breaking news
Major Aditya Kumar
-
ఎఫ్ఐఆర్లో మేజర్ ఆదిత్య పేరు చేర్చలేదు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో జనవరి 27న జరిగిన షోపియాన్ కాల్పుల కేసులో మేజర్ ఆదిత్య కుమార్‌కు ఊరట లభించింది. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఆదిత్య పేరును నిందితునిగా చేర్చలేదని సుప్రీంకోర్టుకు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఏప్రిల్ 24 వరకు కేసులో తదుపరి దర్యాప్తు నిలిపేయాలని ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో జనవరి 27న భారత సైన్యంపై అల్లరి మూకలు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సైన్యం కాల్పులు జరపగా.. ముగ్గురు పౌరులు మృతిచెందారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దర్యాప్తునకు ఆదేశించగా.. 10 గర్వాల్ రైఫిల్‌కు చెందిన ఆర్మీ అధికారులపై సెక్షన్ 302, 307 కింద కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో తన కొడుకు పేరును ఏకపక్షంగా నమోదు చేశారని, ఆ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఆదిత్య తండ్రి లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) కరమ్‌వీర్ సింగ్ సుప్రీంను ఆశ్రయించారు. -
ఆర్మీ మేజర్‌కు సుప్రీంకోర్టులో ఊరట!
సాక్షి, న్యూఢిల్లీ/ శ్రీనగర్: షోపియన్ కాల్పుల ఘటన నేరగాళ్లకు సంబంధించిన కేసు కాదని, ఓ ఆర్మీ మేజర్ కేసుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతానికి మేజర్ ఆదిత్య కుమార్ కేసు దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తన కుమారుడిపై తప్పుడు కేసు నమోదు చేశారని, అతడు అమాయకుడని మేజర్ ఆదిత్యకుమార్ తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు కేసు దర్యాప్తును నిలిపివేయడంతో పాటు తదుపరి విచారణ ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ జనవరిలో షోపియన్‌లోని గనోవ్పోరా గ్రామంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆర్మీ వాహనాలపై రాళ్లు విసిరి, విధ్వంసం సృష్టించారు. దీంతో ఆర్మీ సిబ్బంది ఆ అల్లరి మూకపై కాల్పులు జరపగా.. ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై రాద్ధాంతం కాగా, స్పందించిన సీఎం మెహబూబా ముఫ్తీ ఆర్మీ కాల్పులపై విచారణకు ఆదేశించగా.. పోలీసులు మేజర్ ఆదిత్యకుమార్ సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. కాల్పులు జరిగిన సమయంలో మేజర్ ఆదిత్య అక్కడలేదని, అయినా కేసులు పెట్టారంటూ ఆయన తండ్రి సుప్రీంను ఆశ్రయించారు. కేసు విచారణ అనంతరం సీజేఐ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. ఇది క్రిమినల్ కేసు కాదని.. ఓ ఆర్మీ అధికారికి సంబంధించిన కేసు అని పేర్కొన్నారు. సైనికులపై విచారణ చేపట్టి అంత అనైతికంగా ప్రవర్తించే ప్రసక్తే లేదన్నారు. ఏప్రిల్ 24న ఈ పిటిషన్‌పై తీర్పు ఉంటుందని, అంతవరకూ మేజర్ ఆదిత్యకుమార్‌పై విచారణ చేపట్టవద్దని జమ్మూకశ్మీర్ ప్రభుత్వాన్ని సీజేఐ ఆదేశించారు. ఆదిత్యనే కాన్వాయ్కి హెడ్‌గా వ్యవహరించినట్లు గుర్తించినా.. మేజర్‌ను ఎఫ్ఐఆర్లో తాము నిందితుడిగా పేర్కొనలేదని కోర్టుకు ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.