breaking news
Mohankrishna
-
పారని రాజకీయ కుట్ర
సాక్షి, అమరావతి: రాజకీయ కక్షతో సాక్షి ఫోటో గ్రాఫర్ మోహన్‌కృష్ణతోపాటు, వైఎస్సార్సీపీ నాయకుడు కోటిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన పోలీసులకు తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. వారిద్దరి రిమాండ్‌ని బుధవారం రాత్రి న్యాయస్థానం తిరస్కరించింది. బెయిల్ మంజూరు చేసింది. వివరాల్లోకెళితే.. తిరుమలలో ఈనెల 4న ఖాళీ మద్యం బాటిళ్లు బయటపడటంతో వైఎస్సార్సీపీ నాయకుడు ఆలపాక కోటి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖాళీ మద్యం బాటిళ్లు ఉన్నాయన్న విషయాన్ని సాక్షి ఫొటో గ్రాఫర్ మోహన్ కృష్ణకు సమాచారం ఇచ్చారు. అదే విషయాన్ని తిరుమల ఫొటో గ్రాఫర్ గిరి, సాక్షి టీవీ కెమెరామెన్‌కి సమాచారం ఇచ్చారు. ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ వివరాలతో ‘సాక్షి’తోపాటు అన్ని పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. అన్ని మీడియా ఛానళ్లలోనూ ప్రసారమయ్యాయి. అదే రోజు తిరుమల టూటౌన్లో కేసు నమోదైంది. అయితే గుర్తు తెలియని వ్యక్తుల పేరున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఈనెల 5న తిరుపతి కలెక్టరేట్ వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ తిరుపతి నియోజక వర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను పోలీసులు అడ్డుకుని ఉద్యమకారులను అరెస్టు చేశారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న సాక్షి ఫొటోగ్రాఫర్ మోహన్ కృష్ణపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి స్టేషన్లో కూర్చోబెట్టారు. ఈ పరిణామాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కేసు నమోదు చేయబోమని పోలీసులు హామీ ఇచ్చారు. అయితే టీటీడీ, టీడీపీ పెద్దల ఒత్తిడితో పోలీసులు తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంపై మోహన్కృష్ణపైనా, కోటిపైనా కేసులు నమోదు చేశారు. సాక్షి ఫొటోగ్రాఫర్‌ను టార్గెట్‌గా చేసుకుని రెండురోజులుగా ఓవర్ యాక్షన్ చేశారు. మంగళవారం తిరుమల టూటౌన్ పోలీసులు సాక్షి ఫోటో గ్రాఫర్ ఇంటికి వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేసి ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. బెదిరింపులకూ దిగారు. దీంతో బుధవారం ఉదయం న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి మోహన్ కృష్ణ అలిపిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. అయితే సాయంత్రం వరకు డ్రామాలాడిన పోలీసులు ఆ తర్వాత టీడీపీ, టీటీడీ పెద్దల ఒత్తిడితో బెయిల్ రాకుండా ఉండేందుకు ఎఫ్ఐఆర్లో 152 సెక్షన్ అదనంగా చేర్చారు. సాక్షి ఫొటోగ్రాఫర్, వైఎస్సార్సీపీ నాయకుడు కోటిని దేవలోక్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు కట్టుకథ అల్లారు. బుధవారం రాత్రి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టులో బాధితుల తరఫున న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి చేసిన వాదనలతో ఏకీభవించిన రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి రిమాండ్‌ను తిరస్కరించారు. దీంతో టీడీపీ నేతలు, టీటీడీ పాలకమండలి పెద్దలు షాక్‌కు గురయ్యారు. -
గ్యాంగ్ లీడర్ మాదే
‘‘నేను చిరంజీవిగారికి వీరాభిమానిని. అందుకే ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో ఏ మెగా హీరో సినిమా చేసినా ఇచ్చేస్తాను. వేరే వాళ్లకు ఇచ్చే ప్రసక్తి లేదు. ఈ టైటిల్ తమకు కావాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు అడిగారు. ఇవ్వనన్నాను. అమ్మనన్ని కూడా చెప్పాను’’ అన్నారు మోహన్‌కృష్ణ. ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో తాను హీరోగా నటిస్తూ ఓ నిర్మించాలనుకున్నారు మోహన్‌కృష్ణ. అయితే నాని హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో మైత్రి మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం మోహన్‌కృష్ణ మాట్లాడుతూ – ‘‘తెలంగాణ, ఏపి ఫిలిం చాంబర్లో ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ రిజిస్టర్ చేశాం. త్వరలో షూటింగ్ ఆరంభించి, చిరంజీవిగారి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 22న విడుదల చేయాలనుకున్నాం. చిరంజీవి గారి టైటిల్ పెట్టడం వల్ల చాలా ఫండింగ్ వచ్చింది. 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా వచ్చింది. ఈలోపు నాని బర్త్‌డేకి మా టైటిల్‌తో టీజర్ రిలీజ్ చేశారు. మా పర్మిషన్ తీసుకోకుండా ఎలా టైటిల్‌ను ఎనౌన్స్ చేస్తారు. నేను చాంబర్లో ఫిర్యాదు చేశాను. ఏపి, తెలంగాణ చాంబర్స్ మాకే అనుకూలంగా ఉన్నాయి’’ అన్నారు. -
గుంతలో పడి బాలుడి మృతి
ప్రొద్దుటూరు క్రైం: స్థానిక అనిబిసెంటు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఉన్న నీటి గుంతలో పాపగాళ్ల మోహన్‌కృష్ణ(8) అనే బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రన్నకొట్టాలకు చెందిన లక్ష్మీదేవికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో రెండో వాడైన మోహన్‌కృష్ణ మున్సిపల్ హైస్కూల్లో మూడో తరగతి చదువుతుండే వాడు. పాఠశాల సమీపంలోనే వారి ఇల్లు ఉంది. దీంతో ఆ బాలుడు ఆదివారం తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి మున్సిపల్ హైస్కూల్ మైదానంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పాఠశాల గోడ ఎక్కి ఇంకుడు గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొని రాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. న్యాయం చేయాలని బాధితులతోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు పాఠశాల ఆవరణలో ఆందోళన చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.


