breaking news
meels
-
రూ. 40 లకే భోజనం, ఎక్కడ? నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్ కేవలం తన పాటల ద్వారా మాత్రమే కాదు, తన గొప్పమనసుతో అందరి మనసులను దోచుకున్నాడు. సెలబ్రిటీలు అనేక వ్యాపారాలకు, ఎండార్స్మెంట్లతో కోట్లకు పడగలెత్తుతున్న తరుణంలో తన రెస్టారెంట్ ద్వారా ప్రజలకు పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం 40 రూపాయలకే కమ్మటి భోజనం అందిస్తున్నాడు. ఎక్కడ? ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? తెలుసుకుందామాపశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లోని తన స్వస్థలం జియాగంజ్‌లో హెషెల్ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించాడు అరిజిత్ సింగ్. కుటుంబ వ్యాపారంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశాడు. ఈ రెస్టారెంట్ చాలా తక్కువ ధరకు, కేవలం రూ. 40కి ఆరోగ్యకరమైన, నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాడు. తద్వారా మధురమైన గానంతోపాటు సామాజిక సేవతో మరోసారి ఎందరో హృదయాలను గెలుచుకున్నాడు.మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఈ హోటల్ కొత్తదేమీ కాదు. కుటుంబ వ్యాపారంలో భాగంగా గాయకుడు అరిజిత్ సింగ్ తండ్రి గురుదయాళ్ సింగ్ చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. అయితే సగటు మనిషికి, మరీ ముఖ్యంగా విద్యార్థులకు చాలా సరసమైన ధరలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అరిజిత్. అంతేకాదు గౌరవప్రదంగా వడ్డించడ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ఈ కొత్త ధరలను ప్రకటించినట్టు తెలుస్తోంది.మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం ఈ హోటల్‌ను గాయకుడు అరిజిత్ సింగ్ తండ్రి గురుదయాళ్ సింగ్ నిర్వహిస్తున్నారు.ఇది చాలా కాలంగా కొనసాగుతున్న కుటుంబ వ్యాపారంలో భాగం. అయితే సగటు మనిషికి, మరీ ముఖ్యంగా విద్యార్థులకు చాలా సరసమైన ధరలో, ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అరిజిత్. అంతేకాదు గౌరవప్రదంగా వడ్డించం కూడా అధిక ప్రాధాన్యత ఉంటుందట.భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుడు అరిజిత్ సింగ్ ఒకడు. అతని కచేరీకోసం ప్రేక్షకులు డిమాండ్ బాగా ఉంటుంది. ఒక్కో షోకు దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడట. ముంబైలో రూ. 8 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు అతని సొంతం. మొత్తంగా అరిజిత్ సింగ్ నెట్‌వర్త్ సుమారు 414 కోట్లు ఉంటుందని అంచనా.అయితే కోట్ల రూపాయలు ఆర్జించే గాయకుడు అరిజిత్ సింగ్ లాంటి వారికి ఛారిటబుల్ ఫుడ్ ఆర్గనైజేషన్‌ను నడపడం పెద్ద విషయం కానప్పటికీ, అభిమానులు ఇప్పటికీ ఈ వార్త నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఈ పూర్తి భోజనం విద్యార్థులకు మాత్రమేనని అందరికీ కాదని పేర్కొంటున్నారు. 'ఫర్ ఎ చేంజ్' అనే సంస్థ మరో పోస్ట్‌లో, ఈ రెస్టారెంట్ సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తుందని తెలిపింది. ఈ రెస్టారెంట్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తుందని, విద్యార్థులకు డిస్కౌంట్లను కూడా అందిస్తుందని, ఇది అరిజిత్ సమాజ సేవపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొపడం గమనార్హం.భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే పాపులర్ గాయకుల్లో ఒకరు అరిజిత్ సింగ్. అతని కచేరీలకున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఒక్కో షోకు దాదాపు 14 కోట్లు వసూలు చేస్తాడట. ముంబైలో రూ. 8 కోట్ల ఇల్లు, లగ్జరీ కార్లు అతని సొంతం. మొత్తంగా అరిజిత్ సింగ్ నెట్‌వర్త్ సుమారు 414 కోట్లు ఉంటుందని అంచనా. -
ఇలాంటి భోజనం ఎలా తినాలి?
– ఎస్వీయూలో విద్యార్థుల ఆందోళన యూనివర్సిటీ క్యాంపస్:నాణ్యత, శుచి శుభ్రత లేని భోజనం ఎలా తినాలని ఎస్వీయూ హాస్టల్ విద్యార్థులు ప్రశ్నించారు. ఎస్వీయూలోని బీ–మెస్‌లో భోజనం బాగాలేదని ఆరోపిస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళన నిర్వహించారు. ప్లేట్లు చేతిలో పెట్టుకుని బీ–మెస్ ఎదురుగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ మెస్‌లో భోజనం చాలా అధ్వాన్నంగా వుందన్నారు. నీళ ్లచెట్నీ, సాంబారుతో తినలేక పోతున్నామని విమర్శించారు. ఫీజులు మాత్రం అధిక మొత్తంలో వసూలుచేసుకుని నాణ్యతలేని భోజనం పెడుతున్నారని మండిపడ్డారు. భోజనం వడ్డించే సిబ్బంది కూడా తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. వైఎస్సార్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.ఓబుల్‌రెడ్డి, బీజేపీ ఎడ్యుకేషన్ సెల్ జిల్లా కన్వీనర్ విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘ నాయకులు మురళీధర్ విద్యార్థులకు మద్దతు తెలిపారు. నాణ్యమైన అందించాలని డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో రిజిస్ట్రార్ ఎం.దేవరాజులు విద్యార్థులతో చర్చించారు. రెండు రోజుల్లో నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.