live chat with NRIs
-
యూఎస్ ఫ్యాన్స్ ప్రేమ చూసి ఎమోషనల్ అయిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగిన చిరు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. వాల్తేరు వీరయ్యగా అటు క్లాస్, ఇటు మాస్ ఆడియెన్స్‌ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేశారు. మూవీ రిలీజ్ అయిన తొలిరోజు నుంచే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 200కోట్లకు పైగా కలెక్షన్లకు రాబట్టింది. చిరంజీవి కెరీర్లో మైలురాయిగా నిలిచిన వాల్తేరు వీరయ్య ఇంకా బాక్సాఫీస్ వద్ద ఊచకోత సృష్టిస్తోంది. చిరు స్టామినా ఏమాత్ర తగ్గలేదంటూ మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ హోరెత్తిస్తున్నారు. ఇక అమెరికాలో సైతం మెగా ఫ్యాన్స్ ఈ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో చిరు లైవ్‌లో ఉన్నప్పుడే కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. లాస్ ఏంజెల్స్, ఫీనిక్స్, డెన్వర్, షికాగో, డాలస్, హ్యూస్టన్ సహా 27 అమెరికన్ సిటీస్ ప్రాంతాలకు చెందిన అభిమానులతో చిరు లైవ్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానుల కేకలు, సంతోషం చూసి కాస్త ఎమోషనల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
ఉద్యమం మరింత ఉధృతం
ప్రవాసాంధ్రులతో ముఖాముఖిలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడి రాబోయే రోజుల్లో ప్రత్యేకహోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రవాసాంధ్రులతో సాక్షి టీవీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే తమ పార్టీ పార్లమెంట్ సభ్యులతో రాజీనామా చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పారు. అసాధ్యమనుకున్న తెలంగాణ వచ్చినపుడు.. పార్లమెంట్లో ప్రధాని హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాను సాధించుకోవడం గొప్ప విషయమేమీ కాదన్నారు. అబద్ధాలు చెప్పే రాజకీయ నాయకులను నిలదీసే పరిస్థితి రావాలనీ, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ దారుణ పరిస్థితిలో ఉందన్నారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో రాజీపడిపోయారన్నారు. ప్రత్యేక హోదాపై ప్రవాసాంధ్రులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన వివరణాత్మకంగా సమాధానాలిచ్చారు. రమేష్‌రెడ్డి(అమెరికా): విభజన సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ప్రధాని హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయాల్సిన కేంద్రం.. సాధించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చాయి. ప్రతిపక్ష నేతగా హోదా కోసం మీరు పోరాడుతున్నారు. ఈ పోరాటంలో మీ ప్రణాళిక ఏమిటి? అమెరికాలో ప్రవాసాంధ్రుల నుంచి మీకు ఎలాంటి మద్దతు కావాలి? జగన్: రమేష్ అన్నా.. ప్రత్యేక హోదా ఈ రోజు వస్తుందని.. రేపు వస్తుందని.. సంవత్సరంలో వస్తుందని నేను చెప్పను. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నారు. అలాంటిది పార్లమెంట్లో ప్రధాని ఇచ్చిన మాట ప్రత్యేక హోదాను సాధించుకోవడం గొప్ప విషయమేమి కాదు. ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది. 2019 ఎన్నికల్లో మాపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటవుతుంది. అప్పుడు రాష్ట్రానికి హోదా ఎవరిస్తే వారికి మద్దతు ఇస్తాం. వెంకట్,(శాన్ఫ్రాన్సిస్కో): ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. విభజన చట్టంలో పెట్టారు. కేంద్రం, రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చాక ఏపీకి హోదా ఇవ్వమంటున్నారు. అమెరికాలో ఇలా చేస్తే ప్రభుత్వాన్ని రీకాల్ చేసే అవకాశం ఉంది. మరి భారత్‌లో ఇలాంటిదేమైనా చేయగలమా? అందుకు మీ కార్యాచరణ ఏంటి? జగన్: మీరు చెప్పింది చాలా విలువైన పాయింట్. మన ఖర్మేంటంటే ఎన్నికలప్పుడేమో నాయకులు మాటలు చెబుతారు. అబద్ధాలు చెబుతారు. తర్వాత ప్రజలను మోసం చేస్తారు. రాబోయే రోజుల్లో గట్టిగా మనందరం కలిసి ఏకం కావాలి. అబద్దాలు చెప్పిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో.. ఎన్నికల తర్వాత మోసం ఎవరు చేస్తున్నారో.. వాళ్లని నిలదీసే పరిస్థితి రావాలి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది. దిలీప్, (మిలికిటీ స్టేట్): విభజనప్పుడు హోదా అన్నారు తప్ప.. ప్యాకేజీ అని ఏపార్టీ మాట్లాడలేదు. హోదా విషయాన్ని మీరు గట్టిగా జనంలోకి తీసుకెళ్తున్నారు. బాగా పోరాడుతున్నారు. బీజేపీ, టీడీపీలో ఉన్న సోకాల్డ్ పెద్ద మనుషులు ఆ రోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. మోదీ లాంటి వ్యక్తి కూడా ఇచ్చిన మాటకు వెనకడుగు వేస్తున్నారు. జగన్: ఇది నిజంగా దురదృష్టకరం. రాజకీయాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలాసఫీ ఏమిటంటే.. ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. బతికినంత కాలం ఎలా బతికాం అన్నది ముఖ్యం. ప్రతీ వ్యక్తీ చనిపోతారు. ఇవాళున్నాం. మరో 20, 30 ఏళ్లకు బహుశా నేనుకూడా పోతానేమో. నేను పోయిన తర్వాత.. ఇంకొకళ్లు పోయిన తర్వాత.. ఫలానా వాడు ఏం చేశాడు?.. ఫలానా వాడి క్యారెక్టర్ ఏమిటి? అన్నది మనం పోయిన తర్వాత కూడా భావితరాలు చెప్పుకుంటాయి. ఈ రోజు ఉన్న రాజకీయ వ్యవస్థ ఇంత దారుణమైన పరిస్థితిలోకి పడిపోవడం బహుశా నేను ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల సమయంలో అబద్దాలు చెప్పడం, మోసం చేయడం, ఆ తర్వాత ఏమీ జరగనట్టుగా గాలికొదిలేయడం. ఇలాంటి పరిస్థితి చూసినప్పుడే ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించాలనిపిస్తుంది. దీన్ని నిలదీసే కార్యక్రమంలో ముందుండాలి. విప్లవాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలి. ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని నమ్మేవాళ్లల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. భాస్కర్‌రెడ్డి(మలేషియా): దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. కానీ అరుణ్ జైట్లీ ప్రకటనను చూస్తే స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దుగరాజపట్నం పోర్టు కోసం ఎలాంటి పోరాటాలు చేస్తారు? జగన్: దుగరాజపట్నం వద్ద కొత్త పోర్టును కేంద్రమే నిర్మించాలని.. 2018లోగా పోర్టు తొలి దశను పూర్తి చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. కానీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనలో ఫీజుబులిటీని బట్టి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో దుగరాజపట్నం పోర్టును నిర్మించే అవకాశాన్ని పరిశీలిస్తామనే మాత్రం చెప్తే... ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు అంటూ సీఎం చంద్రబాబు చంకలు గుద్దుకుంటాడు. విభజన చట్టం ద్వారా హక్కుగా సంక్రమించిన వాటి కన్నా ఎక్కువగా చేస్తే దాన్ని ప్యాకేజీ అంటారు. కానీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలకే కోతలు వేసి అరకొరగా అమలు చేస్తున్న ప్రకటిస్తే అది ఎలా ప్రత్యేక ప్యాకేజీ అవుతుంది. అరుణ్ జైట్లీ సెప్టెంబరు 7న ప్రకటన చేసే సమయంలోనే ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చిచెప్పారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనలు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అడ్డంకిగా మారాయని అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని 14వ ఆర్థిక సంఘం చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు. జైట్లీ ప్రకటనలో రాష్ట్రాన్ని నిలువునా మోసం చేసినా.. సీఎం చంద్రబాబు స్వాగతించారు కాబట్టే ఆయనకు ఇంగ్లిషు రాదని అన్నా. విభజన చట్టంలో ఉన్న హామీల అమలుతోపాటూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజీ లేని పోరాటాలు చేస్తాం. స్వాతి(కువైట్): ఎన్నికల సమయంలో ఏవేవో వాగ్దానాలు చేసి ఓట్లు, సీట్లు దక్కించుకుని ఇప్పుడు మోసం చేస్తారా? తమకు సీటు దక్కింది గదాని వాళ్లు హాయిగా కూర్చుంటే మాకు న్యాయం చేసే వాళ్లు ఎవరన్నా? ప్రత్యేక హోదా కల్పించాలి అని తీవ్రమైన క్షోభతో, బాధతో అడుగుతున్నాం. ప్రవాసాంధ్రులు పరిశ్రమలు పెట్టాలంటే ప్రత్యేక హోదా లేకుండా ఎలా? జగన్: ప్రత్యేక హోదాతో ముడిపడిన ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. పరిశ్రమలు పెట్టబోయే ముందు ఎవరైనా.. అక్కడ పెడితే తమకు ఏమి మేలు అని పారిశ్రామిక వేత్తలు ఆలోచిస్తారు. చంద్రబాబు మొహం చూసో, జగన్మోహన్రెడ్డి మొహం చూసే పారిశ్రామిక వేత్తలు రారు. హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి 65 ఏళ్లు పట్టింది. ప్రత్యేక హోదా వస్తే చాలా ప్రయోజనాలున్నాయి. అదో విధానం.. ఈశాన్య రాష్ట్రాలకు ఇప్పటికీ ఈ ఆర్ధిక ప్రయోజనాలు పొందుతున్నాయి. 1997 నుంచి 2007 దాకా అప్పటి నుంచి మరో పదేళ్లు అంటే 2017 దాకా అవి అమల్లో ఉంటాయి. హోదా ఉంటే వంద శాతం ఆదాయపన్ను కట్టాల్సిన పని లేదు. ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినా ఇవి ఉంటాయి. ఇప్పుడు అరుణ్‌జెట్లీ మన రాష్ట్రానికి ప్రకటించిన ప్రోత్సాహకాలు ఏవీ శనక్కాయలు, బెల్లానిక్కూడా సరిపోవు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఇవి మనకు మాత్రమే ఇచ్చారని అబద్దాలు చెబుతున్నారు. తెలంగాణతో కలిపి ఇచ్చినవి అవి. ఇటువంటి ప్రయోజనాలు రాజస్తాన్‌లో కూడా ఉన్నాయి. సురేందర్(లండన్): రోగి కోరుకున్నది ప్రత్యేక ప్యాకేజీయే, డాక్టర్ ఇచ్చిందీ ప్యాకేజీయే అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి. కానీ రాష్ట్రం బాగుపడాలన్నా, ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా, పారిశ్రామికవేత్తలకు మేలు జరగాలన్నా కావలసింది ప్రత్యేక హోదా మాత్రమే. చంద్రబాబు, వారి మీడియా ప్రత్యేక ప్యాకేజీతోనే మేలు అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయి. చంద్రబాబును, ఆ మీడియాను చూస్తుంటే వారు ‘మెగలోమేనియా’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని తానే కనిపెట్టానని, తానే చేశానని చంద్రబాబు చె బుతూ భ్రమల్లో బతకడమే కాదు ప్రజలను భ్రమల్లో ఉంచాలని చూస్తున్నారు. బాబు ఇలా చెప్పడం, తరువాతి రోజు ఆ మీడియా దాన్నే ప్రజల్లో ప్రచారం చేయడం చూస్తుంటే ప్రజల్ని ఎంతగా మోసం చేస్తున్నారో అర్థమవుతోంది. దీనిపై ప్రజల్లో చైతన్యం పెరగాలి. జగన్: ఇలాంటి వారు మనరాష్ట్రానికి ఉండడం మన ఖర్మ. చంద్రబాబుకు అల్జీమర్సో లేదా మెగలోమేనియా వ్యాధి ఉన్నట్టుగా అనుమానం వస్తోంది. ప్రపంచంలో ఫోన్లు తానే కనిపెట్టానని ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్లు పెడుతున్నారు. పీహెచ్డీ చేశానని, షికాగో యూనివర్సిటీ తనకు గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చిందని చెబుతారు. సత్యా నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓగా తానే చేశానని అంటాడు. చివరకు రోజుకు 24 గంటలుంటే విద్యుత్తును రోజుకు 27 గంటలు ఇచ్చానంటాడు. నమ్మేవాళ్లుంటే చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెబుతాడు. మీరంటున్న మాటలైనా విని చంద్రబాబు అర్థం చేసుకుంటాడో లేదు చూడాలి. - సాక్షి, హైదరాబాద్ స్టేలు తెచ్చుకోవడంలో గిన్నిస్ రికార్డ్.. రమేష్(వాషింగ్టన్): మన రాష్ట్రం అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్టు నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ సర్వేలో తేలింది. రాజధాని, పోలవరం, పట్టిసీమ నిర్మాణంలో, రాజధానికి భూ సేకరణ విషయంలో పారదర్శకత లోపించిందని, అంచనాలు పెంచి నిధులు కాజేస్తున్నారని తేలింది. స్విస్ చాలెంజ్ అంటూ అంకెల్ని చూపకపోవడం కూడా జరుగుతోంది. మరోపక్క చంద్రబాబు మాత్రం స్టేలు తెచ్చుకోవడం నెంబర్ వన్‌గా నిలిచి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. (అక్కడ గుమికూడిన వారి నుంచి పెద్దపెట్టున హర్షధ్వానాలు) దీనిపై మీ కామెంట్ ఏమిటి? ప్రజా పోరాటాలను ఎలా ముందుకు తీసుకువెళతారు, శాసనసభలో వ్యూహమేమిటి? న్యాయ పోరాటం ఎలా చేయబోతున్నారు? (ఈ సందర్భంలో మోడరేటర్ కొమ్మినేని జోక్యం చేసుకుంటూ ‘పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని జగన్ గారు చెప్పారు. అది మీకు నచ్చిందా? మీరందరూ అంగీకరిస్తారా? అని అడిగినప్పుడు అక్కడున్న వాళ్లందరూ చప్పట్లు చరిచి హర్షధ్వానాలు తెలియజేశారు.) జగన్: పోరాటం చేయాల్సిందే. ఇది చాలా ముఖ్యం కూడా. 2019 దాకా ఈ సమస్య సజీవంగా ఉండేలా చూస్తాం. అందుకోసం పోరాటం చేస్తూనే పోతాం. వాస్తవానికి అరుణ్‌జెట్లీ ప్రకటన చేసిన రోజే మా పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిద్దామనిపించింది. అలా చేస్తే సభలోకి వెళ్లి మాట్లాడే వారే లేకుండా పోయే పరిస్థితి. వాస్తవానికి కొట్లాడుతున్నది ఎవరన్నా ఉంటే వైఎస్సార్సీపీ ఎంపీలే. అలాంటి వాళ్లు రాజీనామా చేస్తే కొట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఏదిఏమైనా దశలవారీగా పోరాడుతూనే ఉంటాం. సరైన సమయంలో రాజీనామా బ్రహ్మాస్రాన్ని ఉపయోగిస్తాం. ఉద్యమాన్ని మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలనే దానిపై మేధావులతో చర్చించాలి. మొన్న ఢిల్లీలో కమ్యూనిస్టులతో కూడా చర్చించా. సూచనలు, సలహాలు ఇమ్మన్నాం. అందరం కలిసికట్టుగా పోదాం అని చెప్పా. రాజేందర్‌రెడ్డి,(మలేషియా): ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని ఎల్లో మీడియా హైలెట్ చేస్తోంది. దీన్ని మీరు ఎలా తిప్పికొడతారు? వాసుదేవరెడ్డి,(అమెరికా): హోదా కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ కుమ్మక్కయి ప్యాకేజీ ప్రకటించాయి. దీన్ని అడ్డుకోవడానికి, ప్రత్యేక హోదా సాధించడానికి మీ ప్రణాళిక ఎలా ఉండబోతోంది? తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన విధంగా మీరు కూడా అలుపెరగని పోరాటం చేసే ఉద్ధేశం ఉందా? జగన్: తప్పకుండా. అసలు అరుణ్ జైట్లీ స్టేట్మెంట్ చూసిన ఎవరైనా ఆయనకు థ్యాంక్యూ చెప్పే పరిస్థితి ఉండనే ఉండదు. కానీ చంద్రబాబు పూర్తిగా ఏస్థాయికి రాజీపడ్డాడు అంటే.. మన హక్కు ప్రకారం మనకు రావాల్సిందే ఇవ్వకపోయినా సరే అనేంత. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఏదైతే ఇస్తామని చెప్పారో అవే అరకొరగా ఇచ్చే పరిస్థితుల్లో వాళ్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు, అదనంగా వాళ్లు ఎలాంటిదీ ఏమీ ఇవ్వనప్పుడు, పాలసీల మార్పుల ప్రకారం మిగిలిన రాష్ట్రాలకు ఏదైతే ఇస్తున్నారో అవి మాత్రమే మనకూ వస్తున్నప్పుడు.. ఏ రకంగా దీన్ని ప్యాకేజీ అని చెప్పగలుగుతారు? ప్యాకేజీ అంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి హక్కు ప్రకారం ఏదైతే రావాలో అవి ఇస్తూ.. అంతకన్నా ఎక్కువేదైనా ఇస్తే దాన్ని ప్యాకేజీ అనొచ్చు. అంతేకానీ ఆ హక్కును కొద్దోగొప్పో తగ్గించి ఇచ్చే పరిస్థితి కల్పిస్తున్నప్పుడు, మరో పక్క అదే పార్లమెంట్ సాక్షిగా హోదా ఇస్తామన్న హామీని పూర్తిగా పక్కనపెడుతున్నాము అని వాళ్లు మాట్లాడుతున్నప్పుడు దీన్ని ఏ రకంగా ప్యాకేజీ అనగలుగుతారు? ఆశ్చర్యం ఏమిటంటే ఇలాంటిది ఫలానా చేస్తామని కూడా ఆయన చెప్పలేదు. చంద్రబాబు మాత్రం థ్యాంక్యూ చెప్పడం. అదేదో మనకు చాలా ఇచ్చినట్టు చెప్పడం ఆశ్చర్యమేస్తోంది. ♦ కేంద్రాన్ని నిలదీయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా రాజీపడ్డాడు. కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకుంటూ అల్టిమేటం ఇవ్వాల్సిన పరిస్థితి. కేంద్రంలో ఉన్నవాళ్లకు పార్లమెంట్‌నే సాక్షిగా చేస్తూ మీరు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీయాల్సిన ఈ వ్యక్తి రాజీపడ్డ పరిస్థితుల్లో మన పోరాటం కొనసాగుతోంది. ♦ మనం బంద్‌లు చేస్తే బంద్ రోజు బలవంతంగా బస్సులు తిప్పుతాడు చంద్రబాబు. మోదీ రాకముందు మనం 8 రోజులు నిరాహార దీక్ష చేస్తే.. మోదీ మరో రెండు మూడు రోజుల్లో వస్తున్నాడనగా ఈయనే దీక్షను బలవంతంగా భగ్నం చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పోరాటం చేస్తున్నాం. రాష్ట్రానికి అనుకూలంగా లేని కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నాం. వాళ్లు ఇవ్వకపోయినా ఫర్వాలేదని, వాళ్లను వెనకేసుకొస్తున్న చంద్రబాబుతోనూ పోరాటం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. ♦ యువభేరీలు చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తాం. సరైన సమయంలో పార్లమెంట్ సభ్యుల చేత కూడా రాజీనామా చేయించే కార్యక్రమం కూడా చేస్తాం.(వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా? అన్న ప్రశ్నకు). పార్లమెంట్లో వెల్‌లోకి కూడా పోయే పరిస్థితి ఉండదు కాబట్టి ఇవాళ రాజీనామా చేయడం లేదు. కానీ ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇప్పట్లో పార్లమెంట్ సమావేశాలు కూడా ఏమీ లేవు. కొన్ని రోజులు చూస్తాము. చంద్రబాబులో, కేంద్రంలో మార్పులు రాకపోతే.. ఈ విషయాన్ని ఇంకా హైలెట్ చేసేందుకు మరో నాలుగు అడుగులు ముందుకు తీసుకుపోయేదానికి పోరాటం కచ్చితంగా చేస్తాం. నాతో నిలబడ్డ ప్రతీ పార్లమెంట్ సభ్యుడు కూడా రాజీనామా చేస్తారు. చేసి మళ్లీ ఎన్నికలకు పోతాం. ప్రజలిచ్చే తీర్పుతో కేంద్రానికి కూడా అర్థమయ్యేలా చేస్తాం. చంద్రబాబుకు కూడా అర్థమయ్యేలా చేస్తాం. పోరాటం వివిధ దశల్లో జరుగుతూ పోతుంది. ఇప్పటి వరకూ అనేక ధర్నాలు, బంద్‌లు, నిరాహార దీక్షలు చేశాం. యువభేరీ కార్యక్రమాన్ని ఇప్పటి దాకా చేశాం. వచ్చే రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తాం. -
ఏపీ ‘హోదా’ కోసం రాజీలేని పోరు
► అవసరమైతే బ్రహ్మాస్త్రం ► వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ప్రకటన ► మా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తాం ► ప్రత్యేక హోదా కోసం దశలవారీ పోరాటం ► తుదిదశలో రాజీనామా అస్త్రాన్నీ ప్రయోగిస్తాం ► హోదా ఇచ్చే వారికే 2019లో కేంద్రంలో మద్దతు ► కేసుల భయంతోనే హోదాకు చంద్రబాబు తూట్లు ► దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి ► ఉప ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా భావిద్దాం ► వ్యక్తిత్వాన్ని అమ్ముకోలేదు.. అమ్ముకోను కూడా.. సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం సాగిస్తామని, అవసరమైతే ఎంపీల రాజీనామా అనే బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగిస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ‘సాక్షి’ చానల్ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం దశలవారీ పోరాటం సాగిస్తామని, అందులో భాగంగా తుదిదశలో అవసరమైతే ఎంపీల చేత రాజీనామాలు కూడా చేయిస్తామని ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం జరిగే పోరాటాలలో కలసివచ్చే అన్ని శక్తులను కలుపుకుని ముందుకు సాగుతామని, వామపక్షాలతో ఇప్పటికే కలసి పోరాడుతున్నామని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో కూడా ఎంపీలు పోరాడాల్సి ఉంది కాబట్టి అవసరమైతే చివరిదశలో వారి చేత కూడా రాజీనామాలు చేయించడానికి వెనుకాడబోమని ఆయన వెల్లడించారు. ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ముంటే తమ పార్టీ నుంచి ప్రలోభపెట్టి చేర్చుకున్న 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని జగన్ సవాల్ విసిరారు. ఆ 20 స్థానాలలో ఉప ఎన్నికలకు వెళ్దామని, వచ్చే ఫలితాలను రిఫరెండంగా భావిద్దామని పేర్కొన్నారు. 18 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరితే వారి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లామని ఆయన గుర్తుచేశారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ ముఖాముఖి కార్యక్రమంలో అమెరికా, బ్రిటన్, కెనడా, కువైట్, సింగపూర్ల నుంచి పలువురు ప్రవాసాంధ్రులు జగన్మోహన్రెడ్డితో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం అలుపెరుగకుండా పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని వారు ప్రశంసలతో ముంచెత్తారు. ఈ పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని ముక్తకంఠంతో నినదించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాతో పాటు అనేక అంశాలపై జగన్మోహన్రెడ్డి తన అభిప్రాయాలను విస్పష్టంగా వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారన్న ప్రచారంలోని మోసాన్ని వివరాలతో సహా ఏకరువుపెట్టారు. విభజన చట్టంలో తప్పనిసరిగా అమలు చేయాల్సిన అంశాలకు కొర్రీలు వేశారని, వాటినే ప్యాకేజీ అని ఘనంగా ప్రచారం చేస్తున్నారని, ఆ ప్యాకేజీ పేరుతో ప్రత్యేకహోదాకు మంగళం పాడేస్తున్నారని జగన్ వివరించారు. ప్రత్యేక హోదా ఎందుకంటే.. ‘‘రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్‌ను కోల్పోయాం. హైదరాబాద్‌తో 98 శాతం ఐటీ ఉద్యోగాలు, 70 శాతం తయారీ రంగం ఉద్యోగాలు ముడిపడి ఉన్నాయి. చదువుకున్న పిల్లలు ఉద్యోగాల కోసం బెంగళూరు ఉన్న కర్ణాటకకో.. చెన్నై ఉన్న తమిళనాడుకో వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదా చాలా అవసరం. హోదా కలిగిన రాష్ట్రాలకు ఆర్థిక రాయితీలు, ఆదాయపన్ను వంద శాతం మినహాయింపు, ఎక్సైజ్ డ్యూటీ, బీమా, రవాణా రంగాల్లోనూ భారీ ఎత్తున రాయితీలు ఉంటాయి. కొత్తగా వచ్చిన జీఎస్టీలోనూ రాయితీ నిబంధనలు చేర్చారు. ఇన్ని రాయితీలు ఉంటేనే ఇతర దేశాల్లో స్థిరపడిన మీలాంటి వాళ్లు ఎవరైనా పరిశ్రమ, హోటల్, ఆస్పత్రి వంటివి పెట్టడానికి ముందుకొస్తారు. తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అప్పుడు ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది. చెనక్కాయలు, బెల్లం ఇచ్చినట్లు అరకొరగా రాయితీలు ఇస్తే దాన్నెలా ప్రత్యేక ప్యాకేజీ అంటారు. ఈ రాయితీల ద్వారా ఏవైనా పరిశ్రమలు వస్తాయా అని వెంకయ్యను ప్రశ్నిస్తున్నా. ఇలాగైతే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ ఎలా పోటీ పడగలుగుతుంది.? ఉప ఎన్నికలకు వెళ్దామా? అనేక ప్రలోభాలు పెట్టి వైఎస్సార్సీపీ నుంచి చేర్చుకున్న 20 మంది ఎమ్మెల్యేల చేత కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేయిస్తే మేం ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ ఉప ఎన్నికల ఫలితాలను రిఫరెండంగా స్వీకరించడానికి తయారుగా ఉన్నాం. వారికి అధికారం ఉంది, పోలీసులు, డబ్బు అన్నీ ఉన్నాయి. అయినా కూడా చంద్రబాబుకు అవకాశం ఇస్తున్నా. ఉప ఎన్నికలకు వెళ్దాం. ఆ ఫలితాలను రిఫరెండంగా తీసుకుందాం. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకోవడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రాజకీయాలు నడపాలనుకోవడం మూర్ఖత్వమౌతుంది. తప్పులు చేస్తున్నపుడు ప్రశ్నిస్తారు. వాటిని స్వాగతించాలి. తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలి. అసహనం కూడదు. హోదా ఇచ్చే పార్టీకే మద్దతు ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే రెండున్నరేళ్లుగా పోరాడుతున్నాం. దానిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. 2019 ఎన్నికల్లో ఏ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందో వారికే మద్దతుగా నిలుస్తాం. 2019 ఎన్నికల తరువాత కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండబోదని భావిస్తున్నా. కేంద్రంలో అస్పష్టమైన మెజారిటీ వచ్చి ఏపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున దేవుడు దయదలచి 22 లేదా 23 సీట్లు గెలిస్తే.. మన సీట్లే ఆక్సిజన్‌గా మనుగడ సాగించగలిగే ప్రభుత్వానికి మద్దతు నిస్తాం. ఆ ప్రభుత్వానికి తప్పకుండా ప్రత్యేక హోదా షరతును విధిస్తాం. వాళ్లు ఇవ్వరు.. బాబు అడగరు... ఏపీ సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా విషయంలో పూర్తిగా రాజీ పడిపోయారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. మేం మాత్రం హోదా కోసం పట్టువదలకుండా పోరాటం చేస్తాం. హోదా సాధించే వరకూ నిద్రపోయేది లేదు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయి ఐదుకోట్ల మంది ప్రజల భవితవ్యాన్ని కేంద్రానికి పాదాక్రాంతం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీజేపీకి లేదు ... అడగాలని టీడీపీకి లేదు. అసలు చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. వారి మధ్య ఏం అవగాహన ఉందో కానీ ఇద్దరూ కలసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా మోసం చేశారు. భవిష్యత్తులో నేనొక్కడినే కాదు, అందరూ ఈ పోరాటంలో కలసి రావాలి. ఉన్మాది అంటున్నారు. సైకో అంటున్నారు. ప్రజల కోసం పోరాడేవాడు ఉన్మాది, సైకో అవుతాడా! లేక ప్రజలను, చివరకు విద్యార్థులను కూడా అబద్ధాలతో మోసం చేస్తూ ఉన్మాదపూరితంగా వ్యవహరించేవాడు ఉన్మాది, సైకో అవుతాడా? హోదాపై మేం చేస్తున్న పోరాటాలకు వామపక్ష పార్టీలు మద్దతు నిస్తున్నాయి. ఢిల్లీలోనూ హోదా విషయమై విజ్ఞప్తి చేయడానికి వెళ్లినపుడు సీపీఎం, సీపీఐ జాతీయ నేతలను రెండుమార్లు కలిసి అభ్యర్థించాను. వారూ సంఘీభావం ప్రకటించారు. ప్రత్యేక హోదా రాదేమోనన్న నిస్పృహకు ప్రవాసాంధ్రులు గురి కానక్కరలేదు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే పోరాడి సాధించుకున్నపుడు అంతకంటే తీవ్రత గల హోదాను సాధించుకోలేమా? నాపై కేసులు కుట్రపూరితం.. రాష్ట్రంలో 5.50 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. దేవుడు చంద్రబాబుని సీఎంగానూ.. నన్ను ప్రతిపక్ష నేతగానూ చేశారు. దేవుడిచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితో వినియోగించుకోవాలి. అందుకే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నా. ఇప్పుడు హోదా పోరాటం చేయకపోతే భావితరాలు క్షమించవు. కేసులు అంటారా.. విధిరాత.. దేవుడు ఎలా పెట్టి ఉంటే అలా అవుతుంది. అయినా నాపై కేసులు పెట్టింది చంద్రబాబుకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నంత కాలం.. రాజశేఖరరెడ్డి మంచివాడు.. జగన్ మంచివాడు.. కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం జగన్ మంచివాడు.. ఎప్పుడైతే ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్‌ను వీడానో అప్పుడు కాంగ్రెస్, టీడీపీలు ఏకమై రాజకీయంగా నన్ను అణగదొక్కేందుకు కుట్రలు పన్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన బాబు.. చంద్రబాబు మాదిరి వ్యవస్థలను మేనేజ్ చేయడంలోనూ అబద్ధాలు చెప్పడంలోనూ దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎవరూ ఉండరు.. తెలంగాణలో నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఏసీబీ అధికారులకు ఆడియో, వీడియో టేపుల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినా సీఎం పదవికి రాజీనామా చేయరు. అరెస్టు నుంచి తప్పించుకోవడం చంద్రబాబుకే చెల్లింది. వైఎస్సార్సీపీ ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల చొప్పున నల్లధనం ఇచ్చి కొనుగోలు చేశారు. చంద్రబాబు చేస్తోన్న అవినీతి అంతాఇంతా కాదు. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో ఈపీసీ పద్ధతిలో ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ జీవో 22 ద్వారా కాంట్రాక్టర్లకు అదనపు నిధులు ఇచ్చేస్తారు. పట్టిసీమ నుంచి పోలవరం దాకా.. ఇసుక నుంచి బొగ్గు వరకూ.. బొగ్గు నుంచి జెన్కో వరకూ.. జెన్కో నుంచి గుడుల వరకూ.. గుడి నుంచి గుడిలో లింగాన్ని మింగే వరకూ బాబును మించిన వారు లేరు. దొంగ పట్టుబడినప్పుడు బతుకు తెలుస్తుంది. చంద్రబాబును దేవుడు మొట్టికాయలు వేసే రోజు ఎంతో దూరంలో లేదు. కమీషన్ల కోసమే ‘పోలవరం’ అడిగారు.. రాష్ట్ర ప్రభుత్వం అడిగితే పోలవరం ప్రాజెక్టును అప్పగిస్తున్నట్లు కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టంగా ఉంది. రెండున్నర సంవత్సరాల్లో ఏం చేశారు.. కాంట్రాక్టర్ అనర్హుడని.. తొలగించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) పదే పదే చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాంట్రాక్టర్‌ను రక్షించుకోవడం కోసం, కమీషన్లు కొట్టేసేందుకే పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని చంద్రబాబు పట్టుబట్టారు. పీపీఏ చెప్పిన తరహాలో కాంట్రాక్టర్‌ను తొలగించి, మళ్లీ టెండర్ పిలిచి ఉంటే మంచి కాంట్రాక్టర్ దొరికేవారు. అంతే కాదు.. 2013 నుంచి ఇప్పటితో పోల్చి చూస్తే ఇనుము, డీజిల్, ఇసుక, సిమెంటు వంటి ధరలు తగ్గాయి. ఆ మేరకు ప్రాజెక్టు అంచనా వ్యయం తగ్గేది. కేంద్రానికి ప్రాజెక్టును అప్పగించి ఉంటే నిధుల ఇబ్బంది ఉండదు. శరవేగంగా పూర్తయ్యే అవకాశం ఉండేది. సరిహద్దు రాష్ట్రాలు అభ్యంతరం పెట్టినా.. పనులపై పర్యావరణ నిషేధం వంటివి విధించినా ఆ బాధ్యత కేంద్రం చూసుకునేది. కానీ రాష్ట్రానికి ఆ ప్రాజెక్టును అప్పగించడం వల్ల ఇప్పుడు ఆ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వమే ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వ్యక్తిత్వాన్ని అమ్ముకునేవాణ్ణి కాదు అనేక దేశాల నుంచి తమ సమయాన్ని వెచ్చించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రత్యేక హోదాపై మనం పోరాడకపోతే ఎప్పటికీ రాదు. ఈ పోరాటంలో జగన్‌కు మీ అందరి మద్దతు కావాలి. మీరు లేకుండా నేను లేను. ఒకటి మాత్రం చెప్పగలను. మనస్ఫూర్తిగా పోరాడతాను. నా క్యారెక్టర్‌ను నేను ఎప్పుడూ అమ్ముకోలేదు. భవిష్యత్‌లో కూడా ఎప్పుడూ అమ్ముకోను. ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా వ్యక్తిగత స్వార్థం కోసం ఎప్పుడూ రాజీ పడలేదు. పడబోను కూడా. అందరం పోరాటం చేస్తే కచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. సాధ్యం కాదు అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే వాళ్ళు తెచ్చుకోగలిగినప్పుడు... పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్తూ ప్రధానమంత్రి ఇచ్చిన మాట అది. మనం ప్రయత్నం చేస్తే కచ్చితంగా ప్రత్యేకహోదా వస్తుందనే నమ్మకం నాకు ఉంది. పోరాటం చేస్తే కచ్చితంగా సాధ్యమవుతుంది. ఈ పోరాటాన్ని ఇంత వరకూ రెండున్నరేళ్ళు కొనసాగించాం. ఇంకా రెండున్నర సంవత్సరాలు కూడా దశలవారీగా పోరాటాన్ని ముందుకు తీసుకుని పోతాం. ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులమా? అవినీతిని ప్రశ్నిస్తే అడ్డుతగులుతున్నారని అంటున్నారు. రాజధానిలో అనేక అవినీతి ఉన్నాయి. ఇన్సైడర్ ట్రేడింగ్, తనకు సంబంధించిన బినామీలు భూములకు జోనింగ్లో మేలు చే యడమే బాబు లక్ష్యం. స్విస్‌చాలెంజ్‌లో ఆయన ఒక పద్ధతి ప్రకారం తనకు కావలసిన వారికి, ప్రయివేటు కంపెనీలకు భూములు ధారాదత్తం చేయడం, దానికోసం ప్రభుత్వం చేత డబ్బులు ఖరుచ పెట్టించడం చేస్తున్నారు. దానివల్ల వేలకోట్ల రూపాయాలు వారి బినామీలకు మేలు జరిగే కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని ప్రశ్నిస్తే వారికి నచ్చదు. పట్టిసీమలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే అభివృద్ధి నిరోధకులంటూ మాపై బండ వేస్తున్నారు. ధవళేశ్వరం నుంచి రోజుకు 3 లక్షలనుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతోంది. మరోపక్క ప్రకాశం బ్యారేజీ నుంచి 1.30 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పోతోంది. మేము ఆరోజు చెప్పింది అదే కదా? పట్టిసీమ అంటూ గోదావరి నుంచి నీళ్లు తెచ్చి ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి కలుపుతున్నారు. గోదావరి, కృష్ణా నదులు రెండింటికీ ఇంచుమించుగా ఒకే టైమ్‌లో వరదలు వస్తాయి. వరద వచ్చినప్పుడు దాన్ని నిల్వచేయడానికి కావలసింది స్టోరేజీ. ఆ వ రదను నిల్వచేసి వర్షాలు పడనప్పుడు ఆ స్టోరేజీ నుంచి నీళ్లు ఇవ్వవచ్చు. పోలవరం అన్నదే ఆస్టోరేజీ. అది కట్టడు. పట్టిసీమను నది అంటాడు. చంద్రబాబుకు మెగలో మేనియా ఉందన్న మాట నిజమనిపిస్తోంది. తానేమి చెప్పినా ప్రజలు నమ్మేస్తారన్న భ్రమల్లో చంద్రబాబు ఉన్నాడు. ఆ ఇద్దరూ మాటమార్చారు రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక హోదానే సంజీవని అని రాష్ట్ర విభజన సమయంలోనూ, తర్వాత ఎన్నికల సమయంలోనూ వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడులే అన్నారు. ఒకరు అయిదేళ్లు కాదు పదేళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఇంకొకరేమో పదేళ్లు చాలదు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు ఏమేం మాట్లాడారు? ఎలా ప్లేటు ఫిరాయించారు? అనే అంశాలను ఈనెల 22న ఏలూరులో జరిగిన యువభేరిలో నేను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించాను. బీజేపీ వాళ్లు ప్రత్యేక హోదా ఇవ్వదల్చుకోలేదు. ఈయన (చంద్రబాబు) వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినందుకు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇప్పుడు అలాగే బీజేపీకీ, టీడీపీకి కూడా బుద్ధి చెబుతారు. వెంకయ్య, చంద్రబాబు మధ్య ఏముందో? మొత్తం మీద ఐదు కోట్ల మంది ప్రజలను మాత్రం మోసం చేశారు. -
అవసరమైతే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా
-
‘స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ప్రవాసాంధ్రులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానాలు ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నందుకు జననేతను ఎన్నారైలు అభినందించారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరి తూర్పారబట్టారు. భవిష్యత్ ఉద్యమ కార్యచరణ ఏవిధంగా ఉండబోతుందని వైఎస్ జగన్ ను అడిగారు. ప్రవాసులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సవివరంగా సమాధానాలిచ్చారు. రమేష్(వాషింగ్టన్ డీసీ) రమేష్: ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో చెప్పారు కానీ హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతగా మీరు ఎలాంటి పోరాటం చేస్తారు.? జగన్: పోరాటం చేయకపోతే ఈ అంశం కోల్ట్ స్టోరేజ్ లోకి ఈ విషయం వెళ్తుంది. వివిధ స్థాయిల్లో ఇప్పటికే పోరాటం చేసాం. ప్రత్యేక హోదా ఎన్నిరోజుల్లో వస్తుందో చెప్పలేను. అసాధ్యం అనుకున్న తెలంగాణను వారు సాధించుకున్నారు. అలాంటప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటను మనం తెచ్చుకోలేమా. హోదా ఇచ్చే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తాం. హోదాపై చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు. ఇలా ఎందుకు చెబుతున్నానంటే అరుణ్ జైట్లీ సెప్టెంబర్ 7న ప్రకటన తర్వాత స్వాగతిస్తున్నానని చంద్రబాబు స్వయంగా స్వాగతించారు. హోదా తో ఏం వస్తుందని శాసనమండలిలో ప్రశ్నించారు. మండలిలో ఏకంగా హోదా వల్ల ఏం వస్తుందని ప్రశ్నించారు. ఇంగ్లీష్ వచ్చి ఉంటే జైట్లీ గారు చెప్పింది అర్థమై ఉండాలి. వాసుదేవరెడ్డి(అమెరికా) వాసుదేవరెడ్డి: ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్నారు కదా.. మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. అయితే తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసినట్లుగా మీరు ఏదైనా ప్రత్యేక పోరాటం చేయనున్నారా? జగన్: అరుణ్ జైట్లీ స్టేట్ మెంట్ చూస్తే.. ఆయనకు ఎవరూ థ్యాంక్స్ చెప్పరు. కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా మన హక్కు ప్రకారం రావాల్సినది ఏదీ ఇవ్వకున్నా.. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన సాధారణ ప్యాకేజీలు ఇచ్చారు. మనకు ప్రత్యేకంగా వారు చెప్పినట్లు ఎక్కువ మొత్తంలో ఏమైనా ఇస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ అలాంటి పరిస్థితులు లేవు. మీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించకుండా కేంద్రంతో చంద్రబాబు రాజీపడుతున్నారు. మేం ఏదైనా దీక్ష చేపడితే.. మోదీ వస్తారు.. లేక మరెవరో వస్తారని సాకులు చెప్పి కుట్ర పన్ని దీక్ష భగ్నం చేస్తారు. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది. చంద్రబాబులో, కేంద్రంలో గానీ మార్పులు రాకపోతే.. మా పోరాటం ఉధృతం చేస్తాం. కొన్ని దశలుగా పోరాటం కొనసాగిస్తాం.. మా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తాం. దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం. వెంకట్(శాన్ ఫ్రాన్సిస్కో) వెంకట్: ఎన్నికల సమయంలో చెప్పిన వాగ్దానాలు, హోదా లాంటివి నెరవేర్చలేదు. అమెరికాలో ఉన్నట్లుగా నేతను రీకాల్ చేయవచ్చా? జగన్: అమెరికాలో ఉన్నట్లుగా ఇక్కడ అవకాశం లేదు. అబద్దాలు చెప్పే నేతలున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల మ్యాండెట్ అనేది చాలా ముఖ్యం. విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు ఎలా బతికామన్నది ముఖ్యం. రమేశ్ (వాషింగ్టన్ డీసీ) రమేశ్: స్టేలు తెచ్చుకోడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు సాధించారు. ప్రత్యేక హోదా కోసం భవిష్యత్ లో ఎలా పోరాడతారు? జగన్: ప్రత్యేక హోదా కోసం ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలు చేస్తున్నాం. భవిష్యత్ లో పోరాటం మరింత ఉధృతం చేస్తాం. ప్రభాకర్ (న్యూజెర్సీ) ప్రభాకర్: ప్రత్యేక హోదాపై ఒకే ఒక్కడుగా పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాలని కలుపుకుని పోయే ప్రణాళిక ఉందా? జగన్: రాజకీయ పక్షాల్ని, ప్రజా సంఘాలు, ఇతర సంస్థలతో మమేకమై పోరాటం చేస్తున్నాం. దానివల్లే ఇప్పటివరకూ జరిగిన బంద్ లు అన్నీ విజయవంతమయ్యాయి. మా ఒక్కరివల్లే సాధ్యం కాదని తెలుసు. అందుకే హోదా కోసం మా వెంట వచ్చే అందరితోనూ చర్చించి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లామని జగన్ తెలిపారు. ప్రసాద్(కొలంబస్) ప్రసాద్: 2019లో అధికారంలోకి వస్తే మీరు ప్రత్యేక ప్యాకేజీని.. కేంద్రంతో చర్చించి ప్రత్యేక హోదా తీసుకొస్తారా? జగన్: అరుణ్ జైట్లీ ప్రకటన చూస్తే విషయం అర్థమవుతోంది. వారు ప్రత్యేకంగా ఏం ఇవ్వకపోగా ఉన్న వాటికే కోత విధించారు. అసలు దీన్ని ప్రత్యేక ప్యాకేజీ అని ఎలా అంటున్నారో. ప్రత్యేక హోదా ఉన్న జమ్ముకశ్మీర్ కు ప్రధాని మోదీ 80వేల కోట్లు ఇచ్చారు. అంతమాత్రాన ప్రత్యేక హోదా తీసేశారా? కేంద్రంలో భవిష్యత్ లో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ కూటమికి 280 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. 25కు 22 లేదా 23 సీట్లు సాధించి కేంద్రంలో మనం నిలబడాలని పిలుపునిలబితే అప్పుడు మనం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తే హోదా తప్పకుండా వస్తుంది. ప్రదీప్(లండన్) ప్రదీప్: చంద్రబాబు స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు? జగన్: నేను ఆయన స్థానంలో ఉంటే కేంద్రంలోని మా మంత్రులతో రాజీనామా చేయిస్తాను. రెండున్నరేళ్లు విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు. నోటుకు కోట్లు కేసులో ఇరుక్కుని ఉన్నారు. దాంతో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారు. సంతోష్(సింగపూర్) సంతోష్: మరో రెండున్నరేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారు. వారికి ఇప్పడు కావాల్సిన ప్యాకేజీ వస్తుంది. సింగపూర్ అంటే ప్రపంచ పటంలో ఓ చిన్న పాయింట్ లాంటిది. ఎంతో పెద్దదైనా రాష్ట్రం ఏపీని సింగపూర్ లా చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. 90 శాతం పనులు జరిగిన దాన్ని ఇప్పుడు చూపించి ఐదారు పంపులు పెట్టి, పట్టిసీమ తానే చేశానని చెప్పుకుంటున్నారు. ఇందులో ఆయన చేసింది ఏముంది? జగన్: మీరు చెప్పిన విషయం వింటే బాబుకు జ్ఞానోదయం అవుతుంది. అవినీతిని ప్రశ్నిస్తే.. అడ్డుపడుతున్నాడని అంటారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ చేయించడం, ప్రాజెక్టుల విషయంలో నిధుల దుర్వినియోగం ఇలా ఏ విషయాన్ని లేవనెత్తినా పట్టించుకోవడం లేదు. తాను ఏం చేసినా ప్రజలు నమ్మేస్తారన్న భ్రమలో ఇంకా ఉన్నారు. నటరాజ్ (అమెరికా) నటరాజ్ : ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి తేడా ఏంటి? ప్రజలకు ఈ విషయం ఎలా అర్థమవుతుంది? జగన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండేందుకు ప్యాకేజీ అనే కొత్త పదాన్ని తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి ప్యాకేజీ అనేది అబద్ధం. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మెత్తంలో ఏదైనా ఇస్తే దాన్ని మనం ప్యాకేజీ అనాలి. కానీ అర్ధరాత్రి పూట ఏదో ఓ ప్రకటన చేశారు. ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను ఇవ్వకపోగా, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రత్యేక ప్యాకేజీ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. వెంకయ్యనాయుడు గతంలో చెప్పిన మాటపై స్పందిస్తూ.. ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని ఆయన గతంలో చెప్పారు. రాష్ట్రానికి హోదా ఇవ్వలేదు. హోదా వస్తే ఆదాయపన్ను, ఎక్సైజ్ పన్నులపై 100 శాతం మినహాయింపు ఉంటుంది. దాంతో పాటు జీఎస్టీ ప్రభావం కూడా రాష్ట్రంలో ఉండదు. -
అవసరమైతే మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా: వైఎస్ జగన్
హైదరాబాద్: ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ కు అన్ని ప్రయోజనాలు వస్తాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా వచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రవాసాంధ్రులతో ఆదివారం రాత్రి లైవ్ షో ద్వారా ఆయన ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారని, హైదరాబాద్ నగరం మనకు లేకుండా పోవడం వల్ల 98 శాతంపైనే కంపెనీలు కోల్పోయామని చెప్పారు. 70 శాతం ఉత్పత్తి రంగం హైదరాబాద్ లోనే ఉందని గుర్తు చేశారు. ఇప్పుడున్న మౌలిక వసతులతో మనం పోటీ పడలేమని, ప్రత్యేక హోదా వస్తేనే అన్ని వస్తాయని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఆదాయపన్ను కట్టాల్సిన అవసరం ఉండదని, పారిశ్రామిక రాయితీలు వస్తాయని వెల్లడించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే రాయితీలు వస్తాయని తెలిపారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీయిచ్చిందన్నారు. హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు మాట్లాడడం లేదన్నారు. హోదా ఇవ్వబోమన్న జైట్లీ ప్రకటనను చంద్రబాబు సిగ్గులేకుండా స్వాగతించారని ధ్వజమెత్తారు. అరుణ్ జైట్లీ ప్రకటన మొత్తం చూస్తే ఎవరు థ్యాంక్స్ చెప్పరని అన్నారు. మన రావాల్సిన వాటా కంటే ఏమీ రానప్పుడు ప్యాకేజీ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు పూర్తిగా రాజీపడ్డారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు చేస్తుంటే నీరుగార్చే ప్రయత్నం చేశారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు. అవసరమైతే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని స్పష్టం చేశారు. సరైన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం అందరినీ కలుపుకు పోతామని, పోరాటం చేస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చితీరుతుందని ఆయన భరోసాయిచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని సాధించుకోవడం పెద్ద కష్టం కాదు చంద్రబాబు లాంటి అబద్దాలకోరు మరెవరూ ఉండరు పోలవరం ప్రాజెక్టు నిబంధనలను అడ్డగోలుగా మార్చారు వ్యవస్థలో మార్పు రావాలి, నేతలను నిలదీసే పరిస్థితి రావాలి ఎన్నాళ్లు బతికామన్నది ముఖ్యం కాదు, ఎలా బతికామన్నదే ముఖ్యం పరిశ్రమలు వస్తేనే యువతకు ఉపాధి లభిస్తుంది ప్రత్యేక హోదా వస్తేనే పారిశ్రామిక రాయితీలు వస్తాయి రాయితీలు ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులే మోసం చేస్తే పరిస్థితి వస్తే ఇంకెవరికి చెప్పాలి? ప్రత్యేక హోదా ఉద్యమంలో కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుపోతాం ప్రజా సంఘాలు, కమ్యూనిస్టులతో కలిసే ముందుకు సాగుతున్నాం ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయారు బీజేపీ రాష్ట్రానికి ఏం చేసినా చేయకపోయినా తన కేసులను పట్టించుకోకపోయినా ఫర్వాలేదని బాబు అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజల తరపున నిజాయితీగా పోరాడుతున్నది మాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారు అందరు కలిసి రాబట్టే ప్రత్యేక హోదా కోసం చేపడుతున్న ప్రతి ఆందోళన విజయవంతం అవుతోంది మా ఆందోళనలతో హోదాపై ప్రజలందరినీ చైతన్యపరుస్తున్నాం, మా ధ్యేయం హోదా సాధించమే హోదా సంజీవనే.. పదేళ్లు కాదు పదిహేనేళ్లు ఇవ్వాలన్న చంద్రబాబు, వెంకయ్య నాయుడే ఇవాళ మాట మారుస్తున్నారు విభజనపై యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఏపీలో కాంగ్రెస్ ఎలా చతికిలపడిందో.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీది కూడా అదే పరిస్థితి ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం ఒక్క ప్రధానిమంత్రికే ఉంది ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎప్పుడు చెప్పలేదు. ఆ సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ రాసిన లేఖ చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది ప్రత్యేక హోదా ఉన్న జమ్మూకశ్మీర్ కు ప్రధాని మోదీ రూ. 80 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చారు. అయితే హోదా ఉండనట్టా? 2019లో కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. 280 సీట్లు ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. 22-23 సీట్లు గెల్చుకుంటే కేంద్రాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉంటుంది వినుకొండ ఎమ్మెల్యే ఎక్కడో ప్రత్యేక హోదా ఇచ్చిన హిమచల్ ప్రదేశ్ లో కంపెనీ పెట్టారు దీనిని ఏమనాలి? హోదా వచ్చే లాభాలతో పారిశ్రామికవేత్తలు వారంతట వారే పెట్టుబడులు పెడతారు రాజధాని విషయంలో చంద్రబాబు అందరినీ తప్పుదోవ పట్టించారు 4 పంటలు పండే భూములను మాయమాటలు చెప్పి రైతుల నుంచి కొట్టేశారు ఇప్పుడు స్విజ్ చాలెంజ్ పేరుతో కాలయాపన చేస్తున్నారు పార్టీ మారి వచ్చిన 20 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించరు చంద్రబాబు అవినీతి ప్రశ్నిస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు ఏపీలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది చదువుకున్న యువత, మంచి నైపుణ్యం ఉన్న యువత ఉంది ప్రత్యేక హోదా వస్తే వాళ్లందరికీ మేలు జరుగుతుంది ఎవరు ధైర్యం కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసంతో పోరాడితే కచ్చితంగా హోదా వస్తుంది ప్రత్యేక హోదా కోసం అందరూ కలిసి రావాలి. మీ అందరి మద్దతు కావాలి పోరాటం చేస్తే కచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చితీరుతుంది