breaking news
jan 8th
-
హానర్ వి 10 లాంచ్..ధర, ఫీచర్లు
హానర్ ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. హానర్ వి(వ్యూ) 10పేరుతోమ దీన్ని గురువారం విడుదల చేసింది. అమెజాన్ ఇండియాద్వారా జనవరి 8నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి. దీనికి సంబంధించి వినియోగదారుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈరోజునుంచి ప్రారంభించింది. దీని ధరను రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. భారత్ మార్కెట్లో కంపెనీ నిబద్ధతను అనుసరిస్తూ, గ్లోబల్ వేరియంట్ కన్నా తక్కువ ధరకే అందిస్తున్నామని హానర్ ఇండియా-కన్జ్యూమర్ బిజినెస్ గ్రూప్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పి సంజీవ్ చెప్పారు. హానర్ వి 10 ఫీచర్లు 5.99-అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే(18: 9 రేషియో) 1080x2160 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ ఓరియో 8.0 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 16 మెగాపిక్సెల్ ఆర్జీబీ సెన్సా, 20 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, 13మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ f / 1.8 ఎపర్చరు 3750 ఎంఏహెచ్ బ్యాటరీ -
అమరావతి మారథాన్ విజయవంతం చేయండి : కలెక్టర్
విజయవాడ : నూతన రాజధానిలో జనవరి 8న నిర్వహించే అమరావతి మారథాన్ లో ఎక్కువమంది పాల్గొనేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ బాబు. ఏ కోరారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం సమావేశ మందిరంలో మారథాన్ నిర్వహణపై ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మారథాన్‌లో పాల్గొనే వారికి గతేడాది కంటే మూడు రెట్లు అధికంగా రూ. 20 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా ఇస్తున్నామన్నారు.రన్లో పాల్గోనేవారికి మెడల్‌తోపాటు సర్టిఫికేట్, కిట్ ఇస్తామన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు. 3500 మంది ఆన్లైన్లో నమోదయ్యారన్నారు. గతేడాది 6వేల మంది నమోదు చేసుకోగా, 8500 మంది పాల్గొన్నారన్నారు. రెండోసారి నిర్వహిస్తున్న ఈ రన్‌కు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. పెద్దనోట్ల రద్దు నేపధ్యంలో పాఠశాల విద్యార్ధులకు నగదు రహిత చెల్లింపులు నిర్వహించే విధంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. నగరపాలక సంస్ధ కమీషనర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ డీప్ ట్రస్టుతో కలిసి నగరపాలక సంస్థ సంయుక్తంగా మారథాన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీప్ ఫౌండర్ ప్రతినిధి డాక్టర్ మధు మాట్లాడుతూ ఆప్ మారధాన్, 10కె, 5కె, 3కెలుగా రన్ నిర్వహిస్తామన్నారు. రిజిస్టర్ చేసుకున్నవారు 6,7 తేదీల్లో దండమూడి రాజగోపాల్ మున్సిపల్ మినీ స్టేడియంలో కిట్స్ పొందాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసంఠీఠీఠీ.్చఝ్చట్చఠ్చ్టిజిజీఝ్చట్చ్టజిౌn.టun.నమోదు చేసుకోవాలన్నారు. స్వయంగాచేసుకునే వారు ఇందిరా గాంధీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీలో సంప్రదించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాద్యాయులతోపాటు సబ్ కలెక్టర్ సలోనిసిదా, డీఈవో సుబ్బారెడ్డి, విద్యాశాఖధికారులు పాల్గొన్నారు. 29 వీఐజీ పోటో నెం. 42ఏ, మారధాన్ రన్‌పై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్