breaking news
orphan kids
-
అనాథ చిన్నారులతో మంత్రి గుడివాడ అమర్నాథ్ దీపావళి వేడుకలు
-
‘నిర్మల్ హృదయ్’లో సీఎం జగన్ దంపతులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు మంగళవారం విజయవాడలోని మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్మల్ హృదయ్ భవన్‌ను సందర్శించారు. నిర్మల్ హృదయ్‌లో నూతనంగా నిర్మించిన హోమ్ ఫర్ సిక్ అండ్ డైయింగ్ డెస్టిట్యూట్స్ భవనాన్ని సీఎం ప్రారంభించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. రాఘవయ్య పార్కు సమీపంలోని నిర్మల్ హృదయ్ భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతికి నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సాదరంగా స్వాగతం పలికారు. నిర్మల్ హృదయ్ భవన్లో చిన్నారులు సెబాస్టియన్, మేఘన ముఖ్యమంత్రి దంపతుల వెంట ఉన్నారు. చిన్నారులు ముందుండి సీఎం జగన్ దంపతుల చేయి పట్టుకుని నడిపించారు. అనంతరం ఆశ్రమంలోని మదర్ థెరిస్సా చిత్రపటానికి సీఎం జగన్ దంపతులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవన్‌లోని అనాథ పిల్లలు, వృద్ధులతో ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు రూహుల్లా, కల్పలతారెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: మహిళలకు జగనన్న ఇస్తున్న ఆసరా (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే
- వారి చదువులు, బాగోగులన్నీ చూసుకుంటాం: కేసీఆర్ - పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు ఆమోదం - జూలై నుంచి 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. కేబినెట్ నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనాథ బాలబాలికలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా నిలబడుతుందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. ఇకపై తెలంగాణలో అనాథలెవరూ ఉండబోరని.. అలాంటి పిల్లల ఉన్నత చదువులు, బాగోగుల బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని ప్రకటించారు. ‘‘పదో తరగతి వరకు అనాథ పిల్లలను చదివించేందుకు కస్తూర్బా పాఠశాలలున్నాయి. ఆ తర్వాతేం చేయాలో, ఎక్కడికి పోవాలో తెలియని దిక్కుతోచని, దయనీయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం సామాజిక బాధ్యతగా ప్రభుత్వం తీసుకుంటుంది. దేశం మొత్తం అనుసరించే గొప్ప కార్యక్రమంగా ఇది ఉండాలని భావిస్తున్నాం. అనాథ పిల్లలను ఎక్కడ చేర్పించాలి, ఎక్కడ చదివించాలి, ఏమేం ఏర్పాట్లు చేయాలనే విధివిధానాలు ఖరారు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించాం. మంత్రులు ఈటల, జోగు రామన్న, చందూలాల్, లక్ష్మారెడ్డి కమిటీలో సభ్యులుగా ఉంటారు. వారం పది రోజుల్లో నివేదిక అందిస్తారు..’’ అని కేసీఆర్ ప్రకటించారు. బుధవారం జరిగిన మంత్రివర్గ భేటీలో తీసుకున్న పలు కీలకమైన నిర్ణయాలను సీఎం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. - పాలమూరు జిల్లా ప్రజలకు తాగు, సాగునీటిని అందించేందుకు 35,250 కోట్లతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం చూపేలా 6,190 కోట్లతో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచే పాలమూరుకు 70 టీఎంసీలు, డిండి ఎత్తిపోతలకు 30 టీఎంసీలు నీటి తరలింపు. అదనంగా హైదరాబాద్‌కు 20 టీఎంసీలు. - గీత కార్మికులు, మత్స్యకారులకు రూ.5 లక్షల బీమా పథకం అమలు. ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రిజిస్టర్డ్ సొసైటీల్లోని కార్మికులకే ఇది వర్తిస్తుంది. - విదేశాల్లో ఉన్నత విద్య కోసం మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వ ఆర్థిక సాయం. బడ్జెట్లో రూ.25 కోట్లు కేటాయింపు. మైనారిటీ విద్యార్థులకు 10 గురుకుల పాఠశాలలు, 10 వసతి గృహాల ఏర్పాటు. హా పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు కడుపు నిండా భోజనం, రోజు విడిచి రోజు కోడిగుడ్డు. - నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటు. - ఈనెల 12న లాంఛనంగా టీఎస్ ఐపాస్ ప్రారంభం. ప్రపంచంలో ఎక్కడా లేనంత సరళంగా ఉండేలా ఖరారుకు నిర్ణయం. - జూలై నుంచి 25 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ. వయోపరిమితి సడలింపుపై సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం. - కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు స్క్రీనింగ్. స్థానికులైన కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తింపు.