breaking news
ipl-2016
-
బెంగళూరు 3, హైదరాబాద్ 2
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కల నెరవేరలేదు. ఐపీఎల్ లో బలమైన జట్టుగా పేరుగా గాంచిన ఆర్సీబీ ఇప్పటివరకు ఐపీఎల్ కప్ అందుకోలేకపోయింది. తాజాగా జరిగిన మెగా టోర్నీలోనూ ఆర్సీబీ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. మూడుసార్లు ఫైనల్ చేరినా విజేతగా నిలవలేకపోయింది. ఐపీఎల్-2016లోనూ రన్నరప్ గానే సరిపెట్టుకుంది. 2009, 2011లో ఫైనల్ కు చేరినా టైటిల్ దక్కించుకోలేకపోయింది. అయితే ఎక్కువసార్లు రన్నరప్‌గా నిలిచిన రికార్డు చెన్నై సూపర్ కింగ్స్‌దే. రెండుసార్లు విజేతగా నిలిచిన చెన్నై నాలుగుసార్లు ఫైనల్లో పరాజయం పాలైంది. కాగా, హైదరాబాద్ ఫ్రాంఛైజీకి ఐపీఎల్ కప్ దక్కించుకోడం ఇది రెండోసారి. 2009లో గిల్‌క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ ఛార్జర్స్ టైటిల్ గెలిచింది. అప్పడు కూడా బెంగళూరుపైనే హైదరాబాద్ గెలవడం విశేషం. రెండుసార్లు ఆస్ట్రేలియా ఆటగాళ్ల సారథ్యంలోనే హైదరాబాద్ జట్టు కప్పు సొంతం చేసుకుంది. ఆ ఫ్రాంఛైజీ రద్దు కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్లో అవకాశం దక్కింది. -
విశాఖలో ఐపీఎల్ షెడ్యూల్..
విశాఖపట్నం: విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఖరారైంది. దీంతో సాగర తీరంలో సందడి నెలకొంది. మే 10 నుంచి మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. కరవు కారణంగా మహారాష్ట్రలో మ్యాచ్‌లను తరలించాలని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుతో అక్కడ జరగాల్సిన 13 మ్యాచ్‌లను తరలించారు. దీంతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు విశాఖ వైఎస్సార్ స్టేడియాన్ని హోమ్ పిచ్‌గా ఎంచుకుంది. పుణే, ముంబాయిలకు చెందిన జట్ల ఫ్రాంచైజీ ప్రతినిధులు ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రత్యామ్నాయాన్ని చూసుకున్నారు. ముంబాయి ఇండియన్స్ జట్టు వాంఖడే స్టేడియం, పుణే జట్టు మహారాష్ట్ర స్టేట్ స్టేడియాన్ని హోమ్ పిచ్‌లుగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పుణే ఫ్రాంచైజీ కోల్‌కతా వేదికగా మ్యాచ్‌లు నిర్వహించాలుకున్నా అవాంతరాలు ఏర్పాడ్డాయి. దీంతో పుణే జట్టు విశాఖలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు మొగ్గు చూపింది. ఈ సీజన్లో ఐపీఎల్ లీగ్‌లో పుణే ఆడాల్సిన చివరి మూడు మ్యాచ్‌లకు వైఎస్సార్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. రైజింగ్ పుణే జట్టుకు కెప్టెన్‌గా ధోని, కోచ్‌గా స్టీపెన్ ఫ్లెమింగ్ వ్యవహారిస్తున్నారు. షెడ్యూల్ మే 10 - రైజింగ్ పుణే VS సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 17 - రైజింగ్ పుణే VS ఢిల్లీ డేర్‌డెవిల్స్ మే 21 - రైజింగ్ పుణే VS కింగ్స్ ఎలెవన్ పంజాబ్