breaking news
Minister for Health
-
హరీశ్ రావుకు వైద్యం అచ్చచ్చేనా ..?
-
త్వరలో 2 వేల పోస్టులు భర్తీ: లక్ష్మారెడ్డి
మెదక్ : తమ శాఖలో త్వరలో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో ప్రభుత్వాసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... గతంలో కంటే ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెరిగిందన్నారు. ఎంసీహెచ్ సెంటర్, ఐసీయూలో ఐదు వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలో రూ. కోటితో ఆసుపత్రికి కొత్త పరికరాలు అందిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు.