‘చచ్చి’ బతికాడు!
మునగపాక: అంతా అతను చనిపోయాడనుకున్నారు.. మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా బతికే ఉన్నాడని తెలియడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. విశాఖ జిల్లా మునగపాక మండలం గవర్ల అనకాపల్లిలో కాండ్రేగుల సీతారామ్(60) గురువారం ఉదయం నిద్ర లేవలేదు.
దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆర్ఎంపీ వైద్యుడిని పిలిపించారు. ఆయన సీతారామ్ చనిపోయినట్లు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా భోరున విలపించారు. శ్మశానవాటికకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిన సమయంలో సీతారామ్ గుండె కొట్టుకుంటున్నట్లు ఒక వ్యక్తి గమనించాడు. వెంటనే అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఒక్కసారిగా లేచి కూర్చుని మాట్లాడటంతో అంతా అవాక్కయ్యారు.