breaking news
nagabhushna rao
-
ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త కన్నుమూత
సాక్షి, శ్రీకాకుళం : పాతపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి నాగభూషణరావు మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. నాగభూషణరావు మృతితో పాతపట్నం నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, శాంతి-నాగభూషణరావు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగభూషణరావు ఐఎఫ్ఎస్ అధికారిగా దేశంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. గోవా ఫారెస్ట్ కంజర్వేటర్‌గా, డామన్ డయ్యూ టూరిజం డైరక్టర్‌గా, పర్యావరణం, కాలుష్యం, అడవులు, ఇందనవనరుల శాఖలకు సంబంధించిన పలు విభాగాల్లో పనిచేశారు. పలువురు కేంద్ర మంత్రుల వద్ద ఓఎస్డీగా కూడా విధులు నిర్వర్తించారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా చేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ పూర్తిగా నయమయ్యాక కొద్ది నెలల క్రితం మళ్లీ అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాగభూషణరావు మృతిపట్ల సీఎం జగన్ సంతాపం ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రెడ్డిశాంతికి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
ఠాగూర్ మూవీలా.. వైద్యం చేస్తున్నట్లు నటించి..
హైదరాబాద్: ఠాగూర్ సినిమాలోలా చనిపోయిన వ్యక్తికి వైద్య చికిత్సలు చేసి ఆస్పత్రి నిర్వాహకులు డబ్బులు కట్టించుకున్న తీరు మాదిరే శేరిలింగంపల్లిలోని సిటిజన్ ఆస్పత్రి వైద్యులు దారుణానికి ఒడిగట్టారు. నిజామాబాద్‌కు చెందిన నగబుష్ణరావు(60) అనారోగ్య సమస్యలతో చికిత్స కోసం సిటిజన్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషయాన్ని నగబుష్ణరావు కుటుంబసభ్యులకు చెప్పకుండా దాచిన సిటిజన్ ఆసుపత్రి వైద్యులు మరో 27 గంటలపాటు ఆయనకు వైద్యం చేస్తున్నట్లు నటించారు. మధ్యలో చికిత్సల కోసం అంటూ రెండు విడతలుగా రూ.6.5లక్షల బిల్లు కట్టించుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు నగబుష్ణరావు చనిపోయినట్లు చెప్పారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యం, ధనదాహం వల్లే నగబుష్ణరావు ప్రాణాలు కోల్పోయారని ఆయన బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు.