breaking news
P Vijayan
-
నిందితుడి సమాచారం లీక్.. కేరళ సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెండ్
కేరళ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ విజయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది .కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నిందితుడి అరెస్ట్, తరలింపు సమాచారం లీక్ చేసిన ఆరోపణలపై విజయన్‌పై కేరళ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కాగా విజయన్ గతంలో కేరళ ఏటీఎస్ యూనిట్ హెడ్‌గా పనిచేశారు. నిందితుడి తరలింపుకు సంబంధించిన సమాచారం లీక్ కావడం తీవ్రమైన భద్రతా వైఫల్యమని పేర్కొంటూ లా అండ్ ఆర్డర్ అడిషినల్ డీజీపీ అజిత్ కుమార్ అందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ రిపోర్టులో నిందితుడు షారుక్ సైఫీని మహారాష్ట్రలోని రత్నగిరి నుంచి కేరళలోని కోజీకోడ్‌కు తరలిస్తున్న సమాచారాన్ని బహిర్గతం చేసినట్లు తేలింది. అదే విధంగా ఈ కేసును దర్యాప్తుచేసిన బృందంలో లేని ఐజీ విజయన్, గ్రేడ్ ఎస్సై మనోజ్ కుమార్ కే.. నిందితులను రోడ్డు మార్గంలో కోజికోడ్‌కు తీసుకెళ్తున్న అధికారులను సంప్రదించినట్లు పేర్కొంది. చదవండి: అమెరికాలో న్యాయ పోరాటం.. భారత్‌కు విజయం.. ‘రాణాను అప్పగించండి’ పోలీసు ఏటీఎస్ విభాగం మరింత జాగ్రత్తగా పనిచేయాలని సూచిస్తూ..ఏడీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దీనిపై సమగ్ర విచారణ అవసరమని సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొంది.ఏడీజీపీ నివేదిక ఆధారంగా దాని అధికారులపై సమగ్ర విచారణ అవసరమని పేర్కొంది.ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు విజయన్ను సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై ఏడీజీపీ (పోలీస్ హెచ్‌క్యూ) కె పద్మకుమార్ విచారణ జరుపుతారని ప్రభుత్వం తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలు కోజికోడ్ జిల్లాలోని ఎలత్తూర్ సమీపంలోని కోరాపుళ వంతెన వద్దకు చేరుకోగానే ఓ వ్యక్తి తన తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ చల్లి నిప్పంటించిన విషయం తెలిసిందే. చూస్తుండగానే ఆ మంటలు ఇతర ప్రయాణికులకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో రైలు నుంచి కిందకు దూకడంతో ప్రాణాలు కోల్పోయారు. మరణించినవారిలో ఏడాది చిన్నారి సహా మహిళ వ్యక్తి ఉన్నారు. ఏప్రిల్ 2న ఈ ఘటన జరిగింది. దీనిపై విచారణ జరిపేందుకు కేరళ పోలీసులు సిట్ బృందం ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని సిట్ విచారణలో గుర్తించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుడు సైఫ్‌ను రత్నగిరిలో ఏప్రిల్ 5న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రహస్యంగా కేరళకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. మీడియా, ప్రజల దృష్టి పడకుండా రోడ్డు మార్గాన ప్రైవేటు ఎస్‌యూవీలో తరలించారు. అయితే కన్నూరు జిల్లా గుండా వెళ్లుండగా ఉన్నట్టుండి నిందితుడిని తీసుకెళ్తున్న కారు టైర్ పేలడంతో వాహనం రోడ్డు పక్కన నిలిచిపోయింది. ఆ సమయంలో ముగ్గురు అధికారులు మాత్రమే ఉన్నారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు చేస్తుండగా నిందితుడిని చూసేందుకు స్థానికులు అక్కడ గుమిగూడారు. చదవండి:రూ.10 లక్షలు ఇస్తేనే భార్యతో హనీమూన్.. అశ్లీల వీడియోలు తీసి.. -
కేరళ సీఎం ఆయనే!
కేరళలో హోరాహోరీగా సాగుతాయనుకున్న ఎన్నికలు ఫలితాలు వామపక్షాల వైపే నిలిచాయి. ఇక మిగిలింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు పగ్గాలు చేపడతారన్న విషయమే. ఇప్పటికే సీపీఐ నుంచి ఇద్దరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకరు వీఎస్ అచ్యుతానందన్ కాగా మరొకరు పినరయి విజయన్. ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ శుక్రవారం ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించడానికి సీపీఐ శుక్రవారం ఉదయమే సమావేశమైంది. 93 ఏళ్ల అచ్యుతానందన్ ను సీఎంగా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సీపీఐకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు. అయితే ఈయనకు విజయన్ కూడా గట్టి పోటీయే ఇస్తున్నారు. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్ డీఎఫ్) 91 స్థానాల్లో గెలుపొందింది.