breaking news
Minister Thummala Nageshwara Rao
-
భూసేకరణ వేగవంతం చేయాలి: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కీలకమైన రహదారులకు భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఎన్‌హెచ్, ఎన్హెచ్ఏఐ పరిధిలో చేపట్టే పలు రహదారుల పనులపై సమీక్షించారు. వాటి నిర్మాణాలకు కావాల్సిన భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎన్‌హెచ్, ఎన్హెచ్ఏఐ అధికారులు పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అన్నిశాఖలు పనులు వేగిరపరుస్తున్న నేపథ్యంలో ఆర్ అండ్ బీ శాఖ కూడా పనుల స్పీడు పెంచింది. -
యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని అధికారులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారులపై మంగళవారం ఎర్రమంజిల్‌లోని ఈఎన్సీ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రహదారుల నష్టంపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రూ.800 కోట్ల పనులు మంజూరు ‘కేంద్ర రహదారుల నిధి నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 668.48 కిలోమీటర్ల నిడివిగల 53 రహదారుల పనులకు కేంద్రం రూ.800 కోట్ల నిధులను మంజూరు చేసింది. సీఎం చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి ఈ నిధులు విడుదలయ్యేలా కృషి చేశారు. ఈ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను ఖరారు చేయండి. 24 నెలల్లోగా వీటిని వినియోగించకపోతే.. నిధులు వెనక్కి వెళతాయి’అని మంత్రి అన్నారు. భారీ వర్షాలకు వంతెనలు తెగిపోయినపుడు తాత్కాలికంగా ఏర్పాటు చేసే బ్రెయిలీ బ్రిడ్జీలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరమవుతాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాల కోసం వీటిని సిద్ధంగా ఉంచాలన్నారు. అలాగే రాష్ట్రంలో ఆలనాపాలనా లేని పిల్లలకు ఆశ్రయం కల్పిస్తోన్న ఎన్జీవోలను తనిఖీలు చేసి వారంలోగా నివేదికలు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. దీనికోసం ఉన్నతస్థాయి అధికారి నేతృత్వంలో కమిటీని వేయాలని సూచించారు. ఎన్జీవోల్లో అధికారుల ప్రమేయం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ జగదీశ్వర్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు. -
ఇదిగో భద్రాద్రి
♦ రాముని సన్నిధికి కొత్త రూపు ♦ రూ.125 కోట్లతో తుది ప్రణాళికలు సిద్ధం ♦ రామదాసు నిర్మిత ఆలయం యథాతథం ♦ యాదాద్రి తరహా అథారిటీ: తుమ్మల సాక్షి, హైదరాబాద్: చుట్టూ మాడవీధులు. దిగువన భారీ కళ్యాణ మండపం. నిత్యాన్న దాన మందిరం. కార్యాలయాలు తదితరాల తో నాలుగంతస్తుల భవనం. దిగువన ఆలయ సముదాయం చుట్టూ 60 అడుగుల రోడ్డు. ఆలయ ప్రధానరోడ్డు 4 వరసలుగా విస్తరణ. చుట్టూ పచ్చికబయళ్లు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం అభివృద్ధికి ప్రభుత్వం రూపొందిం చిన నమూనా ఇది. యాదాద్రి తరహాలోనే భద్రాద్రికీ రూ.125 కోట్లతో కొత్త రూపు ఇవ్వా లని ప్రభుత్వం సంకల్పించడం తెలిసిందే. ఆలయ అభివృద్ధి నమూనాలకు సీఎం కేసీఆర్, చిన జీయర్‌స్వామి సూచించిన మేరకు మార్పులు, చేర్పులు కూడా చేశారు. వాటికి సీఎం ఆమోదం రాగానే డీపీఆర్‌లు, టెండర్లు, పనుల ప్రక్రియలను ప్రారంభించాలని అధికా రులను రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. భద్రాద్రి అభివృద్ధి ప్రణాళికలపై దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, ప్రభుత్వ సలహాదారు పాపారావు, ఆర్కిటెక్ట్ ఆనంద్సాయిలతో గురువారం ఆయ న సమీక్షించారు. ఆలయాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేస్తామన్నారు. యాదాద్రి మాదిరిగా భద్రాద్రి అభివృద్ధికి అథారిటీ ఏర్పా టు చేసే అవకాశాలు పరిశీలించాలన్నా రు. భక్త రామదాసు స్మారక ట్రస్టు మందిరానికీ ప్రణాళి కలు రూపొందించాలని పేర్కొన్నారు. పూర్తిగా కొత్త రూపు భద్రాద్రి ప్రధానాలయం 90 అడుగుల ఎత్తున్న గుట్టపై కొలువుదీరింది. ఇందులో ఆలయం, రాజగోపురం, ఆంజనేయస్వామి దేవాలయం తో కూడిన భక్త రామదాసు నిర్మిత ఆలయ సమూహాన్ని యథాతథంగా కొనసాగిస్తారు. ఆలయం చుట్టూ ఇరుకుగా ఉన్న మాడ వీధు లు, ప్రాకారాలను పూర్తిగా తొలగించి కొత్తగా కడతారు. చుట్టూ అంత ఎత్తుకు సరిపోయేలా మూడంతస్తుల భవన సముదాయం నిర్మి స్తారు. ఆ భవనం పై భాగంలో ఆలయం చుట్టూ మాడవీధులు రూపొందిస్తారు. భవనం లో ఆలయానికి ఎడమ వైపు రెండో అంత స్తులో దాదాపు 2 వేల మంది సామర్థ్యంతో కళ్యాణమండపం నిర్మిస్తారు. దాని దిగువన ఆలయ కార్యాలయాలు, ఇతర కార్యాల యాలుంటాయి. కుడివైపు నిత్యాన్నదానశాల, దాని దిగువన వంటశాల, స్వామివార్లకు ప్రసా దాలు రూపొందించే మరో వంటశాల విడిగా ఉంటాయి. గోదావరి వైపు నుంచి నేరుగా ఆల యంలోకి వెళ్లేలా భారీ వంతెన తరహాలో మెట్ల దారి నిర్మిస్తారు. అది ఆలయం ముందు విస్తరించి కట్టే రోడ్డు మీదుగా సాగుతుంది. భూసేకరణ లేకుండానే.. ఆలయం దిగువన సింగిల్ రోడ్డును ఒకవైపు 40, మరోవైపు 60 అడుగులకు విస్తరిస్తారు. ఇందుకోసం ఒకవైపు రెండు, మూడు ప్రైవేటు నిర్మాణాల తొలగింపు మినహా ఎలాంటి భూసేకరణ అవసరం లేకుండానే ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుత అప్రోచ్ రోడ్డును 4 వరసల్లో 100 అడుగులకు విస్తరిస్తారు. దర్శనానంతరం భక్తులు సేదతీరేందుకు విశాలమైన పచ్చిక బయళ్లు నిర్మిస్తారు. మాడవీధుల వద్దా చిన్న పూలతోట ఏర్పాటు చేస్తారు.