breaking news
Nickname
-
NATO Summit 2025: డాడీ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కొత్తగా ఒక నిక్‌నేమ్ వచ్చి చేరింది. అదేమిటో తెలుసా?.. డాడీ. అంటే నాన్న అని తెలిసిందేగా. నాటో సదస్సు సందర్భంగా ట్రంప్‌ను డాడీ అని పిలుస్తున్న వీడియోను వైట్‌హౌస్ తాజాగా విడుదల చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్‌ను పక్కనే ఉన్న నాటో చీఫ్ మార్క్ రుట్టే సరదాగా డాడీ అని సంబోధించారు. ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోను ‘డాడీస్ హోమ్. హే, హే, హే, డాడీ’ అని శీర్షికతో శ్వేతసౌధం షేర్ చేసింది. ఇది జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు తమకు తోచిన రీతిలో ప్రతిస్పందిస్తున్నారు. నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో నాటో సదస్సుకు ట్రంప్ హాజరయ్యారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ముగిసిపోయేలా తానే చొరవ తీసుకున్నానని ఆయన చెప్పారు. ఇంతలో నాటో చీఫ్ మార్క్ రుట్టే మాట్లాడుతూ.. డాడీ (ట్రంప్) ఇరు దేశాలకు బలమైన భాషలో చెప్పారని వ్యాఖ్యానించారు. తర్వాత డాడీ అన్ని సంబోధనపై ట్రంప్ స్పందించారు. అది చాలా ఆప్యాయత, అనురాగంతో కూడిన సంబోధన అని ఆనందం వ్యక్తం చేశారు. -
మారుపేరు.. మమకారాల ఊరు
మేడిపల్లి(వేములవాడ): ఒక్కొక్క గ్రామంలో ఒక్కో రకమైన వింతలు ఉంటాయి. జగిత్యాల జిల్లా ఉమ్మడి మేడిపల్లి మండలం కమ్మరిపేట గ్రామంలో కూడా మారుపేర్ల (నిక్ నేమ్) వింత ఉంది. గోదావరి జిల్లాల్లో వెటకారం ఉన్నట్లు, కమ్మరిపేటలో కూడా వెటకారంతో కూడిన ప్రేమలు ఉంటాయి. మచ్చుకు కొన్ని మారుపేర్లుకమ్మరిపేటలో కొందరిని తల్లిదండ్రులు పెట్టిన పేర్లతో కాకుండా మారుపేర్లతోనే గుర్తిస్తా రు. ఉదాహరణకు.. నల్లోడు, కోడిజుట్టుగాడు, బర్లోడు, గుడుగుడు మల్లయ్య, బూటుగాడు, సెంబుగాడు, కటకట రాయడు, బారెపు మల్లయ్య, బొట్టుగాడు, దస్తగిరిగాడు, జేంకొరుకుడు, ఆపకా యేగాడు, సెట్టెపిసోడు, పొట్టన్న, బీపిగాడు, ఎద్దుగాడు, పిసోడు, పొట్టోడు, బుడ్డిగాడు, యాస్టీంగ్గాడు, నరుకుడుగాడు, పిర్రలెంకడు, మల్కుమల్లోజీ, ఒక్కపొద్దు, బొమ్మగాడు, సాంబర్గాడు, పత్తగాడు, బొంబాయిగాడు, బ్రహ్మంగారు, తత్తర్గాడు, గొట్టాలు, గుండంగాడు.. ఇలా దాదాపు ఊరందరికీ మారుపేర్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు అండగా..కమ్మరిపేటలో గ్రామస్తులందరూ వరుసలతో పాటు వెటకారం జోడించి మారుపేర్లతో పిలుచుకుంటారు. ఇలా పిలవడం ఎదుటివారిని తక్కువ చేసినట్లు అస్సలు కాదు. ప్రేమగా ఇలా పిలుచుకోవడంలో గ్రామస్తులంతా ఆదర్శంగా నిలుస్తారు. గ్రామంలో ఎవరికైనా, ఏ సమయంలోనైనా సమస్య వచ్చినా.. అందరూ తలో చేయి వేసి ఆదుకుంటారు. ఎవరైనా చనిపోతే కులమతాలకు అతీతంగా దగ్గరుండి కార్యాలు జరుపుతారు. ఈ విషయంలో చాలా మంది పెద్దలు కమ్మరిపేట గ్రామాన్ని ప్రశంసిస్తారు. భీమారం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేందుకు కమ్మరిపేట గ్రామస్తులు తమదైన పాత్ర పోషించారు. ఇలా చాలా విషయాల్లో కమ్మరిపేట మండలంలో ఆదర్శంగా నిలుస్తోంది.మారుపేరుతోనే పిలుస్తారు నాపేరు బినవేని రెడ్డి. కానీ మా గ్రామంలో ఇంటివారు పెట్టిన పేరుతో పిలవరు. మారుపేర్లతోనే ఎక్కువగా పిలుస్తారు. మా పూర్వీకులు బర్లు కాసేవారని నన్ను బర్ల రెడ్డి అంటారు. మా ఊర్లో దాదాపు అందరినీ ఇలాగే పిలుస్తారు. – బినవేని రెడ్డి, కమ్మరిపేటఅలా పిలిస్తేనే ప్రేమ..సరదాగా మారుపేర్లతో పిలవడం మా ఊరి వెటకార భాషలో భాగం. అలా పిలిచినా ఎవరూ ఇబ్బంది పడరు. అలా పిలిస్తేనే గుండెకు దగ్గరగా.. ప్రేమతో పిలిచినట్లు భావిస్తారు. గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏదైన విషయంలో భేదాభిప్రాయాలున్నా ఇతర గ్రామాల మధ్యవర్తిత్వానికి ఇష్టపడం.– ఆకునూరి శ్రీనివాస్, కమ్మరిపేటఊరంతా ఒక్కటవుతంచాలా గ్రామాల్లో వరుసలు పెట్టి పిలుస్తారు. మా గ్రామంలో వరుసలతో పాటు వెటకారం జోడించి పిలుస్తాం. ఇది ఎప్పటినుంచో వస్తున్న పరంపర. ఏ వర్గంవారైనా వరుసపెట్టి పిలవడం మాకు అలవాటు. మా గ్రామంలో గొడవలు పడ్డా.. ఇతర గ్రామాలు ఒత్తిడి ప్రయోగిస్తే ఊరంతా ఒక్కటవుతం. ఇది మా ఊరు గొప్పతనం.– గొల్ల ముఖేశ్, కమ్మరిపేట -
ఆడు ఎదురొస్తే ‘తుపాను’ నడిచొచ్చినట్టు ఉంటది
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చీర్ల శ్రీనివాస్, గంగా భవానీల కుమారుడు చీర్ల నాగేంద్ర. 1996 నవంబర్ 7న జన్మించాడు. ఆ సమయంలో రాష్ట్రాన్ని పెను తుపాను కమ్మేసి ఉంది. ముసురు బట్టి రోజుల తరబడి వర్షం పడుతోంది. ఆ సమయంలో పుట్టినందున తల్లిదండ్రులు తమ కుమారుడు నాగేంద్రకు తుపాను అని ముద్దు పేరు పెట్టుకున్నారు. అప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగు పొరుగు.. అదే పేరుతో పిలుస్తుండటంతో నాగేంద్ర పేరు తుపానుగానే స్థిరపడిపోయింది. తను కూడా తన పేరు నాగేంద్ర కన్నా.. తుపానుగానే ఎక్కువ ఫీలవుతాడు. అందుకే నాగేంద్రా.. అని పిలిచినదానికన్నా, తుపానూ.. అని పిలిచినప్పుడే ఎక్కువగా స్పందిస్తాడు. ఎనిమిదో తరగతి వరకు చదివిన తుపాను.. బైక్ మెకానిక్‌గా స్థిరపడ్డాడు. తన తమ్ముడు రామాంజనేయులు కూడా 1998వ సంవత్సరం వరదల సమయంలో పుట్టాడని తుపాను చెప్పాడు. ఇక తన ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు కూడా ప్రత్యేకతలున్నాయన్నాడు. పెద్ద కుమారుడు మోహిత్ 2020 జూలైలో కరోనా సమయంలో, చిన్న కుమారుడు ఈ ఏడాది మేలో వచ్చిన అసనీ తుపాను సమయంలో పుట్టారని చెప్పారు. తన కుటుంబానికి ప్రకృతి విపత్తులకు విడదీయరాని అనుబంధం ఉందని.. తమది ప్రకృతి విపత్తుల నుంచి పుట్టుకొచ్చిన ఫ్యావిులీ.. అంటూ చమత్కరించాడు. -
ప్లీజ్ నన్ను అలా పిలవొద్దు.. తమన్నా
తమ అభిమాన హీరో, హీరోయిన్లకు ఫ్యాన్స్ ముద్దు పేరు పెడుతుంటారు.కొత్త కొత్త పేర్లని వారికి కేటాయించి.. అదే పేరును హైలెట్‌గా చేస్తారు. ఇక టాలీవుడ్ బ్యూటీ తమన్నా అభిమానులు తమన్నాను ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు. అయితే ఆ పిలుపు ఈ అమ్మడికి నచ్చదట. ‘మిల్కీ బ్యూటీ’ ముద్దు పేరుపై తాజాగా తమన్నా మాట్లాడుతూ.. ‘అభిమానులు మంచి ఉద్దేశంతోనే మిల్కీ బ్యూటీ అని పిలుస్తున్నా..నాకు ఆ పిలుపు నచ్చదు. శరీర వర్ణాన్ని బట్టి పేర్లు పెట్టడం తప్పు. మనదేశంలో తెలుపు రంగు చర్మం పట్ల అభిమానం,వ్యామోహం చాలా మందిలో కనిపిస్తోంది. కొన్నిసార్లు ఇలాంటి పేర్లు, ముద్రలు ఆత్మన్యూనతకు కారణమవుతాయి. మన టాలెంట్‌ను బట్టి ముద్దు పేర్లు పెడితే బాగుంటుంది. కానీ చర్మ రంగును బట్టి ముద్దుపేర్లు వద్దని’ తమన్నా చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల కరోనా బారిన పడిన తమన్నా.. కరోనాకు చికిత్స పొంది సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగులతో బిజీ అయిపోయింది. తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలంలో నటిస్తోంది. ఈ సినిమా ఓ కన్నడ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. గోపీచంద్ సరసన సీటీమార్ సినిమాలో నటిస్తుంది. అలాగే ‘లెవెంత్ అవర్’అనే వెబ్ సిరీస్ లోకూడా నటిస్తుంది. -
సీఎం మమతా.. నా బిడ్డకు పేరు పెడతారు
హుగ్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజుకోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించిన సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డిసెంబర్ నుంచి మొదలుకొని 5 నెలలుగా ప్రపంచంలో కరోనా, లాక్డౌన్, ఐసోలేషన్, క్వారంటైన్ వంటి పదాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఈ 5 నెలల్లో ఎంతోమంది తల్లిదండ్రులు తమకు పుట్టిన బిడ్డలకు కరోనా , కోవిడ్ లాంటి పేర్లు పెట్టడం చూస్తున్నాం. మొన్నటికి మొన్న టెస్లా కార్ల సంస్థ సీఈవో ఎలన్ మస్క్ తన కొడుక్కి అర్థం కాని పేరు పెట్టి నెటిజన్లను కన్ప్యూజన్లోకి నెట్టేశారు.(కరోనా.. ఒక్క రోజులోనే 103 మంది మృతి) తాజాగా ఈ జాబితాలోకి తృణముల్ కాంగ్రెస్ ఎంపీ అపరూప పొద్దార్ చేరారు. గురువారం రాత్రి హుగ్లీ జిల్లాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అపరూప పొద్దార్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ' కరోనా సమయంలో నాకు బిడ్డ పుట్టింది కాబట్టే దానికి కరోనా అనే పేరు పెడుతున్నా. అయితే ఇది కేవలం నిక్‌నేమ్ మాత్రమే. నా బిడ్డకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామకరణం చేస్తారు. నాకు బిడ్డ పుట్టడం నా భర్త షాకిర్ అలీకి సంతోషం కలిగించింది. ప్రస్తుతానికి నేను, నా బిడ్డ క్షమంగా ఉన్నాం' అంటూ అపరూప పొద్దార్ పేర్కొన్నారు. సాధారణంగా బెంగాల్లో అప్పుడే పుట్టిన బిడ్డలకు రెండు పేర్లు పెట్టే సంప్రదాయం కొనసాగుతుంది. తల్లిదండ్రులు తమకి నచ్చిన పేరును పెట్టుకోవచ్చు. అయితే ప్రధాన నామకరణం మాత్రం ఇంటిపెద్ద నిర్ణయించాలన్నది వారి సంప్రదాయంగా వస్తుంది. -
వినుడు వినుడు నిక్నేమ్ల గాథ!
ప్రపంచ ప్రసిద్ధ నగరాలను ఆ పేరుతోనే కాకుండా ‘నిక్‌నేమ్’తో కూడా పిలుస్తారు. అయితే చాలామందికి ఆ నిక్‌నేమ్ ఎందుకు వచ్చిందో తెలియదు. ఈ నిక్నేమ్ల వెనుక సంఘటనలు, కథలు ఆసక్తికరంగా ఉంటాయి అని చెబుతుంది ఇంగ్లండ్‌కు చెందిన ‘జస్ట్ ది ఫ్లైట్’ అనే ఫ్లైట్స్ కంపెనీ. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాల నిక్నేమ్ల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను, విశేషాలను సేకరించి ‘21 సిటీ నిక్‌నేమ్స్ అండ్ ది స్టోరీస్ బిహైండ్ దెమ్’ పేరుతో ఇన్ఫర్మేషన్ గ్రాఫిక్స్ (ఇన్ఫోగ్రాఫిక్స్) రూపం ఇచ్చింది. మచ్చుకు: లండన్‌ను ‘ది ఓల్డ్ స్మోక్’ అని పిలుస్తారు. కారణం...లండన్‌లో పొగమంచు ఎక్కువగా ఉండడం. 1952లో లండన్‌ను 5 రోజుల పాటు చుట్టు ముట్టిన పొగమంచు వల్ల 4000 మంది చనిపోయారు. న్యూయార్క్‌ను ‘ది బిగ్ యాపిల్’ అని, ప్యారిస్ను ‘ది సిటీ ఆఫ్ లవ్’ అని... ఇలా 21 నగరాల నిక్‌నేమ్‌లను వాటి వెనుక నేపథ్యాన్ని ఆసక్తికరంగా చెబుతుంది ‘జస్ట్ ది ఫ్లైట్’.