breaking news
Locks to the room
-
కుల వివక్షకు పెత్తందారుల ఆజ్యం!
నాగా వెంకటరెడ్డి – సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’’.. స్వయంగా చంద్రబాబు సందేహం ఇదీ!! ‘‘ఒరేయ్ మీకెందుకురా ఈ రాజకీయాలు? అవేవో మేం చేసుకుంటాం, మేం చూసుకుంటాం..!’’ ఎస్సీలనుద్దేశించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అనుచిత వ్యాఖ్యలివీ! ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? టీడీపీ అధినేత ప్రోద్బలంతో ఆ పార్టీ నేతలు ఇప్పుడు అంతకంటే ఇంకో అడుగు ముందుకేశారు! దళిత ప్రజాప్రతిని ధులు తమ గ్రామాలకు వస్తుంటే చాలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవడంతోపాటు పసుపు నీళ్లతో వీధులను శుభ్రం చేస్తున్నారు. అదీ ఎక్కడో కాదు.. స్వయంగా నారా చంద్రబాబు సొంతూరు ఉన్న మండలానికి చేరువలోనే కావడం గమనార్హం. పసుపు నీళ్లు చల్లుతూ... చిత్తూరు జిల్లాలో అధికారపార్టీకి చెందిన ఎస్సీ ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వస్తున్నట్లు తెలియగానే చంద్రబాబు సామాజిక వర్గీయులు తలుపులకు తాళాలు వేసుకుని ఇళ్లలో నుంచి వెళ్లిపోవడం, ఇతరులు ఎవరూ అందుబాటులో ఉండకూడదని హుకుం జారీచేయడం, ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన తరువాత రోడ్లపై పసుపు నీళ్లు చల్లడం, పాలతో అభిషేకాలు చేయించడం లాంటి దారుణాలకు ఒడి గడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథ కాల గురించి ప్రజలకు నేరుగా వివరిస్తూ గడప గడ పకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు), పూతలపట్టు నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కళ త్తూరు నారాయణస్వామి, ఎం.ఎస్.బాబు తమ తమ ప్రాంతాల్లో చురుగ్గా పర్యటిస్తున్నారు. దళిత ఎమ్మెల్యేలు వచ్చే సమయానికి అందరూ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవాలని, ఎవరూ స్వాగతం పలకరాదని, పర్యటనలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలంటూ టీడీపీ అధినేత జారీ చేసిన ఆదేశాలను స్థానిక నాయకత్వం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటికి తాళం.. పెరటిలో సర్పంచ్ ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు ఇటీవల పూతలపట్టు మండలం గుంతూరు గ్రామ సచివాలయం పరిధిలోని 170 గొల్లపల్లె పర్యటనకు వెళ్లే సమయానికి టీడీపీ నాయకులు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి ఎవరూ ఇళ్లలో ఉండకూడదని గ్రామ సర్పంచ్, టీడీపీ నాయకుడు ప్రకాష్‌నాయుడు హుకుం జారీచేయడంతో సుమారు వంద కుటుంబాలు గ్రామం వీడి వెళ్లక తప్పలేదు. సర్పంచ్ తన ఇంటికి తాళం వేసి పెరట్లోనే ఉండటం గమనార్హం. గత నెల 24వతేదీన పేట అగ్రహారం గ్రామానికి వెళ్లినప్పుడు కూడా చంద్రబాబు వర్గం దారుణంగా వ్యవహరించింది. పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజలను బెదిరిస్తూ ఎవరైనా అందుబాటులో ఉంటే అంతు చూసా్తమని హెచ్చరించారు. ఎమ్మెల్యే పర్యటన అనంతరం వీధులను పసుపునీళ్లతో శుభ్రం చేయడం అగ్రకుల దురహంకారానికి మచ్చు తునకగా నిలుస్తోంది. దళిత నేతలకు దూరం దూరం...! ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి గత నెల 24వతేదీన జీడీ నెల్లూరు మండలం పాచిగుంటలో గడప గడపకూ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో టీడీపీ నాయకుడు మనోహర్‌నాయుడు స్థానికులను బెదిరింపులకు గురి చేయడం విస్మయం కలిగిస్తోంది. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవాలంటూ స్థానికులను హెచ్చరించారు. దళిత ఎమ్మెల్యేలను దరిచేరనివ్వకపోవడం, గ్రామాలకు రానివ్వకపోవడం చంద్రబాబు పెత్తందారీ మనస్తత్వానికి తాజా నిదర్శనమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. ‘చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్ మేరకే మనోహర్‌నాయుడు వ్యవహరిస్తున్నారు. పాచిగుంటలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన 22 కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయేలా ఒత్తిడి చేశారు. తాటిమాకులపల్లెలో 10 కుటుంబాల వారు కూడా అదేవిధంగా వెళ్లిపోయారు. దళితులంటే చంద్రబాబుకు ఎందుకంత చులకన భావం?’ అని నారాయణస్వామి ప్రశ్నించారు. పూతలపట్టు, జీడీ నెల్లూరు చంద్రబాబు సొంత ఊరు ఉన్న మండలానికి చేరువలో ఉండటం గమనార్హం. సమాజంలో తప్పుడు సంకేతాలు రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు సహజం. దళిత ఎమ్మెల్యేలు గ్రామాల్లో కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వెళ్లాక వీధులను పసుపు నీళ్లతో కడగడం, పాలాభిషేకాలు చేయడం దారుణం. దీనివల్ల ప్రజా సమస్యలు పక్కదారి పట్టడమే కాకుండా సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి వాటిని అంగీకరించకూడదు. – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలి.. ఇన్నేళ్ల స్వతంత్ర భారత దేశంలో ఇంతటి అవమానకర వివక్ష దారుణం. వీధుల్లో పసుపునీళ్లు చల్లడం, ఇళ్లకు తాళాలు వేసుకుని బహిష్కరించడం, హేళనగా చూడటం ఏమాత్రం సరికాదు. ఇలాంటి దుర్మార్గాలకు కారకులఫై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వివక్షను నిర్మూలించాలి. ప్రజా సంఘాలు స్పందించి ప్రత్యక్ష కార్యాచరణకు నడుం బిగించాలి . – ఆండ్ర మాల్యాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) -
చెట్ల కిందనే పాఠాలు!
► బిల్లులు రాక గదికి తాళాలు వేసిన కాంట్రాక్టర్ ! ► ఆరుబయట కూర్చుంటున్న విద్యార్థులు ► పట్టించుకోని ఉన్నతాధికారులు ► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ఇల్లందకుంట: ఉన్నతాధికారుల నిర్లక్ష్యం..విద్యార్థులకు శాపంగా మారింది. బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో విసుగెత్తిన ఓ కాంట్రాక్టర్ అదనపు తరగతిగదులకు తాళం వేయడంతో విద్యార్థులకు చెట్లే దిక్కయ్యాయి. చేసేదేమిలేక ఉపాధ్యాయులు సైతం చెట్ల కిందనే పాఠాలు బోధిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసిన పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.28.61లక్షలతో.. ఇల్లందకుంట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.28.61లక్షల నిధులు మంజూరు చేసింది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సకాలంలో పూర్తి చేశాడు. ఈ విద్యాసంవత్సరం అదనపు తరగతి గదులకు మారేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే తనకు బిల్లులు రాలేవంటూ కాంట్రాక్టర్ నూతన భవనాలకు తాళం వేసుకున్నారని ప్రధానోపాద్యాయుడు సాంబయ్య తెలిపారు. చేసేదేమి లేక చెట్ల కిందనే పాఠాలు బోధిస్తున్నట్లు చెప్పారు. వెనుదిరుగుతున్న తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు వచ్చి ఇక్కడి విద్యార్థుల చెట్ల కింద కూర్చోవడాన్ని చూసి వెనుదిరుగుతున్నారు. అన్ని వసతులు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ తాళం వేయడం, ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. అధికారులకు నివేదించాం డబ్బులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ నూతన భవనాలకు తాళం వేసుకున్నారు. ఈ విషయంతోపాటు విద్యార్థులు చెట్ల కింద కూర్చుంటున్న విషాయన్ని సైతం ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం కూలిపోయిన తరగతిగదులలో కొందరు, మరికొందరు చెట్లకింద కూర్చుంటున్నారు. కాంట్రాక్టర్‌కు సైతం చాలాసార్లు ఫోన్ చేశాం. ఆయన స్పందించడం లేదు. – సాంబయ్య, ప్రధానోపాధ్యాయుడు