breaking news
Itchiness
-
పిల్లల అరచేతులు, అరికాళ్లలో దురదలా..ప్రమాదకరమా?
సాధారణంగా పిల్లల్లో ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు... మరీ ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చాక కొందరు చిన్నారుల్లో ఈ విధమైన లక్షణాలు కనిపి స్తుంటాయి. మొదట్లో అవి చాలా తీవ్రంగా కనిపించినా క్రమేపీ తగ్గిపోతాయి. ఇది చాలా సాధారణం. అలాగే ఎగ్జిమా వంటి మామూలు సమస్యలతో పాటు హైపర్కెరటోటిక్ పాల్మార్ ఎగ్జిమా, కెరటోలైసిస్ ఎక్స్ఫోలియేటా, ఎస్.ఎస్.ఎస్. సిండ్రోమ్, స్ట్రెస్ వంటి కొన్ని సిస్టమిక్ వ్యాధులు ఉన్నప్పుడూ, ఇక సోరియాసిస్, స్కార్లెట్ ఫీవర్లతోపాటు, కొన్నిసార్లు విటమిన్ లోపాలు... ఇలాంటి కారణాల వల్ల అరచేతుల్లో, అరికాళ్లలో దురదలు రావడంతో పాటు చర్మం పగలడం, ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అంత ప్రమాదకరం కాదు గానీ... పైన పేర్కొన్న సోరియాసిస్ వంటివి మినహాయిస్తే ఇలా చర్మం ఉడి΄ోతూ కొత్త చర్మం వచ్చే ఎగ్జిమా వంటి వాటితపాటు... కొంతమంది చిన్నారుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఇలా అరచేతులు, అరికాళ్లలో సెకండరీ ఇన్ఫెక్షన్లాగా కూడా వచ్చే ‘పోస్ట్ వైరల్ ఎగ్జింథిమా’ అనే కండిషన్లు సాధారణంగా రెండు నుంచి మూడు వారాల్లో వాటంతట అవే పూర్తిగా తగ్గి΄ోతాయి. దాదాపుగా ఏమాత్రం ప్రమాదకరం కాదనే చెప్పవచ్చు.ఈ జాగ్రత్తలు పాటించాలి... ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు చేతులు తేమగా ఉంచుకోవడం (వెట్ సోక్స్), మాయిçశ్చరైజింగ్ క్రీమ్స్ రాయడం వంటివి చేయాలి. జింక్ బేస్డ్ క్రీమ్స్ రాయడం వల్ల చాలావరకు ప్రయోజనం ఉంటుంది. లక్షణాల తీవ్రత మరింత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ మోతాదు స్టెరాయిడ్స్ (మైల్డ్ స్టెరాయిడ్స్) వల్ల ఉపశమనం ΄÷ందవచ్చు. ఒకవేళ పైన పేర్కొన్న జాగ్రత్తల తర్వాత కూడా తగ్గక΄ోయినా, చేతులు, కాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చినా, లక్షణాలు మరీ తీవ్రతరమవుతున్నా పీడియాట్రీషియన్ లేదా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. ∙ చిన్నారుల అరచేతులు, అరికాళ్లలో దురదలా? -
ఆ మందు వాడి ఉంటే..
కొరాపుట్ : దగ్గు, జలుబుకు వైద్యుడు సూచించిన ఔషధానికి బదులు దురదలకు పైపూతగా వాడవలసిన లోషన్‌ను ఉచిత మందుల దుకాణం నిరామయి అందజేసిన ఉదంతం ఆదివారం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశమైంది. స్థానిక పూజారిపుట్‌కు చెందిన అజిత్ కుమార్ పట్నాయక్ భార్య తన మూడేళ్ల కొడుకు దగ్గు, జలుబుతో బాధపడుతుండగా మెడికల్ కాలేజీ చైల్డ్ స్పెషలిస్ట్ అరఖిత స్వంయి వద్దకు వైద్యం కోసం ఉదయం తీసుకువెళ్లింది. ఆ స్పెషలిస్టు దగ్గు, జలుబు కోసం ప్రిస్క్రిప్షన్‌లో రాసిన మందుకు బదులుగా దురదలకు వాడవలసిన లోషన్‌ను నిరామయిలో ఆమెకు అందజేశారు. ఇంటికి వెళ్లి భర్తకు ప్రిస్క్రిప్షన్, మందును ఆమె చూపించింది. భర్త అజిత్ కుమార్ పట్నాయక్ ప్రిస్క్రిప్షన్‌లోని మందు మారినట్లు గుర్తించి, లోషన్‌తో పాటు తన కుమారుని తీసుకుని చైల్డ్ స్పెషలిస్ట్ స్వంయి వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. ఆ లోషన్ తాగించి ఉంటే ప్రాణాపాయం సంభవించేదని తాగించకుండా తన దగ్గరకు రావడం మంచిదైందని స్పెషలిస్ట్ వైద్యుడు అన్నారు. ఈ విషయం హస్పిటల్ ఆవరణలో సంచలనం సృష్టించింది. పొరపాటు చేసిన నిరామయి సిబ్బందిపై హాస్పిటల్ అధ్యక్షుడు డాక్టర్ కాళీప్రసాద్ బెహర మండిపడుతూ విచారణ జరిపి సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. -
అది సీఓపీడీ వల్ల కావచ్చు...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35. నాకు కొంతకాలంగా కొద్దిదూరం నడిస్తే ఆయాసంగా, ఛాతీ బరువుగా అనిపిస్తోంది. నాకు చాలా ఏళ్లుగా పొగతాగే అలవాటున్నందువల్ల ఇది గుండెకు సంబంధించిన వ్యాధి అనుకుని పరీక్షలు చేయిస్తే, అన్ని రిపోర్టులూ నార్మల్‌గానే వచ్చాయి. అయినా నాకు ఈ సమస్య ఎందుకు వస్తోంది? హోమియో చికిత్స ద్వారా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వగలరు. - కిరణ్ కుమార్, హైదరాబాద్ దీర్ఘకాలికంగా పొగతాగే అలవాటు వల్ల ఊపిరితిత్తులకు హాని కలిగి శ్వాస తీసుకోవడంలో తలెత్తడాన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడి) అంటారు. సాధారణంగా మనం పీల్చుకున్న గాలి ముక్కు ద్వారా ట్రాకియా అనే నాళాన్ని చేరుతుంది. ట్రాకియా చివరి భాగంలో రెండు నాళాలుగా చీలి ఉంటుంది. వీటిని బ్రాంకై అంటారు. ఇవి ఊపిరితిత్తులతో ప్రవేశించి, కొన్ని వేలసంఖ్యలో ఉన్న అతి సన్నని నాళాలుగా విభజింపబడతాయి. వీటిని బ్రాంకియోల్స్ అంటారు. ఈ నాళాలు మిక్కిలి చిన్న గాలి తిత్తులుగా ఏర్పడతాయి. వీటిపై చిన్న రక్తనాళాలు ప్రయాణిస్తుంటాయి. గాలి వాయుతిత్తుల వరకు చేరినప్పుడు, ఆక్సిజన్ ఈ రక్తనాళాలకు చేరుతుంది. అదే సమయంలో రక్తనాళాలలోని కార్బన్ డై ఆక్సైడ్ ఈ వాయుతిత్తులను చేరుతుంది. తద్వారా శ్వాస బయటకు వదిలినప్పుడు వెలుపలికి వెళ్లిపోతుంది. ఈ ప్రక్రియను గ్యాస్ ఎక్స్ఛేంజ్ అంటారు. ఈ వాయుద్వారాలు, గాలి తిత్తులు సాగే స్వభావం కలిగి ఉంటాయి. ఇవి గాలి పీల్చుకున్న సమయంలోనూ, వదిలినప్పుడూ ఒక గాలిబుడగలా పని చేస్తాయి. దీర్ఘకాలికంగా పొగతాగడం వల్ల గాలితిత్తులు, వాయుద్వారాలు దెబ్బతిని వాటి సాగే గుణాన్ని కోల్పోతాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతర కారణాలు: ఎక్కువగా కాలుష్యవాయువులను పీల్చడం, వృత్తిరీత్యా కొన్ని పొగలను, రసాయనాలను, దుమ్మును పీల్చవలసి రావడం, జన్యుపరమైన కారణాలు. లక్షణాలు: శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, తరచు దగ్గు, ఊపిరి తీసుకున్నప్పుడు కొన్ని రకాలైన గురగుర శబ్దాలు వినిపించడం, ఛాతీ బరువుగా అనిపించడం వంటివి. జాగ్రత్తలు: స్మోకింగ్ మానివేయడం ద్వారా ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంది. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, కలుషిత వాయువులకు దూరంగా ఉండటం, అవి శరీరంలోకి ప్రవేశించటం ముక్కుకు మాస్క్ కట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవడం హోమియో చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సావిధానం ద్వారా రోగి మానసిక, శారీరక తత్వాలను బట్టి, కుటుంబ చరిత్రను ఆధారంగా తీసుకుని చికిత్స అందించడం ద్వారా వ్యాధి లక్షణాలను పూర్తిగా తగ్గించడమే కాకుండా ఎలాంటి దుష్ఫలితాలూ లేకుండా వ్యాధిని సంపూర్ణంగా నయం చేయవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్,హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నేను ఉంగరం పెట్టుకునే చోట వేలు నల్లబడుతోంది. మంటగా ఉండటంతో పాటు వేలిపై దురద వస్తోంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - సుష్మ, దామరచర్ల మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ ఉన్నట్లు తెలుస్తోంది. మీరు ఏదైనా సబ్బుగానీ లేదా డిటెర్జెంట్ గాని ఉపయోగిస్తుంటే... దాని మిగిలిపోయిన భాగం ఉంగరం వెనక ఉండిపోయి, అది చర్మానికి ఆనుకుంటూ ఉండవచ్చు. దాంతో అలా ఆ సబ్బు లేదా డిటెర్జెంట్ ఆనుకొని ఉండేచోట అలర్జీ వస్తోంది. ఇతర లోహాల మిశ్రమాల (అల్లాయ్స్)తో చేసే ఆభరణాల వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ కింద సూచించిన జాగ్రత్తలు తీసుకోండి. మీ ఉంగరాన్ని తరచూ తీసి శుభ్రం చేసుకొని మళ్లీ ధరించండి. మీరు చేతులు కడుక్కునే సమయంలో వేళ్లన్నీ శుభ్రమయ్యేలా చూసుకోండి. ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, మీరు అలా కూడా మార్చి చూడవచ్చు. చర్మం నల్లగా అయ్యే ప్రాంతంలో హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాల పాటు రాయండి. అప్పటికీ సమస్య తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 49 ఏళ్లు. అండర్వేర్ ధరించే చోట చర్మం మడతలలో ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. ఒక్కోసారి అక్కడ దురదగా కూడా ఉంటోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - వి. సుధాకర్, చల్లపల్లి మీ లక్షణాలను బట్టి మీరు ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఇట్రకొనజోల్-100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినాఫిన్ ఉన్న క్రీమును 2-3 వారాల పాటు రాయాలి. దీంతోపాటు మీరు ప్రతిరోజూ మల్టీవిటమిన్ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి. - డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్,త్వచ స్కిన్ క్లినిక్,గచ్చిబౌలి, హైదరాబాద్