breaking news
luxurious flats
-
ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. కోట్లు పెట్టి కొన్న సినీతారలు వీళ్లే..!
బుర్జ్ ఖలీఫా.. ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరు. దుబాయ్‌లోని ఆకాశసౌధం ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా గుర్తింపు పొందింది. దుబాయ్ ట్రిప్ వెళ్లినవారు అక్కడ తప్పకుండా ఫోటోలు తీసుకోకుండా ఉండలేరు. అంతలా పర్యాటకంగా బుర్జ్ ఖలీఫా ఫేమస్ అయింది. అయితే ఇది కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే అనుకుంటే పొరపాటే. అంత ఎత్తైన శిఖరంలా కనిపించే ఈ ఆకాశం సౌధంలో నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అత్యంత విలాసవంతమైన నివాసాలకు నిలయంగా మార్చారు. ఈ లగ్జరీ లైఫ్ స్టైల్‌కు చిరునామాగా మారిన ఈ బుర్జ్ ఖలీఫాలో అపార్ట్మెంట్ కొనాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే.ఈ ప్రపంచంలోనే ఎత్తైన ఈ భవనంలో నివసించాలని ఎవరు కోరుకోరు. ఎన్ని కోట్లైనా సరే పెట్టేందుకు బడా వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు క్యూ కడతారు. అలా ఈ ఆకాశ సౌధంలో మన సినీతారలు సైతం అపార్ట్మెంట్స్ కొనేశారు. ఇందులో బాలీవుడ్ భామ శిల్పాశెట్టితో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఖరీదైన ఫ్లాట్లను తమ సొంతం చేసుకున్నారు. ఆ వివరాలేంటో చూసేద్దాం.బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి ఈ ఫ్లాట్ బహుమతిగా లభించింది. ఆమె భర్త, నటుడు రాజ్ కుంద్రా వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా బుర్జ్ ఖలీఫాలో లగ్జరీ ఫ్లాట్‌ను తన సతీమణికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆమె విలాసవంతమైన నివాసం 19వ అంతస్తులో ఉంది. దీని విలువ దాదాపు రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.మోహన్ లాల్ స్వర్గధామం..మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం బుర్జ్ ఖలీఫాలో అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఆయన 29వ అంతస్తులో లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నారు. దాదాపు 940 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఆధునాతన సౌకర్యాలు ఉన్నాయి. దీని విలువ దాదాపు రూ. 3.5 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఈ ఫ్లాట్‌ను మోహన్ లాల్ తన భార్య సుచిత్ర మోహన్‌లాల్ పేరు మీద రిజిస్టర్ చేశారు. వీరితో పాటు కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ వి నీరియపరంబిల్కు ఈ భవనంలో దాదాపు 22 ఫ్లాట్స్ కొనుగోలు చేశారట. అందువల్లే ఆయనను బుర్జ్ ఖలీఫా రాజు అని ముద్దుగా పిలుస్తారట. -
ఇళ్లు కొనేందుకు ఎగబడ్డారు.. ఒక్కోటి రూ.7 కోట్లు!
ఇళ్లు ఉచితంగా ఇస్తే జనం ఎగబడటం చూశాం. కానీ ఒక్కో ఇల్లు రూ.7 కోట్లు పెట్టి మరీ కొనేందుకు ఎగబడ్డారు. ఎంతలా అంటే మూడు రోజుల్లో ఏకంగా 1,137 ఇళ్లు అమ్మడుపోయాయి. దీనికి సంబంధించి ఇళ్లు కొనేందుకు వచ్చిన జనం అంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ ఆర్బర్ పేరుతో గురుగ్రామ్‌లో ఓ కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. ఈ లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్లను అమ్మకానికి ప్రకటించగా కంపెనీ కార్యాలయానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారంటూ జనం కిక్కిరిసి ఉన్న ఓ ఫొటోను వీకెండ్ఇన్వెస్టింగ్ అనే సంస్థ అధినేత అలోక్ జైన్ ట్విటర్లో షేర్ చేశారు. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!) Just checked with a DLF broker...says entire project of 1137 flats at 7 cr a piece has been sold out in 3 days 🤐 Mind gone numb 😲 https://t.co/UpvNnsH0H3 — Alok Jain ⚡ (@WeekendInvestng) February 21, 2023 డీఎల్ఎఫ్ కొత్త ప్రాజెక్ట్‌లో ఒక్కో ఫ్లాట్ ధర రూ.7 కోట్లని, మొత్తం 1,137 ఫ్లాట్లు మూడు రోజుల్లోనే అమ్ముడుపోయాయని తనకు డీఎల్ఎఫ్ బ్రోకర్ ఒకరు తెలియజేసినట్లు అలోక్ జైన్ పేర్కొన్నారు. దీనికి పలువురు ట్విటర్ యూజర్లు పలు విధాలుగా స్పందించారు. ఇది ఇన్వెస్టర్లు, బ్రోకర్ల మాయాజాలం అని, అన్నీ వాళ్లే కొనుక్కొని ఉంటారని కామెంట్లు పెట్టారు. అయితే దీన్ని డీఎల్ఎఫ్ సంస్థ ధ్రువీకరించాల్సి ఉంది. (ఇదీ చదవండి: UIDAI Factcheck: ఆధార్ జిరాక్స్‌లు ఇవ్వకూడదా?) -
ఐదేళ్లలో 5 లగ్జరీ ఇళ్లు కొన్న రష్మిక? నెట్టింట ట్వీట్ వైరల్
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న రష్మికకు సంబంధించి తాజాగా మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. కెరీర్ ప్రారంభించిన 5ఏళ్లలోనే రష్మిక ఐదు ప్రదేశాల్లో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసిందట. తన సంపాదనలో ఎక్కువ శాతం ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేస్తోందని, ఇందులో భాగంగానే హైదరాబాద్, కూర్గ్, బెంగుళూరు, గోవా, ముంబై నగరాల్లో రష్మికకు ఖరీదైన అపార్ట్మెంట్స్ ఉన్నాయంటూ ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ రూమర్స్‌పై స్వయంగా రష్మిక స్పందించింది. 'ఇదంతా నిజమైతే బాగుండు' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఇవన్నీ అవాస్తవాలే అని క్లారిటీ ఇచ్చినట్లయ్యింది. కాగా ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. 'పుష్ప' హిట్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం రణ్‌బీర్‌తో ‘యానిమల్’ సినిమాలో నటిస్తుంది. #Rashmika owns 5 luxurious apartments in 5 places🤨#RashmikaMandanna 🔥 pic.twitter.com/9zHBwvPU37 — Nerdy News (@NerdyNews07) February 10, 2023 -
తొమ్మిది రోజుల్లో రూ.500 కోట్ల బుకింగ్స్
ముంబై: ప్రముఖ రియాల్టీ సంస్థ లోదా గ్రూపు తొమ్మిది రోజుల్లో రూ.500 కోట్లు విలువచేసే ఫ్లాట్లు అమ్మింది. దక్షిణ మధ్య ముంబైలో 'వరల్డ్ వన్ టవర్' పేరుతో 117 అంతస్థుల భవంతిని ఈ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో నిర్మిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్లు అమ్మేందుకు మూడేళ్ల తర్వాత నవంబర్ 29 బుకింగ్స్ ప్రారంభించారు. దీనికి అనూహ్యమైన స్పందన వచ్చిందని లోదా గ్రూపు మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ లోధా తెలిపారు. పోటీ వాతావరణంలోనూ రికార్డు స్థాయిలో బుకింగ్స్ వచ్చాయని చెప్పారు. వరల్డ్ వన్ టవర్ నిర్మాణంలో 75 శాతం సివిల్ నిర్మాణం పూర్తైందన్నారు. 2010లో ప్రారంభమైన ఈ టవర్ నిర్మాణం 2016లో పూర్తవుతుందని భావిస్తున్నారు.