breaking news
Libyan coast
-
లిబియాలో 500మంది జలసమాధి!
కైరో: లిబియాలో ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదం భయంతో ఈజిప్టు నుంచి లిబియా వైపు సముద్రం గుండా వలస వెళుతున్న వారి నౌక లిబియా తీరం మునిగిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో వలసదారులు నీటి మునిగిపోయినట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ వెల్లడించింది. దాదాపు 500మందికి పైగా జలసమాధి అయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ బోటులో ప్రయాణించినవారిలో 41మంది మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. వీరిలో 37మంది పురుషులు, ముగ్గురు మహిళలు, మూడేళ్ల బాలుడు ఉన్నారు. మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఐరోపాలో కొనసాగుతున్న వలసల సంక్షోభంలో ఇదే అతిపెద్ద ప్రమాదంగా నమోదు కానుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పడవ బోల్తా: 234 మంది గల్లంతు
లిబియా: లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలో పడవ బోల్తా పడింది. ఆ దుర్ఘటనలో పడవలో ప్రయాణిస్తున్న 250 మంది నీట మునిగారని కోస్ట్‌గార్డ్ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న రక్షణ దళం వెంటనే రంగంలోకి దిగి 16 మందిని రక్షించిందని తెలిపారు. 234 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. పడవలో ప్రయాణిస్తున్నవారంతా యూరప్ దేశానికి వలస వెళ్తున్న ఆఫ్రికావాసులను ఉన్నతాధికారి పేర్కొన్నారు.