breaking news
Nicky Joseph
-
'యువకులను ప్రలోభపెట్టి.. ఐఎస్ఐఎస్లో చేరుస్తున్నా'
హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మహిళా ఉగ్రవాది నిక్కీ జోసెఫ్‌ను శనివారం పోలీసులు జడ్జి ముందు హాజరు పరిచారు. నిక్కీ జోసెఫ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. యువకులను ప్రలోభపెట్టి.. ఐఎస్ఐఎస్లో చేరుస్తున్నటుగా నిక్కీ జోసెఫ్ అంగీకరించింది. జడ్జి.. నిక్కీ జోసెఫ్ కు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు నిక్కీ జోసెఫ్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈమెకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన పలువురిని ఐఎస్ఐఎస్లో చేర్చేందుకు ఈమె ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. దాని సాయంతో పలువురిని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. గత జనవరిలో పోలీసులు అరెస్టు చేసిన మొయినుద్దీన్ అనే ఉగ్రవాదికి ఈమె ప్రియురాలని, ఈమె ఇంగ్లండ్ దేశస్థురాలని తెలుస్తోంది. ఈమెకు 2011లోనే మొయినుద్దీన్‌తో పరిచయం అయ్యింది. ఇక్కడ కొన్నాళ్ల పాటు తమ కార్యకలాపాలు సాగించిన తర్వాత.. దుబాయ్ వెళ్లిపోయింది. ఆమెను పోలీసులు అత్యంత చాకచక్యంగా హైదరాబాద్‌కు రప్పించి అరెస్ట్ చేశారు. -
ఐఎస్ఐఎస్ ఏజెంట్ అరెస్ట్
* శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో * అదుపులోకి తీసుకున్న పోలీసులు * ఐఎస్ఐఎస్లో చేరేందుకు యువతకు గాలం! హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ లో యువతను చేర్పించేందుకు వారికి గాలం వేస్తున్నట్లు అనుమానిస్తున్న ఓ యువతిని శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ఐఎస్లో చేరేలా యువతను సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్‌కు చెందిన అఫ్షా జబీన్ అలియాస్ నిక్కీ జోసెఫ్ (37) ఉసిగొల్పుతున్నట్లు డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్ తదితర రాష్ట్రాల్లోని యువతను ఫేస్బుక్ ద్వారా ఐఎస్ఐఎస్లో చేర్పించేందుకు ప్రయత్నించిందని తెలిపారు. అబుదాబీలో ఆమె ఉన్నట్లు కనుక్కున్న అధికారులు.. దుబాయ్ నుంచి ఆమెను వ్యూహాత్మకంగా హైదరాబాద్‌కు రప్పిం చారు. ఇక్కడకు రాగానే శంషాబాద్ విమానాశ్రయ పోలీ సులు నిక్కీని కస్టడీలోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఐఎస్ఐఎస్లో చేరేందుకు ప్రయత్నించిన సల్మాన్ మొయినుద్దీన్‌ను ఈ ఏడాది జనవరి 16న శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిక్కీ జోసెఫ్‌తో ఫేస్బుక్లో పరిచయం ద్వారానే సల్మాన్ ఐఎస్ఐఎస్లో చేరేందుకు బయలుదేరాడని పోలీసులు విచారణలో తేలింది. హైదరాబాద్ నుంచి చిన్నతనంలోనే దుబాయ్‌కు వెళ్లి అక్కడే పాఠశాల చదువు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో కూడా చదువుకున్నట్లు పోలీసులకు తెలిసింది.