breaking news
Mayo hospital
-
ఆత్మాహుతి దాడి : ఐదుగురు మృతి
-
ఆత్మాహుతి దాడి : ఐదుగురు మృతి
పాకిస్థాన్: లాహోర్ నగరంలోని పోలీసు కాంప్లెక్స్ వద్ద మంగళవారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదురుగు అక్కడికక్కడే మరణించగా... మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను నగరంలోని మెయో, గంగారామ్ ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. హోటల్ సమీపంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఘటన ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. మృతులు, క్షతగాత్రులను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని ఇంతవరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు.