Long-term investments
-
సిప్ ఓకే... తప్పు చేయొద్దు!
స్టాక్ మార్కెట్లలో ఇది అత్యంత ఆకర్షణీయంగా కనిపించే పదం. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను (సిప్‌ను) ప్రోత్సహించే కంపెనీలు కావొచ్చు... ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు... ఇన్వెస్ట్మెంట్ గురువులు కావొచ్చు. అందరూ దీన్నో తారకమంత్రం మాదిరి జపిస్తుంటారు. నిజానికి ఇన్వెస్టర్లకు కూడా ఇదో హుక్ లాంటిది. కోటి రూపాయలనే టార్గెట్‌గా పెట్టుకుని, 10వేలతో సిప్ ప్రారంభించినవారు చాలామంది ఉన్నారు. కాకపోతే వారంతా నిజంగా కోటి రూపాయలు సంపాదించారా? లేక నష్టాలొచ్చాయని మధ్యలోనే వదిలేసారా? ఒకవేళ కోటి రూపాయలు సంపాదిస్తే ఎంతకాలానికి సంపాదించి ఉంటారు? ఎంత క్రమశిక్షణ పాటించి ఉంటారు? ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలే. ఎందుకంటే సిప్‌కు కావాల్సినవి ఇవే. సిప్ అంటే అదేదో మంత్రదండం కాదు. అక్షయపాత్ర కూడా కాదు. క్రమశిక్షణతో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయటం ద్వారా సంపద సృష్టించే ఒక సాధనం మాత్రమే. ఆ రిసు్కల్ని తెలియజేసేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...రాబడికి గ్యారంటీ ఉండదు...చాలా మంది నిర్ణిత కాలంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. దీనివెనుక అంచనాల్లో పొరపాట్లే ప్రధానంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా రాబడి విషయంలోనే ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తుంటారు. → ఈక్విటీల్లో పెట్టుబడిపై ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడి వస్తుందని అనుకుంటుంటారు. → ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయని భావిస్తుంటారు. → ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి.. సిప్‌తో రిస్క్ ఉండదని అనుకుంటుంటారు. → కానీ ఇవేవీ నిజం కావు. వాస్తవాలను తెలుసుకోవాలి... → ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా రికరింగ్ డిపాజిట్ల మాదిరి ఈక్విటీల్లో రాబడులు స్థిరంగా ఉండవు. → ఈక్విటీ రాబడులు అన్నవి మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయన్న డిస్క్లోజర్ను తప్పనిసరిగా మనసులో ఉంచుకోవాలి. → మార్కెట్ ర్యాలీల్లో 15 శాతమే కాదు. 18– 25– 35 శాతం వార్షిక రాబడులు వచి్చన సందర్భాలు కూడా ఉన్నాయి. → కానీ ఆటుపోట్ల తరుణంలో రాబడులు 10–12 శాతం మించకపోవచ్చు. → మరీ ముఖ్యంగా ప్రతికూల సమయాల్లో సగటు వార్షిక రాబడి 7–9 శాతం మించకపోవచ్చు. ఒకోసారి అంతకన్నా తక్కువకూడా రావచ్చు. → ఇక సిప్ తొలినాళ్లలో అయితే (మూడేళ్లలోపు) మార్కెట్ దిద్దుబాట్లు ఎదురైతే.. రాబడి కాదు, నష్టాలకూ స్వాగతం పలకాల్సి వస్తుంది. → పైన కొటేషన్లో చెప్పుకున్నట్టు ప్రతి నెలా రూ.10,000తో 20 ఏళ్లలో కోటికి అధిపతి కావాలంటే వార్షిక రాబడి 12.7 శాతం తక్కువ కాకుండా ఉండాలి. ఉదాహరణలు.. → 2020 మార్చిలో కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు 40% నష్టపోవడం తెలిసిందే. → 2024 నుంచి ఇప్పటి వరకు మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే పెరుగుతూ, తగ్గుతూ, స్థిరీకరణకు గురవుతున్నాయి. → కానీ వైరస్‌పై కొంత స్పష్టత రావడంతో మార్కెట్లు వెంటనే రివర్స్‌గేర్ తీసుకున్నాయి. 2023 వరకు ర్యాలీ చేశాయి. ఈ కాలంలో సిప్ రాబడులు అద్భుతంగా ఉన్నాయి.రిస్క్ లూ ఉంటాయ్.. → అనుకున్న కాలానికి అనుకున్నంత సమకూరాలంటే అన్ని సందర్భాల్లోనూ సాధ్యపడకపోవచ్చు. → మార్కెట్లు సైడ్‌వేస్ (ఓ పరిధిలోనే)లో ఎక్కువ కాలం పాటు కొనసాగొచ్చు. దీనివల్ల దీర్ఘకాల రాబడులు తగ్గిపోతాయి. → పక్కా ప్లాన్‌తో సిప్ చేసినా.. ఫండ్ ఎంపిక సరిగ్గా లేకపోతే చివర్లో అనుకున్నంత రాబడి సాధ్యం కాదు.ప్రవర్తనా లోపాలే ఎక్కువ... → కొంత మంది ఆదాయం సర్దుబాటు చేయలేక సిప్‌లను మధ్యలోనే ఆపేస్తుంటారు. → కొంత మంది మార్కెట్లు పడిపోతున్నాయని చెప్పి నష్టాలను చూసి భయంతో సిప్‌కు టాటా చెబుతుంటారు. → మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఉత్సాహం కొద్దీ అధిక వ్యాల్యూషన్ల వద్ద అదనంగా సిప్ చేస్తుంటారు. → అదే మార్కెట్ల పతనాల్లో మాత్రం నమ్మకం సడలి ఉన్న సిప్‌లను ఆపేస్తుంటారు. కానీ, నిజానికి పతనాల్లోనే సిప్‌లకు అదనంగా జోడించుకోవడం తెలివైన పని. → కొందరు ఒక లక్ష్యం, స్పష్టత లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. లక్ష్యం, కాల వ్యవధి ఆధారంగా సరితూగే పథకాలనే ఎంపిక చేసుకోవాలి. → నిపుణుల సూచనలు కాకుండా స్నేహితులో, సహచర ఉద్యోగో లేక బంధువు చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం వంటివి వద్దు. → స్వల్పకాల కోసం సిప్ చేయడం సరికాదు. సిప్ అనేది దీర్ఘకాల ఇన్వెస్ట్మెంట్ సాధనం. → గడిచిన ఏడాది కాలంలో మంచి పనితీరు చూపించిన (అప్పటికే బాగా పెరిగిన) ఫండ్స్‌లో సిప్ చేయడం సరికాదు. → పెట్టుబడి తక్కువ మొత్తమే అయినా ఎక్కువ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడాన్ని అతి వైవిధ్యంగా చెబుతారు. ఇది కూడా తప్పే.ఇదీ వాస్తవం.. → సిప్పై దీర్ఘకాలంలో రాబడి 10–12 శాతంగానే ఉంటుందన్న అంచనా వాస్తవికం. 15–20 శాతం అంచనా వేసుకోకూడదు. → కనీసం 10–15 ఏళ్ల పాటు అయినా స్థిరంగా సిప్ చేసుకుంటూ వెళ్లాలి. → మార్కెట్ టైమింగ్ (ఎప్పుడు ఎటు కదులుతుందో అంచనా) కాకుండా క్రమశిక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలి. → సిప్ అన్నది పవర్ఫుల్ టూల్. అద్భుతమైన మంత్రదండం కాదు. కానీ, క్రమశిక్షణతో దీర్ఘకాలంలో సిప్ చేస్తే సంపద సాధ్యం. → అవాస్తవిక అంచనాలతో ముందుకెళితే చివర్లో ఫలితం నిరాశకు గురి చేయొచ్చు. ముందు మొదలెడితే... మ్యాజిక్ → నెలకు రూ.10,000 చొప్పున 20 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఏటా 12 శాతం రాబడి అంచనా ఆధారంగా రూ.91.98 లక్షలు సమకూరుతుంది. → 20 ఏళ్లకు బదులు మరో 5 ఏళ్లు పెంచి 25 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే రూ.1.70 కోట్లు సమకూరుతుంది. అంటే ఐదేళ్లలో రూ.78 లక్షలు అదనంగా వస్తుంది. → 30 ఏళ్ల పాటు ఇంతే మేర ఇన్వెస్ట్ చేస్తే సమకూరే సంపద రూ.3.08 కోట్లు. → ప్రతి నెలా 10వేలు చొప్పున, ఏటా 10 శాతం అదనంగా సిప్ పెంచుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే.. (12 శాతం రాబడి అంచనా ఆధారంగా) → 20 ఏళ్లలో రూ.1.86 కోట్ల సొమ్ము సమకూరుతుంది. → 25 ఏళ్లలో రూ.3.93 కోట్లు ఏర్పడుతుంది. → 30 ఏళ్లలో రూ.7.98 కోట్ల నిధి సొంతం అవుతుంది. -
దీర్ఘకాల పెట్టుబడులకు భారత్ బెస్ట్
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడులకు భారతదేశం అత్యుత్తమమైనదని ప్రధాని నరేంద్రమోదీ గురువారం పేర్కొన్నారు. వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్‌టేబుల్ (వీజీఐఆర్) 2020 సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అతి తక్కువ కార్పొరేట్ పన్ను ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని తెలిపారు. ‘‘విశ్వసనీయ రిటర్న్స్‌ను మీరు కోరుకుంటున్నట్లయితే, ఇందుకు భారత్ చక్కటి దేశం. ప్రజాస్వామ్యయుతంగా వ్యవస్థలు నడిచే విషయంలో భారత్ చక్కటి ప్రదేశం. మీరు సుస్థిరతను కోరుకుంటే అందుకు భారత్ అనువైన దేశం. దీర్ఘకాలంలో మంచి వృద్ధి అవకాశాలను కోరుకుంటే, భారత్ ఇందుకు సరైన మార్గం’’ అని మోదీ అన్నారు. పటిష్ట ప్రజాస్వామ్యం, యువత, డిమాండ్, వైవిద్యం వంటి విశిష్ట అంశాలను భారత్ ఆఫర్ చేస్తోందన్నారు. వైవిధ్యమైన మార్కెట్లను ఒకే మార్కెట్లో చూడగలుగుతారని విదేశీ పెట్టుబడిదారులకు సూచించారు. ప్రపంచాభివృద్ధి, సంక్షేమంపై భారత్ బహుముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. దిగ్గజ దేశాల ప్రతినిధులు... ఈ సదస్సులో అమెరికా, యూరోప్, కెనడా, కొరియా, జపాన్, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, సింగపూర్‌లకు చెందిన దాదాపు 20 మంది ఉన్నత స్థాయి వ్యవస్థాగత ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. వీరి నిర్వహణలో ఉన్న పెన్షన్ అండ్ సావరిన్ వెల్త్ ఫండ్స్ విలువ దాదాపు ఆరు ట్రిలియన్ డాలర్లను ఒక అధికారిక ప్రకటన తెలిపింది. భారత ఆర్థిక మంత్రిత్వశాఖ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ సంయుక్తంగా ఈ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తదితరులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. గ్లోబల్ ఇన్వెస్టర్లకు ప్రధాని పిలువు -
గిల్ట్‌ఫండ్స్‌కు క్రెడిట్ రిస్క్ ఉండదు
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు సంబంధించి రెగ్యులర్ ఆప్షన్‌నా లేదా డెరైక్ట్ ఆప్షన్‌నా దేనిని ఎంచుకోవాలి? దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించి ఏరకమైన ఫండ్స్‌ను ఎంచుకోవాలో సూచించండి? - సుకుమార్, హైదరాబాద్ ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాన్‌కు సంబంధించి రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్లలో డెరైక్ట్ ప్లాన్‌కే వ్యయం తక్కువ. ఫలితంగా రిటర్న్‌లు అధికంగా వస్తాయని చెప్పవచ్చు. ఈ డెరైక్ట్ ప్లాన్లను మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్రత్యక్షంగా విక్రయిస్తున్నందున రెగ్యులర్ ప్లాన్‌తో పోల్చితే ఇది చౌకగా లభ్యమవుతుంది. మీ ఆర్థిక లక్ష్యాలకు తగ్గ ఫండ్ ఏదో మీరు ఎంచుకోగలిగితే డెరైక్ట్ ప్లాన్‌లోనే పెట్టుబడులు పెట్టడం సముచితం. ఇక దీర్ఘకాలిక పెట్టుబడుల విషయానికొస్తే మీరు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకూడదు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవాలంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(ఎస్ఐపి) విధానాన్ని అనుసరించడం ఉత్తమం. సెక్టోరియల్ లేదా థీమాటిక్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయకండి. విభిన్న రంగాల్లో ఇన్వెస్ట్ చేసే డైవర్సిఫైడ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం కింది ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. .. క్వాంటమ్ లాంగ్‌టెర్మ్ ఈక్విటీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, యూటీఐ ఈక్విటీ, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్‌లు. ప్రస్తుతం రెండేళ్ల వయస్సున్న నా కూతురు చదువు, వివాహం కోసం రూ. కోటి నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. దీని కోసం నెలకు రూ.10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నా పెట్టుబడులు ఎలా ఉండాలి? ప్రస్తుతం ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నాను. అలాగే పీపీఎఫ్‌కు కొంత మొత్తం చెల్లిస్తున్నాను. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని తగిన సూచనలివ్వండి. - శరణ్య, ఈ మెయిల్ ద్వారా పీపీఎఫ్, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న యూలిప్.. ఇవి ఈ రెండు తక్కువ రాబడులనిచ్చే స్థిరాదాయ మార్గాలు. మీ ఆర్థిక లక్ష్యాలకు ఇవి సరిపోవు. మీరు మొదటగా చేయాల్సింది ఏమిటంటే మీ జీవన్ ఆనంద్ పాలసీ డాక్యుమెంట్‌ను పరిశీలించి ఈ పాలసీ నుంచి వైదొలిగే మార్గాలను చూడండి. అలాగే పీపీఎఫ్‌లో కనీస మొత్తమే ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన మొత్తాన్ని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న రూ.10,000కు జత చేయండి. ఈ మొత్తాన్నంతటిని మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. మీరు మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, మొదటగా రెండు బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్ పనితీరు తదితర అంశాలపై మీకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఈక్విటీ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికైతే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, కెనరా రొబెకొ బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. నేనొక సీనియర్ సిటిజన్‌ను. 12-18 నెలల కాలానికి ఏదైనా ఒక గిల్ట్ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ విషయమై తగిన సలహా ఇవ్వండి. - రామకృష్ణయ్య, ఏలూరు ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే గిల్ట్‌ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. అందుకే వీటికి ఎలాంటి క్రెడిట్ రిస్క్ ఉండదు. భద్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవి ఒడిదుడుకులకు గురవుతుంటాయి. వడ్డీరేట్లు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ ఒడిదుడుకులు మరీ తీవ్రంగా ఉంటాయి. గత సంవత్సరంన్నర కాలంలో డెట్ ఫండ్ కేటగిరిలో అత్యంత అధ్వాన పనితీరు కనబరిచింది ఈ గిల్ట్ఫండ్సే. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే, వడ్డీ రేట్లను తగ్గించబోమని ఆర్బీఐ గవర్నర్ ఇటీవలనే పేర్కొన్న సంగతి తెలిసిందే. గిల్ట్ఫండ్స్ల్లో పెట్టుబడులు పెట్టేముందు ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. గిల్ట్‌ఫండ్స్‌కు బదులుగా డైనమిక్ బాండ్ ఫండ్‌లో గానీ ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్‌లో గానీ ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించండి. నేను ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్‌లో నెలకు రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాను. మూడేళ్ల కాలానికి మరి కొంత ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్‌లను షార్ట్‌లిస్ట్ చేశాను. తగిన సలహా ఇవ్వండి. - రామ్మూర్తి, అనంతపురం మూడేళ్ల ఇన్వెస్ట్‌మెంట్‌కు ఈక్విటీ ఫండ్స్‌ను పరిశీలించడం సమంజసం కాదు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డిస్కవరీ ఫండ్స్ మీరు నిర్దేశించుకున్న మూడేళ్ల కాలానికి సరైన రాబడులనివ్వలేవు. స్వల్పకాలంలో వీటి నుంచి మీరు ఆశించే రాబడులు రావు. అందుకని బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. మూడేళ్ల కాలానికి వీటిల్లో రిస్క్ తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్న హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరింతగా పెంచవచ్చు. లేదంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను పరిశీలించవచ్చు.


