breaking news
kuna ravi
-
గోబ్యాక్.. ఎమ్మెల్యేను అడ్డుకున్న గిరిజనులు
సాక్షి శ్రీకాకుళం: టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు సరుబుజ్జులి మండలం వెన్నెల వలసలో గిరిజనుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను గిరిజనులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టవద్దంటూ నినాదాలు చేశారు. కూన రవికుమార్ ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.అయితే కొద్ది రోజుల క్రితం థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా వెన్నెలవలస నుంచి సరుబుజ్జిలి వరకూ ర్యాలీ నిర్వహించాలని తలపించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైనే గిరిజనులు నిరసనలు చేపట్టారు. సురుబుజ్జి, బూర్జ మండలాలలో పవర్ ప్లాంట్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని పవర్ ప్లాంట్ నిర్మాణంతో పర్యావరణానికి తీవ్ర స్థాయిలో ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. థర్మల్ ప్లాంట్ నిర్మాణం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందని గిరిజనులు భావిస్తున్నారు. స్థానికుల జీవనోపాధి అయిన అడవులు, నీటి వనరులు, వ్యవసాయం ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న గిరిజనులు.. ఈ మేరకు నిరసనల చేపట్టారు. ఇది గత కొంతకాలం నుంచి కూటమి ప్రభుత్వానికి ఎదురవుతున్న నిరసన సెగ. ఇప్పటికే -థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ శ్రీకాకుళంలో ర్యాలీలు నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. స్థానికులు తమ భూములు, వనరులు కాపాడుకోవడానికి సంఘటిత పోరాటం చేస్తున్నారు.ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఎదురైన నిరసన సెగ.. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది. ఈ సంఘటనతో థర్మల్ ప్లాంట్ ప్రతిపాదనపై రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తం అయ్యే అవకాశం ఉంది. గిరిజనుల నిరసనను విస్మరిస్తే మాత్రం వారి నిరసనలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రజల జీవనాధారానికి సంబంధించిన సమస్య కాబట్టి, వారి నిరసనకు ప్రజాబలం పెరుగుతుంది. మొత్తంగా, శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ ప్లాంట్ నిర్మాణం గిరిజనుల ఆందోళనలకు కేంద్రబిందువుగా మారింది. -
TDP నేతలు తనను వేధిస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్న ప్రిన్సిపల్ సౌమ్య
-
ఏపీ అసెంబ్లీలో మంత్రుల తీరుపై TDP MLA కూన రవి విమర్శలు
-
‘టీడీపీ ఎమ్మెల్యే కూనరవితో ప్రాణహాని’
శ్రీకాకుళం, సాక్షి: టీడీపీ నేతల దాడులు, బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎమ్మెల్యే కూనరవితో తనకు ప్రాణహాని ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస స్వతంత్ర అభ్యర్థి సనపల సురేష్ తెలిపారు. ఆయన ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఎమ్మెల్యే దాడి, బెదిరింపుల విషయాన్ని బయటపెట్టారు. ‘‘ఎమ్మెల్యే కూనరవి నుంచి నాకు ప్రాణహాని ఉంది. అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటున్నానని దాడి చేశారు. ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. జిల్లా ప్రభు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. దెబ్బలు తగిలినా రిపోర్టు నార్మల్ అని ఇచ్చారు. పోలీసులతో కలిసి నన్ను చంపేందుకు రవి కూమార్ స్కెచ్ వేశారు. దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. నాపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు’’ అని వీడియోలో తెలిపారు. -
అచ్చెంనాయుడికి ముచ్చెమటలు!
-
ఉప సర్పంచ్‌కు అత్తింటి వేధింపులు
శ్రీకాకుళం: మహిళా ఉపసర్పంచ్‌కు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తుంగపేటలో చోటు చేసుకుంది. గ్రామ ఉపసర్పంచ్ భర్త పేరు సుధీర్. ఆయన టీడీపీ నేత. ప్రభుత్వ విప్ కూన రవికి సన్నిహితుడు. దాంతో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'కూన రవి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు'
శ్రీకాకుళం: తుపాను నష్టాన్ని అంచనా వేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కూన రవి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆరోపించారు. ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని ధ్వజమెత్తారు. తుపాను బాధితులకు కాకుండా టీడీపీ కార్యకర్తలకు మేలు చేకూరేలా అధికారులు వ్యవహరించడంపై జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.


