breaking news
Navy base camp
-
విశాఖలో గవర్నర్‌కు ఘన స్వాగతం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ హోదాలో ఆయన తొలిసారి విశాఖలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చిన గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీస్ కమిషనర్ మీనా, నేవీ అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్ మొదట తూర్పు నావికాదళం ఆపరేషన్ బేస్‌ను సందర్శించి, సర్క్యూట్ హౌస్‌కు వెళతారు. సాయంత్రం కైలాసగిరికి వెళ్లి తెలుగు మ్యూజియం, అనంతరం డాక్టర్ వైఎస్సార్ సిటీ సెంట్రల్ పార్క్‌ను సందర్శిస్తారు. గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించి బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభిస్తారు. అదే రోజు మధ్యాహ్నం పోర్ట్ ట్రస్ట్‌ని సందర్శించి అక్కడ నుంచి రాత్రికి విజయవాడ బయలుదేరనున్నారు. -
నేవీ బేస్ క్యాంప్ ఏర్పాటుపై కేసీఆర్ సానుకూల స్పందన!
హైదరాబాద్: నేవీ బేస్ క్యాంప్ నిర్మాణం కోసం ఆలయ వివాదంలో ఉన్న భూమిని ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌కు తూర్పు నావికాదళం కమాండెంట్ సతీష్ సోనీ విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ఏర్పాటుచేయనున్న నేవీ బేస్ క్యాంప్ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను సతీష్ సోనీ గురువారం మధ్యాహ్నం భేటి అయ్యారు. నేవీ బేస్ క్యాంప్ ఏర్పాటుపై కేసీఆర్ సానుకూలం స్పందించారు. వీలైనంత త్వరగా నేవీ క్యాంప్ ఏర్పాటుకు భూమిని అప్పగిస్తామని సతీష్ సోనికి కేసీఆర్ హామీ ఇచ్చినట్టు తెలిసింది.