త్వరలో 2 వేల పోస్టులు భర్తీ: లక్ష్మారెడ్డి | Two thousand posts fill in medical and health department, says ch laxma reddy | Sakshi
Sakshi News home page

త్వరలో 2 వేల పోస్టులు భర్తీ: లక్ష్మారెడ్డి

Jul 6 2016 1:30 PM | Updated on Sep 4 2017 4:16 AM

తమ శాఖలో త్వరలో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి వెల్లడించారు.

మెదక్ : తమ శాఖలో త్వరలో రెండు వేల పోస్టులు భర్తీ చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సిహెచ్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. బుధవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలో ప్రభుత్వాసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... గతంలో కంటే ప్రజలకు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెరిగిందన్నారు. 

ఎంసీహెచ్ సెంటర్, ఐసీయూలో ఐదు వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలో రూ. కోటితో ఆసుపత్రికి కొత్త పరికరాలు అందిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement