breaking news
masks Factory
-
నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకున్నారు..
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నెటిజన్లకు టార్గెట్ అయ్యారు. అరిజోనాలో నూతనంగా ఏర్పాటైన మాస్క్ ఫ్యాక్టరీని ట్రంప్ సందర్శించిన సందర్భం ఇందుకు వేదికైంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న క్రమంలో ముఖానికి మాస్క్ లేకుండా ట్రంప్ మాస్క్ ఫ్యాక్టరీని సందర్శించడం వివాదాస్పదమైంది. ఈ పర్యటనలో అధ్యక్షుడు సేఫ్టీ గాగుల్స్ ధరించినా ఫేస్ మాస్క్‌ను విస్మరించారు. ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని అక్కడ సైన్ బోర్డు ఉండటం విశేషం. ఈ ప్లాంట్‌లో కార్మికులందరూ మాస్క్‌లు ధరించగా ట్రంప్ సహా ఇతర అతిధులు మాస్క్‌లు ధరించలేదు. దీంతో మాస్క్‌లను తయారు చేసే ఫ్యాక్టరీలోనే ట్రంప్ మాస్క్ లేకుండా తిరిగారని నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకున్నారు. మాస్క్‌లపై ఆయనకు నమ్మకం లేదా..? అందుకే మాస్క్ ఫ్యాక్టరీకి ముఖాన్ని కవర్ చేసుకోకుండా వెళ్లారా.? అంటూ ఓ ట్విటర్ యూజర్ ప్రశ్నించారు. కోవిడ్-19 దిగ్గజాలకు సోకదు..అందుకే మాస్క్ ఫ్యాక్టరీలో కేవలం కార్మికులే మాస్క్ ధరించారని మరో యూజర్ ట్రంప్‌ను ట్రోల్ చేశారు. చదవండి : ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యం ఎక్కడ!? -
తిడుతున్నా ట్రంప్‌కు చైనాలో భలే డిమాండ్
బీజింగ్: చైనా తమ దేశాన్ని రేప్ చేసిందంటూ.. తమ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ దేశ దూకుడుకు ఎలాగైనా తాను కళ్లెం వేస్తానని మాటలు పేలిన అమెరికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు చైనాలో మాత్రం మంచి డిమాండ్ పెరుగుతోంది. ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తప్పక సాధిస్తారని మాస్క్‌లు (ముసుగులు) తయారు చేసే ఓ చైనా కంపెనీ యజమాని బెట్టింగ్‌లు కాస్తున్నాడు. ట్రంప్ గెలిచే అవకాశాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకుంటానని చెబుతూ ఇప్పటికే ట్రంప్ ముఖంలాంటి ముసుగులు వందల్లో తయారు చేసి సిద్ధంగా ఉంచాడు. ఒక్క ట్రంప్ వే కాకుండా హిల్లరీ, సాండర్స్ మాస్క్‌లు కూడా తన మాస్క్‌ల ఫ్యాక్టరీలో ముందుచూపుతో తయారుచేయించాడు. చైనాలోని జిజియాంగ్ ప్రావిన్నస్‌లోగల లాటెక్స్ ఆర్ట్, క్రాఫ్ట్స్ ఫ్యాక్టరీకి ఒక ప్రముఖ మాస్క్‌ల తయారీ పరిశ్రమగా పేరుంది. ఇందులో ఒసామా బిన్ లాడెన్ నుంచి స్పైడర్ మేన్ వరకు రబ్బరుతో ముసుగులు తయారు చేస్తారు. ట్రంప్, హిల్లరీల ఒక్కో మాస్క్ ధర ఐదు డాలర్లుగా నిర్ణయించారు. ఒక్కో నేతకు దాదాపు అర మిలియన్ మాస్క్‌లు సిద్ధం చేస్తున్నారట. అయితే, ఈ పరిశ్రమ యజమాని మాత్రం ట్రంప్ కచ్చితంగా విజయం సాధిస్తాడని, ట్రంప్ ముసుగులు వీలయినన్ని ఎక్కువగా తయారుచేయాలని కార్మికులకు చెప్పినట్లు కూడా తెలుస్తోంది.