breaking news
Irrigation Minister harishrao
-
2 గంటలు.. 5 కిలోమీటర్లు..
సిద్దిపేట జోన్: ఉదయం ఆరు గంటల సమయం.. ఇంకా చీకటి తెరలు తొలగిపోలేదు.. అంతలో మూడు వాహనాలు రాజీవ్ రహదారి పక్కన ఉన్న చెట్ల మధ్యకు దూసుకెళ్లాయి. వాహనంలో నుంచి దిగిన నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అక్కడి నుంచి 2 గంటల పాటు 5 కిలోమీటర్ల మేర కాలినడకన ముందుకు సాగారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట పట్టణం నాగులబండ శివారులో ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్క్‌ను పరిశీలించారు. నిధుల అవసరం, మొక్కల పెంపకంపై ఆయన వెంట వెంటనున్న డీఎఫ్‌వో శ్రీధర్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ పార్క్, అర్బన్ పార్క్ పనులపై ఆరా తీశారు. -
15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు
- భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు - గగన్‌పహడ్‌లో మెట్రో క్యాష్ అండ్ క్యారీ ప్రారంభం రాజేంద్రనగర్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే పారిశ్రామిక ఔత్సాహికులకు 15 రోజుల్లో అన్ని అనుమతులు ఇవ్వనున్నట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలోపెట్టుకుని సీఎం కేసీఆర్ గత పదిహేను రోజుల్లోనే 17 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారని గుర్తు చేశారు. మంగళవారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఎయిర్పోర్ట్ ప్రధాన రహదారిపై ఉన్న గగన్‌పహాడ్‌లో జర్మనీకి చెందిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ మాల్‌ను శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మెట్రో సంస్థవారు నగరంలో ఇప్పటికే మూడు మాల్స్‌ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మరో షాపింగ్ మాల్ కోసం కూడా వీరు దరఖాస్తు చేసుకున్నారని, త్వరలోనే అన్ని అనుమతులను ఇవ్వనున్నట్లు తెలిపారు. రానున్న మూడు నాలుగు నెలల్లో హైదరాబాద్‌లో ప్రతిరోజు మంచినీటి సరఫరా ఉంటుందని తెలిపారు. . ఇలాంటి షాపింగ్ మాల్స్ రావడం వల్ల స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయన్నారు. అదే విధంగా దినసరి అవసరాలకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట లభిస్తాయని తెలిపారు. అంతకుముందు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ... ఇలాంటి షాపింగ్ మాల్స్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలకు రావడం ఎంతో సంతోషకరమన్నారు. మెట్రో క్యాష్ అండ్ క్యారీ సీఈఓ రాజీవ్ మాట్లాడుతూ...ఈ షాపింగ్ మాల్స్ వల్ల చిరు వ్యాపారులు నష్ట పోతారన్న అపోహ నుంచి బయట పడాలని కోరారు. తమ సంస్థలో అధికశాతం మెంబర్ షిప్ కార్డులు చిరువ్యాపారులకు, కిరాణకొట్టుదారులకే కేటాయించామన్నారు. కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి,చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, స్థానిక టిడిపి ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి స్వర్ణలత భీమార్జున్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి రైతును ఆదుకుంటాం
- సీఎం కేసీఆర్ కూడా హామీ ఇచ్చారు - ఇది మన ప్రభుత్వం. న్యాయం చేస్తాం - బాధితులకు మంత్రి హరీష్‌రావు హామీ నంగునూరు: అకాల వర్షం వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఎవరూ అధైర్యపడొద్దని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేట, బద్దిపడగ గ్రామాల్లో గురువారం మంత్రి పర్యటించి వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల మామిడి తోటలు, వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏ గ్రామాల్లో ఎంత మేరకు నష్టం వాటిల్లిందో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, రెవెన్యూశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మగ్ధుంపూర్, నంగునూరుతో పాటు కరీంనగర్ జిల్లా సరిహద్దులోని తమ తోటలకు నష్టం వాటిల్లిందని, తమను ఆదుకోవాలని రైతులు మంత్రికి మొరపెట్టుకున్నారు. బుధవారం అర్ధరాత్రి కురిసిన వానలతో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. లక్షలు ఖర్చు చేసి మామిడి తోటలు, వరి పొలాలు కౌలుకు తీసుకున్నామని తమను ఆదుకోవాలని కౌలు రైతులు మంత్రిని కోరడంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెరి సగం అందజేయాలని అధికారులను ఆదేశించారు. మాది రైతు ప్రభుత్వం గత ప్రభుత్వాలు యాభై శాతం నష్టం జరిగితేనే పరిహారం అందజేసేవని, తాము అధికారంలోకి రాగానే 33 శాతం నష్టపోయినా ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తున్నామని మంత్రి హరీష్‌రావు అన్నారు. బద్దిపడగలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు నష్టం జరగకుండా చూడాలని సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారన్నారు. రైతులు అధైర్యపడొద్దని రెండు రోజుల్లో నష్టం వివరాలను సేకరించి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ఎకరా వరికి రూ. 5,400, మామిడి తోటలకు ఎకరాకు రూ. 6,800 పరిహారం అందజేస్తామన్నారు. అధికారులు పారదర్శకంగా సర్వే చేపట్టి జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అతికించి ఒక్క రైతుకు కూడా నష్టం వాటిల్లకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం వ్యవసాయశాఖ కమిషన్ ప్రియదర్శిని, ఇన్సూరెన్స్ కమిషనర్ రాజేశ్వరితో ఫోనులో మాట్లాడి తెలంగాణలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్‌కు ఎరువుల కొరత రానివ్వం రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల కొరత ఉన్నప్పటికీ ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఎస్ఎఫ్ కొనుగోళు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ నిల్వ ఉంచేందుకు గిడ్డంగులు లేక కొనుగోళ్లు నిలిచిపోయాయన్నారు. గిడ్డంగుల్లో ఉన్న పత్తి నిల్వలను తరలించి పొద్దుతిరుగుడు పంటను హుజురాబాద్‌లోని గిడ్డంగిలో నిల్వ ఉంచేలా చూడాలని కమిషనర్ ఆదేశించామన్నారు. ఖరీఫ్ సీజన్‌లోగా ఎరువులు తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఆయన వెంట వ్యవసాయశాఖ జూయింట్ డెరైక్టర్ హుక్యానాయక్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ బాల్‌రాజు, జెడ్పీవైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేశ్‌గౌడ్, ఎడ్ల సోమిరెడ్డి, సర్పంచ్ గిరిజ, మంజుల, నాయకులు దువ్వల మల్లయ్య, పురేందర్, వెంకట్‌రెడ్డి, తిరుపతి, జయపాల్‌రెడ్డి, వెంకట్రాజం, బి కృష్ణారెడ్డి, అధికారులు ప్రభాకర్, శ్రీహరి, మోహన్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.