breaking news
kailash mountain
-
సరోవరంలో పాలమూరు వాసుల పాట్లు
హిల్సాలో చిక్కుకున్న 13 మంది పర్యాటకులు మహబూబ్‌నగర్ క్రైం: మానస సరోవరం వద్ద కైలాస పర్వతం పర్యాటక ప్రాంతాన్ని చూసేందుకు వెళ్లిన మహబూబ్‌నగర్‌జిల్లా వాసులు ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. కనీసం తినడానికి తిండి లేక.. పడుకోవడానికి సౌకర్యాలు లేక.. కంటి నిండా నిద్రరాక నానా అవస్థలు పడుతున్నామని వారు తమ బంధువులు, మీడియా ప్రతినిధులకు ఆదివారం ఫోన్ ద్వారా తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ జిల్లా కార్యదర్శి బాలరాజు, శారద దంపతులు, స్థానిక పంచవటి పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్‌రెడ్డి, అనితరెడ్డి దంపతులు, ఆనంద్, శైలజ దంపతులతో పాటు కూతురు అనన్య, ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి, చేతన దంపతులు, శివానందస్వామి, సుధారాణి దంపతులు, మక్తల్‌కు చెందిన కొండయ్య, రవి కలసి ఈనెల 16న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లారు. అక్కడి నుంచి నేపాల్ టూరిజం ప్యాకేజీ అనే సంస్థకు ఒక్కొక్కరూ రూ.రెండు లక్షలు వెచ్చించి ప్రత్యేక హెలికాప్టర్లో నేపాల్-చైనా సరిహద్దులోని మానస సరోవరం కైలాస పర్వతంలో ఉన్న శివుడిని దర్శించుకునేందుకు వెళ్లారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో చైనా-నేపాల్ సరిహద్దు అయిన హిల్సా అనే పర్వత ప్రాంతంలో ఇరుక్కుపోయారు. మోసం చేసిన టూరిజం సంస్థ! వీరిని తీసుకెళ్లిన టూరిజం సంస్థ వారు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు తెలిపారు. ప్రస్తుతం జిల్లావాసులు ఉంటున్న ప్రాంతం చైనా-నేపాల్ సరిహద్దులోని చెకింగ్ పాయింట్ వద్ద చిన్న చిన్న గుడిసెలు, దాబాలు తప్ప ఇతర ఇళ్లు ఉండవు. ఇలాంటి ప్రతికూల పరి స్థితుల్లో జిల్లావాసులు కూర్చోవడానికి కూడా స్థలం లేక అవస్థలు పడుతున్నారు. అక్కడ ఉన్న బాధితులు జిల్లా మీడియా వారికి సమాచారం ఇచ్చారనే కారణంతో వారందరి పాస్‌పోర్టులు తీసుకున్నట్లు తెలిసింది. వాతావారణం అనుకూలిస్తే తప్ప వారు అక్కడి నుంచి రావడానికి వీల్లేదు. కలెక్టర్, మంత్రులు స్పందించి తమ వారిని ఎలాగైనా జిల్లాకు తీసుకురావాలని వారు కోరుతున్నారు. -
భూతల 'కైలాసం'
సాంస్కృతిక ప్రాముఖ్యత.. ప్రకృతి సోయగాలు.. భక్తిపారవశ్యంతో మునిగితేలేటి చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం.. అడుగడుగనా అద్భుతమైన అనుభూతులు..ఇవన్నీ కలిస్తే కైలాస మానససరోవర్యాత్ర. హిందువులు ప్రముఖంగా సందర్శించే తీర్థయాత్ర స్థలాల్లో ఇది ఒకటి. ఈ యాత్ర చేపట్టే ప్రయాణికులకు దారి వెంబడి అందమైన హిమగిరులు, స్వచ్ఛమైన జలపాతాలు కనువిందు చేస్తూ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. భారత్ నుంచి కైలాసమానసయాత్ర చేపట్టే ప్రయాణికులు సులువుగా కైలాసపర్వతం చేరేందుకు వీలుగా.. చైనా తన భూభాగంలోని నాథులా పాస్‌ను తెరిచింది. ఈ నేపథ్యంలో కైలాస సరోవర్ యాత్ర, ప్రాముఖ్యత, ఇతర విశేషాలు తెలుసుకుందాం. సాక్షి, స్కూల్‌ఎడిషన్: మానవససరోవర యాత్ర ఒక అద్భుతం. కైలాస పర్వతం, మానససరోవ సరస్సును సందర్శించేందుకు ఈ యాత్ర చేపడుతారు. ఈ రెండూ చైనా అధీనంలోని టిబెట్‌లో ఉన్నాయి. ఇది హిందు, బౌద్ధ, జైన మతాలకు పవిత్ర స్థలం. హిందు మతం ప్రకారం శివుడు ఈ పర్వత శిఖరంపై థ్యానస్థితిలో ఉంటాడని నమ్మకం. మానస సరోవరం ఒడ్డున హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి. కర్నాలి, బ్రహ్మపుత్ర, సట్లేజ్, సింధూ నదులకు ఇది జన్మస్థలం. మానససరోవరం పడమటి వైపు రక్షస్తలి సరస్సు, ఉత్తరం వైపు కైలాస శిఖరం ఉంది. ప్రపంచంలో కెల్లా ఎత్తై ప్రదేశంలో ఉన్న ఈ సరస్సులో సాన్నం చేసినా, నీరు తాగినా పాపాలు పోతాయన్న భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉదయం 3 నుంచి5 గంటల మధ్య బ్రహ్మి ముహూర్తంలో బోలాశంకరుడు ఈ సరస్సులో స్నానమాచరిస్తాడని భక్తుల నమ్మకం. భారత్, నేపాల్‌తోపాటు అనేక దేశాల్లోని హిందువులు ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంటారు. మానస సరోవరానికి సమీపంలో కొలువుతీరిన ముక్తినాథ్ వద్ద 108 జలపాతాలు ప్రత్యేక్ష ఆకర్షణగా నిలుస్తాయి. ప్రపంచలో అతంత ఎత్తై ఎవరెస్ట్ శిఖిరంతో సహా, అనేక పర్వతాలను వీక్షించటం గొప్పఅనుభూతి. ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం తమకు కలుగుతుందని భక్తుల నమ్మకం. ఎన్నో విశిష్టతలతో ఇమిడి ఉన్న ఈ హిమాలయ పర్వతశ్రేణుల్లో మానవ మేధసుసకు సైతం అంతకుపట్టని ఎన్నో విషయాలు దాగున్నానయనే భావన ఈ యాత్ర ద్వారా కలుగుతుంది. యాత్ర విశేషాలు.. కైలాస మానససరోవర్ యాత్రను భారత విదేశాంగశాఖ నిర్వహిస్తుంది. ప్రతి ఏటా జూన్, సెప్టెంబర్ మధ్యలో ఈ యాత్రకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఈ యాత్రలో భాగంగా సముద్రమట్టం కన్నా 20 వేల కి.మీ ఎత్తులో ప్రయాణించాల్సి ఉంటుంది. శారీరంకంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ యాత్ర చేపట్టాంటే కచ్చితంగా భారతీయ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. పురాతన కాలంలో అనేక మార్గాల్లో భక్తులు కైలాస పర్వతాన్ని చేరుకునేవారు. అయిన్పటికీ భారతప్రభుత్వం రెండు నిర్దేశిత మార్గాల్లో కైలాస పర్వతానికి భక్తులను పంపిస్తోంది. అందులో ఒకటి భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉత్తరాఖండ్ నుంచి లిపులేక్ పాస్ ద్వారా టిబెట్‌కు చేరే మార్గం ఇది. ఇంకో మార్గం నేపాల్ నుంచి ఉంది. ఇటీవలే చైనా ప్రభుత్వం సిక్కిం సరిహద్దుల్లోని నాథులా పాస్ తెరవటంతో ఈ యాత్రకు మూడో మార్గం సుగమైంది. నేపాల్ ద్వారా.. అనేక ట్రావెల్ ఏజెన్సీలు నేపాల్ రాజధాని కఠ్మాం డూ నుంచి మానససరోవర యాత్రకు ప్రయాణికులను తీసుకెళుతుంటారు. భారత్‌లోలాగా ప్రయాణీకుల సంఖ్యకు నిర్దిష్ట పరిమితంటూ ఏమీ లేదు. కార్లు, ఇతర వాహనాలు ద్వారా టిబె ట్ పీఠభూమి గుండా కైలాస పర్వతం బేస్ క్యాం పు తీసుకెళ్తారు. ఈ రూటు ద్వారా కైలాస పర్వతా న్ని చేరుకోవాలంటే 16 రోజుల సమయం పడుతుంది. సుమారు రూ.80000 ఖర్చు అవుతుంది. చైనా గుండా.. 50 ఏళ్ల తరువాత చైనా మానసరోవర్ యాత్ర చేపట్టే ప్రయాణికుల కోసం నాథులాపాస్ను ఇటీవలే తెరిచింది. ఇది సముద్రమట్టం కంటే 4వేల మీటర్ల ఎత్తులోఉంది. సిక్కిం-టిబెట్ సరిహద్దులో ఉండే ఈ కనుమ ద్వారా భారత్ నుంచి 50 మంది ప్రయాణికులు జూన్ 16న ఈ యాత్రకు బయలుదేరారు. ఈ సీజన్లో ఈ కనుమ గుండా ఐదు బ్యాచ్‌లుగా 250 మందిని యాత్రకు పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్ 18న భారత్-చైనాలు కుదర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ మార్గాన్ని చైనా ప్రభుత్వం తెరిచింది. నాథులా కనుమ ఒకప్పటి సిల్క్‌రూట్‌లో భాగంగా ఉండేది. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ నుంచి 54 కి.మీ దూరంలో ఉంది. 1962 భారత్-చైనా యుద్ధం తరువాత ఈ మార్గాన్ని చైనా మూసేసింది. భారతదేశం నుంచి.. భారత్ నుంచి కైలాస పర్వతాన్ని చేరుకునుందుకు ప్రభ్వుతమే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఆరోగ్యం, ఆసక్తి ఉన్నవాళ్లు యాత్రకు అప్లై చేసుకోవచ్చు. నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే ఈ యాత్రకు తీసుకెళుతారు. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో దీనికి సంబంధించి ప్రకటన వెలువడుతుంది. ఎంపికైన యాత్రికులకు మే నాటికి సమాచారం అందుతుంది. ఎంపికైన వారిని బ్యాచ్‌లుగా విభజిస్తారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాచ్‌లుగా ప్రభుత్వం యాత్రికులను పంపిస్తుంది. ఇందుకు సుమారు రూ.50000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియా సరిహద్దులోఉన్నంత వరకు ప్రభుత్వమే యాత్రికులకు భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది. ఈ రూట్లో ఎక్కువభాగం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. హెల్త్చెకప్ తరువాత ఢిల్లీ నుంచి ధార్చులా వరకు వాహనాల్లో తీసుకెళ్లారు. అక్కడ నుంచి పర్వతారోహణ చేయాల్సి ఉంటుంది. కైలాస పర్వతం, మానససరోవరాన్ని చేరుకున్న తరువాత అక్కడ 7 రోజులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అక్కడ యాత్రికులే స్వయంగా వంట చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాత్ర మొత్తం 30 రోజలు. కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ శిఖరాన్ని చేరాలంటే ఈ మార్గం అనుకూలమైంది.