breaking news
Iron Dome
-
సరికొత్త ఆయుధం ఐరన్బీమ్
సైన్స్‌ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే కొత్తశకం ఆయుధాలను ఇజ్రాయెల్ ఈ తరంలోనే తీసుకొచ్చి మరోసారి ప్రపంచ రక్షణరంగాన్ని ఔరా అనిపించింది. శత్రు దేశాల యుద్ధ విమానాలపై క్షిపణులను ప్రయోగించకుండా నేరుగా లేజర్ కాంతిపుంజాన్ని ప్రయోగించి విమానాలను నేలకూల్చే వ్యవస్థను ఇజ్రాయెల్ రంగంలోకి దింపింది. అత్యంత ప్రభావవంతంగా ఇది పనిచేస్తోందని, సమరక్షేత్రంలోనూ దీని సత్తాను పరీక్షించామని ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. దీనిని ఐరన్బీమ్ అని పేరు పెట్టింది. శత్రుసేనల డ్రోన్ల దండును ఒకేసారి వందలాది చిన్నపాటి క్షిపణులతో నేలమట్టంచేసే ఐరన్‌డోమ్ గగనతల రక్షణ వ్యవస్థతో ఇజ్రాయెల్ ఇప్పటికే ఆధునిక తరం ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్‌ల మోహరింపులో తన పైచేయి సాధించింది. వందలాది హమాస్ రాకెట్లను గాల్లోనే తుత్తునియలు చేసి ఈ ఐరమ్డోమ్ ఇప్పటికే తన సత్తా చాటింది. దీనికి తోడుగా ఇప్పుడు లేజర్కాంతిపుంజ సహిత ఐరన్బీమ్ వ్యవస్థను సంసిద్ధం చేశామని ఇజ్రాయెల్ రక్షణవర్గాలు ప్రకటించాయి. ఎప్పటికప్పుడు కొత్త రకం ఆయుధాలతో దేశ సైనికరక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ పటిష్టంచేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఐరన్బీమ్ ను రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ తయారుచేసింది. కేవలం రెండు డాలర్లతో మటాష్విధ్వంసం సృష్టించేందుకు నేలమీదకు దూసుకొచ్చే శత్రువుల డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు, మానవరహిత విహంగాలు, మోర్టార్లను గాల్లోనే అడ్డుకునేందుకు ఉపయోగించే సంప్రదాయక క్షిపణి నిరోధక వ్యవస్థను ఒక సందర్భంలో ఉపయోగిస్తే ఏకంగా 60,000 డాలర్లు అంటే రూ.53 లక్షలు ఖర్చవుతుంది. శత్రువుల రాకెట్లను అడ్డుకునేందుకు చిన్నపాటి రాకెట్లు, ఇతరత్రా ఆయుధాలను ప్రయోగించాల్సి రావడం వల్లే ఇంతటి ఖర్చు అవుతుంది. కానీ కొత్తగా రణరంగంలోకి దిగిన ఈ ఐరన్బీమ్ను ఒకసారి ఉపయోగిస్తే కేవలం 2 డాలర్లు మాత్రమే ఖర్చవుతుంది. మెరుపువేగంతో అమితమైన విద్యుత్‌ను ఉపయోగించుకుని కొత్త కాంతిపుంజాన్ని వదులుతుంది. అందుకే అత్యల్ప ఖర్చుతోనే అత్యధిక ప్రయోజనాన్ని పొందొచ్చు. సంప్రదాయక గగనతల రక్షణవ్యవస్థలో ప్రయోగించే కొన్ని చిన్నపాటి రాకెట్లు గురితప్పొచ్చు. వృథా ఖాయం. కానీ ఐరన్బీమ్ కాంతిపుంజాన్ని గురిచూసి ప్రయోగిస్తారు. కాంతిమాదిరిగా అత్యంత కచ్చితత్వంతో సరళరేఖ మాదిరి ఈ కాంతిపుంజం దూసుకుపోతుంది. దీంతో దిశ మారే అవకాశమే లేదు. ఏ పాయింట్ వద్ద కొడతామో అక్కడే విమానం, డ్రోన్, క్షిపణి ముక్కలుచెక్కలుకావడం ఖాయం. బీమ్ ప్రయోగానికి అది లక్ష్యాన్ని ఛేదించడానికి మధ్య సెకన్ల వ్యవధి కూడా పెద్దగాఉండదని ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి నాఫ్తాలీ బెన్నెట్ చెప్పారు. ఉన్న వాటితో కలుపుకుని పోతూ..ఐరన్బీమ్ను అందుబాటులోకి తెచ్చినంత మాత్రాన ఐరన్‌డోమ్, డేవిడ్ స్లింగ్, యారో సిస్టమ్ వంటి ఇతర గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ పక్కనబెట్టబోదు. యుద్ధ రీతి, అవసరానికి అనుగుణంగా వీటినీ మోహరిస్తుంది. అవసరమైతే ఐరన్‌డోమ్‌కు తోడుగా ఐరన్బీమ్ కదనరంగంలో రణానికి సిద్ధంకానున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖలోని పరిశోధనా భివృద్ధి విభాగం, ఇజ్రాయెల్ వాయుసేన, రఫేల్, ఎల్బిట్ సిస్టమ్స్ సంయుక్తంగా నెలల తరబడి కష్టపడి ఐరన్బీమ్ను సాకారంచేశాయి. దీనిని ఇప్పటికే దక్షిణ ఇజ్రాయెల్‌లో పలుమార్లు విజయవంతంగా పరీక్షించారు. రఫేల్ అడ్వాన్స్డ్ సంస్థలోని అడాప్టివ్ ఆప్టిక్స్ సాంకేతికతను సైతం ఐరన్బీమ్కు జోడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Iron Dome: రక్షణ కవచాన్ని చీల్చుకుని మరీ..
దాడులు చేయడమే తప్ప.. దెబ్బ తినడం తెలియని ఇజ్రాయెల్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇజ్రాయెల్ ఆయుధాల పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది దుర్భేద్యమైన ఐరన్ డోమ్(Iron dome). నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా.. ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకొంటుంది. అలాంటిది ఆ వ్యవస్థ మరోసారి విఫలమైందనే చర్చ నడుస్తోంది. ఇరాన్ అణు ముప్పును తప్పించేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు శుక్రవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు వైమానిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ సైన్యం(IDF). ప్రతిగా ఇరాన్ కూడా దాడులు జరిపింది. డ్రోన్లతో జరిపిన దాడులను ఐడీఎఫ్ తిప్పికొట్టగలిగింది కానీ.. క్షిపణుల దాడిలో మాత్రం దెబ్బ తింది. ఏకంగా రాజధాని టెల్ అవీవ్‌లో.. అదీ రక్షణ ప్రధాన కార్యాలయంపై దాడి జరగ్గా.. ఏ రక్షణ వ్యవస్థ అడ్డ్డుకోలేకపోయింది.#BreakingNews Iron Dome Blasts Iranian Drone Out Of The Sky#Israel #Iran #IsraeliranWar #israil #Tehran #Teheran #TelAviv #deathtoamerica #irannucleardeal #AsadabadRegion #IronDome pic.twitter.com/wEV5FsM2qD— Shekhar Pujari (@ShekharPujari2) June 14, 2025ఆకాశంలో క్షిపణులు దూసుకొస్తున్నా ఇజ్రాయెల్ ప్రజలు ఏమాత్రం వణికిపోకుండా తమ పని తాము చేసుకుంటారు. ఎందుకంటే ఐరన్ డోమ్ ఉందనే ధైర్యం. కానీ, శనివారం భీకర యుద్ధంలో ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. ఈ క్రమంలో రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌ను చీల్చుకుంటూ మరి మిస్సైల్స్ దూసుకెళ్లాయి. Last night strike on Tel aviv.Follow us for for all latest updates #middleeast #riyadh #jeddah #IranNuclearSecrets #USA #Israel #SaudiArabia #UAE #iran #tehran #tahran #russia #ukraine#telAviv #MissileAttack #Irondome pic.twitter.com/sRvxNzvXPy— Bharat - As it is (@NewBharatVoice) June 14, 2025పెద్ద శబ్దంతో.. దూసుకొచ్చిన మిస్సైల్ సెకన్ల వ్యవధిలోనే భవనాన్ని తాకింది. ది టైమ్స్ ఈ 19 సెకన్ల వీడియోను ధృవీకరించింది. బ్యాక్‌గ్రౌండ్‌లో టెల్ అవీవ్‌కు తలమానికంగా భావించే కీర్యా ప్రాంతంను చూడొచ్చు. ఇరాన్ మిస్సైల్స్‌ను ఐరన్ డోమ్ అడ్డుకుంటుందని భావించినప్పటికీ అది జరగలేదు. మిస్సైల్ నేరుగా రక్షణ కార్యాలయాన్ని ఢీ కొట్టింది. అయితే అక్కడ జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను వినియోగిస్తోంది. ఇతర భూభాగాల నుంచి రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగిస్తే రాడార్ వ్యవస్థ దాన్ని అధ్యయనం చేస్తుంది. అనంతరం క్షిపణులు వెళ్లి ఆ రాకెట్‌ను అడ్డుకుంటాయి. అయితే శనివారం నాడు నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ఇరాన్ ప్రయోగించింది. కానీ, వాటిని అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ పవిఫలమైంది. ఐరన్ డోమ్ ఉండేది అక్కడే..ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఒకే దశలో ఉండదు. ఇందులో మూడు దశలు ఉంటాయి. యారో-2, యారో-3 సిస్టమ్స్‌ను బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగిస్తారు. ఇవి ఆకాశంలోనే బాలిస్టిక్ క్షిపణులను పేల్చేసి.. వాటి శకలాల నుంచి ముప్పును దూరం చేస్తాయి. ఆపై డేవిడ్ స్లింగ్ మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. 100-200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి వాడతారు. అంతేకాదు.. యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చేయడంలోనూ దీనిదే కీలక పాత్ర.ఇక.. చిట్టచివరి దశలో ఐరన్ డోమ్ ఉంటుంది. దీనిని ఇజ్రాయెల్ విస్తృతంగా వాడుతుంది. హమాస్, హెజ్బొల్లా ప్రయోగించిన వేల రాకెట్లు, వందల డ్రోన్లను కూల్చేసింది. ఇజ్రాయెల్‌కు అసలైన రక్షణ కవచంగా నిలిచింది. దూసుకొచ్చే ఒక్కో ముప్పును పేల్చేయడానికి రెండు క్షిపణులను ఐరన్ డోమ్ ప్రయోగిస్తుంది. ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు 50 వేల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. పని చేసేది ఎలాగంటే..ఐరన్ డోమ్‌ను స్థానికంగా కిప్పాట్ బర్జెల్‌గా వ్యవహరిస్తారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకొంటుంది. దీనిలో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ ఉంటాయి. రాడార్ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకపోతే.. వదిలేస్తుంది. అదే జనావాసాలు అయితే మాత్రం. రాకెట్‌ను ప్రయోగించి దానిని ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్ సిస్టమ్, రఫెల్ సంస్థలు పనిచేశాయి.సక్సెస్ రేటుపై అనుమానాలా?2006లో హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. నాడు వేల రాకెట్లను ఆ సంస్థ టెల్ అవీవ్ పై ప్రయోగించింది. దీంతో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకొంది. దీంతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌కు తయారీకి నిర్ణయించింది. దీనికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. 2008 నాటికి టమిర్ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011 నాటికి అందుబాటులోకి తెచ్చింది. ఐరన్ డోమ్ సక్సెస్ రేటు 90శాతానికి పైగానే ఉంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఇదో అద్భుతం. అయితే 2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడులను, తాజా ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ తడబడింది.


