Land Ceiling Act
-
రూ.150 కోట్ల ప్రభుత్వ భూమికి ఎమ్మెల్యే 'వరద' స్కెచ్
సాక్షి టాస్క్ ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లాలో కడప తర్వాత ప్రొద్దుటూరు అతిపెద్ద పట్టణంగా ఉంది. ఈ మున్సిపాలిటీకి 120 ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడున్న భూములు, స్థలాలు ఎక్కువ ధర పలుకుతుండడంతో రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని దక్కించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఆయన తనయుడు కొండారెడ్డి స్కెచ్ వేశారు. వివరాలివీ.. మున్సిపాలిటీ పరిధిలోని బొల్లవరం వెంకటేశ్వరస్వామి ఆలయం వెనుక ఈ ప్రభుత్వ భూమి ఉంది. పట్టణంలోని బొల్లవరానికి చెందిన రైతు బద్వేలు సత్యనారాయణరెడ్డికి పెద్దమొత్తంలో భూములు ఉండడంతో అప్పట్లో ప్రవేశపెట్టిన ల్యాండ్ సీలింగ్ యాక్ట్‌తో నిబంధనల కన్నా ఎక్కువున్న భూమిని ప్రభుత్వం సేకరించింది. 1968లో సత్యనారాయణరెడ్డి కొనుగోలు చేసిన భూమిని 1975లో స్వాధీనం చేసుకుని 1979లో ఎస్సీలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. రామేశ్వరం, చౌటపల్లె, దొరసానిపల్లె గ్రామాలకు చెందిన తొమ్మిది మంది ఎస్సీలకు 497/1, 497/2, 467/6, 497/7, 497/8, 172/1, 172/3, 172/4, 491/1, 490/5, 490/6, 196/4 సర్వే నంబర్లలోని 9.68 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. 2007 జనవరి 6న ఎస్సీ రైతులకు ఫాం–1 నోటీసు ఇచ్చిన తహసీల్దార్ , 1985 జనవరి 10న భూములను నడిపి సుబ్బన్నకు అమ్మిన ఎస్సీ రైతులు రిజిస్ట్రేషన్ పత్రం ఎస్సీలైన పబ్బతి పుల్లయ్య, పబ్బతి చిన్న పుల్లయ్య, పబ్బతిæ బాలపుల్లయ్య, పొట్టిగాళ్ల సత్యరాజు, కడియం లక్ష్మీనరసమ్మ, చింతాకు వెంకటసుబ్బమ్మ, ఉక్కిసాల చిన్నక్క, రామేశ్వరం లలితమ్మ, మేకల శిలాసు, ఎర్రమాసు శిరోమణమ్మలకు తాత్కాలిక డీకేటీ పట్టాలను పంపిణీ చేశారు. వీరు పంట సాగు చేయడంతోపాటు ఏడాదికి రూ.470 పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ, వీరు పంటలు సాగుచేయకపోవడం, ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోవడంతో పాటు 1985 జనవరి 10న ఈ భూమిని రామేశ్వరానికి చెందిన నడిపి సుబ్బన్న (అగ్గిరాముడు), పెద్దసుబ్బన్న తదితరులకు అమ్ముకున్నారు. అప్పట్లోనే ఈ భూమిని వారికి రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాలను రద్దు చేసిన ప్రభుత్వం.. ప్రభుత్వం ఇచ్చిన భూమిని వీరు సాగుచేయకుండా ఇతరులకు అమ్ముకున్నారని కొంతమంది అప్పట్లోనే ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ విచారణ జరిపించారు. పట్టాలు పొందిన రైతులకు 2007 జూన్ 1న ఫాం–1 నోటీసు జారీచేశారు. భూములు తీసుకున్న తర్వాత ఎందుకు సాగుచేయలేదని, ప్రభుత్వానికి ఎందుకు పన్ను చెల్లించలేదని, దీనికి 15 రోజుల్లోపు సమాధానం చెప్పాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. పంటలు సాగు చేయకపోవడంతోపాటు పన్ను చెల్లించకపోవడం, పైగా చట్ట విరుద్ధంగా భూమిని అమ్మి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించారని రెవెన్యూ అధికారులు నిర్ధారించడంతో అప్పట్లోనే కలెక్టర్ వీరి పట్టాలను రద్దుచేశారు. ఏపీ అసైన్మెంట్ ల్యాండ్స్–1977లోని సెక్షన్–3 సబ్‌సెక్షన్ క్లాజ్(2) ప్రకారం ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంది. కోర్టును ఆశ్రయించిన ఎస్సీలు.. ఈ నేపథ్యంలో.. కొంతమంది ఎస్సీలు కోర్టును ఆశ్రయించారు. తాత్కాలిక డీకేటీ పట్టాలు కాకుండా తమకు శాశ్వత పట్టాలు పంపిణీ చేయాలని, పాస్‌పుస్తకాలూ ఇవ్వాలని కోరారు. ఏళ్ల తరబడి ఈ విచారణ సాగింది. మరోవైపు.. విలువైన ఈ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకోవాలనే లక్ష్యంతో బద్వేలు సత్యనారాయణరెడ్డి వ్యూహం పన్నినట్లు సమాచారం. భావితరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణ పరిధిలోని ఐదు కిలోమీటర్ల దూరం వరకు ప్రభుత్వ భూములను పంపిణీ చేయకూడదని 2012 జూన్ 18న ప్రభుత్వం జీఓ జారీచేసింది. నగరాలు, మున్సిపాలిటీలతోపాటు మేజర్ పంచాయతీ హెడ్‌క్వార్టర్ పరిధిలో కూడా ఈ నిబంధనలను పాటించాలని అందులో పేర్కొన్నారు. పరిశ్రమలతోపాటు వాణిజ్య అవసరాలకు కూడా భూములను పంపిణీ చెయ్యొద్దని తెలిపారు. ఈ నిబంధనల ఆధారంగా 2020 జూన్ 24న కలెక్టర్ హరికిరణ్ నివేదికను కోర్టుకు సమర్పించడంతో కోర్టులో రైతుల వ్యాజ్యాన్ని కొట్టేశారు. రైతులను మభ్యపెట్టి...సర్వే నంబర్ 497తోపాటు మిగిలిన భూమలున్నీ బొల్లవరం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయి. ఈ భూమి అంతా మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది. చుట్టూ ప్లాట్లు వేసి వెంచర్లు వేసి ఇళ్లు నిర్మించుకున్నారు. దీంతో.. సుమారు రూ.150 కోట్ల విలువైన 9.68 ఎకరాల భూమిని తిరిగి హస్తగతం చేసుకునేందుకు వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే చౌటపల్లె, దొరసానిపల్లె గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్‌లు లక్ష్మిరెడ్డి, అరవ మునివరలను ముందుపెట్టి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే వ్యూహం ప్రకారం 1985లో ఈ భూమి కొనుగోలు చేసిన నడిపి సుబ్బన్న, పెద్ద సుబ్బన్న కుమారులకు రూ.60 లక్షలు ఇచ్చి ఇటీవల లోక్ అదాలత్‌లో కేసును ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. అంతేకాక.. పూర్వం తాత్కాలిక డీకేటీ పట్టాలు పొందిన ఒక్కో రైతుకు కూడా రూ.10 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. రైతులు తిరిగి తహసీల్దార్‌ను సంప్రదించి తమకు శాశ్వత డీకేటీ పట్టాలు ఇవ్వడంతోపాటు పాస్‌పుస్తకాలు ఇవ్వాలంటూ వినతిపత్రం సమర్పించాలని భావిస్తున్నారు. అధికారుల ద్వారా సమస్య పరిష్కారం కాకుంటే కోర్టును ఆశ్రయించి తద్వారా ఈ భూమిని తిరిగి స్వా«దీనం చేసుకుని అమ్ముకునేందుకు వ్యూహం పన్నుతున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేతోపాటు ఆయన కుమారుడు కొండారెడ్డి ప్రభుత్వంలోని కీలక యువనేతను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ భూములన్నీ ప్రస్తుతం డీకేటీ జాబితాలో ఉన్నాయి. మాజీ సర్పంచ్‌లు లక్ష్మిరెడ్డి, అరవ మునివరలను ముందుపెట్టి ఎమ్మెల్యే, ఆయన తనయుడు ఈ భూమిని హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
బడుగుల భూముల్లో రాబంధువులు
దశాబ్దాల క్రితం ఆ భూములు నిరుపేద ఎస్సీ, బీసీలకు దాఖలు పడ్డాయి. సర్కారు డీ పట్టాలు ఇచ్చింది. కానీ వారెవరూ వాటిని అనుభవించ లేకపోతున్నారు. కారణం అవి ఎప్పుడో పెత్తందార్లు కబంధ హస్తాల్లో చిక్కుకోవడమే. వారికి టీడీపీ కీలక నేత అండ ఉండటం, అడిగితే అంతు చూస్తారన్న భయంతో బడుగుల వాటి పై ఆశలు వదులుకున్నారు. 2022లో సమాచార హక్కు చట్టం ద్వారా ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి దళిత సంఘాలు కోట్ల విలువ చేసే çసుమారు 20 ఎకరాల భూములను టీడీపీ పెత్తందారులు చెర నుంచి రక్షించేందుకు ఉద్యమిస్తున్నారు. అయితే కీలక టీడీపీ నేత సోదరుడు అధికారులపై ఒత్తిడి చేస్తూ చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో మరో భూదందా వెలుగులోకి వచ్చింది. కింజరాపు ఫ్యామిలీ స్వగ్రామమైన కోటబొమ్మాళి మండలం నిమ్మాడకు పక్కనే తులసిపేటలో దాదాపు 19.62ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమి ఆక్రమణకు గురైంది. నిరుపేద ఎస్సీ, బీసీలకు ఇచ్చిన భూమిని అక్కడి పెత్తందార్లు ఆక్రమించుకోగా.. వీరికి టీడీపీ కీలక నేత అండగా నిలిచారు. ఇంకేముంది వారి కబంద హస్తాలనుంచి ఆక్రమిత భూమి బయటకి రావడం లేదు. గట్టిగా అడుగుదామంటే ఎక్కడ చంపేస్తారేమో అన్న.. భయంతో బాధితులు వణికిపోతున్నారు. 19.62 ఎకరాల మేర భూ ఆక్రమణ దివంగత కింజరాపు ఎర్రంనాయుడు, ప్రస్తుత ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఫ్యామిలీ రాజకీయాల్లోకి రాకముందు అప్పటి ప్రభుత్వం నిమ్మాడకు పక్కనున్న తులసిపేటలోని నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు ల్యాండ్ సీలింగ్ భూమిని డీ పట్టాల కింద ఇచ్చింది. కింజరాపు ఫ్యామిలీ స్వ గ్రామం నిమ్మాడకు కిలోమీటరన్నర దూరంలో ఉ న్న చిట్టివలస రెవెన్యూ పరిధిలో తులసిపేట ఉంది. సర్వే నెంబర్.194/1, 194/7,195/2, 200/1, 203/3బి, 208/2ఎ, 208/2సీ, 217/2, 222/1లోగల 19.62ఎకరాల భూమిని 33 మంది నిరుపేద ఎస్సీలకు, 19 మంది నిరుపేద బీసీలకు డీ పట్టాల కింద ప్రభుత్వమిచ్చింది. అయితే, ప్రభుత్వం తమకిచ్చిన భూములను లబ్ధిదారులు వెంటనే సాగు చేయకపోవడంతో అక్కడనున్న టీడీపీ నేతల అండదండలున్న పెత్తందార్లు ఆక్రమించారు. అంతటితో ఆగకుండా సాగు చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములు కావడంతో భూములు వదులుకోవడానికి ససేమిరా అంటున్నారు. టీడీపీ కీలక నేతలు అండదండలు ఉండటంతో ఆ భూమి మీదకి నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులు వెళ్లడానికి భయపడుతున్నారు. అసలే అక్కడ హత్యా రాజకీయాలు. నిమ్మాడ కేంద్రంగా టీడీపీ కీలక నేత ఫ్యామిలీకి నేర చరిత్ర కూడా ఉంది. వారిని కాదని అక్కడ ముందుకెళ్లడానికి సహజంగానే భయం. అలాంటి పరిస్థితులున్న పక్క గ్రామమే కావడంతో ప్రభుత్వం తమకిచ్చిన భూముల్లోకి వెళ్లేందుకు సాహసించలేకపోతున్నారు. ఆందోళనలు చేస్తున్నా.. నిరుపేద ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ దళిత మహసభ జిల్లా శాఖ, మరికొన్ని సంఘాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా గత కొన్నాళ్లుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ జిల్లా శాఖ అధ్యక్షుడు, టెక్కలి వాసి బోకర నారాయణరావు సమాచార హక్కు చట్టం కింద ఆ భూముల వివరాలు, పట్టాదారులెవరు, ప్రస్తుత అనుభవదారులు ఎవరన్న వివరాలను లిఖిత పూర్వకంగా అడిగారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమాచార హక్కు చట్టం కింద లిఖితపూర్వంగా 2022 మార్చిలో వివరాలు ఇచ్చింది. 19.62 ఎకరాలను 33 మంది ఎస్సీలకు, 19 మంది బీసీలకు ఇచ్చారని, ఇప్పుడా భూమి ఆక్రమణ జరిగిందని, ఫలానా వ్యక్తుల అనుభవంలో ఉందని నిర్ధారణ కూడా చేస్తూ వివరాల్లో పేర్కొంది. ఆక్రమణలో ఉన్న భూమిని అసలైన లబ్ధిదారులకు అప్పగించాలని కొన్ని నెలలుగా ఆందోళన జరుగుతోంది. అధికారులపై ఒత్తిళ్లు ఆందోళనలు జరుగుతుండటం, ఆక్రమిత భూమి వ్యవహారం వెలుగు చూడటం, సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన రిప్లయ్‌లో ఆక్రమణలు ‘డీ–పట్టా భూములు అప్పగించాలి’ కోటబొమ్మాళి: మండలంలోని చిట్టివలస పంచాయతీ తులసిపేటలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన డీ–పట్టా భూములను గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకున్నారని దళిత హక్కుల పోరాట కమిటీ జిల్లా కార్యదర్శి ఎడ్ల గోపి, అధ్యక్షుడు పాల పోలారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన తెలిపారు. ఈనెల 20లోగా రెవెన్యూ అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ జామి ఈశ్వరమ్మకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చిట్టి సింహాచలం, బలగ రామారావు, జామాన రామారావు, బమ్మిడి వేణు పాల్గొన్నారు. ఆక్రమణదారులకు అండగా పెద్దలు డీ పట్టా భూముల ఆక్రమణదారులకు రాజకీయ పెత్తనం, అధికారం చెలాయిస్తున్న ఫ్యామిలీ అండదండలు ఉన్నాయి. ఆక్రమణ బాగోతమంతా టీడీపీ కీలక నేతల కనుసన్నల్లోనే జరిగింది. పెద్దల అండదండలు ఉండటంతో నిరుపేదలు ఏం చేయలేకపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ వాదన వినిపిస్తున్నారు. ముందుకెళ్లలేక, వెనక్కి తగ్గలేక నిరుపేద లబ్ధిదారులు అన్యాయానికి గురవుతున్నారు. ఇప్పటికైనా ఆ భూములు అసలైన లబ్ధిదారులకు అప్పగించి న్యాయం చేయాలి. – బోకర నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ దళిత మహసభ జిల్లా శాఖ అధ్యక్షుడు స్వాధీనం చేసుకుంటాం తులసిపేట ప్రభుత్వ భూమిలో ఎస్సీ, బీసీ పేద కుటుంబాలకు పట్టాలిచ్చారని, అవి ఆక్రమణకు గురయ్యాయని టెక్కలి సబ్ కలెక్టర్‌కు దళిత సంఘం నేత ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఇటీవల గ్రామానికి మా సిబ్బందిని పంపించాం. కానీ, స్థానికంగా ఎవరూ సహకరించలేదు. బుధ వారం మరికొందరు బాధిత లబ్ధిదారులు ఫిర్యా దు చేయడంతో మళ్లీ గ్రామానికి వెళ్లి సమగ్ర విచారణ జరుపుతాం. అంతా నిర్ధారించుకున్నాక పోలీసుల బందోబస్తు మధ్య ఆ భూములను స్వాధీ నం చేసుకుని, అసలైన లబ్ధిదారులకు అప్పగిస్తాం. – జామి ఈశ్వరమ్మ, తహశీల్దార్, కోటబొమ్మాళి జరిగాయని అధికారులు నిర్ధారించడం వంటి పరిణామాల నేపథ్యంలో అధికారులు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న ఉద్దేశంతో టీడీపీ కీలక నేత సోదరుడు రంగంలోకి దిగి ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఇప్పుడా భూముల జోలికి పోవద్దని, తాము అధికారంలోకి వస్తామని, అంతవరకు జాప్యం చేయాలని తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. తమ మాట వినకపోతే తాము అధికారంలోకి వస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరికలు కూడా చేసినట్టు తెలియవచ్చింది. -
పట్టణ భూపరిమితి చట్టం.. ప్రవేశపెట్టిన వ్యక్తే రద్దు చేయమన్నారు!
ఇందిరాగాంధీ ప్రభుత్వంలో గృహ నిర్మాణ మంత్రి హోదాలో ఇందర్ కుమార్ గుజ్రాల్ పట్టణ భారతంలో ఇళ్ల స్థలాల ధరలను తగ్గించి, భూముల లభ్యతను పెంచాలనే ఉదాత్త ఆశయంతో పట్టణ భూ పరిమితి, నియంత్రణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. 1997లో యునైటెడ్ ఫ్రంట్ ప్రధానమంత్రి హోదాలో అదే ఐ.కె. గుజ్రాల్ ఆ చట్టాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించారు! అప్పుడు కూడా ఆయన ఆశయం పట్టణ భారతంలో ఇళ్ల స్థలాలను తగ్గించి, భూముల లభ్యతను పెంచడమే! ఏ లక్ష్యంతోనైతే పార్లమెంటు ఒక చట్టం చేసిందో సరిగ్గా అదే లక్ష్యాన్ని నెరవేర్చడానికి తిరిగి అదే చట్టాన్ని రద్దు చేయడం అనేది అరుదుగా జరిగే ఘటన. పార్లమెంటు చట్టం విఫలం కావడమే దీనికి కారణం. అన్ని సోషలిస్టు స్వప్నాల్లానే పట్టణ భూమి సామాజికీకరణ కల కూడా భగ్నం అయింది. పట్టణ భూ పరిమితి చట్టం అమలైన 64 నగరాలలో ప్రైవేటు యజమానుల నుంచి 2,20,000 హెక్టార్ల మిగులు పట్టణ భూములను ప్రభుత్వం సేకరించవలసి ఉంది. ఆ భూమిలో అత్యధిక భాగాన్ని పేదలకు ఇళ్లు కట్టడానికి వినియోగించవలసి ఉంది. కానీ వాస్తవంలో 19,000 హెక్టార్ల పట్టణ భూములను మాత్రమే సేకరించారు. అయితే, పట్టణ భూ పరిమితి చట్టం, అద్దె నియంత్రణ చట్టం, అధిక స్టాంప్ సుంకాల వల్ల కృత్రిమ భూ కొరత ఏర్పడి ముంబైలో భూముల ధరలు న్యూయార్క్, లండన్ ధరలను మించిపోయాయి. చాలా రాష్ట్రాల్లో పట్టణ భూపరిమితి చట్టాన్ని రద్దు చేశారు. దాంతో కనీసం ఒక తరం పట్టణ భారతీయులకు సొంత ఇల్లు అనేది కలగానే మిగిలింది. -
'ఉత్తమ్ గాంధీభవన్ వదిలి జనంలోకి వెళ్లు'
హైదరాబాద్: తెలంగాణలో చట్టబద్ధ పాలన సాగడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. భూసేకరణ చట్టాన్ని కేసీఆర్ సర్కారు ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో పిల్ వేయాలని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్ ను వదిలి జనంలోకి వెళ్లి ప్రజాసమస్యలపై పోరాడాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణ అంచనాలు పెంచుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. అవినీతి సొమ్ముతోనే ఇతర పార్టీల నేతలను కొంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర బడ్జెట్ కేసీఆర్ కుబుంబ సొమ్ము కాదు, ప్రజల సొమ్మున్నారు. గాంధీభవన్ లో మున్సిపల్ ప్రతినిధుల శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ శిక్షణా కార్యక్రమాన్ని రెండేళ్ల కిందటే నిర్వహించాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పార్టీ పెద్దలు భరోసా కల్పించనందు వల్లే మున్సిపల్ చైర్మన్లు పార్టీ మారారని అన్నారు. -
‘భూ’చోళ్లకు అండ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ప్రభుత్వం పంపిణీ చేసిన భూ ములకే దిక్కు లేకుండా పోయింది. సీలింగ్ యాక్ట్‌లో భూములు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు గిరిజనులకు పంపిణీ చేసిన భూములు తమవేనంటూ ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. బాధితులకు అండగా నిలవాల్సిన అధికారులు బడాబాబులకు వ త్తాసు పలుకుతున్నారు. వివరాలు ఇలా.. మెదక్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన హఫీజా బేగంకు అదే గ్రామంలో ఒకటి నుంచి 51 సర్వే నంబర్లలో 920 ఎకరాల భూమి ఉండే ది. దీన్ని 1960లో నర్సింహారెడ్డి, జనార్దన్‌రావు, సూర్యారావు, తో పాటు మరో 5 మంది కొనుగోలు చేసి పట్టా చేయిం చుకున్నారు. అయితే సాగు చేయలేదు. సీలింగ్ యాక్ట్ ప్రకారం ఇంత భూమి ఉండరాదు. దీంతో ప్రభుత్వం కొంత భూమిని స్వా ధీనం చేసుకుంది. కొంత కాలం తరువా త ఈ భూమిని పేద గిరి జనులకు పంపిణీ చేసింది. 63 మంది గిరిజనులకు 71.02 ఎకరాల భూమిని పంపిణీ చేసింది. పట్టాలు కూడా ఇచ్చింది. 13 బీ కింద మరి కొందరిని హక్కుదారులను చేసిం ది. తరతారాలుగా ఇదే భూమినే నమ్ముకొని గిరిజనులు బతుకుతున్నా రు. ఇంత వరకు బాగున్నా సీలింగ్ యాక్ట్‌లో భూములు కోల్పోన వారి కుటుంబ సభ్యులు ఇప్పడు అనంతసాగర్‌కు వచ్చి పేదల భూములు తమవే నంటూ లాక్కోవ డం మొదలు పెట్టారు. బాధితులకు అండగా నిలబడాల్సిన రెవెన్యూ అధికారులు పెద్దల పంచన చేరారు. ఎప్పుడో భూము లు విడిచి వెళ్లిపోయిన మాజీ ఎమ్మె ల్యే నర్సింహారెడ్డి, జనార్దన్‌రావు, బషీరుద్దీన్ వారసులు అధికారుల అండదండలతో పేదల భూమిని ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అంతేకాకుండా విక్రయాలు కూడా జరిపారు. ప్రభుత్వ ఇచ్చిన పట్టాలను గిరిజనులు పోగొట్టుకోవడంతోనే సమస్య మొదలైంది. వారి వద్ద పట్టాలు లేవన్న విషయం తెలుసుకొనే సీలింగ్ యాక్ట్‌లో భూములు కోల్పోయిన వారు పాత రికార్డులను చూపి స్థలాలను ఆక్రమించుకుంటున్నట్లు తెలిసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 27లో దాదాపు 370 ఎకరాల భూమి, సర్వే నంబర్ 36,51లో 350 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ భూమిలోని కొంత భాగాన్ని గిరి జనులు సాగు చేసుకుంటున్నారు. దాదాపు 71.02 ఎకరాల భూమిని అధికారికంగా హక్కులు పొంది సాగు చేసుకుంటున్నారు. 13/బీ కింద అప్పటిప్రభుత్వం ఒక్కొక్కరికి 1.10 గుంటల చొప్పున భూమి కేటాయించి పట్టాలు ఇచ్చింది. పాసు పుస్తకాలను మెదక్ ఏడీబీలో తనఖా పెట్టి రైతులు రుణాలు కూడా పొందారు. చట్టంలో ఇలా... భూ సీలింగ్ చట్టం 1973 ప్రకారం అనంతసాగర్ గ్రామంలోని సర్వే నెంబర్ 24లో 6.46 ఎకరాలు ప్రొసిడింగ్ నెంబర్ సీఆర్/6497/1978లో ఐదు మందికి, 1985వ సంవత్సరంలో 2394/ఎస్జీడీ/75 ప్రొసిడింగ్ సీసీ నెంబర్‌తో సర్వేనంబర్ 27లో 42.36 ఎకరాల భూమిని 41 మంది గిరిజనులకు, 1991లో సర్వే నంబర్ 27లో ప్రొసిడింగ్ నెంబర్ డీ/5676/91 ఉత్తర్వుతో 22.25 ఎకరాల భూమిని 17 మంది లబ్ధిదారులకు ఇస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే నిజమైన పట్టాదారులు గిరిజనులే. మొత్తం 71.02 ఎకరాల్లో తిమ్మాయిపల్లి, శేరిశంకర్ తండా, అప్పటి అనంతసాగర్ గ్రామాలకు చెందిన దాదాపు 63 మంది దళిత, గిరిజనులకు పట్టాలు చేశారు. గతంలో ఇక్కడ జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన డాక్టర్ శరత్ గిరిజనుల భూముల్లో వారిని కూర్చోబెట్టి, హక్కు పత్రాలు సిద్ధం చేసి ఇవ్వాలని తహశీల్దారు విజయలక్ష్మిని ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఆయన ఆదేశాలు అమలు కాకపోవటం గమనార్హం. ఏ ఒక్క హక్కు పత్రం ఉన్నా చాలు భూములకు సంబంధించిన ఏ ఒక్క హక్కు పత్రం ఉన్నా సరే తిమ్మాయిపల్లి దళిత, గిరిజనులు తనను సంప్రదించవచ్చు. వాటి ఆధారంగా ఆక్రమించుకున్న భూములను తిరిగి పట్టా చేయిస్తాం. రెవెన్యూ రికార్డుల్లో ఆధారాలు ఉంటే గిరిజనుల భూ హక్కులకు ఎలాంటి ఢోకా ఉండదు. పరిశీలించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉంది. ఆర్డీవో మెంచు నగేష్


