breaking news
Personality development experts
-
నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!
మనం ఒక భవనాన్ని చూసినప్పుడు దాని రంగులు, కిటికీలు కనిపిస్తాయి కానీ, భూమి లోపల ఉన్న పునాది కనిపించదు. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. మీరు ఈరోజు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా, లేదా ఎంత భయపడుతున్నా.. దాని వెనుక మీ జీవితంలోని మొదటి 2,000 రోజులు (మొదటి ఐదేళ్లు) ఉన్నాయి.సైకాలజీలో ఒక ప్రసిద్ధ మాట ఉంది: "Give me a child until he is seven, and I will show you the man." అంటే, ఏడేళ్ల లోపు ఒక బిడ్డను నాకు ఇస్తే, అతను భవిష్యత్తులో ఎలాంటి వాడో నేను చెప్పగలను అని. ఎలిజబెత్ హర్లాక్ ఈ కాలాన్ని 'పునాది దశ' (Foundational Stage) అని పిలిచారు.నమ్మకం vs అపనమ్మకం (Trust vs Mistrust): పుట్టిన మొదటి ఏడాది బిడ్డ పుట్టిన మొదటి ఏడాదిలో నేర్చుకునే అత్యంత ముఖ్యమైన విషయం "ప్రపంచం సురక్షితమైనదా? కాదా?".సురక్షితమైన పునాది: బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి వెంటనే పాలు పట్టడం, దగ్గరకు తీసుకోవడం, ప్రేమగా నిమరడం చేస్తే.. ఆ బిడ్డ సబ్-కాన్షియస్ మైండ్‌లో "ఈ ప్రపంచం నమ్మదగినది. ఇక్కడ నా అవసరాలు తీరుతాయి" అనే నమ్మకం కలుగుతుంది. ఇది భవిష్యత్తులో ఆ వ్యక్తి ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి పునాది అవుతుంది.అభద్రతా భావం: అదే బిడ్డను పట్టించుకోకపోతే, ఆకలితో ఏడుస్తున్నా నిర్లక్ష్యం చేస్తే.. "ఎవరినీ నమ్మలేం, నా గురించి ఎవరూ పట్టించుకోరు" అనే అభద్రతా భావం మొదలవుతుంది. పెద్దయ్యాక ఇలాంటి వారు ఎవరినీ త్వరగా నమ్మలేరు (Trust issues).స్వయంప్రతిపత్తి (Autonomy): 2 నుండి 3 ఏళ్లుఈ దశలో బిడ్డ తన కాళ్లపై తాను నడవడం, తన చేత్తో తాను తినడం నేర్చుకుంటాడు. అంటే తనకంటూ ఒక 'ఇచ్ఛ' (Will) ఉందని గుర్తించే సమయం.పర్యవేక్షణ vs అణచివేత: బిడ్డ తనంతట తాను ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు (ఉదాహరణకు: గ్లాసుతో నీళ్లు తాగడం), తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహిస్తే వారిలో ఆత్మవిశ్వాసం (Self-confidence) పెరుగుతుంది."వద్దు.. నువ్వు వొంపేస్తావు, నీకు రాదు" అని ప్రతిదానికీ అరిస్తే.. వారిలో సందేహం (Doubt), సిగ్గు (Shame) మొదలవుతాయి. "నేను ఏదీ సరిగ్గా చేయలేను" అనే నెగటివ్ సెల్ఫ్-ఇమేజ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది.చొరవ (Initiative): 4 నుండి 5 ఏళ్లుఈ వయస్సులో పిల్లలు చాలా ప్రశ్నలు వేస్తారు. ప్రతిదీ తెలుసుకోవాలని కుతూహల పడతారు. ప్రపంచాన్ని ఒక 'ప్లే గ్రౌండ్' లా చూస్తారు.సృజనాత్మకత: పిల్లల ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్తూ, వారి ఆటలను ప్రోత్సహిస్తే వారిలో నాయకత్వ లక్షణాలు (Leadership), సృజనాత్మకత (Creativity) పెరుగుతాయి.అపరాధభావం (Guilt): వారి ప్రశ్నలను విసుక్కుంటే, వారి ఆటలను అల్లరిగా భావించి శిక్షిస్తే.. "నేను ఏదో తప్పు చేస్తున్నాను" అనే గిల్ట్ ఫీలింగ్ వారిలో నాటుకుపోతుంది. పెద్దయ్యాక వీరు ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా భయపడతారు.సో-కాల్డ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, మోటివేషనల్ స్పీకర్లు ఇచ్చే చిట్కాలు (ఉదాహరణకు: అద్దం ముందు నిలబడి గట్టిగా అరవడం) ఈ లోతైన పునాది గోడలను మార్చలేవు.ఎందుకంటే...మీరు 30 ఏళ్ల వయస్సులో "నేను కాన్ఫిడెంట్‌గా ఉండాలి" అని అనుకుంటున్నారు. కానీ మీ సబ్-కాన్షియస్ మైండ్‌లో 3 ఏళ్ల వయస్సులో పడ్డ "నువ్వు ఏదీ సరిగ్గా చేయలేవు" అనే ముద్ర అలాగే ఉంది. పైన మీరు ఎన్ని కోట్లు వేసుకున్నా, లోపల ఆ చిన్న పిల్లాడు ఇంకా భయపడుతూనే ఉంటాడు.Real Personality Development అంటే.. ఆ చిన్ననాటి ముద్రలను గుర్తించి, వాటిని రీ-ప్రోగ్రామ్ చేయడం, మీ ఇన్నర్ చైల్డ్ ను హీల్ చేయడం. కేవలం బాడీ లాంగ్వేజ్ మార్చడం కాదు.ఇదే నిజమైన వ్యక్తిత్వ వికాసం: Genius Matrix WayStep 1: Break (విశ్లేషించడం)మీరు ఇప్పుడు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నా (ఉదాహరణకు: స్టేజ్ ఫియర్, రిలేషన్షిప్ సమస్యలు), దానికి మూలాలు మీ మొదటి ఐదేళ్లలో ఎక్కడ ఉన్నాయో వెతకండి."నన్ను చిన్నప్పుడు అతిగా కంట్రోల్ చేశారా?""నా అవసరాలను నా తల్లిదండ్రులు గుర్తించారా?"ఈ విశ్లేషణే మీ పాత వ్యక్తిత్వాన్ని 'బ్రేక్' చేస్తుంది.Step 2: Build (తిరిగి నిర్మించడం)మీ చిన్నతనంలో మీకు దక్కని ప్రోత్సాహాన్ని ఇప్పుడు మీరు మీకు ఇచ్చుకోవాలి. దీనినే 'Reparenting yourself' అంటారు. మీ అంతరాత్మతో మీరు మాట్లాడే తీరును మార్చుకోవాలి."నీకు చేతకాదు" అనే మాటను "నువ్వు నేర్చుకోగలవు" అనే మాటతో రీప్లేస్ చేయాలి.Step 3: Beyond (పరిమితులకు ఆవల)ఒక్కసారి మీ మూలాలు మీకు అర్థమైతే, పాత గాయాలు మీ వ్యక్తిత్వాన్ని శాసించవు. మీరు ఒక స్వేచ్ఛా జీవిగా మారుతారు. ఎదుటివారి సర్టిఫికేట్లతో సంబంధం లేకుండా మీ లెగసీని మీరు నిర్మించుకుంటారు.మొదటి ఐదేళ్లు మీ వ్యక్తిత్వానికి పునాది వేశాయి. అది మీ తప్పు కాదు. కానీ 25 లేదా 30 ఏళ్ల వయస్సులో కూడా అదే పాత భయాలతో బ్రతకడం మీ బాధ్యతారాహిత్యం అవుతుంది. మిమ్మల్ని మీరు రీ-డిజైన్ చేసుకోగలరు!ఎలిజబెత్ హర్లాక్ చెప్పినట్లు, వ్యక్తిత్వం అనేది 'డైనమిక్'. అంటే దాన్ని మార్చుకోవచ్చు. మీ పునాది గోడల్లో పగుళ్లు ఉన్నాయని తెలిస్తే, వాటిని సిమెంట్ వేసి పూడ్చవచ్చు. ఆ పునాదిని అర్థం చేసుకోవడమే Real Personality Development.Self-Reflection: ఈరోజు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మీ ఐదేళ్ల వయస్సును గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీరు ఎలా ఉండేవారు? మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఎలా చూసేవారు? ఆ జ్ఞాపకాల్లోనే మీ వ్యక్తిత్వ రహస్యం దాగి ఉంది.సైకాలజిస్ట్ విశేష్ Genius Matrix Hub 8019 000066www.psyvisesh.com(చదవండి: The DNA of You: 'పర్సనాలిటీ'కి పునాది ఎక్కడ పడుతుందంటే..!) -
బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. హైదరాబాద్‌లో నిన్న (సోమవారం) రాత్రి ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రచయితగా, ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ ఆయన పేరు ప్రఖ్యాతలు పొందారు. ఖైరతాబాద్ నివాసంలో పట్టాభిరామ్ పార్థివదేహాన్ని ఉంచారు. రేపు (బుధవారం) ఉదయం నుంచి అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఆయన తెలుగుతో పాటు ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో కూడా రచనలు చేశారు. ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహింంచడంతో పాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సులు కూడా నిర్వహించారు.బీవీ పట్టాభిరామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్డీ పట్టా పొందిన తరువాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. ఇండియాలోనే కాకుండా.. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ దేశాలలో అనేక వర్క్ షాపులు నిర్వహించారు. -
ప్రవచన శిరోమణులు
అడిగేవారికి చెప్పేవారు లోకువ అని సామెత. అయితే అవతలి వారు ఏమీ అడగకున్నా, వారికి ఏం కావాలో, ఏం చెబితే బాగుంటుందో తామే తెలుసుకుని నాలుగు మంచిమాటలు .. అందులోనూ ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిత్వ వికాసానికి పాదులు తీసే అంశాలూ చెబుతుంటారు ప్రవచనకారులు. ఇక్కడ ప్రవచనకారులు అనగానే ముందుగా గుర్తొచ్చేది పురుషులే. అలాగని స్త్రీలు అసల్లేరని కాదు. అయితే వారి పేర్లు చెప్పాలంటే చేతివేళ్లు సరిపోతాయి. 8న మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ హితంకోసం ప్రవచనాలు చెబుతున్న కొందరు మహిళామణుల గురించి తెలుసుకుందాం. వారి ప్రయాణంలోని సాధక బాధకాలు వారి మాటల్లోనే...మహిళలు ప్రవచనాలా?– డా. ఎన్. అనంతలక్ష్మి‘‘ఈ రోజు ప్రేయర్ అయినాక నువ్వు మాట్లాడు’’ అన్నారు మాస్టర్ గారు. సంతోషం, భయం ఒకేసారి కలిగాయి. నా కంగారు అర్థం కాదా! పిలవలేదు. ఊపిరి పీల్చుకున్నా కాని, కొంచెం నిరాశ. తర్వాత జనకులం (తల్లి తండ్రులు స్కూలు తర్వాత పిల్లలకి సంప్రదాయం సంస్కారం నేర్పే వ్యవస్థ)లో పెద్దలకి ఆముక్తమాల్యదలో విష్ణుచిత్తుడి కథాభాగం చెప్పమన్నారు. ఎం. ఏ; లో అది మాకు పాఠ్యభాగం కాదు. మాస్టర్ గారికే నమస్కరించుకుని చెప్పాను. అది వాళ్ళకి కాదు నాకు శిక్షణ. వేదవాఙ్మయాన్ని, పురాణేతిహాసాలను, కావ్యాలను శాస్త్రవిజ్ఞానంతో సమన్వయం చేసి, నేటితరానికి పనికి వచ్చే అంశాలని వివరించి, వాటి సార్వకాలీనతను ప్రపంచానికంతటికి వెల్లడించటం మా గురువరేణ్యులు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల పద్ధతి. అది శిష్యులలో కొద్దిగానైనా ప్రతిఫలించటం సహజం. ఈ కారణంగా నా సాహిత్య ప్రసంగాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు అయ్యాయి. వీలైనంత మందికి మాకు తెలిసిన విషయాలను చెప్పాలనే తపన తప్ప అది ప్రసంగమో, ప్రవచనమో పట్టించుకోలేదు. అందరూ అవి ప్రవచనాలు అని నిర్ధారించారు. అందరూ నన్ను ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త అంటుంటే వింతగా ఉంటుంది. నేను మామూలు గృహిణిని, ఉద్యోగినిని, తల్లిని అంతే! నన్ను అందరూ ఆ విధంగా గుర్తించటానికి నా కుటుంబ సభ్యులు అందరు కారణం. నా పిల్లలు, విద్యార్థులు అడిగే అనుమానాలని తీర్చటానికి మరింత అధ్యయనం చేయవలసి వచ్చింది. అనుకున్న ప్రయోజనాన్ని సాధించాననే అనుకుంటాను. సాధారణంగా ఆడవాళ్ళు ప్రవచనాలు అంటూ బయలుదేరితే ఇంట్లోనే ఇబ్బందులని ఎదుర్కోవలసి వస్తుంది, అనేకరకాలుగా. అటువంటి సమస్య నాకు కుటుంబం నుండి రాలేదు. (ఎవరికీ ఇబ్బంది కలుగని విధంగా జాగ్రత్తలు తీసుకునే దాన్ని.) కాని, బయటి నుండి తప్పవు. ‘‘ఆడవాళ్ళు ప్రవచనాలు చేయటం ఏమిటి?’’,‘‘ముందు ఇల్లు చూసుకో మనండి.’’ ‘‘దీనికి కూడా ఆడవాళ్ళు పోటీకి వస్తే మా సంగతి ఏమిటి?’’ ఇటువంటివి చాలానే విన్నాం. పైగా మగవాళ్లు వినరు ఆడవాళ్ళు చెపితే వినేది ఏమిటి? అని. చేస్తున్నది ధర్మబద్ధం అయితే అటువంటి వ్యాఖ్యలని పట్టించుకో నవసరం లేదు. తల్లిలాగా లాలించినట్టు చెపితే మంచి వైపుకి సమాజం మళ్లుతుంది అనుకుని చెప్పాలి. అలాగే చెబుతున్నాను కూడా!వ్యక్తిత్వ వికాసానికి.. ఆధ్యాత్మిక భావోన్నతికి...– డా. తుమ్మలపల్లి వాణీకుమారివృత్తిరీత్యా నేను అధ్యాపకురాలిని. సుమారు 35 సంవత్సరాల బోధనానుభవంలో నాకు తెలిసినంతవరకు విద్యార్థులకు బోధించగలిగాననే సంతృప్తి నాకు నిండుగా ఉంది. నేను చాలాకాలంగా ప్రసార మాధ్యమాలలో, ఇతర సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటున్నా ప్రవచనాల వైపు మరల లేదు. ఒకసారి రామాయణం గురించి నేను వ్రాసిన పుస్తకాలను చూసి శ్రీ చాగంటి కోటేశ్వరరావు ‘‘ఇన్ని మంచి విషయాలను వ్రాసిన మీరు ప్రవచనాలను చెప్పకపోవడం ఏమిటి? పైగా హైదరాబాదులో ఉంటూ కూడా!’’ అన్నారు. వారి వాక్ప్రభావమో, దైవసంకల్పమో కానీ తరువాత కొన్ని ఆలయాలలో, ఇతర వేదికలలో ప్రవచనాలకు అవకాశం వచ్చింది. మామూలు సాదం (అన్నం) భగవదర్పితమయితే ప్రసాదమైనట్లు మామూలు వచనం భగవత్సంబంధితమయితే అది ప్రవచనం అవుతుంది. ఆ విధంగా చెప్పేవారికి, వినేవారికి కూడా మనసు ఆధ్యాత్మికత వైపు మరలుతుంది కాబట్టి నాకు ప్రవచనాల పట్ల మక్కువ కలిగింది. అయితే ప్రవచనాలను వినేవారు పెద్దవారు. ప్రవచనకారులు చెప్పే విషయాల పట్ల కొంత అవగాహన ఉన్నా ఆసక్తిగా వింటారు. చెప్పే విషయాలలో, తీరులో వైవిధ్యం ఉండటమే ఇందుకు కారణమనుకుంటాను. తెలుగు రాష్ట్రాలలో విఖ్యాతులైన ప్రవచనకారులు ఎంతోమంది ఉన్నా, నేను చెప్పినప్పుడు ఆసక్తిగా వినే శ్రోతలు లభించటం నా అదృష్టం. మంచి విషయాలను పదేపదే చెప్పటం వలన చెప్పేవారికి, వినటం వలన వినేవారికి మనసులో నాటుకుపోతాయి. మానవ సహజమైన బలహీనతలను అధిగమించే స్థైర్యం అలవడుతుంది. నా వరకు ఇది నా వ్యక్తిత్వ వికాసానికి, ఆధ్యాత్మిక భావోన్నతికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను.చిన్నప్పుడే పునాది పడింది– ఖుర్షీదా బేగం షేక్నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అలవాటు. అలా ధార్మిక పుస్తకాలు, ఇస్లాం సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ, ధార్మిక రచనలు చేస్తూ ఉండటం మూలాన నా జీవితంలో ఆధ్యాత్మికతకు బలంగా పునాది పడింది. ఒక నిజమైన ముస్లిం విశ్వాసి నుండి దైవం ఏమి కోరుకుంటున్నాడో అది చేయడం మాత్రమే నా మోక్షానికి, దైవప్రేమకు, పరలోక జీవిత సాఫల్యానికి మార్గం అని గ్రహించాను. అంతిమ దైవగ్రంథం దివ్య ఖుర్ ఆన్, ప్రవక్త ముహమ్మద్(స) బోధించిన హాదీసు బోధలను, మహాప్రవక్త ముహమ్మద్ (స) వారి జీవిత చరిత్రను అధ్యయనం చేశాను. అవే నాకు ఆధ్యాత్మిక ప్రేరణ. ఒక విశ్వాసిగా ఇస్లాం అడుగుజాడల్లో నడుస్తున్నా సాటి విశ్వాసులకు ఏదో చేయాలనే తపన ఉండేది.గ్రామీణ ప్రాంతాలలో స్త్రీలు ఆధ్యాత్మికంగా చాలా వెనుకబడి ఉండేవారు. ధార్మిక సమావేశాల్లో వారికి ఖుర్ ఆర్, హాదీసు బోధనలను వివరించేదాన్ని. వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా విని, తమకు తెలియని ఎన్నో మంచి విషయాలను తెలుసుకునేవారు. మూఢనమ్మకాలు, అజ్ఞానం, నిరక్షరాస్యత, అనాగరిక ఆచార, సంప్రదాయాలు వారిలో ఎక్కువగా ఉండేవి. ఇస్లాం వాస్తవ బోధనలను వారికి తెలిపి వారి జీవితంలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగిస్తే వారి ఇహ, పర జీవితాలు అల్లాహ్ కరుణను పొందుతాయని వారి ఇహ, పరలోకాలు ఆదర్శంగా, గౌరవంగా ఉత్తమ, ఉన్నత నైతికతతో ఉండి తద్వారా పరలోకంలో శాశ్వత సాఫల్యం లభిస్తాయని ధార్మిక సమావేశాల్లో వివరించేదాన్ని. నా రచనలు, ప్రసంగాల ద్వారా చాలామంది తమలోని నైతిక రుగ్మతలను దూరం చేసుకొని, ఒక ముస్లిం ఎలా ఉండాలో అలా మారే విధంగా తమను తీర్చిదిద్దుకుంటున్నామని చెప్పినప్పుడు చాలా తృప్తిగా అనిపిస్తుంది. నా జీవితానికి సార్థకత లభించిన అనుభూతి కలుగుతుంది.నేర్చుకున్నాను...నేర్పిస్తున్నాను– షకీనా గ్లోరి, సువార్తికురాలునేను ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి పట్టణంలో భక్తిగల దైవసేవకుల కుటుంబంలో జన్మించాను. బాల్యం నుండే మా తల్లిదండ్రులు మాకు బైబిల్ ను బోధించేవారు.‘‘బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైన తర్వాత దానినుండి తొలగిపోడు’’ అని బైబిల్ వాక్యప్రకారం సమాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వారు మాకు నేర్పించారు. తదనుగుణంగా నేను బైబిల్లో ఉన్న యేసుప్రభువు బోధలకు, వాక్యాలకు ప్రభావితమొందాను.నీతి నియాలు పాటించి బతికితే ఈ లోకంలో బతికినంత కాలం శాంతి–సమాధానం పొందుకుంటాము. ఒకవేళ ఏదో ఒక రోజున కన్నుమూస్తే దేవుడుండే తన రాజ్యానికి చేరుకుంటాము అనే సత్యాన్ని అనేకులకు తెలియజేయాలని, భయంకర సమస్యలకు దేవుడు పరిష్కారమిస్తాడు. మీకు మేళ్లు కలిగిస్తాడు. మిమ్మును ఆదరిస్తాడు. రక్షిస్తాడు. మీ బుద్ధిని మారుస్తాడనే శుభవార్తను అందరికీ అందించాలని, సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే నేను నా జీవితాన్ని ఈ పనికి అంకితం చేసుకున్నాను.ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని బీఈడీ చేసి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కూడా కొనసాగించుచున్న నాకు దైవస్వరం వినిపించగా నా శేషజీవితమంతా దేవుని పనిలో వాడబడాలని, ఆశలు అడియాశలైన వారినెందరినో బలపరచి, వారికి ఆనందకరమైన జీవితాన్నందించాలని ఈ సేవలో సాగిపోతున్నాను. మా తండ్రిగారైన జోసఫ్ విజయకుమార్ గారే నాకు ప్రేరణ. చాలా ఒడిదొడుకులు, అభ్యంతరాలు, ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు ఎదురౌతున్నా మొక్కవోని ధైర్యంతో క్రీస్తుబోధలను మననం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నాకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. నా కుటుంబానికి, పిల్లలకు ప్రాధాన్యతనిస్తూ... అందరం సమైక్యంగా ఈ పనిలో ఆనందిస్తుంటాము. నేను అందించిన ఈ బైబిల్ ప్రవచనాలు తమ కన్నీటిని తుడిచాయని, తమలో ధైర్యాన్ని నింపాయని, తమను వెన్నుతట్టి ప్రోత్సహించాయని, మంచిమార్గంలో నడిచేలా సహాయం చేస్తున్నాయని, చెడు వ్యసనాలతో, చెడు బుద్ధులతో ఉన్న తమను విడిపించి, సరిౖయెన, నిజమైన మార్గాన్ని చూపించాయనే సాక్ష్యాలు వింటున్నప్పుడు సంతోషం కలుగుతుంటుటుంది. -
టెన్ కమాండ్మెంట్స్
మతగ్రంథంలో ఉన్నట్లే... మహిళల కోసం కూడా పది ఆజ్ఞలు ఉన్నాయని తెలుసా? ఇవి వ్యక్తిత్వ వికాస నిపుణులు రూపొందించినవి. వీటిని అనుసరిస్తే ఈ సమాజంలో మీకో గొప్ప స్థానం లభిస్తుంది. అంతేకాదు, విజయశిఖరాలను అందుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. నిన్ను నువ్వు నమ్ము: ఎవరినో నమ్ముతాం. వాళ్లు మనకోసం ఏదో చేస్తారని ఆశపడతాం. చేయకపోతే దిగులుపడతాం. అసలు ముందు నిన్ను నువ్వు నమ్మితే, ఎవరిమీదా ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. ఊహల్లో తేలవద్దు: ఊహలు అవకాశాలను చంపేస్తాయని మీకు తెలుసా? అలా చేయాలి, ఇలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే సమయం గడిచిపోతుంది. కాబట్టి ఊహల్లో తేలడం మాని, అవకాశాలను వెతకండి. మనసు మాట వినండి: చేసేది తప్పనిపించినప్పుడు తప్పుకోవడం ఎంత అవసరమో, సరైన దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో చెప్పారనో, ఏమైనా అంటారేమోననో వెనకడుగు వేయకుండా ఉండటం అంతే అవసరమని గుర్తు పెట్టుకోండి. కొన్నింటిని మరవాలి: మీలో చాలా ప్రతిభ ఉంటుంది. ఏదైనా చేయగలిగే శక్తి ఉంటుంది. కానీ అది గుర్తించరు. నాకు చాలా కష్టాలు ఉన్నాయి అని గుర్తు తెచ్చుకుని పదే పదే బాధపడుతుంటారు. వద్దు. వాటిని మర్చిపోండి. ఆవేదన దేనికీ పరిష్కారం కాదు. అది మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. ఉన్నతంగా ఆలోచించండి: మీ చూపు ఎప్పుడూ పైకే ఉండాలి. ఎలా ఎదగాలి, ఎక్కడి వరకూ వెళ్లాలి, ఏం సాధించాలి అన్నది తప్ప మరో ఆలోచన వద్దు. ఇంతకంటే చేయలేమేమో అన్న ఆలోచనే వద్దసలు. ఇతరులకు చాన్స్ ఇవ్వకండి: మనం చేసే ప్రతి పనిలోనూ తలదూర్చేందుకు, మనకు సలహాలిచ్చేందుకు బోలెడంతమంది సిద్ధంగా ఉంటారు. మనకు వాళ్ల సలహాలు అవసరం లేదనుకున్నప్పుడు మెల్లగా వాళ్లను అవాయిడ్ చేయండి. లేదంటే వాళ్లు మన లక్ష్యాల మీద పెద్ద ప్రభావమే చూపిస్తారు. మనసును తెరవండి: మీ ఆలోచనలను లోపలే అణచేసుకోకండి. ఒక పని మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, ఒక లక్ష్యం మీద కానీ... మీకేదైనా అభిప్రాయం ఉంటే ఓపెన్‌గా చెప్పండి. అందరికీ అది నచ్చాలని లేదు. కానీ ఎందరికి నచ్చుతోందో తెలిస్తే మీ ఆలోచనా విధానం ఎలా ఉందో మీకు తెలుస్తుంది. లేదంటే మనం మరుగున అయినా పడిపోతాం, మరొకరికి మనల్ని దాటేసే అవకాశమైనా ఇచ్చేస్తాం. బ్రేకులు వేయొద్దు: ఏదో చేసెయ్యాలనుకుంటారు. ఎక్కడో ఏదో అడ్డు తగులుతుంది. వెంటనే అనుకున్నదాన్ని వదిలేసి వేరే వైపు దృష్టి మళ్లించేస్తారు. ఇది కూడదు. ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే చేశాకే వదిలిపెట్టండి. నో చెప్పి తీరాలి: నచ్చినదానికి ఎస్ చెప్పినట్టు, నచ్చనిదానికి నో చెప్పడం కూడా అవసరం. పని చేసేచోట మనలను ఇబ్బందిపెడుతున్నా, ఎందులోనైనా ఇరికించే ప్రయత్నం చేస్తున్నా, మనది కానిదాన్ని మనమీద రుద్దుతున్నా నో అనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మిమ్మల్ని పిరికివారిగానో, భయస్థులగానో చూస్తారు. రిస్క్ తీసుకోండి: ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండలేం. ఉండాలని కోరుకోకూడదు కూడా. ఏదైనా చేయాలని అనిపించినప్పుడు... కష్టనష్టాలను తలచుకుని భయపడకండి. కాస్త కష్టమైనా పర్లేదు ప్రయత్నిద్దామని అనుకోండి. ప్రయత్నం ఎప్పుడూ వృథా కాదు. కష్టం ఎప్పుడూ ఓడిపోనివ్వదు. అది మర్చిపోకండి!


