మకావులో మెరిసిన సింధు | PV Sindhu shines bright in Macau, lifts 2nd Grand Prix Gold title | Sakshi
Sakshi News home page

మకావులో మెరిసిన సింధు

Dec 1 2013 2:40 PM | Updated on Sep 2 2017 1:10 AM

మకావులో మెరిసిన సింధు

మకావులో మెరిసిన సింధు

తెలుగుతేజం పీవీ సింధు మకావు ఓపెన్లో మెరిసింది.

తెలుగుతేజం పీవీ సింధు మకావు ఓపెన్లో మెరిసింది. భారత బ్యాడ్మింటన్ యువ సంచలనం సింధు మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాదీ విజయకేతనం ఎగురవేసి తన కెరీర్లో రెండో గ్రాండ్ ప్రీ టైటిల్ను కైవసం చేసుకుంది.

ఫైనల్లో సింధు 21-15, 21-12తో మిచెల్లీ లీ (కెనడా)ని చిత్తుచేసింది. హైదరాబాదీ 37 నిమిషాల్లో వరుస గేమ్ల్లో మ్యాచ్ను వశం చేసుకుంది. మ్యాచ్ ఆద్యంతం ఆధిక్యం ప్రదర్శిస్తూ ఏకపక్షంగా ముగించింది. ఈ సీజన్లో అత్యుత్తమ ఫామ్లో ఉన్న సింధు గత మేలో జరిగిన మలేసియా ఓపెన్ టైటిల్ నెగ్గింది. ఈ ఏడాది సింధును అర్జున అవార్డు వరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement