breaking news
new pension
-
చేయూత అందేనా?
సాక్షి, హైదరాబాద్: కొత్త చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులను ఓ కొత్త సమస్య వేధిస్తోంది. వీరి చేయూత దరఖాస్తుల పరిశీలన నత్తనడకన సాగుతుండడంతో తమకు పింఛను వస్తుందా..రాదా? అని ఆందోళనకు గురవుతున్నారు. గత బుధవారం సాయంత్రంతో దరఖాస్తులకు గడువు ముగియగా.. 33 జిల్లాల పరిధిలో మొత్తం 5,98,193 కొత్త దరఖాస్తులు వచి్చనట్టుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన, అర్హుల వడపోత ప్రక్రియను ఈ నెల 25 లోగా పూర్తి చేయాలని జిల్లా అధికారులు ఆదేశించారు.మొత్తం దాఖలైన దరఖాస్తుల్లో సగానికి పైగా వితంతు పింఛన్లు (55 శాతానికి పైగా) ఉండగా, ఆ తర్వాతి స్థానంలో దివ్యాంగులు (1,48,882 దరఖాస్తులు) ఉన్నాయి. ఈ నెల 25న అంటే మరో 4 రోజుల్లోనే దరఖాస్తుల పరిశీలన ముగియనుండగా, దివ్యాంగుల దరఖాస్తుల్లో 85 వేలకు పైగా దరఖాస్తుల పరిశీలన ఇంకా పెండింగ్‌లోనే ఉన్నట్టు సమాచారం. గత నెలలో (ఆగస్టు) కేవలం 13 వేల దరఖాస్తుల పరిశీలనే పూర్తికావడం, గత వారంలో 2,326 అప్లికేషన్ల వెరిఫికేషన్ మాత్రమే జరగడంతో...ఈ నెల 25వ తేదీకల్లా 85 వేలకు పైగా అప్లికేషన్ల వెరిఫికేషన్ పూర్తి అవుతుందా? లేదా అన్న సందేహాలు దివ్యాంగులను వేధిస్తున్నాయి. పరిశీలనలో భాగంగా దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా..కొన్ని ఆసుపత్రులలో వారానికి ఒక పరీక్ష కూడా పూర్తికాక పోవడం గమనార్హం. నల్లగొండలో అత్యధికంగా.. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే...నల్లగొండ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) అత్యధికంగా 6,799 దరఖాస్తుల పెండింగ్‌తో అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆ తర్వాత అత్యధికంగా పెండింగ్‌లో ఉన్న జిల్లాల విషయానికొస్తే... నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో 3,774, నిర్మల్ జీజీహెచ్‌లో 3,745, నిజామాబాద్ జీజీహెచ్ 3,645, సూర్యాపేట జీజీహెచ్ 3,574, జగిత్యాల జీజీహెచ్ 3,465, కామారెడ్డి జీజీహెచ్ 3,377, కరీంనగర్ జీజీహెచ్ 3,313, ఆదిలాబాద్ రిమ్స్ 2,823, నాగర్‌కర్నూల్ జీజీహెచ్‌లో 2,811 దివ్యాంగుల అప్లికేషన్ల వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. పెండింగ్ దరఖాస్తులపై ప్రభుత్వం దృష్టి పెట్టి అర్హులందరికీ పింఛన్లు అందేలా చూడాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. -
కొత్త పింఛన్ కాకమ్మ కథే!
సాక్షి, అమరావతి: ‘‘ప్రస్తుతం కొత్త పింఛన్ల దరఖాస్తు స్వీకరణకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ఆదేశాలు వెలువడలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక మార్గదర్శకాలు వెలువడిన వెంటనే ప్రజలకు తెలియచేయబడును’’ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి విచారిస్తున్న వారికి ఉద్యోగులు తెలియజేస్తున్న సందేశమిది. ఎక్కువ మందికి ఇదే సమాచారం చెప్పాల్సి వస్తుండడంతో ఈ సందేశాన్ని పలువురు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ వాట్సాప్ స్టేటస్ మెసేజ్లుగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు కాలేదు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ సైతం నిలిచిపోయింది. అయితే, నెలన్నర నుంచి అధికార టీడీపీ అనుకూల మీడియాలో ‘వితంతువులకు పింఛను భరోసా – జూన్ నుంచి కొత్త వారికి– కూటమి ప్రభుత్వం మూడో వసంతంలోకి అడుగిడే వేళ మంజూరు’ అంటూ ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఇదే అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు సహా కొందరు మంత్రులు ప్రకటన చేసినట్టు కథనాలు వచ్చాయి. ఇవి చూసి రెండేళ్లగా కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అర్హులైన అవ్వాతాతలు, వితంతువులు దరఖాస్తు చేసుకోవడానికి రోజూ సచివాలయాలకు వచ్చి పోతున్నారు. అయితే సచివాలయ ఉద్యోగుల సందేశాలను బట్టి ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనని తేలిపోయింది. కూటమి ప్రభుత్వం మభ్యపుచ్చే పథకాలలో ఇది కూడా భాగమేనని స్పష్టమయ్యింది. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆదేశాలతో ఉత్తుత్తి దరఖాస్తుల డ్రామా.. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల మౌఖిక సూచనలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో కొత్త పింఛన్ల పేరిట ఉత్తుత్తి దరఖాస్తుల డ్రామా మొదలైంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పీఏల ద్వారా వాళ్ల పరిధిలోని గ్రామ వార్డు సచివాలయాలకు ఫోన్లు చేసి కొత్త పింఛన్ల కోసమంటూ ఎవరు వచ్చినా వాళ్లకు ‘ప్రభుత్వం ఇప్పుడు కొత్తవి ఇవ్వడం లేద’ని చెప్పకుండా వాళ్లిచ్చే కాగితాలు తీసుకోవాలంటూ మౌఖిక ఆదేశాలిచ్చారు. దీంతో.. ఉమ్మడి పశ్చిమ గోదావరి సహా పలు జిల్లాల్లో పింఛన్ల కోసమని సచివాలయాలకు వచ్చే వారి నుంచి దరఖాస్తులను తీసుకొని సిబ్బంది వాటన్నింటినీ పక్కన పడేశారు. ‘ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తుందంట..’ అన్న ఉత్తుత్తి ప్రచారాన్నే నమ్మి మే నెలలో ఏలూరు జిల్లా ఉంగటూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని భీమడోలు మండలం పూళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం సచివాలయంలో 44 మంది పింఛను ఫారాలు ఇచ్చి వెళ్లారు. అందులో 16 మంది అవ్వాతాతల పింఛన్ కోసమైతే, మరో 28 మంది వితంతు, దివ్యాంగుల పింఛన్ల కోసం. మరోవైపు.. అదే పూళ్ల గ్రామ పంచాయతీలోనే పూళ్ల – 1 సచివాలయంలో మరో 30 మంది ఇలాంటి పింఛన్ ఫారాలు ఇచ్చి వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గం దువ్వ గ్రామ పంచాయతీ పరిధిలోనూ ఇదే పరిస్థితి. దువ్వ –1 సచివాలయంలో కూడా 29 మంది కొత్త పింఛన్ల కోసం ఫారాలు ఇవ్వగా, దువ్వ రెండో సచివాలయంలో మరో 20 మంది కొత్త పింఛన్ల ఫారాలు ఇచ్చి వెళ్లారు. ఆరు నెలలకొకసారి ఇలాంటి మభ్య పెట్టే ప్రకటనలతోనే.. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఈ జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు అంటూ ప్రచారం చేశారు. గత ఏడాది డిసెంబరు నెలలో జరిగిన కలెక్టర్ల సదస్సులోనూ జిల్లాకు రెండు వందల కొత్త పింఛన్లను మంజూరు చేయనున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు, కేన్సర్ రోగులు, వికలాంగులకు ప్రాధాన్యత ఇచ్చి జిల్లాకు రెండు వందల చొప్పున ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రుల ఆధ్వర్యంలో కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నటు ప్రకటించింది. కానీ, దానికి సంబంధించి ఇప్పటిదాక అధికారిక ఉత్తర్వులైతే వెలువడలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయస్సు 60 ఏళ్లు కాగా గత ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కొత్తగా 50 ఏళ్లకే మంజూరు చేయనున్నట్టు హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరే ఆగిపోయింది. 2024 జూన్ నుంచి రాష్ట్రంలో అర్హులు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం పూర్తిగా మూతపెట్టేసింది. రెండేళ్లలో పింఛన్ల సంఖ్య ఆరు లక్షలపైనే తగ్గుదల.. చంద్రబాబు ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం ఒక ఎత్తయితే.. ఇచ్చే పింఛన్ల సంఖ్య కూడ గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాటి సంఖ్యతో పోల్చితే ఆరు లక్షలకు పైబడి తగ్గిపోయాయి. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా అత్యధికంగా 66,34,742 మంది లబ్దిదారులు పింఛను పొందారు. తర్వాత కాలంలో పెన్షన్ల సంఖ్య సాధారణంగా పెరగాలి. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఈ నెల 1, 2 తేదీల్లో పూర్తయిన పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం డబ్బులు పంపిణీ చేసిన లబ్దిదారుల సంఖ్య 60,19,920 మాత్రమే. అంటే గత ప్రభుత్వంలో పెన్షన్లు పొందిన లబ్ధిదారుల సంఖ్య కన్నా ప్రస్తుతం దాదాపు 6.14 లక్షల వరకు తగ్గిపోయాయి. అదే వైఎస్జగన్ ప్రభుత్వ హయాంలో (2019–24 మధ్య ఆ ఐదేళ్ల కాలంలో) అప్పటి ప్రభుత్వం 29.51 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేసినట్టు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారికంగా ప్రకటించింది. దివ్యాంగుల మెడపై కత్తి... పింఛన్లలో మరిన్ని కోతలు పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం దారులు వెతుకుతోంది. పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగుల్లో పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నారంటూ ప్రచారం చేస్తుండడంతో ఎవరి పింఛన్ ఆపేస్తారోనని వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. పింఛన్లు పొందుతున్న దాదాపు 8 లక్షల మంది దివ్యాంగులకు ఇప్పుడు కొత్తగా అర్హత నిర్ధారణ కోసమంటూ డాక్టర్ల ద్వారా రీ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టారు. దివ్యాంగులు, మెడికల్ పింఛన్లు తీసుకునే 8 లక్షల మందికీ రీ వెరిఫికేషన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ గ్రామాల్లో టీడీపీ సానుభూతిపరులు అనుకునే వారికి ఇప్పటి దాక పరీక్షల నోటీసులు ఇవ్వలేదు. అలా రెండు లక్షల మందిని ఈ పరీక్షల నుంచి మినహాయించి మిగిలిన ఆరు లక్షల మంది దివ్యాంగులకు మాత్రమే ఈ రీ వెరిఫికేషన్ పరీక్షలు చేపట్టడం గమనార్హం. -
కొత్త పింఛన్లు ఎప్పుడో?
చంద్రబాబు.. హామీలు ఇవ్వడంలో చూపిన స్పీడు అమలులో కనిపించడం లేదు. ఎన్నికల సమయంలో అర్హులందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పినా.. 19 నెలలైనా నేటి వరకు ఒక్క పింఛన్ మంజూరు చేయాలేదు. చివరకు దరఖాస్తు ప్రక్రియనూ ప్రారంభించక పోవడంపై అర్హులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో కొత్త పింఛన్ కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొత్తవి ఇవ్వకపోగా..ఉన్న వాటిని తొలగిస్తుండటంపై లబి్ధదారుల్లో ఆందోళన నెలకొంది.ఆలూరు రూరల్: కొత్త పింఛన్ల మంజూరుకు చంద్రబాబు ప్రభుత్వం ముఖం చాటేస్తోంది. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడచినా కనీసం దరఖాస్తులు స్వీకరించడం లేదు. పైగా తాము అధికారంలోకి వస్తే నెల రోజుల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్ల మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లకే ఎసరు పెడుతున్నారు. విచారణ పేరిట పింఛన్లకు క్రమం తప్పకుండా కోతలు పెడుతున్నారు. మరో వైపు నియోజకవర్గంలో కొత్త పింఛన్ల కోసం మండల పరిషత్ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రదక్షిణలు చేస్తున్నా వారి ఆశ నెరవేరడం లేదు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అ«ధికారులు చెబుతుండటంతో దరఖాస్తుదాలు నిట్టూర్తూ వెనుదిరుగుతున్నారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీని సైతం చంద్రబాబు సర్కారు విస్మరించింది. 2 వేల మందికి పైగా ఎదురుచూపులు.. ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మండలాల పరిధిలో దాదాపు 2 వేలకు పైగా మంది అర్హులు కొత్త పింఛన్లు కోసం ఎదురుచూస్తున్నారు. పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కార్యలయాల చుట్టూ, మరి కొందరు టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే వెబ్సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు సమాధానమిస్తున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో సులభంగా.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉండేది. వలంటీర్లు అర్హుల ఇంటికి వెళ్లి వారే దరఖాస్తు చేసి పింఛన్ మంజూరు చేయించే వారు. ఆ సమయంలో ఇది నిరంతరం ప్రక్రియగా కొనసాగింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత నూనత పింఛన్ల కోసం ఎదురుచూపులే మిగిలుతున్నాయి.కొత్త పింఛన్లు మంజూరు చేయాలిగత ప్రభుత్వంలో మాదిరిగానే దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు పింఛన్ల మంజూరు ప్రక్రియ కొనసాగించాలి. అధికారం చేపట్టి 19 నెలలు పూర్తవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పింఛన్ మంజూరు చేయకపోవడం దారుణం. మరో పక్క వెరిఫికేషన్ పేరుతో ఉన్న పింఛన్లు తొలగించే కుట్రలు పన్నుతోంది. వికలాంగులు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమివ్వాలి. – రామాంజనేయులు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు -
ఫ్రాన్స్‌లో ప్రత్యేక అధికారాలతో పెన్షన్ బిల్లుకు ఆమోదం
పారిస్: ఫ్రాన్స్ ప్రభుత్వం పెన్షన్ సంస్కరణల్ని ప్రజలపై బలవంతంగా రుద్దుతోంది. దేశ పార్లమెంటులో ఓటింగ్ జరగకుండానే బిల్లు చట్టరూపం దాల్చేలా ప్రత్యేకమైన రాజ్యాంగ అధికారాన్ని పొందేలా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ చర్యలు తీసుకున్నారు. రిటైర్మెంట్ వయసును 62 ఏళ్ల నుంచి 64 సంవత్సరాలకు పెంచుతూ తీసుకుని వచ్చిన ఈ బిల్లు నేషనల్ అసెంబ్లీలోని దిగువ సభలో ఆమోదం పొందే అవకాశం లేదు. అందుకే ఓటింగ్‌కి కొన్ని నిమిషాల ముందు ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్న్ చట్టసభలు ఆమోదించకుండానే బిల్లు చట్టంగా మారేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 49:3ని వినియోగించుకున్నారు. ఈ కొత్త పెన్షన్ బిల్లుపై గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. -
ఏపీలో నేటి నుంచి కొత్త పెన్షన్ కార్డులు
-
పింఛన్.. టెన్షన్..
మంచిర్యాల రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఆహార భద్రతా కార్డులు, పింఛన్ల కోసం చేపట్టిన ప్రక్రియ సజావుగా ముగిసినా.. ఆన్లైన్ చేసేందుకు మాత్రం తంటాలు తప్పడం లేదు. ఇటీవల కోకొల్లలుగా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు అధికారులకు పెద్ద పరీక్షగా మారింది. కాగా.. గురువారం వరకు ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేసి.. శుక్రవారం నుంచి కొత్త పింఛన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ పూర్తికాకపోవడంతో కొత్త పింఛన్ల పంపిణీ ఎలా చేసేదని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆటంకంగా మారిన సాంకేతిక సమస్య... గత నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆహార భద్రత, పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. 22వ తేదీ నుంచి ఈనెల 2 వరకు దరఖాస్తులదారుల ఇళ్లకు వెళ్లి అధికారులు విచారణ చేశారు. అనంతరం 3వ తేదీ నుంచి ఆ అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్ చేసే పని ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ, ఇంటింటి సర్వే చేసి విచారించిన అధికారులకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నమోదు చేయడం పెద్ద పరీక్షగా మారింది. తక్కువ సమయం ఉండడం, వివరాల నమోదుపై కంప్యూటర్ ఆపరేటర్లకు అవగాహన లేకపోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆన్లైన్లో పింఛన్ల వివరాలు నమోదు కావడంలో ఆలస్యం జరుగుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఏకకాలంలో దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడం ప్రారంభించడంతో ఒక్కసారిగా సర్వర్‌పై ఒత్తిడి పెరిగి వెబ్‌పేజీలో వివరాలు ఆలస్యంగా నమోదవుతున్నాయి. ఒక్కో దరఖాస్తు పూర్తయ్యేందుకు పది నిమిషాల వరకు సమయం తీసుకుంటోంది. ఆ పది నిమిషాల తర్వాత కూడా ఆ దరఖాస్తు సేవ్ అవుతుందనే నమ్మకం కూడా లేకుండాపోయింది. ఒక్కోసారి ఒక్కో దరఖాస్తును రెండేసి మూడేసి సార్లు నమోదు చేయాల్సి వస్తోంది. వీటిని తొందరగా పూర్తి చేయాలని ఆపరేటర్లు రాత్రి, పగలు తేడా లేకుండా నాలుగు రోజులుగా కుస్తీ పడుతున్నారు. దీనికితోడు కంప్యూటర్ అవగాహన ఉన్న సిబ్బంది లేకపోవడం.. ఎక్కువ కంప్యూటర్లను సిద్ధం చేసుకోకపోవడంతోనూ ప్రక్రియ ఆలస్యం అవుతోంది. అందుబాటులో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు, మండల పరిషత్, రెవెన్యూ, ఈజీఎస్ సిబ్బందితో ఆన్లైన్లో దరఖాస్తుల నమోదును చేపడుతున్నారు. ఒక్క రోజులో పూర్తయ్యేనా... జిల్లాలో ఆహార భద్రత కోసం 7,12,645 మంది, వివిధ రకాల పింఛన్ల కోసం 3,19,957 మంది దరఖాస్తు చేసుకున్నారు. పింఛన్ దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో నమోదు చేసి ఈ శుక్రవారమే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అర్హులైన వారి జాబితాలను ప్రదర్శించాలి. కానీ.. అలా వీలుపడే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు. జిల్లాలోని 3,19,957 పింఛన్ దరఖాస్తులకు గాను గురువారం సాయంత్రం 6 గంటల వరకు 1,81,581 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేశా రు. ఒక్కరోజే సమయం ఉండడం, నాలుగు రోజు ల్లో 1.81 లక్షల దరఖాస్తులే ఆన్లైన్లో నమోదు చేయడంతో ఈ మిగిలిన ఒక్క రోజులో 1.38 లక్షల దరఖాస్తులను ఆన్లైన్ చేయడం కష్టంగానే మారిం ది. కంప్యూటర్లో దరఖాస్తుదారుల వివరాలను న మోదు చేసే సమయంలో జరిగిన పొరపాట్లను పరి శీలించేందుకు కూడా అధికారులకు సమయం లేకపోవడంతో, శనివారం పింఛన్ల పంపిణీలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి. ఆన్లైన్ చేస్తేనే పింఛన్.. ఇదిలా ఉంటే.. జిల్లాలో మరో 1.38 లక్షల దరఖాస్తులు ఆన్లైన్ చేసేందుకు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే.. వీరి వివరాలు ఆన్లైన్ చేస్తేనే పింఛన్ అందిస్తారా లేకుంటే దాంతో సంబంధం లేకున్నా పింఛన్ ఇస్తారా తెలీక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీఆర్డీఏ అడిషనల్ పీడీ గజ్జారాంను వివరణ కోరగా.. శనివారం ఆసరా కా ర్యక్రమం ప్రారంభం వరకు ఆన్లైన్ నమోదు ప్రక్రి య కొనసాగుతుందని, సమయానికి పూర్తికాకుంటే సంబంధిత తేదీ వరకు అనుమతి తీసుకుని పూర్తి చేస్తామని, ఆన్లైన్ పేర్లు నమోదు చేసిన వారికే పింఛన్లు అందుతాయని చెప్పారు. -
రెండు లక్షల మంది పింఛన్ దారుల పై వేటు


