‘కుస్తీ’పట్టి పతకాలు సాధించారు!
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో జిల్లా బాల,బాలికల జట్టు జయకేతనాన్ని మోగించింది. రాష్ట్రస్థాయి పోటీలో మొట్టమొదటిసారి జిల్లా జట్టు ప్రతిభ కనబరచడంతో స్కూల్‌గేమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు అంజయ్య, నారాయణ లు ఆనందం వ్యక్తం చేశారు. కష్ణాజిల్లా తలప్రోలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు 2 బంగారు, 6 వెండి, 8 కాంస్య పతకాలను సాధించారు.
రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను గురువారం స్థానిక కొత్తూరు ఉన్నత పాఠశాలలో అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయస్థాయిలో మంచి ప్రతిభను చూపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీఈటీలు శ్రీనాథ్, మొరార్జీ, మల్లికార్జున, తిప్పేస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్ర, హేమలత తదితరులు క్రీడాకారులను అభినందించారు.
బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు
– వేణుమాధవ్, శ్రీహర్ష
వెండి పతకాలు సాధించిన క్రీడాకారులు
– రోషన్, లక్ష్మీనరసింహ, రోషన్, హర్షవర్థన్, హేమంత్ నాయక్, మౌనిక, లోహిత్ కుమార్,
కాంస్య పతకాలు సాధించిన క్రీడాకారులు
– స్రవంతి, సుజాత, సాయియశ్వంత్, పవన్‌కళ్యాణ్, చంటి, రాకేష్, రవితేజ, లోకేష్ నాయక్