breaking news
kavari sambhasivarao
-
కైకలూరులో బీజేపీకి శ్రేణులు దూరం
కావూరి సాంబశివరావు చేరికను వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు తమకు ప్రాధన్యత లేదంటూ పార్టీకి నాయకుల రాజీనామా కైకలూరు, న్యూస్‌లైన్ : ‘పార్టీ అధికారంలో లేకపోయినా సమస్యలపై ఒంటరి పోరాటం చేశాం.. అధిష్టానం చెప్పిన కార్యక్రమాలను తూ.చ. తప్పకుండా పాటించాం.. ఎన్నికలు వచ్చే సరికి ముందు నుంచి కష్టపడిన కార్యకర్తలను పక్కనబెట్టారు.. ఇది అన్యాయం’’ అంటూ కైకలూరు నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ పొత్తుల్లో భాగంగా కైకలూరు సీటును ఇటీవలే బీజేపీలో చేరిన కామినేని శ్రీనివాస్‌కు కట్టబెట్టారు. గత ఎన్నికల్లో కామినేని పీఆర్పీ తరుఫున పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గానికి అప్పుడప్పుడు చుట్టపుచూపుగా వచ్చిన ఆయనకు టికెట్ ఇవ్వడాన్ని కార్యకర్తలు వ్యతిరేకించారు. తర్వాత నాయకులు బుజ్జగించడంతో కామినేని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇటీవల వెంకయ్యనాయుడు ప్రచార సభకు పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధన్యం ఇవ్వలేదని బీజేపీ నాయకులు మదనపడ్డారు. చివరికి పొత్తుల పార్టీలో ఇమడలేమంటూ కైకలూరుకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేంపాటి విష్ణురావు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మంగళవారం రాత్రి సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబుకు ఫ్యాక్స్ చేశారు. కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ బొల్లా అభిమన్యుకుమార్ పదవిని వదులుకోడానికి సిద్ధమవుతున్నారు. ముందు నుంచీ బీజేపీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడిన నాయకులను పక్కన పెట్టడం పార్టీకి నష్టమేనని కార్యకర్తలు భావిస్తున్నారు. కావూరి చేరికపై వ్యతిరేకత ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు గురువారం భీమవరంలో జరిగే మోడీ బహిరంగ సభలో బీజేపీలో చేరనున్నారు. ఆయన చేరికను పార్టీ కైకలూరు నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఆయన టీడీపీ టికెట్ ఆశించగా, మాగంటి బాబు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో అనేక సమస్యలపై బీజేపీ నాయకులుగా కావూరిపై పోరాటం చేశామని, ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం తమకు ఇష్టం లేదని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధిగా రాష్ట్ర విభజన అంశంలో ఆయన చేసిందేమీ లేదని, పైగా ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వివరిస్తున్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్సార్ సీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సముచిత స్థానం కల్పించారని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ బొల్లా అభిమన్యుకుమార్ చెప్పారు. కైకలూరు నియోకవ ర్గంలోని బీసీ ఓటర్లు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. ఎన్నికల ప్రాచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం కైకలూరు వచ్చినప్పుడు, ఆయన సమక్షంలో బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో ఆ పార్టీలో చేరనున్నామని ఆయన తెలిపారు. -
'ఒకరు వెళిపోతే పదిమంది వస్తారు'
పోలవరం : కాంగ్రెస్ పార్టీని ఒక్కరు విడిచి వెళితే పదిమంది యువకులు పార్టీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం పోలవరం స్పిల్‌వేను పరిశీలించారు. ఈ సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ పోలవరం జాతీయ హోదాకు కావూరి సాంబశివరావు, పల్లంరాజులు గట్టిగా కృషి చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని జైరాం రమేష్ స్పష్టం చేశారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు ఉన్నా అక్కడ నిర్వాసితులకు రూ.600 కోట్లు ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకుందని ఆయన తెలిపారు.