breaking news
JP cement plants
-
మరో సిమెంట్ కంపెనీపై అదానీ కన్ను?
దేశీయంగా సిమెంట్ పరిశ్రమలో వేగంగా దివాలా చర్యలను ఎదుర్కొంటున్న జైప్రకాశ్(జేపీ) అసోసియేట్స్‌కు చెందిన జేసీ సిమెంట్స్‌ను అదానీ కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అల్ట్రాటెక్, అదానీ గ్రూప్, దాల్మియా, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. సిమెంట్ తయారీలో అదానీ గ్రూప్.. దిగ్గజ కంపెనీలు ఏసీసీ, అంబుజాలోని ప్రధాన వాటాను కొనుగోలు చేసి దేశంలోనే రెండో పెద్ద సంస్థగా నిలిచింది. ఈ పరిశ్రమ అభివృద్ధిపై అదానీ గ్రూప్ ఎంతో ఆసక్తిగా ఉందని నిపుణులు చెబుతున్నారు. జేపీ సిమెంట్స్‌ను కూడా ఆ గ్రూప్ కొనుగోలు చేసే వీలుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జేపీ సిమెంట్స్ 9 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒకవేళ ఈ కంపెనీని అదానీ కొనుగోలు చేస్తే అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావాజూన్ మొదటి వారంలో జేపీ గ్రూప్‌పై దివాలా చట్టం పరంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ దరఖాస్తు చేయడంతో అలహాబాద్‌లోని జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) కోర్టు జేపీ అసోసియేట్స్‌పై దివాలా చట్ట ప్రక్రియను ప్రారంభించింది. జేపీ గ్రూప్ ఆధ్వర్యంలోని సిమెంట్ ఉత్పత్తికి ఉపయోగపడే లైమ్‌స్టోన్ గనులు, విద్యుత్ ప్లాంటుసహా సంస్థ ఆస్తులను పొందేందుకు అదానీ గ్రూప్ సన్నాహాలు మొదలు పెట్టే వీలున్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ జేపీ ఆస్తుల విక్రయానికి ఎలాంటి ఆదేశాలు మాత్రం జారీకాలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2022, సెప్టెంబర్ 15 వరకు జేపీ గ్రూప్ అప్పులు రూ.6,893 కోట్లుగా ఉన్నట్లు తేలింది. -
అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంట్ ప్లాంట్లు
* డీల్ విలువ దాదాపు రూ. 17,000 కోట్లు.. * సిమెంట్ రంగంలో అతిపెద్ద ఒప్పందంగా రికార్డు న్యూఢిల్లీ: దేశీ సిమెంట్ పరిశ్రమలో అతిపెద్ద డీల్ సాకారమైంది. ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్.. జైప్రకాశ్(జేపీ) గ్రూపునకు చెందిన సిమెంట్ ప్లాంట్లను చేజిక్కించుకుంది. ఇందుకోసం దాదాపు రూ.17,000 కోట్లు చెల్లించనున్నామని.. ఈ మేరకు జేపీ అసోసియేట్స్‌తో అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు అల్ట్రాటెక్ సిమెంట్ ఆదివారం ప్రకటించింది. తాము కొనుగోలు చేస్తున్న సిమెంట్ ప్లాంట్లు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఉన్నాయని పేర్కొంది. వీటి వార్షిక ఉత్పాదక సామర్థ్యం 22.4 మిలియన్ టన్నులు(ఎంటీపీఏ). ఒప్పందం ఇలా... డీల్‌లో భాగంగా ఈ ప్లాంట్ల విలువను రూ.16,500 కోట్లుగా లెక్కించామని అల్ట్రాటెక్ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.470 కోట్ల పెట్టుబడితో మరో 4 ఎంటీపీఏ సామర్థ్యంగల ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించింది. వీటికోసం దేశీయంగా అదేవిధంగా విదేశీ సంస్థలు కూడా రేసులో ఉన్నప్పటికీ.. చివరికి తాము దక్కించుకున్నట్లు పేర్కొంది. సాత్నా, తూర్పు యూపీ, హిమాచల్‌ప్రదేశ్, కోస్తాంధ్రల్లో ఈ డీల్ వల్ల అల్ట్రాటెక్‌కు కొత్త మార్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ప్రతిపాదిత లావాదేవీ పూర్తయితే తమ మొత్తం వార్షిక సిమెంటు ఉత్పత్తి సామర్థ్యం 90.7 ఎంటీపీఏలకు(ప్రస్తుతం 68.3 ఎంటీపీఏ) పెరగనుందని అల్ట్రాటెక్ పేర్కొంది. నియంత్రణపరమైన అనుమతులకు లోబడి డీల్ పూర్తవుతుందని వెల్లడించింది. కాగా, గతంలో మధ్య ప్రదేశ్‌లోని రెండు సిమెంట్ ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు జేపీ అసోసియేట్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం.. ఈ తాజా ఎంఓయూతో రద్దవుతుందని పేర్కొంది. రుణ భారం తగ్గించుకోవడానికే... భారీగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకొని, బ్యాలెన్స్ షీట్‌ను మెరుగుపరుచుకోవడం కోసమే తాము ఈ అమ్మకాలను చేపడుతున్నట్లు జేపీ అసోసియేట్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. సిమెంట్, విద్యుత్ వంటి సాంప్రదాయ రంగాల్లో పెట్టుబడులకు రుణాలు తీసుకున్న అన్ని కంపెనీలపై ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి కారణంగా తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడిందని తెలిపింది. టారిఫ్‌లు ఆల్‌టైమ్ కనిష్టానికి పడిపోవడం, సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవడం కారణంగా విద్యుత్ రంగం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని వెల్లడించింది. ఇకపై తాము ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్, రియల్టీ ప్రాజెక్టులపై మరిం త దృష్టిసారించున్నట్లు జేపీ అసోసియేట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మనోజ్ గౌర్ వ్యాఖ్యానించారు.