breaking news
malavya
-
సాయంత్రం వాజ్పేయికి భారత రత్న ప్రదానం
న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయికి నేడు భారతరత్న ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం సాయంత్రం అయిదు గంటలకు ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రణబ్ స్వయంగా వాజ్పేయి నివాసానికి వెళ్లి ఈ అవార్డును అందించనున్నారు. గత కొంతకాలంగా వాజ్పేయి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. దాంతో ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు. దాంతో రాష్ట్రపతే స్వయంగా వాజ్పేయి ఇంటికి వెళ్లి అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వనున్నారు. కాగా మదన్ మెహన్ మాలవ్యకు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. -
వాజ్పేయికి భారతరత్న ఇవ్వటం ఆ అవార్డుకే గౌరవం
న్యూఢిల్లీ : సుపరిపాలనకు మారుపేరు అయిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న ఇవ్వటం ఆ అవార్డుకే గౌరవమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు పండిత్ మదన్ మోహన్ మాలవ్యాకు కేంద్రం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. మాలవ్యాకు భారతరత్న ఇవ్వటం తమకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నామని వెంకయ్య నాయుడు అన్నారు. -
వాజ్పేయి, మాలవ్యాలకు భారత రత్న
-
వాజ్పేయి, మాలవ్యాలకు భారత రత్న
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు పండిత్ మదన్ మోహన్ మాలవ్యాకు అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' అవార్డును ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశంపై కేంద్ర కేబినెట్ బుధవారం ఉదయం ప్రధాని మోదీ నివాసంలో భేటీ అయ్యింది. చర్చల అనంతరం కేంద్ర మంత్రివర్గం వీరిద్దరికి భారతరత్న ఇచ్చేందుకు ఆమోదం తెలిసింది. అనంతరం రాష్ట్రపతి భవన్కు సిఫార్సులు పంపించింది. కేంద్ర ప్రభుత్వ సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు.