breaking news
kurnool market
-
ఉల్లి పంట చిది‘మేత’
ఈయన పేరు హకీన్ బాషా. ఉల్లి రైతు. ఊరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి. ఉన్న రెండున్నర ఎకరాల్లో ఆరుగాలం అష్టకష్టాలు పడి అప్పులు చేసి ఉల్లి సాగు చేశాడు. నూటికి రూ.2, 3 వడ్డీకి రూ.2.50లక్షలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. సీజన్ ప్రారంభంలో వర్షాభావానికి ఎదరొడ్డాడు. తీరా పంట చేతికొచ్చే సమయానికి అధిక వర్షాలు దిగుబడిని తీవ్రంగా దెబ్బతీశాయి. గడ్డకుళ్లు తెగులు ప్రభావంతో 60 నుంచి 70 క్వింటాళ్లకు మించి దిగుబడి రాని దుస్థితి. వచ్చిన పంటనైనా అమ్ముదామనుకుంటే కొనే నాథుడు కనిపించడం లేదు. నాణ్యమైన ఉల్లినే క్వింటా రూ.400 నుంచి 500కు మించి వ్యాపారులు కొనడం లేదు. దీంతో గత్యంతరం లేని స్థితిలో ఉల్లి పంటను కోయకుండానే ఇలా గొర్రెలకు మేతగా పెట్టి కన్నీటిపర్యంతమయ్యాడు. సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం/ఎమ్మిగనూరు టౌన్/కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వ పాలనలో ఉల్లి రైతులకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక వర్షాలు తీవ్రంగా దెబ్బతీయడంతోపాటు ధర లేక కర్షకులు విలవిల్లాడుతున్నారు. అయినా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. క్వింటా కనీసం రూ.400–500కు మించి పలకకపోవడంతో ఏం చేయాలో పాలుపోక పంటను కోయకుండానే గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. ఉల్లి విస్తీర్ణం లక్ష ఎకరాలు రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు. అత్యధికంగా కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, విజయ నగరం జిల్లాల్లో సాగవుతుండగా, కర్నూలు జిల్లా ఉల్లికి జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు తర్వాత మైదుకూరులో సాగయ్యే కేపీ ఉల్లికి గిరాకీ ఎక్కువ. మూడు నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. ఖరీఫ్‌లో 8 నుంచి 10 టన్నులు, రబీలో 10 నుంచి 20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి.కనీసం 3 నుంచి 6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ నిల్వ చేసుకునే సదుపాయాల్లేక పంట చేతికిరాగానే రైతులు అయినకాడకి అమ్ముకోవల్సి వస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మే నెలలో వేసిన పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి. గడ్డకుళ్లు తెగులు సోకడంతో దిగుబడులు పడిపోయాయి. దీంతో ఎకరాకు 50 నుంచి 70 క్వింటాళ్ల దిగుబడి రావడం గగనంగా మారింది. దీనికితోడు పంట నాణ్యత కూడా దెబ్బతింది. తేమ సాకుతో కొనని వ్యాపారులు కోతకొచి్చన పంట కర్నూలులోని ప్రధాన ఉల్లి మార్కెట్‌కు రావడం మొదలైంది. మార్కెట్‌కు వస్తున్న ఉల్లిని తేమ ఎక్కువగా ఉందని, నాణ్యత లేదనే సాకులతో కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కర్నూలు మార్కెట్‌కు సోమవారం 12,,903 క్వింటాళ్ల పంట రాగా, మంగళవారం 8,391 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. సోమవారం 5 వేల క్వింటాళ్లు కొనుగోలు చేయగా, మంగళవారం కేవలం 1,500 క్వింటాళ్లు మాత్రమే వ్యాపారులు కొన్నారు. కొనుగోలు చేసిన ఉల్లిలో సైతం 90 శాతానికిపైగా క్వింటా రూ.400–500కు మించి ధర లభించలేదు.సీజన్ ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే పంట పూర్తిగా మార్కెట్‌కు వచ్చే సెపె్టంబర్లో పరిస్థితి మరింత దిగజారిపోతుందేమోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. అధిక వర్షాలతో నాణ్యత దెబ్బతినడంతో పాటు మహారాష్ట్రలో పండిన పంట పెద్దఎత్తున ఉల్లి మార్కెట్‌కు రావడంతోపాటు కోల్‌కతాతో పాటు బంగ్లాదేశ్‌కు ఎగుమతులు లేక పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్థానికంగా పండిన పంట దండిగా ఉండగా మహారాష్ట్ర ఉల్లి దిగుమతికి అధికారులు అనుమతివ్వడం వల్ల ఇక్కడి రైతులు దెబ్బతింటున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రతికూల పరిస్థితులను చక్కదిద్ది ఉల్లికి మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అసలే పట్టించుకోవడం లేదు. తాడేపల్లిగూడెం మార్కెట్లోనూ అదే దుస్థితి తాడేపల్లి గూడెం మార్కెట్లోనూ కర్నూలు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. మంగళవారం కర్నూలు నుంచి కేవలం 15 లారీల సరుకు మాత్రమే మార్కెట్‌కు వచ్చింది. మహారాష్ట్ర నుంచి దిగుమతైన ఉల్లి ముందు కర్నూలులో పండించిన పంట నిలబడలేకపోతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక్కడ అధిక వర్షాలకు గడ్డ కుళ్లు తెగులు వల్ల పంట నాణ్యత లేదని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఉల్లి రైతుకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వంవైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉల్లి రైతులకు ఐదేళ్లూ అండగా నిలిచారు. 2019–24 మధ్య గరిష్టంగా క్వింటా రూ.3500 నుంచి రూ.4వేల మధ్య ధర లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా క్వింటాకు రూ.770 కనీస మద్దతు ధరను గత ప్రభుత్వం ప్రకటించింది. ధర తగ్గిన సందర్భాల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేసింది.ఈ విధంగా ఐదేళ్లలో రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొని రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు విక్రయించింది. మరొక వైపు ధరలు పెరిగిన సందర్భాల్లో షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లి కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50లకే సరఫరా చేసి వినియోగదారులపై భారం పడకుండా చూసింది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలిఖరీఫ్లో మార్కెట్‌కు వచ్చే తొలి పంట ఉల్లి. అత్యధికంగా సాగయ్యే కర్నూలు జిల్లాలో ఉల్లికి ధర లేకపోవడం ఆందోళనకరం. ఉల్లిసాగు చేసేది చిన్న, సన్నకారు రైతులే. సాధారణంగా ఉల్లి మార్కెట్‌కు వచ్చే తొలినాళ్లలో మంచి ధర లభిస్తుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి కని్పంచడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎక్కువగా ఉల్లి మార్కెట్‌కు వచ్చేసెపె్టంబర్లో పరిస్థితి మరీ అధ్వానంగా మారుతుంది. మార్కెటింగ్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలి – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ రూ.3.60 లక్షల నష్టం నేను 6 ఎకరాల్లో ఎకరాకు రూ.90వేల పెట్టుబడితో ఉల్లి సాగు చేశాను. కోతకొచ్చే సమయంలో కురిసిన అధిక వర్షాలతో పంట భారీగా దెబ్బతింది. ఎకరాకు 50 క్వింటాళ్లకు మించి రాలేదు. నాణ్యత లేదనే సాకుతో ట్రేడర్స్ కొనేందుకు ముందుకు రావడం లేదు. కొద్దిగా నాణ్యత బాగున్న ఉల్లిగడ్డలను క్వింటా రూ.600కు అమ్ముకున్న. ఎకరాకు రూ.30వేల చొప్పున 6 ఎకరాలకు రూ.1.80 లక్షలు ఆదాయం వచ్చింది. కనీసం పెట్టుబడి కూడా దక్కకపోగా, రూ.3.60 లక్షల వరకు నష్టం వచ్చింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – ముల్లా మొహిద్దీన్ , పేలకుర్తి, కర్నూలు జిల్లా కొనేవారు లేరు రెండున్నర ఎకరాలు.. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి అయ్యింది. ఎకరాకు 50 క్వింటాళ్ల అయ్యింది. క్వింటా రూ.500కు ఇద్దామన్నా ట్రేడర్స్ కొనేందుకు ముందుకు రావడం లేదు. 2023–24 సీజన్లో ఎకరాకు 70–100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా 3వేలకు పైగా ధర లభించింది. ఎకరాకు రూ.50వేలు మిగిలింది. కానీ ఈసారి 1.50 లక్షల వరకు నష్టపోతున్నాం. కోత కోసిన పంటను ఏం చేయాలో అర్ధం కావడం లేదు. మేకలు, గొర్రెలకు మేతకు వదిలేయడం తప్ప మరొక మార్గం కన్పించడం లేదు. – నారప్పగారి కృష్ణ, వల్లూకూరు, కర్నూలు జిల్లా -
భారం ఎంతైనా కిలో ఉల్లి రూ.25కే
సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలకు రెక్కలు రావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా సబ్సిడీ ధరలకే రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు విక్రయిస్తోంది. ఈ విషయంలో వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖలు, రైతుబజార్ల ఎస్టేట్ అధికారులతో సీఎం కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వారం రోజులుగా రాష్ట్రంలో ఉల్లిధరలు కిలో రూ.80 నుండి రూ.100 వరకూ పెరగడంతో ఈ అధిక ధరలను అదుపుచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గేంత వరకూ రైతు బజార్లలో అమ్మకాలు చేపట్టాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ధరలను పెంచేందుకు అక్రమంగా ఎవరైనా ఉల్లిపాయలు నిల్వ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంతైనా సామాన్యులకు రైతు బజార్లలో రూ.25 కే కిలో చొప్పున అమ్మాలని సీఎం వైఎస్ జగన్ మంగళవారం ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అక్రమంగా ఉల్లిపాయల నిల్వ చేస్తే వారిపై మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు రోజుకు 500 నుంచి 1,200 క్వింటాళ్ల ఉల్లిపాయలు సేకరించి మార్కెటింగ్ శాఖ ద్వారా రైతు బజార్లకు తరలిస్తున్నారు. ప్రతీ కిలో మీద రూ. 50కి పైగా ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చి రైతు బజార్లకు సరఫరా చేస్తోంది. రాష్ట్రానికి షోలాపూర్ ఉల్లిపాయలు కర్నూలు మార్కెట్లో ఉల్లి నిల్వలు తగ్గిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకునేందుకు చర్యలు తీసుకుంది. షోలాపూర్ మార్కెట్‌కు ఉల్లి నిల్వలు అధికంగా వస్తున్నాయనే సమాచారం తెలుసుకున్న మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న అక్కడికి తమ సిబ్బందిని పంపించారు. బుధవారం నుంచి అక్కడ ఉల్లిని కొనుగోలు చేసి రోడ్డు మార్గంలో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌యార్డులో ఉల్లి ధరల హోరు కొనసాగుతోంది. మంగళవారం క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.10,220 పలికింది. -
ఇక ఈ-మార్కెటింగ్!
సాక్షి, కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ ప్రస్తుతం ఆధునిక హంగులు సంతరించుకోబోతోంది. త్వరలో జిల్లాలో ‘ఈ-మార్కెట్’ వ్యవస్థ రైతులకు కొంతమేర అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో ‘ఈ-మార్కెటింగ్’ వ్యవస్థ విజయవంతమైన తర్వాత ప్రభుత్వం ఏపీలో కూడా ఈ విధానం అమలు చేయాలని భావించింది. రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్రంలోని గుంటూరు, ఖమ్మం, వరంగల్ నిజామాబాద్, కేసముద్రం, మిర్యాలగూడెం వ్యవసాయ మార్కెట్లలో నవంబరు 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.ఈ నేపథ్యంలో రెండో విడతలో భాగంగా కర్నూలులో ‘ఈ-మార్కెట్’ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటకలో దిగ్విజయంగా ఈ వ్యవస్థను అమలు చేసిన సంస్థ ప్రతినిధులతో జిల్లా అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో జిల్లావ్యాప్తంగా ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. రైతులకెన్నో ప్రయోజనాలు.. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే అధికారులు ఆన్‌లైన్‌కు అనుసంధిస్తారు. సరుకు లోపలికి తెచ్చేడానికి బయటకు పంపేదానికి ఎలాంటి తేడాల్లేకుండా ఉండటానికి ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేస్తారు. సంబంధిత రైతు సరుకును ఆన్లైన్లో నమోదు చేస్తారు. సీసీ కెమోరాలను కూడా ఉంచుతారు. ప్రతి రైతు పేరు ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌లో నమోదవుతుంది. సరుకు ఎంట్రీగేటు దగ్గర కంప్యూటర్లో నమోదు కాగానే లాట్ నంబరు కేటాయిస్తారు. అదే నంబరును సరుకు దగ్గర ఉంచుతారు. కమీషన్ ఏజెంట్లకు, కొనుగోలుదారులకు ఐటీ నంబరు ఇస్తారు. ప్రతిరోజు వీలైనంత త్వరగా ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు. బహిరంగ వేలం కాకుండా కొనుగోలుదారులు చెల్లించే ధరను సరుకు దగ్గర నమోదు చేస్తారు. ఈ ధర మరో కొనుగోలుదారుడికి తెలియదు. సరుకు ఎంత ధర పలికింది. సంక్షిప్త సమాచారం ద్వారా రైతుకు తెలియజేస్తారు. గిట్టుబాటు అయితే విక్రయించుకోవచ్చు. లేదా మరుసటి రోజు అమ్ముకోవచ్చు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి రైతుకు గిట్టుబాట ధర లభించే అవకాశం ఉంది. దేశంలోని ఏ మార్కెట్లో అయినా సరే ఏ పంటకు ఎంత ఉందనే విషయం గురించి కూడా ఇక్కడ రైతులు తెలుసుకోవచ్చు. మార్కెట్లోకి వచ్చి ధర విషయంలో దగాపడకుండా ఇంటి దగ్గర సంక్షిప్త సమాచారం ద్వారా ధర తెలుసుకున్న తర్వాతనే గిట్టుబాటు అవుతుందనుకుంటేనే మార్కెట్‌కు విక్రయానికి తెచ్చుకోవచ్చు. మార్కెట్లో గతంలో అక్రమాలకు ఇలాంటి విధానం ద్వారా తావుండదని అధికారులు భావిస్తున్నారు. రైతులు వెంటనే తక్‌పట్టీలు తీసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలుంటాయి ఇక్కడ. ప్రతిరోజు ఎంత సరుకు వచ్చింది, ఎంత బయటకు పోయింది కశ్చితంగా నమోదవుతుంది. మార్కెట్‌కు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. -
రైతన్నకు ఊరట
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: మార్కెటింగ్ శాఖ ఉద్యోగుల సమ్మెతో వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతన్నకు ఊరట లభించింది. సమ్మె ప్రభావాన్ని తగ్గిస్తూ జేఏసీ నాయకులు చర్యలు తీసుకున్నారు. దీంతో శనివారం నుంచి కర్నూలు మార్కెట్లో యథావిధిగా అమ్మకాలు కొనసాగనున్నాయి. సోమవారం నుంచి అన్ని వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలూ జరుగుతాయి. అయితే మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు మాత్రం సమ్మెలోనే ఉంటారు. అమ్మకాలకు సెక్యూరిటీ గార్డులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహకరిస్తారు. సీమాంధ్ర జిల్లాల జేఏసీ నేతలతో మార్కెట్ కమిటీ చైర్మన్ డి.వెంకటేశ్వరరెడ్డి, జేఏసీ కోకన్వీనర్ చంద్రమోహన్‌రెడ్డి చర్చించారు. ఈ నెల 20 నుంచి మార్కెట్లు బంద్ కావడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీంతో సానుకూల ఫలితం వచ్చింది. రైతులను దృష్టిలో ఉంచుకుని సమ్మెకు సడలింపు ఇచ్చిన మార్కెటింగ్ శాఖ జేఏసీకి శుక్రవారం కమిటీ డెరైక్టర్ ఫరూక్ అహ్మద్, కమిషన్, కొనుగోలుదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కో-కన్వీనర్ చంద్రమోహన్‌రెడ్డి, డెరైక్టర్లు శేషగిరిశెట్టి, కటకం శాంతి స్వరూప్, కట్టా శేఖర్, కమిషన్ ఏజెంట్ల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమానికి చర్యలు ఆదోని: రైతుల సంక్షేమం కోసం ఈ నెల 30 నుంచి ఆదోని మార్కెట్లో అమ్మకాలు ప్రారంభం కానున్నట్లు యార్డు కార్యదర్శి రాజేంద్రప్రసాద్, డీఈఈ సుబ్బారెడ్డి తెలిపారు. మార్కెట్లో దిగుబడుల ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవని, ప్రస్తుతం ఆయా దిగుబడుల ధరలు ఆశాజనకంగా ఉండడంతో వినియోగించుకోవాలని అన్నారు. ఆయా యార్డులలో అవుట్ సోర్సింగ్, ప్రొబిషనరీ ఉద్యోగులు సమ్మెలో లేరని, వారు రైతులకు సహకరిస్తారని తెలిపారు. రైతులు తమ దిగుబడులను సోమవారం నుంచి యార్డులోనే అమ్ముకోవచ్చని తెలిపారు.