breaking news
Macau open
-
తరుణ్ సంచలనం
మకావ్: అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న భారత షట్లర్, హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ 47వ ర్యాంకర్ తరుణ్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తరుణ్ 19–21, 21–14, 22–20తో ప్రపంచ 15వ ర్యాంకర్, టాప్ సీడ్ లీ చెక్ యు (హాంకాంగ్)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 60 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తరుణ్ తొలి గేమ్‌లో ఒకదశలో 7–1తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ అదే జోరును కొనసాగించలేకపోయాడు. తొలి గేమ్ చేజార్చుకున్నప్పటికీ ఆందోళనకు గురి కాకుండా సంయమనంతో ఆడిన తరుణ్ రెండో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. హోరాహోరీగా సాగిన నిర్ణాయక మూడో గేమ్‌లు పలుమార్లు స్కోర్లు సమమయ్యాయి. ఒకదశలో 17–14తో ముందంజ వేసిన తరుణ్ ఆ తర్వాత తడబడి స్కోరును 20–20తో సమం చేసుకున్నాడు. అయితే వెంటనే వరుసగా రెండు పాయింట్లు నెగ్గిన తరుణ్ చిరస్మరణీయ విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. భారత్‌కే చెందిన లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ చేరగా... ఆయుశ్ శెట్టి నిష్క్రమించాడు. లక్ష్య సేన్ 21–14, 14–21, 21–17తో చికో వర్దోయో (ఇండోనేసియా)పై నెగ్గగా... ఆయుశ్ 18–21, 16–21తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రక్షిత శ్రీ (భారత్) 21–14, 10–21, 11–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–19, 13–21, 18–21తో జిమ్మీ వోంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) జంట క్వార్టర్ ఫైనల్ చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ 10–21, 22–20, 21–16తో కకేరు కుమగాయ్–హిరోకి నిషి (జపాన్)లపై గెలిచింది. 61 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జోడీ రెండో గేమ్‌లో 19–20తో ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే పట్టుదలతో పోరాడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గిన భారత ద్వయం రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసిన సాత్విక్–చిరాగ్ చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకుంది. -
తరుణ్ ముందుకు...
మకావు: మకావు ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి, పారిస్ ఒలింపియన్ లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... హెచ్ఎస్ ప్రణయ్, మన్రాజ్ సింగ్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్, కిరణ్ జార్జి, సతీశ్ కుమార్ కరుణాకరన్, రిత్విక్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తరుణ్ 21–19, 21–13తో సహచరుడు మన్రాజ్ సింగ్‌పై, లక్ష్య సేన్ 21–8, 21–14తో జియోన్ హైయోక్ జిన్ (దక్షిణ కొరియా)పై, ఆయుశ్ 21–10, 21–11తో హువాంగ్ యు కాయ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించారు. ప్రపంచ 33వ ర్యాంకర్ ప్రణయ్ 21–18, 15–21, 16–21తో ప్రపంచ 75వ ర్యాంకర్ యోహానెస్ మార్సెలినో (ఇండోనేసియా) చేతిలో... శంకర్ 18–21, 14–21తో హు జె ఆన్ (చైనా) చేతిలో... కిరణ్ జార్జి 15–21, 10–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... సతీశ్ కుమార్ 19–21, 12–21తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో, రిత్విక్ 16–21, 8–21తో చికో వర్దాయో (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. రక్షిత శ్రీ సంచలనం మహిళల సింగిల్స్‌లో ఆరుగురు భారత క్రీడాకారిణులు బరిలోకి దిగగా... రక్షిత శ్రీ మినహా మిగతా ఐదుగురు తొలి రౌండ్లోనే వెనుదిరిగారు. తొలి రౌండ్లో రక్షిత శ్రీ 63 నిమిషాల్లో 18–21, 21–17, 22–20తో ప్రపంచ 35వ ర్యాంకర్ పోర్న్‌పిచా చోయికివోంగ్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఉన్నతి హుడా 21–16, 19–21, 17–21తో జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో, తస్నీమ్ మీర్ 6–21, 14–21తో టాప్ సీడ్ చెన్ యు ఫె (చైనా) చేతిలో, ఆకర్షి కశ్యప్ 14–21, 16–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో, అనుపమ 16–21, 10–21తో రికో గుంజి (జపాన్) చేతిలో, అన్మోల్ 21–23, 11–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు. రుత్విక జోడీకి నిరాశ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీకి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ ద్వయం 20–22, 17–21 తో వు గువాన్ జున్–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్లో తనీషా–ధ్రువ్ ద్వయం 21–10, 21–15తో రచాపోల్–నత్తమోన్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గింది.ఇతర మ్యాచ్‌ల్లో హేమనాగేంద్ర బాబు–ప్రియ (భారత్) 11–21, 14– 21తో ఫువానత్–ఫుంగ్ఫా (థాయ్‌లాండ్) చేతిలో ... సతీశ్–ఆద్య (భారత్) 18–21, 21– 23 తో అమ్రీ–నితా (ఇండోనేసియా) చేతి లో... ఆయుశ్ –శ్రుతి (భారత్) 10–21, 11– 21 తో రెహాన్–గ్లోరియా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు. -
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం
మకావు: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మకావు ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–13, 21–15తో లో హాంగ్ యీ–ఎన్జీ ఇంగ్ చెయోంగ్ (మలేసియా) జంటపై గెలిచి శుభారంభం చేసింది. 36 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీకి ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. మహిళల డబుల్స్‌లో ప్రియ–శ్రుతి మిశ్రా (భారత్) జోడీ కూడా ముందంజ వేసింది. తొలి రౌండ్లో ప్రియ–శ్రుతి 21–15, 16–21, 21–17తో జి లింగ్ హువాంగ్–వాంగ్ జు మిన్ (చైనీస్ తైపీ)లపై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్స్ అన్మోల్, తస్నీమ్ మీర్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో అన్మోల్ 21–11, 21–13తో ఫాతిమా (అజర్బైజాన్)పై, తస్నీమ్ 21–14, 13–21, 21–17తో టిడాప్రోన్ క్లీబైసన్ (థాయ్‌లాండ్)పై గెలుపొందారు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో టాప్ సీడ్ చెన్ యు ఫె (చైనా)తో తస్నీమ్; రెండో సీడ్ బుసానన్ (థాయ్‌లాండ్)తో అన్మోల్ తలపడతారు. టాప్ సీడ్ గాయత్రి జంటకు షాక్ మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) ద్వయం అనూహ్యంగా తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. లిన్ జియో మిన్–పెంగ్ యు వె (చైనీస్ తైపీ) జోడీతో జరిగిన మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా జంట 21–16, 20–22, 15–21తో ఓడిపోయింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో అపూర్వ–సాక్షి (భారత్) 8–21, 11–21తో తియో మె జింగ్–గో పె కి (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో హరిహరన్–రూబన్ (భారత్) 21–15, 19–21, 14–21 తో టోరి ఐజవా–దైసుకె సానో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. డింకూ సింగ్–అమాన్ (భారత్) జోడీ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 21–18, 21–17తో లా చెయుక్ హిమ్–యెంగ్ షింగ్ చోయ్ (హాంకాంగ్) జంటపై నెగ్గి మెయిన్ ‘డ్రా’కు చేరుకుంది. మెయిన్ ‘డ్రా’కు హేమనాగేంద్ర జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తాండ్రంగి హేమనాగేంద్ర బాబు–ప్రియ (భారత్) జోడీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హేమనాగేంద్ర బాబు–ప్రియ జోడీ 21–17, 21–19తో జి వె హి–యాన్ ఫె చెన్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది.మళ్లీ టాప్–10లోకి సాత్విక్–చిరాగ్ జోడీన్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మళ్లీ టాప్–10లోకి దూసుకొచ్చింది. గతవారం చైనా ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరడం ద్వారా సాత్విక్ జంట మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 10వ ర్యాంక్‌కు చేరింది. గతేడాది థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన అనంతరం ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ దక్కించుకున్న భారత ద్వయం... ఈ సీజన్లో మూడు టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరింది. చైనా ఓపెన్ కంటే ముందు సింగపూర్ ఓపెన్, ఇండియా ఓపెన్లలో సైతం ఈ జోడీ సెమీస్ ఆడింది. పురుషుల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి షట్లర్ లక్ష్యసేన్ రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 17వ ర్యాంక్‌కు చేరాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ఇటీవల పీవీ సింధుపై నెగ్గిన 17 ఏళ్ల ఉన్నతి హుడా కెరీర్ బెస్ట్ 31వ ర్యాంక్ దక్కించుకుంది. ఈ విభాగంలో భారత్ నుంచి అత్యుత్తమంగా సింధు 15వ స్థానంలో ఉంది. టాప్–100లో భారత్ నుంచి 16 మంది ఉండటం విశేషం. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రిæ–ట్రెసా జాలీ జంట 11వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. -
సెమీస్‌లో గాయత్రి–ట్రెసా జోడీ
మకావ్: వరుసగా ఐదు టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఆ అడ్డంకిని ఆరో ప్రయత్నంలో అధిగమించింది. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో మూడో సీడ్ గాయత్రి–ట్రెసా జాలీ జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 21–12, 21–17తో ఆరో సీడ్ సు యిన్ హుయ్–లోన్ జి యున్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది. గత జూన్‌లో సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో సెమీఫైనల్ చేరిన తర్వాత గాయత్రి–ట్రెసా ఐదు టోర్నీలు ఆడారు. అయితే ఈ ఐదు టోర్నీల్లో వారు క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 16–21, 12–21తో ఓడిపోయాడు. నేడు జరిగే మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సెయి పె షాన్–హుంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. గతవారం చైనా ఓపెన్ టోర్నీ తొలి రౌండ్లోనే సెయి పె షాన్–హుంగ్ ఎన్ జు చేతిలో ఓడిన గాయత్రి–ట్రెసా ఈసారి గెలిచి బదులు తీర్చుకుంటారో లేదో వేచి చూడాలి. -
క్వార్టర్స్‌లో శ్రీకాంత్
మకావ్: భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 38వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–13, 21–18తో భారత్‌కే చెందిన ప్రపంచ 57వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టిపై గెలుపొందాడు. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు కొంత ప్రతిఘటన ఎదురైనా కీలకదశలో పాయింట్లు సాధించి వరుస గేముల్లో విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్‌లో స్కోరు 12–10 వద్ద శ్రీకాంత్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి 16–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో గేమ్‌ను దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో తేరుకున్న ఆయుశ్ ఒకదశలో 14–10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి అంతరాన్ని తగ్గించాడు. ఆ తర్వాత ఆయుశ్ ఒక పాయింట్ నెగ్గగా... ఆ వెంటనే శ్రీకాంత్ చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు సాధించి 19–16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో ఆయుశ్ రెండు పాయింట్లు సాధించినా, మరోవైపు శ్రీకాంత్ మూడు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ తస్నిమ్ మీర్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ప్రపంచ 18వ ర్యాంకర్ తొమోకా మియజాకి (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 67వ ర్యాంకర్ తస్నిమ్ 17–21, 21–13, 10–21తో పరాజయం పాలైంది. గాయత్రి–ట్రెసా జోడీ విజయం మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ద్వయం 22–20, 21–11తో లిన్ చి చున్–టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) ద్వయంపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట 17–21, 14–21తో వోంగ్ టియెన్ సి–లిమ్ చియెవ్ సియెన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
శ్రీకాంత్ శుభారంభం
మకావ్: నాలుగు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–14, 21–15తో డానిల్ దు»ొవెంకో (ఇజ్రాయెల్)పై నెగ్గాడు. 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండు గేముల్లోనూ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆయుశ్ శెట్టి 21–13, 21–5తో సహచరుడు ఆలాప్ మిశ్రాను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో శంకర్ ముత్తుస్వామి (భారత్) 14–21, 21–10, 12–21తో పనిట్‌చాపోన్ (థాయ్‌లాండ్) చేతిలో, చిరాగ్ సేన్ (భారత్) 12–21, 17–21తో లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో, మిథున్ (భారత్) 12–21, 15–21తో హువాంగ్ యు కాయ్ (చైనీస్ తైపీ) చేతిలో, సమీర్ వర్మ (భారత్) 21–18, 11–21, 13–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ 24–22, 10–21, 21–13తో లూ బింగ్ కున్–హో లో ఈ (మలేసియా) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 21–23, 22–24తో రుతానాపక్–జిహెనిచా (థాయ్‌లాండ్) జంట చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–రుతి్వక జోడీ 17–21, 19–21తో నికోల్ చాన్–యాంగ్ చు యున్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
గాయత్రి–ట్రెసా జోడీ శుభారంభం
మకావ్: మకావ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో మూడో సీడ్ గాయత్రి–ట్రెసా ద్వయం 15–21, 21–16, 21–14తో అకారి సాటో–మాయా టగూచి (జపాన్) జోడీపై గెలిచింది. గద్దె రుత్విక శివాని–సిక్కి రెడ్డి ద్వయం మహిళల డబుల్స్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. క్వాలిఫయింగ్ ఫైనల్ మ్యాచ్‌లో రుతి్వక–సిక్కి జంట 21–15, 21–10తో చెయుంగ్ యాన్ యు–చు వింగ్ చి (హాంకాంగ్) ద్వయంపై నెగ్గింది. పురుషుల సింగిల్స్ లో భారత ప్లేయర్ ఆలాప్ మిశ్రా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ ఫైనల్ మ్యాచ్‌లో ఆలాప్ 21–10, 24–22తో భారత్‌కే చెందిన ఆర్యమాన్ టాండన్‌ను ఓడించాడు. పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి శ్రీకాంత్, మిథున్, సమీర్ వర్మ, ఆయూశ్, శంకర్ ముత్తుస్వామి, చిరాగ్ సేన్ పోటీపడనున్నారు. మహిళల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో అనుపమ, తాన్యా హేమంత్, తస్నిమ్ మీర్, దేవిక సిహాగ్, ఇషారాణి బారువా బరిలో ఉన్నారు. -
సైనా నెహ్వాల్ మరోసారీ..
న్యూఢిల్లీ: ఫామ్‌లేమితో సతమతమవుతున్న భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మకావు ఓపెన్ మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో సైనా ఓటమి చవిచూసింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా 21-12, 21-17 స్కోరుతో ఝంగ్ యిమన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. ఇటీవల జరిగిన హాంకాంగ్ ఓపెన్‌లో కూడా సైనా క్వార్టర్స్‌లోనే పోరాటం ముగించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితాలో సైనా టాప్-10లో చోటు కోల్పోయి 11వ ర్యాంకుకు పడిపోయిన సంగతి తెలిసిందే. గత ఎనిమిదేళ్లలో సైనా టాప్-10లో స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి. -
రెండో రౌండ్ లో కశ్యప్ ఓటమి
మకావు: మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ నిష్ర్కమించాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ పోరులో కశ్యప్13-21, 20-22 తేడాతో లిన్ యు సెన్(చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌ను ఎటువంటి ప్రతిఘటన లేకుండా కోల్పోయిన కశ్యప్ ... రెండో గేమ్‌లో పోరాడి ఓడాడు. ఇదిలా ఉండగా, మహిళల సింగిల్స్ పోరులో సైనా నెహ్వాల్ క్వార్టర్స్ కు చేరింది. ప్రి క్వార్టర్ ఫైనల్లో సైనా 17-21, 21-18, 21-12 తేడాతో దినార్(ఇండోనేషియా)పై గెలిచింది. కాగా, పురుషుల డబుల్స్ విభాగంగా మను అత్రి-సుమీత్ రెడ్డి జోడి 20-22, 19-21 తేడాతో డానీ బావా క్రిస్నాంతా-హెంద్రా విజయా(సింగపూర్) జంట చేతిలో పరాజయం చెందింది. -
క్వార్టర్స్‌లో సైనా
మకావు: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాలో్ మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో సైనా 17-21, 21-18, 21-12 తేడాతో దినార్ ద్యా అయుస్టెన్ (ఇండోనేషియా)పై గెలిచి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా.. ఆ తరువాత తిరిగి పుంజుకుంది. వరుస రెండు సెట్లలో గెలిచి టోర్నీలో నిలబడింది. తొలి గేమ్‌లో దినార్ 3-1 ఆధిక్యంలోకి వెళ్లిన దశలో సైనా 5-5తో స్కోరు సమం చేసింది. ఆ క్రమంలోనే 10-7 తేడాతో మరింత పైచేయి సాధించింది. కాగా, ఆ దశలో దినార్ నుంచి సైనాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వరుసగా పాయింట్ల సాధించిన దినార్ 16-14, 19-15తో ముందుకు దూసుకుపోయింది. ఇక ఆ తరువాత సైనా రెండు పాయింట్లు సాధించినా తొలి గేమ్‌ను రక్షించుకోలేకపోయింది. ఇక రెండో గేమ్‌లో సైనా 3-0,8-3, 11-3, 18-12 తేడాతో ఆధిక్యం సాధించి ఆ గేమ్‌ను దక్కించుకుంది. ఆపై నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సైనా 3-2, 6-5,15-9 తేడాతో ముందంజ వేసింది. అదే దూకుడును చివరివరకూ కొనసాగించి గేమ్‌ను సాధించి క్వార్టర్స్‌కు చేరింది. -
సింధు దూరం: సైనా సారథ్యం
మకావు: గతేడాది మకావు ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను సాధించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఒకే టోర్నమెంట్‌ను వరుసగా మూడుసార్లు గెలిచిన తొలి భారతీయ ప్లేయర్‌గా నిలిచిన స్టార్ షట్లర్ పివి సింధు.. ఈ ఏడాది ఆ టోర్నీ నుంచి వైదొలిగింది. ఇటీవల చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను గెలవడమే కాకుండా, హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు..డిఫెండింగ్ చాంపియన్‌గా మకావు ఓపెన్‌లో ఆడాల్సి వుంది. కాగా, చివరి నిమిషంలో మకావు ఓపెన్ నుంచి తప్పుకుంది. వచ్చే నెల్లో దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీకి సరికొత్త ప్రణాళికలతో సిద్ధమయ్యే క్రమంలోనే సింధు మకావు నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని సింధు తండ్రి పివి రమణ స్పష్టం చేశారు.' ముందస్తు ప్రణాళిక ప్రకారం మకావు గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు పాల్గొనాల్సి వుంది. కానీ దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు సింధు అర్హత సాధించిన తరువాత ప్రణాళికను మార్చుకున్నాం. మకావు నుంచి తప్పుకుని దుబాయ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కు సన్నద్ధం కావాలనే క్రమంలోనే సింధు తప్పుకుంది'అని వెంకట రమణ వివరణ ఇచ్చారు. మకావు ఓపెన్‌లో సింధు తన తొలి మ్యాచ్‌ను బుధవారం చైనా క్రీడాకారిణి యు హెన్తో ఆడాల్సి వుంది.కాగా, ఆఖరి నిమిషంలో సింధు వైదొలగడంతో యు హెన్ బై ద్వారా రెండో రౌండ్లో అడుగుపెట్టనుంది.ఇదిలా ఉండగా, మకావు నుంచి సింధు వైదొలగడంతో మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ భారత్‌కు సారథ్యం వహించనుంది. 2014, 15, 16ల్లో మకావు ఓపెన్‌లో సింధు విజేతగా నిలిచింది. -
'హ్యాట్రిక్'తో సింధు సంచలనం
-
పి.వి. సింధుదే మకావు టైటిల్
మకావు:మకావు ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టైటిల్ ను హైదరాబాద్ అమ్మాయి పి.వి.సింధు మరోసారి కైవశం చేసుకుంది. మహిళల సింగిల్స్ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-12, 21-17 తేడాతో దక్షిణ కొరియా క్రీడాకారిణి కిమ్ హో మిన్ ను మట్టికరిపించి టైటిల్ ను ఎగురవేసుకుపోయింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన సింధు మకావులో తనకు తిరుగులేదని నిరూపించుకుంది. టైటిల్ వేటలో వరుస రెండు సెట్లలో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించిన సింధు.. ప్రపంచ 91 ర్యాంక్ క్రీడాకారిణి కిమ్ కు చుక్కలు చూపించింది. తొలి సెట్ ను సునాయాసంగా చేజార్చుకున్న కిమ్ .. రెండో సెట్ లో మాత్రం పోరాడింది. అయితే సింధు తనదైన శైలిలో విజృంభించి రెండో గేమ్ ను స్వల్ప తేడాతో గెలుచుకుని టైటిల్ ను చేజిక్కించుకుంది. అంతకుముందు శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు 21-14, 21-15 తేడాతో ఎనిమిదో సీడ్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌పాన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. -
మకాయ్ ఓపెన్ సెమీస్ లో పివి సింధు
మకాయ్: డిఫెండింగ్ చాంపియన్ పి.వి.సింధు మకాయ్ ఓపెన్ టోర్నీలో సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ లో భాగంగా శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లోచైనా క్రీడాకారిణి హాన్ లీ పై సింధు విజయం సాధించింది. ప్రపంచ 11 ర్యాంకర్ సింధు 21-17, 19-21, 21-16 తేడాతో ఐదో సీడ్ క్రీడాకారిణి అయిన హాన్ లీని బొల్తా కొట్టించింది. తొలి గేమ్ ను అవలీలగా గెలుచుకున్న సింధు తదుపరి సెట్ ను కోల్పోయింది. అయితే మూడో సెట్ లో దూకుడుగా ఆడి జయకేతనం ఎగురవేసింది. ఇదిలా ఉండగా కెనడా క్రీడాకారిణి మిచెల్లీ లీ, థాయ్ లాండ్ క్రీడాకారిణి బుసానన్ ల మధ్య తదుపరి క్వార్టర్స్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో విజేతతో సింధు సెమీ ఫైనల్లో తలపడనుంది. -
మకావులో మెరిసిన సింధు
-
మకావులో మెరిసిన సింధు
తెలుగుతేజం పీవీ సింధు మకావు ఓపెన్‌లో మెరిసింది. భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం సింధు మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాదీ విజయకేతనం ఎగురవేసి తన కెరీర్లో రెండో గ్రాండ్ ప్రీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సింధు 21-15, 21-12తో మిచెల్లీ లీ (కెనడా)ని చిత్తుచేసింది. హైదరాబాదీ 37 నిమిషాల్లో వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను వశం చేసుకుంది. మ్యాచ్ ఆద్యంతం ఆధిక్యం ప్రదర్శిస్తూ ఏకపక్షంగా ముగించింది. ఈ సీజన్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న సింధు గత మేలో జరిగిన మలేసియా ఓపెన్ టైటిల్ నెగ్గింది. ఈ ఏడాది సింధును అర్జున అవార్డు వరించింది.