breaking news
junior boxing championship
-
Boxing Championships: ఆడక ముందే భారత్‌కు 21 పతకాలు!
దుబాయ్: ఆసియా యూత్ అండ్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఇంకా అడుగు పెట్టక ముందే భారత్‌కు కనీసం 21 పతకాలు ఖరారయ్యాయి! ఈ నెల 24నుంచి దుబాయ్‌లో జరిగే ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో కలిపి వేర్వేరు వెయిట్ కేటగిరీలలో భారత్ తరఫున 250 మంది బాక్సర్లు పాల్గొంటున్నారు. కోవిడ్, ప్రయాణ ఆంక్షల కారణంగా వివిధ దేశాలనుంచి పెద్ద సంఖ్యలో బాక్సర్లు తప్పుకోవడంతో ‘డ్రా’ బాగా చిన్నదిగా మారిపోయింది. దాంతో కనీసం 21 పతకాలు ఖాయం కాగా, ఇందులో 9 మంది నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించారు. -
భారత్‌కు మూడు స్వర్ణాలు
►నీహారికకు రజతం ►ప్రపంచ జూనియర్ బాక్సింగ్ తైపీ : అంచనాలకు మించి రాణించిన భారత అమ్మాయిలు ప్రపంచ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, రెండు రజత పతకాలు సాధించారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో సవిత (50 కేజీలు), మన్దీప్ సంధూ (52 కేజీలు), సాక్షి (54 కేజీలు) పసిడి పతకాలు నెగ్గగా... తెలంగాణ బాక్సర్ గోనెల్ల నీహారిక (70 కేజీలు)తో పాటు సోనియా (48 కేజీలు) రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. ఇదే వేదికపై జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో జమునా బోరో (57 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించింది. దోహాలో మరో నాలుగు స్వర్ణాలు న్యూఢిల్లీ: దోహా అంతర్జాతీయ టోర్నీలో భారత బాక్సర్లు మెరిశారు. శనివారం జరిగిన ఈవెంట్లో నాలుగు స్వర్ణాలు, ఓ రజతం, రెండు కాంస్యాలు దక్కాయి. ఎల్.దేవేంద్రో సింగ్ (49కేజీ), శివ థాపా (56కేజీ), మనీష్ కౌశిక్ (60కేజీ), మనోజ్ కుమార్ (64కేజీ) స్వర్ణాలు గెలుచుకోగా గౌరవ్ బిధూరి (52కేజీ) రజతం, మన్దీప్ జాన్‌గ్రా (69కేజీ), వికాస్ క్రిషన్ (75కేజీ) కాంస్యాలు సాధించారు. అక్టోబర్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు సన్నాహకంగా ఈ టోర్నీ జరుగుతోంది.