గుంతలో పడి బాలుడి మృతి | Pit fell into the boy's death | Sakshi
Sakshi News home page

గుంతలో పడి బాలుడి మృతి

Sep 25 2016 10:25 PM | Updated on Sep 4 2017 2:58 PM

గుంతలో పడి బాలుడి మృతి

గుంతలో పడి బాలుడి మృతి

స్థానిక అనిబిసెంటు మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో ఉన్న నీటి గుంతలో పాపగాళ్ల మోహన్‌కృష్ణ(8) అనే బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.

ప్రొద్దుటూరు క్రైం: స్థానిక అనిబిసెంటు మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో ఉన్న నీటి గుంతలో పాపగాళ్ల మోహన్‌కృష్ణ(8) అనే బాలుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రన్నకొట్టాలకు చెందిన లక్ష్మీదేవికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో రెండో వాడైన మోహన్‌కృష్ణ మున్సిపల్‌ హైస్కూల్‌లో మూడో తరగతి చదువుతుండే వాడు. పాఠశాల సమీపంలోనే వారి ఇల్లు ఉంది. దీంతో ఆ బాలుడు ఆదివారం తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పాఠశాల గోడ ఎక్కి ఇంకుడు గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకొని రాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. న్యాయం చేయాలని బాధితులతోపాటు ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాఠశాల ఆవరణలో ఆందోళన చేశారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహేష్‌ తెలిపారు.

Advertisement

పోల్

Advertisement