breaking news
knocks down
-
నిద్రలో భుజంపై వాలితే అలా కొడతారా..?
న్యూయార్క్: నిద్రలో భుజంపై వాలిపోయినందుకు పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడో వ్యక్తి. మోచేయితో భీకరంగా దాడి చేయగా.. బాధితుడు అక్కడే మూర్చపోయాడు. బాధితుని స్నేహితులు తిరగబడటంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఈ దారుణ ఘటన న్యూయార్క్‌లోని మెట్రో రైలులో జరిగింది. మెట్రో రైలు ఫారెస్ట్ హిల్స్ 71వ అవెన్యూ స్టాప్ సమీపంలో సబ్‌వేకు చేరేసరికి ఉదయం 5:30 గంటల సమయం అవుతోంది. నిద్రలో పక్కనే ఉన్న ఓ ప్యాసింజర్ భుజంపై అనుకోకుండా వాలిపోయాడో వ్యక్తి. దీంతో ఆ ప్యాసింజర్ వాగ్వాదానికి దిగాడు. నిద్రలో ఉన్న వ్యక్తి స్నేహితులు ఆ ప్యాసింజర్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆగ్రహంతో పక్కనే ఉన్న వ్యక్తిని మోచేతితో బలంగా దాడి చేశాడు. అంతే.. ఆయన అక్కడే మూర్చపోయాడు. New York man elbows another passenger on the subway #subwaycreatures #nyc #frailego pic.twitter.com/N6KX6ltBIz — Rama (@EyesWitness00) August 24, 2023 బాధితుని స్నేహితులు గొడవకు దిగారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో మెట్రో ఆ కంపార్ట్మెంట్ రణరంగంగా మారింది. ఆ వెంటనే స్టాప్ రావడంతో అందరూ దిగిపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వ్యక్తిని గాలిస్తున్నారు. ఇదీ చదవండి: ఏంటి గురూ..! ఏకంగా విమానంలోనే ఇలా చేస్తావా..? -
కవితను దొంగ దెబ్బతీసిన రెజ్లర్
న్యూఢిల్లీ: ది గ్రేట్ ఖలీ నిర్వహించిన కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ పోటీల సందర్భంగా మహిళా రెజ్లర్ బీబీ బుల్ బుల్ సవాల్ కు దీటైన జవాబు చెప్పిన సల్వార్ కమీజ్ పంజాబీ యువతి కవిత గుర్తుంది కదా... తన సాహసంతో.. మనోధైర్యంతో... కండలు తిరిగిన రెజ్లర్ తో పోటీకి దిగి .. చిత్తు చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ప్రతీకారంతో రగిలిపోయిన బీబీ.. సివంగి కవితపై దాడిచేసిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రేక్షకుల్లో కూర్చున్న కవితపై ఆనూహ్యంగా దాడి చేసి.. దొంగ దెబ్బ తీసింది. తనను ఒడించిందనే అక్కసుతో కవితపై క్రూరంగా దాడిచేసిన బీబీ బుల్ బుల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే జుట్టు పట్టుకొని లాక్కొచ్చి రింగ్ లో ఈడ్చిపారేసిన రెజ్లర్ కు తనదైన శైలిలో రిటార్ట్ ఇచ్చింది కవిత. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలాగే ఈ వ్యవహారమంతా గందరగోళంగా ఉందన్న కమెంట్లు కూడా వినిపించాయి. కాగా కాంటినెంటల్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ భాగంగా మహిళా రెజ్లర్ బీబీ బుల్ బుల్ రింగ్‌లో నుంచి ఓ సవాల్ విసిరింది. దమ్ము, ధైర్యం ఉన్నవాళ్ళెవరైనా వచ్చి తనతో తలపడాలని సవాల్ విసిరింది. తనతో పోటీ పడే వారు ఎవరైనా ఉన్నారంటూ చెలరేగిపోయిన బీబీ బుల్ బుల్ ను నిమిషాల్లో మట్టికరిపించి శభాష్ అనిపించుకుంది. అయితే పవర్ లిప్టింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ఛాంపియన్ కూడా అయిన కవిత గతంలో హర్యానా పోలీసు శాఖలో ఉద్యోగి. 2015లో చోటు చేసుకున్న ఈ వీడియో తాజాగా సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే