breaking news
Kate McWilliams
-
గత ఏడాది అత్యంత క్లిష్టమైంది!
లండన్: తన జీవితంలో 2024 సంవత్సరం అత్యంత కఠినమైనదని ప్రిన్స్ విలియం వ్యాఖ్యానించారు.గత ఏడాది విలియం భార్య కేట్, ఆయన తండ్రి కింగ్ చార్లెస్–3 ఇద్దరూ క్యాన్సర్ చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే లెవీ నిర్వహిస్తున్న ’ది రెలుక్టెంట్ ట్రావెలర్’ షోలో విలియం ఈ విషయాలు పంచుకున్నారు. ’షిట్స్ క్రీక్’ నటుడు యూజీన్ లెవీ నిర్వహిస్తున్న ఆపిల్ టీవీ+ ఎపిసోడ్కు సంబంధించిన ప్రివ్యూలో విలియం మాట్లాడుతూ.. ‘2024 నా జీవితంలోనే అత్యంత కఠినమైన సంవత్సరం అని నేను చెబుతాను. జీవితం మమ్మల్ని పరీక్షించాలని నిర్ణయించుకుంది.. ఆ పరీక్షను అధిగమించగలిగినప్పుడే మనమేమిటో తెలుస్తుంది.’ అని వ్యాఖ్యానించారు. అక్టోబర్ 3న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రివ్యూలో విలియం.. లెవీని విండ్సర్ కోట చుట్టూ తిప్పుతూ చూపించడం, వారిద్దరూ ఒక పబ్లో బీరు పంచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యాలున్నాయి. కేట్ జనవరిలో తనకు క్యాన్సర్ నయమైందని ప్రకటించారు. ఇటీవల ఆమె అనేక బహిరంగ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నెల ప్రారంభంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూకే పర్యటనలో.. ఆయనకు రాజ మర్యాదలతో ఆహ్వానం పలకడంలో ఆమె, విలియం కీలక పాత్ర పోషించారు. కింగ్ చార్లెస్ కూడా గత సంవత్సరం చికిత్స కోసం నెలల పాటు విరామం తీసుకున్న తర్వాత దైనందిన జీవితంలో పాల్గొంటున్నారు. కానీ కింగ్ చార్లెస్–3, కేట్లు ఇద్దరూ తాము ఏ రకమైన క్యాన్సర్కు చికిత్స చేయించుకున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
ఆకాశంలో ఈ అమ్మాయిని చూసి..
'అరెయ్, సీటు మీద కూర్చుంటే నేలకు కాళ్లందవు.. నీకెందుకురా సైకిల్?' చిన్నతనంలో సైకిల్ ప్రాక్టీస్ చేసే ప్రతిఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఈ విమర్శ ఎదుర్కోవాల్సివస్తుంది. సైకిల్ కే ఇట్లంటే.. 13 ఏళ్లకే విమానంలో ఉద్యోగం సంపాదించి, 19 ఏళ్లకు కాక్ పిట్ లో చేరిపోయి, ఇప్పుడు ప్రపంచంలోనే అతి పిన్న మహిళా కమర్షియల్ పైలెట్ గా రికార్డులకెక్కిన కేట్ మెక్ విలియమ్స్ గురించి ఏమనుకోవాలి? ది ఆన్సర్ ఈజ్ రొటీన్! పైలట్ యూనిఫాంలో కాక్ పిట్ తలుపు తీసుకుని బయటికొచ్చిందంటే ప్రయాణికులు మొదట స్థాణువైపోతారు. వెంటనే తేరుకుని'అమ్మాయీ.. విమానాన్ని నువ్వే నడుపుతున్నావాఏంది?' అని ప్రశ్నిస్తారు. 'పైలట్ గా ప్రతిరోజూ ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కుంటేనే ఉంటా. అనుభవంతో కూడిన నా సమాధానాలు విన్నతర్వాత అవతలివారు సంతోషపడతారు' అని చెబుతుంది కేట్.బ్రిటన్ లో ప్రఖ్యాత బడ్జెట్ఎయిర్ లైన్స్ 'ఈజీ జెట్' సంస్థలో ఇటీవలే పైలట్ గా ప్రమోట్ అయిన కేట్ మెక్ విలియమ్స్ వయసు 26 ఏళ్లు. ప్రపంచంలో మరే మహిళ ఇంత చిన్న వయసులో పైలట్ అయిందిలేదు. కాబట్టే ఈమె పేరు రికార్డులకెక్కింది. ఉత్తర ఇంగ్లాండ్ లోని కర్లిస్లే పట్టణంలో పుట్టి, పెరిగిన ఈ అమ్మాయి తన 13వ యేటనే విమానం సిబ్బందిగా ఉద్యోగంలో చేరింది. సంబంధిత పరీక్షలో మెరిట్ సాధించడంతో ఆమెకు ఆ అవకాశం దక్కింది. 16 ఏళ్లకే చిన్నతరహా విమానాన్ని సొంతగా నడిపింది. 19 ఏళ్ల వయసులో ప్యాసింజర్ ఫ్లైట్ లో ట్రైనీ పైలట్ గా చేరింది. ఇటీవలె కమాండ్ కోర్స్ ను కూడా పూర్తిచేయడంతో 'ఈజీ జెట్' కేట్ కు పైలట్ హోదా కల్పించింది. ఎయిర్ బస్ ఏ319, ఏ320 విమానాలను నడిపిన కేట్ ఇప్పటివరకు విమానాల్ని, అందులోని ప్రయాణికులను 100 సార్లుపైగా సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చింది. తనలాంటి మహిళా పైలట్ల సంఖ్య పెరగాలని కోరుకుంటోంది.