breaking news
mob justice
-
'రాజస్థాన్' ఘటనను ఖండించిన సీపీఎం
జైపూర్: రాజస్థాన్ లో ఓ మహిళను అర్థనగ్నంగా గాడిదపై ఊరేగించిన ఘటనను సీపీఎం ఖండించింది. బాధితురాలు తన మేనల్లుడిని హత్యచేసిందన్న ఆరోపణతో కొంత మంది పంచాయతీ పెద్దలు ఈ దారుణానికి ఒడిగట్టారు. బీజేపీ 11 నెలల పాలనలో మహిళలపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయని సీపీఎం నాయకుడు వసుదేవ్ ధ్వజమెత్తారు. వసుంధరా రాజే పాలనలో రాష్ట్రంలో పరిస్థితి అదుపుతప్పిందని విమర్శించారు. మహిళ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అతివలను అవమానించే, అగౌరపరిచే సంఘటనలు పెచ్చుమీరుతుండడం దారుణమని అన్నారు. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. రాజస్మానంద్ జిల్లాలోని తురవాద్ గ్రామంలో 45 ఏళ్ల మహిళను ఈనెల 8న అర్థనగ్నంగా గాడిదపైఊరేగించడం సంచలనం రేపింది. -
మహిళ దుస్తులు విప్పి.. గాడిదపై ఊరేగింపు
సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన రాజస్థాన్లో జరిగింది. కొంతమంది పంచాయతీ పెద్దలు కలిసి 45 ఏళ్ల మహిళకు దుస్తులు విప్పించి, ఆమెను నగ్నంగా గాడిదపై ఊరేగించారు. ఈ కేసులో ఇప్పటివరకు 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లలో 9 మంది బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తన మేనల్లుడిని హత్యచేసిందని ఆ మహిళపై ఆరోపణలు వచ్చాయి. దాంతో పంచాయతీ పెద్దలు తమంతట తానుగా నిర్ణయం తీసేసుకుని.. అమలుచేసేశారు. ఆమెను ప్రస్తుతం సంరక్షణాలయానికి తరలించి అక్కడ కౌన్సెలింగ్ చేయిస్తున్నారు.