కేవలం చెత్తను తీసుకోవాలని ఆదేశాలు ఉన్నా పర్యవేక్షణ అధికారులు లేక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆసుపత్రులను తనిఖీ చేసిన సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్.. కొద్ది రోజుల కిందట కడప, ప్రొద్దుటూరుల్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను కర్నూలు రీజియన్ సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ జనార్ధన్ పరిశీలించారు. చాలా ఆసుపత్రుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు పాటించని విషయంపై వైద్యులను ప్రశ్నించారు. కొందరు బయో మెడికల్ వ్యర్థాలను ట్రీట్‌మెంట్‌ప్లాంట్లకు ఇవ్వడం లేదని చెప్పారు. చెత్తను తీసుకెళ్లే మున్సిపాలిటీ పారిశుద్ధ్య విభాగానికి డబ్బులు ఇచ్చి, ట్రీట్‌మెంట్‌ప్లాంట్ వారికి డబ్బు ఇవ్వాలంటే భారంగా మారిందని చెప్పడం చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటికే కడపలోని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయగా ప్రొద్దుటూరులోని 10 ఆసుపత్రులకు మరో రెండు రోజుల్లో నోటీసులు రానున్నాయి. ట్రీట్మెంట్ ప్లాంట్‌కు చెల్లించే ఫీజు ఇలా... ప్రతి రోజు జిల్లాకు బయోమెడికల్ వ్యర్థాలను తీసుకెళ్లేందుకు మూడు ప్రత్యేక వాహనాలు వస్తున్నాయి. ఒక్క ప్రొద్దుటూరు నుంచి అరటన్నుకుపైగా వ్యర్థాలు వస్తున్నాయి. పూర్తి స్థాయిలో వ్యర్థాలను వేరు చేస్తే టన్నుకు పైగా రావాల్సి ఉంది. ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్వాహకులు ల్యాబ్‌కు రూ.600, డెంటల్ ఆసుపత్రి నుంచి రూ.500, ఆసుపత్రిలో 50 బెడ్లు ఉంటే రూ.5000, 100 బెడ్లు ఉంటే రూ.10వేలు, ఇలా రూ. 500 నుంచి ఫీజు తీసుకుంటున్నాయి. ఒక్క రోజు వాహనం ఏ కారణం చేతనైనా రాక పోతే మరుసటి రోజు రెండు రోజుల వ్యర్థాలను తీసుకెళుతున్నా ఆ రోజు ఫీజును ఆసుపత్రుల నిర్వాహకులు ఇవ్వడం లేదని ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రకాల డబ్బాల వినియోగం ఎక్కడ... నిబంధనల ప్రకారం ప్రతి ఆసుపత్రిలో తెలుపు, ఎరుపు, పసుపు రంగులు కలిగిన డబ్బాలను విని యోగించాలన్న నిబంధనలు ఆసుపత్రులు పక్కన పెట్టాయి. కనీసం డస్టు బిన్స్ కూడా లేని ఆసుపత్రులు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అవగాహన లేమితో... ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బందికి బయోమెడికల్ వ్యర్థాలపై అవగాహన లేకపోవడం వల్లకూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. కొందరు సిరంజిలు, సెలైన్ బాటిళ్లు, విక్రయానికి తీసుకెళుతుండగా, మరి కొందరు ఆపరేషన్‌కు వినియోగించిన వస్తువులు నేరుగా మురికి కాలువల్లో పడేస్తున్నారు. పసుపు రంగు డబ్బాలో.. శరీర అవయవ భాగాలు, డ్రైసింగ్, గాజ్, దూది, పట్టీలు ఈ డబ్బాలో వేయాలి మావి, ప్లాసెంటా, గర్భాశయం, అపెండిక్స్ కంతులు తదితరాలు వ్యాధి నిర్ధారణ కణజాల నమూనాలు(బయాస్పీ స్పెసిమెన్) ఆటోక్లేవ్ చేసిన తర్వాత బ్లడ్ బ్యాగులు ఆపరేషన్‌లో తొలగించిన అవయవాలు డ్రెస్సింగ్ ప్యాడ్లు, బ్యాండేజీలు, దూది స్వాబ్లు, శానిటరీ ప్యాడ్లు, రక్తం, చీముతో తడిచిన ఏదైనా దూదిబట్ట, గాజ్ వంటి వ్యర్థాలు సిమెంట్ పట్టీలు వ్యాధి నిర్ధారణ తరువాత మిగిలిన మానవ శరీర వ్యర్థాలు (చీము, రక్తము, మలము, మూత్రము, కంతుల ముక్కలు) సైటో టాక్సిక్, యాంటిబయోటిక్స్ వయర్స్, (సగం వాడిన, కాలం చెల్లినవి) తెలుపు డబ్బాలో... పదునైన వ్యర్థాలన్నింటినీ ఈ డబ్బాలో వేయాలి ఈ డబ్బాలో 10 శాతం సోడియం హైపో క్లోరైడ్ ద్రవం కలిపి ఉంచాలి ఇంజక్షన్లు సూదులు ఇంజక్షన్మందు ఉంటే పగిలిన వయల్స్ పగిలిన ఆంప్యూల్స్ సూక్ష్మదర్శినిలో వాడే పగిలిన స్లైడ్స్ ఆపరేషన్‌లో కుట్లు వేసేందుకు ఉపయోగించిన సూదులు షేవింగ్ బ్లేడులు శస్త్రచికిత్సలో ఉపయోగించే రెండంచుల పదునైన కత్తులు, పరికరాలు రోగితో సంబంధం కలిగిన గాయపరిచే పదునైన వస్తువులు నీలం రంగు డబ్బాలో.. రబ్బర్, ప్లాస్టిక్ వ్యర్థాలను ముక్కలుగా కత్తిరించి ఈ డబ్బాలో వేయాలి మూత్రాన్ని బయటకు తీసే క్యాథిటర్స్ రోగికి వాడిన ఇతర ప్లాస్టిక్ గొట్టాలు రైల్స్ ట్యూబులు ముక్కు విరిచిన ప్లాస్టిక్ సిరంజిలు మూత్రపు సంచులు ఐవి సెట్స్ చేతి గొడుగులు, గ్లౌజ్ ఆఫ్రాన్లు డయాలసిస్ సామగ్రి -
కృష్ణాతీరం.. కాలుష్య కాసారం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలుగు నేలపై గలగల పారుతున్న కృష్ణమ్మకు ప్రమాదం పొంచి ఉందా..? వ్యర్థాలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. తీరం వెంట ఉన్న పరిశ్రమలు వెదజల్లే వ్యర్థాలు.. డ్రైనేజీల మురుగు నేరుగా నదిలో కలుస్తోంది. తీరం వెంబడి పొలాల్లో ఉపయోగించే రసాయనా లు కూడా కృష్ణానదిలో కలుస్తుండటంతో నదీ జలా లు కలుషితం అవుతున్నాయి. తద్వారా జీవరాశుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికే నదీ దాదాపు 61 శాతం కుచించుకుపోయినట్లు పరిశోధకులు పేర్కొంటున్నారు. నదికి ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలువ నీడ కూడా లేదు. ఇలాంటి కారణాలతో రాబోయే 30 ఏళ్లలో కృష్ణానదీ మనుగడ తీవ్ర ప్రమాదంలో పడనుందని హెచ్చరిస్తున్నారు. ప్రాభవం కోల్పోతున్న కృష్ణమ్మ జీవనది కృష్ణమ్మ తన ప్రాభవం కోల్పోతోంది. ఏటా నది ప్రవాహం తగ్గిపోతోందని పదేళ్ల గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రవాహాలు పడిపోతుండటంతో ఏడాదిలో దాదాపు ఆరు నెలలపాటు చుక్కనీరు కూడా పారే పరిస్థితి కనిపించడంలేదు. విష వ్యర్థాలు నదిలో కలుస్తుం డటంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు ప్రాం తం పరిధిలో కలుషితాలు కలుస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. రాయిచూరు శక్తినగర్‌లోని కెమికల్ ఫ్యాక్టరీల వ్యర్థాలు నేరుగా నదిలో కలుస్తున్నాయి. బీచుపల్లి, కర్నూలు ఏరియాలోని కొన్ని పరిశ్రమల నుంచి కూడా ప్రమాదకర వ్యర్థాలు వెలువడుతున్నాయి. గద్వాల ప్రాం తంలోని పరిశ్రమల వ్యర్థాలు నేరుగా జములమ్మ రిజర్వాయర్‌లో కలుస్తుండటంతో స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు కాలుష్య పరిశ్రమలను సీజ్ చేశారు. అయితే ఈ వ్యర్థాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పీసీబీకి ఫిర్యాదు చేస్తాం ‘కృష్ణానదీ పరీవాహకంలో వ్యర్థాలు కలుస్తున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు జములమ్మ రిజర్వాయర్‌లో కలుషితాలు కలుస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే పీసీబీకి ఫిర్యాదు చేశాం. అందుకు అనుగుణంగా వారు చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే ఇంకా ఏమైన కలుషితాలు నదిలో కలుస్తున్నట్లు మాకు ఫిర్యాదులు రాలేదు.’ అని చీఫ్ ఇంజనీర్ ఖగేందర్ అన్నారు. వ్యర్థాలతో కలుషితం మేము పది రోజులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని కృష్ణానదీ తీరం వెంట దాదాపు 270 కి.మీ మేర పాదయాత్ర చేశాం. అనేక విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. చాలా వ్యర్థాలు వచ్చి నదిలో కలుస్తున్నాయి. దీని వల్ల జీవరాశులు చనిపోతున్నాయి. నదీ పరీవాహక ప్రాంతంలో చాలా చోట్ల కనుచూపు మేర ఒక్క చెట్టు కూడా కనిపించడం లేదు. నదీ పరిసరాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. – జలజం రమేశ్‌గౌడ్, సామాజికవేత్త, మహబూబ్‌నగర్ -
నేను ప్రొస్టేట్‌ని
ఆనంద్ శరీరంలో నేనో కీలక భాగాన్ని. ఆక్రోటు (వాల్నట్) పరిమాణంలో ఉంటాన్నేను. నేను అతడి ప్రొస్టేట్ను (పౌరుష గ్రంథిని) ఒక్కోసారి ఆనంద్‌ను బాగా ఇబ్బంది పెట్టేస్తుంటాను. రాత్రివేళ మంచి నిద్రలో ఉండగా అతడికి మెలకువొచ్చేలా చేస్తాను. పాపం ఆనంద్... రాత్రివేళ నా కారణంగా పదేపదే బాత్రూమ్కు వెళ్లాల్సి వస్తుంది. పరిస్థితి వికటిస్తే, మూత్రం ద్వారా పోవలసిన కాలుష్యాలు రక్తంలో కలిసేలా చేయడం ద్వారా యురేమిక్ పాయిజనింగ్‌కు దారితీసి అతడి మరణానికి కూడా కారణమవుతాను. ఇందుకు నేనేమీ చేయలేను. ప్రకృతే నన్ను అలా తయారు చేసింది. వయసు మీరాక నాతో కొన్ని ఇబ్బందులు ఉన్నా, నాలో చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ఆనంద్ శృంగార జీవితంలో ముఖ్య పాత్రనే పోషిస్తాను. ఇంకా నా ఘనతని చెప్పుకోకూడదు గానీ, మానవజాతి మనుగడే చాలావరకు నాపై ఆధారపడి ఉంది. వెన్ను ఆదేశిస్తుంది... నేను పాటిస్తాను... ఆనంద్ పొత్తికడుపులో అతడి మూత్రాశయానికి దిగువ ఉంటాన్నేను. ఆనంద్ యుక్తవయస్సులోకి వచ్చేంత వరకు కేవలం బాదంగింజ పరిమాణంలో ఉంటాను. అతడి మిగిలిన శరీరంతో పాటే నేను కూడా క్రమంగా ప్రస్తుత పరిమాణానికి పెరుగుతాను. ఆనంద్ బాల్యస్థితిని వీడి యువకుడిగా మారినప్పుడు అతడి శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ద్వారా నాకు సంకేతం అందుతుంది. అప్పటికి నేను పూర్తి ఆకారాన్ని సంతరించుకుని ఉంటాను. నాలోని కండరాలతో వేరుశనగ గింజల పరిమాణంలో నిర్మితమైన సంచుల్లో వీర్యద్రవం తయారవడం అప్పుడే మొదలైంది. ఆనంద్‌లో లైంగికోద్రేకాలు కలిగినప్పుడు నాలోని ద్రవాన్ని ఎలా ఖాళీ చేయాలో నాకు తెలీదు. అలాంటప్పుడు ఆనంద్ వెన్ను దిగువ నుంచి వచ్చే ఆదేశాలను తు.చ. తప్పక పాటిస్తాను. అలాంటి స్థితిలోనే నాలో చాలా సంక్లిష్టమైన చర్యలు మెరుపు వేగంలో జరిగిపోతాయి. నా బ్లాడర్ దిగువనున్న స్పింక్టర్ వాల్వ్ క్షణకాలం గట్టిగా నొక్కేసినట్లు మూసుకుపోతుంది. దాంతో ఆ సమయంలో మూత్రం వెలువడే ఆస్కారమే ఉండదు. ఆ వెంటనే కండర సంకోచ తరంగాలు నా వరకు వ్యాపిస్తాయి. వాటి వల్ల వీర్యద్రవాన్ని నిల్వ చేసుకున్న నా సంచులు కూడా ఒత్తుకుపోతాయి. వాటి నుంచి ఇరవై శాతం వీర్యద్రవం తయారైతే, నాలో నేరుగా ఎనభై శాతం వీర్యద్రవం తయారవుతుంది. ఒత్తిడికి గురైనప్పుడు ఈ ద్రవం ఒక్కసారిగా మూత్రనాళం ద్వారం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఈ ద్రవం దాదాపు ఒక టీస్పూన్ పరిమాణంలో ఉంటుంది. వయసు మళ్లే కొద్దీ కష్టాలు ఆనంద్‌కు వయసు మళ్లే కొద్దీ అతడి వృషణాల నుంచి తయారయ్యే హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో నా పరిమాణం అతడి చిన్నప్పటి పరిమాణానికి కుంచించుకుపోతానని హేతుబద్ధంగా ఊహించవచ్చు. అయితే, నిజానికి నాలోని పరిణామం ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది. కుంచించుకుపోయే బదులు నా పరిమాణం పెరుగుతుంది. ఒక్కోసారి విపరీత పరిస్థితుల్లో ఏకంగా ఒక దబ్బకాయ పరిమాణానికి పెరిగిపోతాను. ఇప్పటికైతే ఆనంద్‌కు అలాంటి పరిస్థితేమీ లేదు గానీ, అతడికి యాభయ్యేళ్లు దాటితే నా పరిమాణం పెరిగే అవకాశాలు ఇరవై శాతం వరకు పెరుగుతాయి. ఎనభయ్యేళ్లు నిండితే ఆ అవకాశాలు ఎనభై శాతం వరకు పెరుగుతాయి. నా పరిమాణం కాస్తంత పెరిగితే ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. అయితే, మూత్రాశయాన్ని నొక్కేసేంతగా పెరిగితేనే ఆందోళన చెందాలి. అలా పెరిగితే మూత్రం నెమ్మదిగా వెలువడటం, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రనాళంలో ఇన్ఫెకన్లు ఏర్పడి మంటపుట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు వెంటనే వైద్యసహాయం తీసుకోవాలి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు కాఫీ, టీ, ఆల్కహాల్ మానేయాలని వైద్యులు చెబుతారు. పరీక్షల ద్వారా తగిన కారణాన్ని కనుక్కుని మందుల ద్వారా ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తారు. తప్పనిసరి పరిస్థితులు తలెత్తితే ముందు మూత్రనాళంలోకి ట్యూబ్ పంపి మూత్రం బయటకు పోయే మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంకా అవసరమైతే శస్త్రచికిత్స చేసి నన్ను పూర్తిగా తొలగిస్తారు. లేకుంటే, పెన్సిల్ వంటి పరికరాన్ని మూత్రనాళం గుండా నా వరకు పంపి, మూత్రానికి అవరోధం కలిగిస్తున్న నాలోని కణజాలాన్ని విద్యుత్తరంగాలతో నాశనం చేస్తారు. ఇలాంటి చికిత్స పద్ధతులను తలచుకుంటేనే ఆనంద్‌కు భయంతో ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇలాంటి ప్రక్రియలు తన పురుషత్వాన్ని తుదముట్టించేస్తాయనేదే అతడి ఆందోళన. అయితే, అది అపోహ మాత్రమే. ఇలాంటి చికిత్సల తర్వాత కూడా ఎనభైశాతం మంది పురుషులు సాధారణ లైంగిక జీవితాన్ని కొనసాగించగలుగుతారు. కేన్సర్ సోకితేనే కష్టం నా పరిమాణం కాస్త పెరిగినంత మాత్రాన ఆందోళన అక్కర్లేదు. ఇన్ఫెక్షన్ల వంటి ఇతరేతర కారణాల వల్ల వాపు వచ్చి నా పరిమాణం పెరగవచ్చు. అలాంటి పరిస్థితిని సాధారణ చికిత్సలతోనే చక్కదిద్దవచ్చు. అయితే, కేన్సర్ వల్ల నాలో అసాధారణమైన పెరుగుదల ఏర్పడితేనే కష్టం. యాభై ఏళ్లు నిండిన వాళ్లలో దాదాపు ఐదు శాతం మందికి ప్రొస్టేట్ కేన్సర్ సోకే అవకాశాలు ఉంటాయి. డెబ్బయ్యేళ్లు నిండిన వారిలో ఈ అవకాశాలు యాభై శాతం వరకు ఉంటాయి. దురదృష్టం ఏమిటంటే, అలాంటి వారిలో దాదాపు 90 శాతం మంది వైద్యుల వద్దకు వచ్చే సరికే వారి వ్యాధి ముదిరిపోయి ఉంటుంది. అయితే, నాకు సోకే కేన్సర్లు మిగిలిన కేన్సర్లలాగ వారాలు, నెలల వ్యవధిలోనే అంత త్వరగా వ్యాపించేవి కావు. ఇవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి. శస్త్రచికిత్సకు వీలు లేనంతగా ఈ కేన్సర్లు వ్యాపించినా, మందుల ద్వారా జీవితకాలాన్ని పొడిగించేందుకు అవకాశాలు ఉన్నాయి. నాలోని కేన్సర్లు పురుష హార్మోన్ల ద్వారా పెరుగుతూ ఉంటాయి. పురుష హార్మోన్లను ఉత్పత్తిచేసే వృషణాలను తొలగించడం ద్వారా లేదా స్త్రీ హార్మోన్లు ఇచ్చి చికిత్స చేయడం ద్వారా ఈ కేన్సర్లను నయం చేయవచ్చు. అవసరమైతే రేడియేషన్ చికిత్స, స్త్రీ హార్మోన్ల చికిత్స కలిపి కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి నాలో మొదలైన కేన్సర్ ప్రాణాంతకం కాకుండా ఉండాలంటే, వైద్యులు నన్ను పూర్తిగా తొలగించడం ద్వారా రోగులను కాపాడుతూ ఉంటారు. పునరుత్పత్తిలో నేనే కీలకం పునరుత్పత్తి వ్యవస్థలో నేనే (ప్రొస్టేట్) కీలకం. ఆనంద్ శరీరంలో నేనే గనుక లేకుంటే, అతడికి సంతానం పొందే అవకాశాలే దాదాపు ఉండవు. అతడి వీర్యద్రవానికి స్టోరేజీ యూనిట్లా పనిచేస్తాను నేను. ప్రతి స్ఖలనంలోనూ ఆనంద్ వృషణాలు దాదాపు ఇరవై కోట్ల వీర్యకణాలను విడుదల చేస్తాయి. నాలో తయారయ్యే ప్రత్యేక ద్రవం వాటిని డైల్యూట్ చేసి, వీర్యకణాల సంఖ్య పదోవంతుకు తగ్గేలా చేస్తుంది. ప్రొటీన్లు, ఎంజైమ్‌లు, కొవ్వులు, చక్కెరలతో ఉండే నా ద్రవం వీర్యకణాలకు పోషణనిస్తుంది. నా ద్రవంలోని క్షారగుణం స్త్రీ శరీరంలోని ఆమ్లగుణాన్ని తట్టుకుని మరీ వీర్యకణాలను బతికిస్తుంది. నా ద్రవంలో క్షారగుణమే లేకుంటే వీర్యకణాలు సజీవంగా స్త్రీ శరీరంలోని అండాన్ని చేరుకోలేవు. నాలో మూడు భాగాలు చిన్నగానే ఉంటాను గానీ, నాలో మూడు భాగాలు ఉంటాయి. ఒకదాని పక్కన ఒకటిగా నాలో ఉంటాయి. ఆనంద్ మూత్రనాళం నాలోని మధ్యభాగం మీదుగా వెళుతుంది. నాకు ఇన్ఫెక్షన్ సోకినా, వాపు వచ్చినా లేదా కేన్సర్ సోకినా నాలోని భాగాలు పరిమాణానికి మించి పెరుగుతాయి. ఫలితంగా మూత్ర విసర్జనకు అంతరాయం కలుగుతుంది. ఇక అక్కడి నుంచి నానా సమస్యలు మొదలవుతాయి. బయటకు రాలేని మూత్రం బ్లాడర్‌లోనే మడుగు కట్టేస్తుంది. అందులోకి బ్యాక్టీరియా చేరి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు తలెత్తుతాయి. బ్లాడర్‌లో నిండిన మూత్రం తిరిగి కిడ్నీలకు చేరి, అక్కడి నుంచి రక్తంలో కలిసిపోయి యురీమిక్ పాయిజనింగ్ కలిగిస్తుంది. యమయాతన కలిగించే ఈ పరిస్థితి క్రమంగా మరణానికి దారితీస్తుంది.