breaking news
One gram of gold
-
అచ్చు బంగారమే.. ఇంత చవకగా వస్తే ఆడాళ్లు వదులుతారా?
జనగామ: బంగారం ధరలకు రెక్కలొచ్చినా, మహిళలు అలంకరణలో తగ్గడం లేదు. ధరలు ఆకాశాన్ని తాకినా అందం మీద మక్కువ మాత్రం తీరడం లేదు. గోల్డ్‌కు ప్రత్యామ్నాయంగా వన్ గ్రామ్ ఆభరణాలతో ఆడపడుచులు తమ అందాన్ని మరింత చిగురింపజేసుకుంటున్నారు. చవక ధరలో చక్కని మెరుపు, బంగారానికే పోటీగా మెరిసే డిజైన్లు ప్రతీ మహిళ మెడలో కొత్త కాంతి నింపుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.లక్షా 27 వేలు దాటింది. దీంతో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు ఆభరణాలు కొనడం కలగా∙మారింది.పెళ్లిళ్లు, పుట్టినరోజులు, శుభకార్యాలు ఎన్ని ఉన్నా బంగారం ధరలు అలంకారాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే, అందం మీద మక్కువ మాత్రం తగ్గలేదు. అలా బంగారం స్థానాన్ని వన్‌గ్రామ్ ఆభరణాలు ఆక్రమిస్తున్నాయి. కొన్నేళ్లుగా కొంత మేరకే∙ఆదరణ పొందిన ఈ వన్‌గ్రామ్ ఆభరణాలు ఇప్పుడు పూర్తిగా మార్కెట్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఎనిమిది నెలల్లో అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం ధరల పెరుగుదలతో పాటు చోరీల భయం కూడా ప్రజలను వన్‌గ్రామ్ వైపు మళ్లిస్తోంది. మహిళలు తమ బంగారు నగలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుని, బయటకు వెళ్లేటప్పుడు వన్‌గ్రామ్ ఆభరణాలతో మెరిసిపోతున్నారు.బంగారానికి పోటీగా మెరిసేవ గ్రామ్ ..కంపెనీలు కూడా ఈ ధోరణిని అందిపుచ్చుకుని ఫ్యాషన్ డిజైన్లలో కొత్తదనం చూపుతున్నాయి. వజ్రాల్లాంటి రాళ్లు, ముత్యాలు, రంగు రాళ్లతో అద్భుతంగా మెరిసే డిజైన్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. బంగారం లాంటి ఫినిషింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ఆభరణాలు అసలు బంగారం కంటే ఎక్కువ మెరుస్తూ, చూసే వారిని ఆశ్చర్యపరుస్తున్నాయి.వ్యాపారం రూ. లక్షల నుంచి కోట్ల దాకా.. గతంలో కేవలం చిన్న షాపుల్లో మాత్రమే అమ్ముడయ్యే వన్‌గ్రామ్ ఆభరణాలు ఇప్పుడు పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా విస్తరించింది. ఆన్లైన్ మార్కెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, బ్యూటీ పార్లర్లు, గృహిణిలు సైతం ఈ వ్యాపారంలో భాగస్వామ్యులవుతున్నారు. జనగామ జిల్లాలో ప్రతీ నెల వ్యాపారం రూ. కోటికి పైగా ఉంటుందని అంచనా. రూ. 1,000 నుంచి రూ.1,500, రూ. 2,500, ఇలా రూ.20 వేలకు పైగా ధరల్లో లభించే ఈ ఆభరణాలు ఇప్పుడు ప్రతీ మహిళను ఆకర్షిస్తున్నాయి. వివాహాలు, పండుగలు, పార్టీలు, సెలబ్రేషన్లలో వన్‌గ్రామ్ ఆభరణాలు తళుక్కుమంటున్నాయి. బంగారంలా కనిపించే, అందరికీ అందుబాటులో ఉండే వన్‌గ్రామ్ ఆభరణాలు ప్రస్తుతం ఫ్యాషన్ సింబల్‌గా మారాయి. విద్యార్థినుల నుంచి ఉద్యోగిణుల వరకు, గ్రామీణుల నుంచి పట్టణ మహిళల వరకు అందరి మెడలో, చేతుల్లో ఈ నగలు మెరిసిపోతున్నాయి. తక్కువ ధర.. ఎక్కువ ఆకర్షణ.. ఈ రెండు అంశాలే వన్‌గ్రామ్ ఆభరణాల విజయ రహస్యం. మార్కెట్ అంచనాల ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ఈ వ్యాపారం మరింత రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.వ్యాపారం పెరిగిందిగతేడాదితో పోలిస్తే ఈ సారి వన్‌గ్రామ్ ఆభరణాల వ్యాపారం పెరిగింది. ప్రస్తుతం ఒక్కో కుటుంబం నాలుగు నుంచి ఐదు రకాల ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. నెలవారీ వ్యాపారం బాగానే ఉంటోంది. హోల్‌సేల్‌గా ప్రతీ నెల ఆర్డర్‌పై తెప్పిస్తాం.ఉత్తమ్, వ్యాపారి, జనగామమహిళలు మక్కువ చూపుతున్నారు ప్రస్తుతం వన్ గ్రామ్ ఆభరణాలకు క్రేజ్ ఉంది. బంగారం రూ.లక్షా 30వేలకు పైగా ఉండడంతో చాలా మంది మహిళలు వన్ గ్రామ్ ఆభరణాలపై మక్కువ చూపుతున్నారు. బంగారం చేయించుకుంటే ఎక్కువ ఖర్చుతో పాటు దొంగల భయం ఉంది. అందుకే వన్ గ్రామ్ ఆభరణాలు చేయించుకున్నాం. శుభకార్యాలకు వెళ్లినప్పుడు ఈ ఆభరణాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.శానబోయిన కల్యాణి, శివునిపల్లి, స్టేషన్ఘన్పూర్వన్ గ్రామ్ ఆభరణం బెటర్రోజురోజుకూ బంగారం ధర పెరుగుతూ మాలాంటి సామాన్య కుటుంబాలు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోతోంది. బంగారం ధర పెరగడంతో ఇటీవల చోరీలు, దాడులు జరుగుతున్నాయి. దీంతో బంగారం బదులు వన్ గ్రామ్ ఆభరణాలు ఉత్తమమని కొనుగోలు చేయాలనుకుంటున్నా. నిరుపేద, సామాన్య కుటుంబాలు బంగారానికి ప్రత్యామ్నాయంగా వన్ గ్రామ్ ఆభరణాలు కొనుగోలు చేయడం మంచిది.మేకల సునీత, రామన్నగూడెం,కొడకండ్ల -
ఆ గోల్డ్‌కి పెరుగుతున్న క్రేజ్..రోజుకో నగతో మహిళామణులు..
శుభకార్యం ఏదైనా... మహిళలు ప్రత్యేకంగా దృష్టి సారించేది ఆభరణాలపైనే. చీర రంగు, డిజైన్‌కు తగ్గట్టుగా ఆభరణాలు ధరించాలనుకుంటారు. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ బంగారం ధరలు చుక్కలనంటుతుండంతో ప్రత్యామ్నాయ ఆభరణాల వైపు చూస్తున్నారు. చాలా మంది ‘వన్‌గ్రామ్ గోల్డ్’ వైపు మొగ్గుచూపుతున్నారు. ధర తక్కువగా ఉండటం...వివిధ మోడళ్లలో అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది వీటిని ధరించేందుకు ఇష్టపడుతున్నారు. రోజుకో మోడల్ నగతో ధగధగ మెరుస్తున్నారు. సాక్షి, పుట్టపర్తి: బంగారం.. కొనాలంటే ధర భయపెడుతోంది...ఎలాగోలా కొందామనుకున్నా కావాల్సిన మోడల్ అందుబాటులో ఉండటం లేదు. నచ్చిన మోడల్ నగ కొనుగోలు చేసినా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అందువల్లే బంగారు ఆభరణాల కొనుగోలు ఇప్పుడో పెద్ద ప్రహసనం. అందువల్లే సామాన్య, మధ్యతరగతి వారు ప్రత్యామ్నాయ ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. జిగేల్ మంటున్న వన్‌గ్రామ్ గోల్డ్ బంగారు ఆభరణాలు కొనుగోలు చేయలేని సామాన్యులు, మధ్య తరగతి మహిళలకు ఇప్పుడు వన్‌గ్రామ్ గోల్డ్ కళ్లముందు జిగేల్‌మంటోంది. ధరలు కూడా అందుబాటులో ఉండటం..కోరిన డిజైన్లలో దొరుకుతుండటంతో వన్‌గ్రామ్ గోల్డ్‌కే జై కొడుతున్నారు. చైన్ స్నాచింగ్ కేసులు నేపథ్యంలో చాలా మంది తాళిబొట్టు గొలుసు కూడా వన్‌గ్రామ్ గోల్డ్‌నే వాడుతున్నారు. వీటిని ధరించడం సులువు, రవాణాలో ఇబ్బంది ఉండదు, పైగా చోరీకి గురైనా నష్టం పెద్దగా ఉండదు. దీనికి తోడు రకరకాల డిజైన్లు ఆకట్టుకుంటాయి. తక్కువ మొత్తానికే భారీ తూకం నగలు ఇంటికి చేరుతాయి. అందువల్లే చాలా మంది వన్‌గ్రామ్ గోల్డ్ బెస్ట్ అంటుండగా...జిల్లాలో దుకాణాలు భారీగా వెలిశాయి. గతంలో బెంగళరు, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లోనే ఎక్కువగా కనిపించే వన్‌గ్రామ్ గోల్డ్ నగల దుకాణాలు ఇప్పుడు హిందపురం, ధర్మవరం తదితర పట్టణాల్లోనూ మిరుమిట్లు గొలుపుతున్నాయి. సంపన్నులదీ అదే దారి ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ర.55 వేలపైనే పలుకుతుండగా... ఏ ఆభరణం కొనాలన్నా ర.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. కొనుగోలు చేసిన వారు కూడా చోరుల భయంతో ధరించలేని దుస్థితి. అందువల్లే ఇంట్లో బంగారం ఎక్కువ ఉన్న వాళ్లు బ్యాంకుల్లోని లాకర్లలో ఉంచుతున్నారు. శుభకార్యాల సమయంలో వాటిని తీసుకుని ధరిస్తున్నారు. ఆ వెంటనే మళ్లీ లాకర్లలోనే భద్రపరుస్తున్నారు. ఇదంతా ఎందుకు అనుకునే సంపన్నులు వన్‌గ్రామ్ గోల్డ్ నగలను ధరించేందుకు ఇష్ట పడుతున్నారు. బంగారం కొనుగోలు కోసం దాచిన డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడి పెడుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా డిజైన్లు బంగారు ఆభరణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు వివిధ డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. ఉంగరాల ధర .వెయ్యి నుంచి ర.10 వేల వరకు ఉంటోంది. మహిళలు ధరించే లాంగ్ చైన్లు రూ .5 వేల నుంచి ర.20 వేల వరకు రకరకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మధ్య తరగతి వారంతా విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. అందులోనూ కళాశాలకు వెళ్లే యువతులు రెండు, మూడు సెట్ల నగలు కొంటున్నారు. ఫలితంగా అమ్మకాలు బాగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారం బాగుంది వన్‌గ్రామ్ గోల్డ్‌తో చేసిన ఆభరణాలకు నాలుగైదు ఏళ్లుగా విపరీతమైన డిమాండ్ పెరిగింది. పట్టణ వాసులకు పోటీగా పల్లె వాసులు కొనుగోలు చేస్తున్నారు. ధరల విషయంలో రాజీ పడకుండా నచ్చి.. మెచ్చిన డిజైన్లను సొంతం చేసుకుంటున్నారు. రోజూ కనీసం ఐదుగురు చొప్పున వన్ గ్రామ్ గోల్డ్‌తో చేసిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. – సాజిద్, బంగారు నగల వ్యాపారి, ధర్మవరం కాలేజీ విద్యార్థులే ఎక్కువ కరోనా లాక్డౌన్ తర్వాత వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. గ్రామీణ ప్రాంత వాసులు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. అందులో కూడా కాలేజీ విద్యార్థినులే అధికంగా ఉంటున్నారు. దొంగల బారి నుంచి నష్టపోకుండా ఉండేందుకు విరివిగా వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. – రమేశ్, వ్యాపారి, హిందూపురం (చదవండి: చీర కట్టుతో మతి పోగొడుతున్న.. ఈ ముద్దుగుమ్మ ధరించిన చీర ఎంతంటే..) -
‘వన్‌గ్రామ్’ వల
తాడేపల్లిగూడెం : ‘అక్కయ్యగారూ. ఈ నెక్లెస్ ఎంత బాగుందో.. ధగధగా మెరిసిపోతోంది.. అచ్చం బంగారంలా లేదూ.. మీ మెడలో వేసుకుంటే అబ్బో ఇక చెప్పనక్కరలేదు.. పెళ్లిళ్లు, పేరంటాలకు వీటిని వేసుకెళితే అందరి దృష్టి మీపైనే’ అంటూ జిల్లాలోని డ్వాక్రా సంఘాల మహిళలే లక్ష్యంగా వన్‌గ్రామ్ గోల్డ్ నగల పేరిట కొన్ని ముఠాలు మోసం చేస్తున్నారుు. కొన్న రెండు మూడు రోజులకే వెలిసిపోతున్న గిల్టు నగల్ని అంటగట్టి లక్షలాది రూపాయలను దండుకుంటున్నారుు. వన్‌గ్రామ్ గోల్డ్ నగలపై మోజు పెరగడంతో సామాన్యులతోపాటు సంపన్నులు సైతం వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు డ్వాక్రా సంఘాలను లక్ష్యంగా చేసుకుని జిల్లాలో కొంతకాలంగా మోసం చేస్తున్నారు. ఆఫర్లతో మహిళలను బురిడీ కొట్టించడంతోపాటు వాటిని తెలిసిన వారికి అమ్మిపెడితే వెండి పట్టాల జతను నజరానాగా ఇస్తామని నమ్మబలుకుతున్నారు. దీంతో ఆ నగలను తాము కొనడంతోపాటు తమకు తెలిసిన వారితో కూడా మహిళలు కొనుగోలు చేరుుస్తున్నారు. వీటిని కృష్ణాజిల్లా చిలకలపూడిలో తయూరు చేస్తున్నట్టు లేబుల్స్, జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో నగలను విక్రరుంచే దుకాణాల చిరునామాలతో బిల్లులు సృష్టించి రోల్డ్‌గోల్డ్ నగలను వన్‌గ్రామ్ గోల్డ్ నగలుగా విక్రరుస్తున్నారు. అవి రెండు మూడు రోజులకే రంగు వెలిసిపోతుండటంతో వాటిని కొన్న మహిళలు బిల్లులో పేర్కొన్న చిరునామాలకు వెళ్తున్నారు. ఆ చిరునామాలో ఇలాంటి నగలు విక్రయించే దుకాణాలు లేకపోవడంతో తెల్లమొహం వేస్తున్నారు. జిల్లాలో ఈ తరహాలో వెరుు్యకి పైగా డ్వాక్రా సంఘాలకు వీటిని విక్రరుుంచినట్టు సమాచారం. తాడేపల్లిగూడెం పట్టణంలో పలు చిరునామాలు ఇచ్చి, వాటి పేరుమీద రబ్బరు స్టాం పులు వేసిన ర శీదుల్ని ముఠా సభ్యులు మహిళలకు ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్క సంఘం రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకూ చేతి చమురు వదుల్చుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నెన్నో ఆఫర్లు నెక్లెస్ రూ.300, గొలుసు రూ.500, డైమండ్ నెక్లెస్ రూ.వెరుు్య చొప్పున అమ్ముతున్నామని, ఆఫర్లో ఆ మూడిం టినీ రూ.900కే ఇస్తున్నామంటూ తాడేపల్లిగూడెం శివాలయం వీధిలోని మహిళా సంఘాలకు సురేష్ అనే యువకుడు రోల్డ్‌గోల్డ్ నగల్ని అంటగట్టాడు. రెండు రోజులకే అవి రంగు వెలిసి నల్లగా అవడంతో సంబంధిత మహిళలు ఆ యువకుడు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ‘దిస్ నంబర్ నాట్ ఎగ్జిస్ట్స్’ అనే సమాధానం వస్తోంది. మీరు కొన్న వస్తువులకు మూడేళ్ల వారంటీ అంటూ కార్డులు కూడా ఇచ్చారు. ఏ వస్తువుపై అరుునా 50 శాతం తగ్గింపు అంటూ ప్రచారం చేయడంతో డ్వాక్రా సంఘాల మహిళలు వన్‌గ్రామ్ వలలో చిక్కుకుంటున్నాయి. అసలు విషయం తెలిశాక లబోదిబో మంటున్నాయి. ఈ రాకెట్లో తాడేపల్లిగూడెంకు చెందిన వ్యక్తులు ఉన్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులపై నగల వ్యాపారానికి ల్యాండ్ మార్కుగా ఉన్న ప్రాంతాల పేరుతో స్టాంపులు వేస్తుండటం ఈ అనుమానాలకు తావిస్తోంది. వన్ గ్రామ్ గోల్డ్ అంటే ... నగల తయారీలో ఇది ఒక ఫార్ములా. ఇతర లోహాలతో తొలుత నగలు తయారు చేస్తారు. అనంతరం నగ ధగధగల కోసం పైపూతగా వేసి మెరుగు పెడతారు. ఇవి అధికంగా ముంబైలో తయారవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. వీటిధర నగను బట్టి రూ.వెరుు్య నుంచి రూ.4,500 వరకు ఉంటుంది. వీటి పేరు చెప్పి రోల్డ్‌గోల్డ్ నగలను మహిళలకు అంటగట్టి మోసాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. సిసలైన వన్‌గ్రామ్ బంగారు ఆభరణాలను కరిగిస్తే చివరకు గ్రాము బంగారం వస్తుందని బంగారు వ్యాపారి ఒకరు తెలిపారు. ఇంత ధరకు అమ్మాల్సిన వన్‌గ్రామ్ నగలను అతి తక్కువ ధరకు విక్రయిస్తూ కొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్నారుు. మోసపోరుున మహిళలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మిన్నకుండిపోతున్నారు.


