breaking news
jan Dhan
-
7రోజుల్లో రూ.1,487 కోట్లు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి జన్ ధన్ యోజన్ ఖాతాల్లో నగదు డిపాజిట్ల వర్ద క్రమంగా తగ్గుముఖంపడుతోంది. ముఖ్యంగా గత వారం రోజుల కాలంలో స్పల్పంగా తగ్గింది. ఏడు రోజుల్లో సుమారు రూ.1,487కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇది నవంబరు 30 నాటికి వీటి విలువ 8,283కోట్లు డిపాజిట్ కాగా ఈ వారంలో డిపాజిట్ల విలువ క్రమంగా తగ్గుముఖం పట్టినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం నవంబరు 30నాటికి 25.85 కోట్ల ఖాతాల్లోరూ. 74,321.55కోట్లు నమోదయ్యాయి. నవంబరు 23 నాటికి 25.68 కోట్ల ఖాతాల్లో మొత్తం విలువ రూ.72,834.72 కోట్లు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నవంబరు 9 నాటికి సుమారు రూ.45,637 కోట్ల డిపాజిట్లు పెరిగాయి. కాగా 2014 ఆగస్టులో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన్ పథకాన్ని ప్రారంభించారు. జన్ ధన్ ఖాతాల్లో గరిష్ట డిపాజిట్ పరిమితి 50 వేలుగా నిర్ణయించారు. అయితే డీమానిటైజేషన్ తర్వాత విత్ డ్రా పరిమితిని 10 వేలకు కుదించిన సంగతి తెలిసిందే. -
రూ.30,000 కోట్లకు జన్ ధన్ డిపాజిట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వపు ప్రతిష్టాత్మక ‘ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజనా (పీఎంజేడీయూ)’ కార్యక్రమం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డిపాజిట్లు రూ.30,000 కోట్లకు పైగా చేరాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. జనవరి 20 వరకు జన్ ధన్ యోజనా కింద దాదాపు 20.38 కోట్ల బ్యాంకు ఖాతాల ప్రారంభం జరిగింది. -
జన్‌ధన్‌కు లింక్‌గా ఆరోగ్య పథకాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (పీఎండీవై)కు పేదలకు సంబంధించిన ప్రజారోగ్య పథకాలను జోడించనున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ జన్ ధన్ యోజనకు ఇప్పటికే అనూహ్యంగా విజయవంతమైందని, దాదాపు పద్నాలుగు కోట్లమంది ఖాతాలు తెరిచారని, 14 వేల డిపాజిట్లు వాటిల్లో ఉన్నాయని చెప్పారు. వచ్చే దశలో పేదలకు ఆరోగ్య సంబంధమైన లబ్ధిని జన్ ధన్ ద్వారా అందించమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. -
అందరూ బ్యాంకు ఖాతాలు తెరవాలి
బళ్లారి ఎంపీ శ్రీరాములు సాక్షి, బళ్లారి : ప్రధాన మంత్రి నరేంద్ర మో డీ రూ పొందించిన నూతన పథకం ‘జన్- ధన్’ ద్వారా జీరో బ్యాలెన్స్‌తోనే బ్యాంక్‌లో ఖాతాలు తెరవచ్చని, దీన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని బళ్లారి ఎంపీ శ్రీరాములు పేర్కొన్నారు. స్థానిక అల్లం సుమంగళమ్మ కళాశాలలో జన్-ధన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభిం చిన ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ వినూత్న తరహాలో పథకాలు ప్రవేశపెడుతున్నారని కొనియాడారు. ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలు బీమా కింద ఇస్తుందని గుర్తు చేశారు. ఆడ, మగ అన్న తేడా లేకుండా బ్యాంకు ఖాతా లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బళ్లారి జిల్లాలో ఇంకా బ్యాంకు ఖాతాలు తెరవని వారు ఒక లక్షా 60 వేల మం ది ఉన్నారన్నారు. అనంతరం లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ కమిషనర్ అనిరుద్ద్ శ్రవణ్, జెడ్పీ అధ్యక్షురాలు అనిత, జెడ్పీ సీఈఓ మహమ్మద్ సలాఉద్దీన్, సిండికేట్ బ్యాంకు ప్రముఖులు కుమారగౌడ పాల్గొన్నారు. బ్యాంక్ సేవలు వినియోగించుకోండి దావణగెరె : ప్రజలు జన్ ధన్ ద్వారా ఖాతాను తెరిచి బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లాధికారి ఎస్టీ అంజన్‌కుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం నగరంలోని గురుభవనంలో ప్రధాన మంత్రి జన్ ధన్ పథకానికి శ్రీకారం చుట్టిన ఆయన మాట్లాడారు. జిల్లాలో 193 బ్యాంకులు, 14 డీసీసీ బ్యాంకులు, 6 క్రాస్ కార్డు బ్యాంకులు ఉన్నాయని, ఈ అన్ని సంస్థలు జన్ ధన్ పథకం కింద ఖాతాలు తెరిచేందుకు అనుకూలం కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా జన్‌ధన్ పథకం ద్వారా ఖాతాలు ప్రారంభించిన వారికి పాస్‌పుస్తకాలను అందజేశారు. ‘జన్-ధన్’ను సద్వినియోగం చేసుకోండి గంగావతి : ‘జన్-ధన్’ పథకం ద్వారా జీరో అకౌంట్‌తో బ్యాంక్‌లో ఖాతాను ఏర్పాటు చేసుకోవచ్చని, ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీహెచ్ ఏడీబీ బ్యాం క్ మేనేజర్ జనార్ధనరావు సూచించారు. ఈ పథకం ద్వారా ఖాతా ఏర్పాటు చేసుకున్న వారికి గురువారం సాయంత్రం పాసుపుస్తకాలను అందజేసిన ఆయన మాట్లాడారు. ఖాతాలు పొందిన వారు ఆరు నెలల పాటు జమ, ఖర్చు వ్యవహారాలు బ్యాంక్ ద్వారా చేపడితే అనంతరం వెయ్యి రూపాయల నుంచి రూ.5 వేల వరకు రుణ సౌకర్యం, రూ. 2 లక్షల ప్రమాద బీమా సదుపాయం లభిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎస్బీహెచ్ మేనేజర్ మధుసూధన్‌రావు, గంగావతి డి ప్యూటీ డెరైక్టర్ అనిల్ కుమార్, సిరస్తెదార్ సురాజ్, ఎస్బీహెచ్ మేనేజర్ ఫీల్డ్ ఆఫీసర్ రాఘవేంద్రరావు, బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్య క్షులు ఎస్బీహెచ్ నారాయణరావు పాల్గొన్నారు.