breaking news
Konathala Ramakrishna Rao
-
‘ఏ పార్టీలో చేరేది వచ్చేవారం ప్రకటిస్తా’
సాక్షి, విజయవాడ : మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ గురువారం వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర సమస్యలపై ఉమ్మారెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కొణతాల మాట్లాడుతూ.. విశాఖకు రైల్వే జోన్ వచ్చిందని సంతోషపడాలో.. బాధపడాలో తెలియడం లేదన్నారు. రైల్వే జోన్ ఇచ్చినట్లే ఇచ్చి విశాఖ డివిజన్ను తీసేయడం సరి కాదన్నారు. ఉత్తరాంధ్ర సమస్యలపై అన్ని పార్టీలకు నివేదిక ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టోలో ఉత్తరాంధ్ర సమస్యలను చేర్చాలని కోరారు. రాజకీయాల కంటే కూడా ఉత్తరాంధ్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని కొణతాల స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరే అంశం గురించి వచ్చే వారం ప్రకటిస్తానని తెలిపారు. -
విశాఖ ‘దేశం’లో.. కొణతాల కాక
మాజీ మంత్రి రామకృష్ణ చేరికపై మంత్రులు గంటా, అయ్యన్న ఏకాభిప్రాయం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చేరేందుకు మార్గం సుగమమైందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఆయన చేరికను మొదట వ్యతిరేకించిన మంత్రి గంటా శ్రీనివాసరావు చివరకు మొత్తబడ్డారు. విశాఖపట్నం జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఉప్పు నిప్పుగా ఉండే మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా ఇద్దరూ కొణతాల చేరికపై ఏకాభిప్రాయానికి వచ్చారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. శుక్రవారం సచివాలయంలో అయ్యన్నపాత్రుడి చాంబర్లో కొణతాలతో గంటా టీడీపీ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వీవీవీ చౌదరితో కలసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేరికపై గంటకు పైగా చర్చలు జరిపారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొణతాల చేరికను వ్యతిరేకిస్తూ పలు నియోజకవర్గాల్లో కొన్ని రోజులుగా టీడీపీ శ్రేణులు ధర్నాలు కూడా చేపడుతున్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు తమను దెబ్బతీసేందుకు ఈ ఎత్తుగడ వేశారని గంటా వర్గం భావించింది. దీనికి ప్రతిగా వారు మొదట నుంచి అయ్యన్నపాత్రుడుకు ప్రత్యర్ధిగా ఉండే దాడి వీరభద్రరావును తిరిగి పార్టీలోకి చేర్చే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.ఈ ఎత్తుగడలతో పక్షం రోజుల నుంచి జిల్లా టీడీపీ రాజకీయాల్లో విభేదాలు రగులుతున్నాయి. కాగా కొణతాల చేరికకు అధినేత చంద్రబాబు సుముఖంగా ఉండడంతో ఇప్పుడు గంటా వర్గం తప్పనిస్థితిలో అంగీకారం తెలపిందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరో పక్క దాడి తిరిగి పార్టీలో చేరికపై కూడా బాబు సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. అంతా అధినేత ఇష్టం: అయ్యన్న పార్టీలో ఎవరిని చేర్చుకోవాలనేది అధినేత ఇష్టమని, చిన్న చిన్న తేడాలు ఉన్నా సమన్వయం చే సుకుని పనిచేసుకోవడానికి కార్యకర్తలుగా తామెప్పుడూ సిద్ధమేనని మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. దాడి వీరభద్రరావు పార్టీలోకి వచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. చర్చే రాలేదు: గంటా మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడితో జరిగిన భేటీలో రాజకీయ అంశాలుగానీ, కొణతాల చర్చగానీ రాలేదన్నారు. ఇతర పార్టీల నేతలందరూ సీఎం నాయకత్వం పట్ల మొగ్గు చూపుతున్నారని అన్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఎవరు చేరుతున్నా సానుకూలంగా స్పందించడం తప్పుకాదన్నారు.